పొద్దున్న లేస్తే కాడికి ఎద్దులను కట్టి , నాగలి భుజాన వేసుకొని కొందరు , పండిన పంటను ,గంపలకెత్తుకొని దగ్గర్లోని పట్నానికి పరిగెత్తేదొ కరు , నారెండితే నీళ్లకోసం , గొంతెండితే గుక్కెడు నీళ్లకోసం , చీడపడితే చిటికెడు గుళికల కోసం , రోగమొస్తే సూదిమందుకోసం ,డొక్కెండి తే గుప్పెడు మెతుకులకోసం , ఉరుకులు పరుగులతో బతుకులు ఎలామారుస్తున్న 60కోట్లమంది భారతీయులను బాధ పెట్టే దెందుకు ? పంట భూమిని చదును చేసి , పధకాలు గీసి భవనాలు కట్టే దొరలోక పక్క , ఎండకు మాడి ,వానకు తడిసి ,చలికి వణికుతూ నెత్తిన తట్ట బుట్ట పెట్టుకొని , దుమ్ములో దొర్లుతూ బతికేస్తున్న కార్మికులొక పక్క , గనుల్లో , ఫాక్టరీలలో , నెత్తురు చిందించి ఆపసోపాలు పడుతూ కాలుష్య కోరల్లో బతుకులను బలిదానం చేసుకొంటున్న కార్మిక లోకం , దవాఖానాల్లో రోగులు, పెళ్ళిపీటల పై వధూవరులు , పరీక్ష హాల్లో విద్యార్థులు , రైలుబండిలో బాటసారులు , అమ్మ పొత్తిళ్ళలో పసికందులు ఇలా అందరూ వసివాడిపోయి అల్లాడిపోవాలా ? వారి బతుకులు ఎందుకు ఆగిపోయాయో తెలియక అయోమయం ... ఏమిటి సాధించాలని ప్రభుత్వం ఇంత ఇబ్బంది పెడుతుంది ? మూ