పెద్దనోట్ల రద్దుతర్వాత ,కేవలం 50 రోజులలో , ఒక లక్ష ఏబది వేల బాంక్ ఖాతాలలో సుమారుగా 4 లక్షల కోట్ల విలువైన పాతనోట్లు జమ ' అయ్యాయి అంటే మనదేశంలో కనీసం 1. 5 లక్షల మంది దగ్గర నల్ల డబ్బు గుట్టలు ఉన్నాయని అర్ధం అవుతుంది .
అంతే కాదు సుమారు 2లక్షల మంది 50000 కోట్ల విలువైన పాతనోట్ల తో బాంక్ బకాయిలు తీర్చేశారు .
అలాగే పేదవారి జనధన ఖాతాలలో సుమారు 40000 కోట్ల విలువైన పాతనోట్లు జమ అయ్యాయి .
అంటే మనదేశంలో గారంటే గా 2లక్షల మంది నల్ల బడాబాబులు ఉన్నారని అర్ధం అవుతుంది .
ఇవన్నీ పక్కనపెడితే ఆదాయ పన్ను దాడులద్వారా కేవలం 4000 కోట్లు మాత్రమే దొరికింది .
14 లక్షలకోట్ల విలువైన పాతనోట్లు బాంక్ లకు తిరిగి వచ్చ్చేశాయి . అంటే , సుమారు 1. 4 లక్షల కోట్ల పాతనోట్లు జమ అవ్వలేదు .
ఏదిఏమైనా నోట్లరద్దు ద్వారా ప్రభుత్వానికి కనీసం 4లక్షలకోట్ల రాబడి వస్తుందని లెక్కవేయడం కరెక్టే అని అనిపిస్తుంది . అంతే కాదు, కుంగి కునారిల్లు తున్న బాంకింగ్ వ్యవస్థ లోకి అపరిమితమైన ధన ప్రవాహం రావడం తో వడ్డీలు తగ్గే అవకాశం ఉంది . పురపాలక శాఖ మొదలు కొని అన్ని ప్రభుత్వ శాఖల పన్ను బకాయిల వసూళ్లు , బాంక్ ల మొండి బకాయిలు కూడా వసూల్ కావడం ఎంతో మంచి పరిణామం .
కొత్త నోట్ల ముద్రణకు 10వేలకోట్లు ఖర్చు , 50రోజులపాటు జనం వారిపనులు మానుకోవడం వలన ,చేతి లో కరెన్సీ లేకపోవడం వలన వారి కొనుగోలు శక్తి తగ్గిపోవడం ద్వారా పరిశ్రమల ఉత్ప త్తి , వ్యాపారస్తుల అమ్మకాలు తగ్గిపోవడం వలన దేశ ఉత్పత్తి విలువ (GDP) కనీసం 50000 కోట్లు తగ్గిందని అంచనా వేసినా, మొత్తం నష్టం 60 వేల కోట్లు దాటదు .
కానీ , ఈ రద్దు చర్య వలన , ప్రజల ఆలోచనల్లో , లావా దేవీ లలో (digital transactions) తెచ్చ్చిన మౌలికమైన మార్పు కి వెల కట్టలేం . ఎందుకంటే మళ్ళీ నల్లధనం పేరుకు పోకుండా కొంతవరకు అడ్డుకట్ట వేస్తుంది .
నల్లధనం పూర్తి కట్టడి అనేది అసాధ్యం . అలాగే పూర్తి డిజిటల్ లావాదేవీలు కూడా అసాధ్యం .
ఏదిఏమైనా చెదలు పట్టిన వ్యవస్థ లో మార్పు రావడం అనేది అత్యంత అవసరం . ఆ మార్పు కొంతమందికి బాధను కలిగించ వచ్చుఁ . కానీ మనకో సామెత ఉందిగదా .... " No pains No gains".
గమనిక : పైన చెప్పిన లెక్కలన్నీ ఆదాయ పన్ను శాఖ వారు తేటతెల్లం చేసినవే .

Comments
Post a Comment