Skip to main content

చేతనైతే మంచి చేద్దాం ... Let us do Good !

పొద్దున్న లేస్తే కాడికి ఎద్దులను కట్టి , నాగలి భుజాన వేసుకొని కొందరు ,  
పండిన పంటను ,గంపలకెత్తుకొని దగ్గర్లోని పట్నానికి పరిగెత్తేదొ
 కరు  ,
నారెండితే నీళ్లకోసం , గొంతెండితే గుక్కెడు నీళ్లకోసం , చీడపడితే చిటికెడు గుళికల కోసం , రోగమొస్తే సూదిమందుకోసం ,డొక్కెండి
 తే గుప్పెడు మెతుకులకోసం , ఉరుకులు పరుగులతో బతుకులు ఎలామారుస్తున్న 60కోట్లమంది భారతీయులను బాధ పెట్టే  దెందుకు ?
పంట భూమిని చదును
  చేసి ,  పధకాలు గీసి భవనాలు కట్టే  దొరలోక పక్క , 
 ఎండకు మాడి  ,వానకు తడిసి ,చలికి వణికుతూ  నెత్తిన తట్ట బుట్ట పెట్టుకొని , దుమ్ములో దొర్లుతూ బతికేస్తున్న కార్మికులొక పక్క , 
  గనుల్లో , ఫాక్టరీలలో , నెత్తురు చిందించి ఆపసోపాలు పడుతూ కాలుష్య కోరల్లో బతుకులను బలిదానం చేసుకొంటున్న కార్మిక లోకం ,
దవాఖానాల్లో రోగులు,   పెళ్ళిపీటల పై వధూవరులు , పరీక్ష   హాల్లో విద్యార్థులు , రైలుబండిలో బాటసారులు , అమ్మ పొత్తిళ్ళలో పసికందులు ఇలా అందరూ వసివాడిపోయి అల్లాడిపోవాలా ?
వారి బతుకులు ఎందుకు ఆగిపోయాయో తెలియక అయోమయం ...
 
 ఏమిటి సాధించాలని  ప్రభుత్వం ఇంత ఇబ్బంది పెడుతుంది ?

మూడుపూటలా
మీడియాలో ఇదే వరస ... చర్చలు ,వాదాలు  వెరసి జనాలను భయము ,అయోమయం లో ముంచేయడం  మీడియా వాళ్లకు మామూలై పోయింది .  పైన చెప్పిన వాటిలో వాస్తవం లేక పోలేదు . కానీ విషయాన్ని మసిపూసి మారేడు కాయ చేయడం ఎంతవరకు సబబు ?

పెద్దనోట్ల రద్దును ,
  ప్రతిఒక్కరు అంగీకరిస్తున్నారు . ఎటొచ్ఛీ  అమలుచేసే విధానమే అధ్వానంగా ఉందని మొత్తుకొంటున్నారు . సరే బాగానే ఉంది,  ఏ విధం గా అమలు చేయాలో గత 70 ఏళ్లలో ఒక్కరైనా వివరించి చెప్పారా ?

గోదాలో దూ
 కమని చెప్పి  గొడవ పెట్టడం ఎంతవరకు న్యాయం ? పైపెచ్చూ ఇలా అవుతుందని అనుకోలేదు ,ఇంకో రకం గా చేయవలసింది " అనే సన్నాయి నొక్కులు నొక్కే వాళ్ళు కొందరు .

 భారతీయులకు తగినంత రక్తం చిందించ కుండానే స్వాతంత్రం దఖలు పడింది . అప్పటి నుండి అన్నిరకాల స్వాతంత్రాలను మనం ఎంతగా దుర్వినియోగం చేస్తున్నామో అందరికీ ఎరికే !
మాటను , నడతను , పనిని ,బాధ్యతను ,దేశ భక్తిని భారతీయులు దుర్వినియోగం చేసినంతగా ఏ అభివృద్ధి చెందిన
 దేశంలో చేయరు . వస్తుత: మనం మంచివాళ్ళమే .. కానీ సోమరితనం ,పలాయన వాదం , నిర్వేదం, గందరగోళం , కుహనా లౌకిక వాదం ,కుహనా కర్మ సిద్ధాంత వాదం ,భారతీయులను  గత 70 ఏళ్లుగా నిర్వీర్యులను చేశాయి . 
 ఎప్పుడైతే మెజారిటీ ప్రజలు నిర్వీర్యులయ్యారో , కొంతమంది తెలివిగలవాళ్ళు బలహీనులను దోపిడీ చేయడం షురూ చేశారు . అలా దోపిడీ ,అవినీతి, లంచాలు, డ్రగ్ ట్రాఫికింగ్ , విమెన్ ట్రాఫికింగ్ ,ఉగ్రవాదం, పేట్రేగి పోవడం తో లక్షలకోట్ల ధనం కొంతమంది గుప్పెట్లో ఉండిపోయింది .

అలా,
 మన భారతీయులు  పోగేసిన  మొత్తం నల్ల సంపద లో 50% మనదేశంలో , మరో 50% విదేశాలలో ఉందని నిపుణులు చెబుతున్నారు .  విదేశాలకెళ్లిన సంపదలో సింహభాగం మళ్ళీ పార్టిసి పేటరీ నోట్ల ద్వారా మనదేశ స్టాక్ మార్కెట్టుకి వచ్చ్చిందని నిపుణుల అభిప్రాయం .

మనదేశంలో  ఉన్న నల్ల సంపదలో కూడా అత్యధిక శాతం భూమి ,బంగారం ,విలాస వస్తువుల రూపంలో ఉండి ,  కేవలం 6% మాత్రమే  కరెన్సీ రూపంలో ఉంది . అంటే ఆర్థికవేత్తల లెక్క ప్రకారం సుమారు 5లక్షల కోట్లు నల్ల సంపద కరెన్సీ రూపంలో ఉండే అవకాశముంది .

ఈ కాస్త దానికోసం 100రోజులపాటు కోట్లాది భారతీయులకు నరకం చూపించాలా ?
 
జాతీయ ఉత్పత్తి
 తగ్గడం వలన  ఎన్నిలక్షలకోట్ల నష్టం వస్తుందో గమనించారా ? 

 జాతీయ ఉత్పత్తి లో పెరుగుదల ఉన్నంత మాత్రాన పేదవాడికి ఒరిగేదేమి ఉంది ? ఇప్పటివరకు మనం చూస్తున్నాం గదా ... అభివృద్ధి ఫలాలలో సింహభాగం కేవలం లక్షమంది బొక్కేసి , డొక్కలుమాడిపోయిన కోట్లాది బడుగు జీవులకు ఇంత బిఛ్చమేస్తున్నారు . ఇలాంటి అభివృద్ధినా  మనం కోరుకొనేది ? ఒక మాజీ ప్రధానమంత్రిగారు లేటుగా  కళ్ళు ,నోరు తెరిచి అంటారు గదా ,... . వృద్ధి 2% తక్కువ నమోదు అవుతుందట !  దోపిడీ ని పెంచే ఇలాంటి వృద్ధి తగ్గితే వఛ్చిన నష్టం ఏమిటిట  ?

అంతెందుకు ... గత దశాబ్దం లో దారుణ కుంభకోణాలతో పాలన చేసి లక్షలకోట్ల ధనం నొక్కేసి,
పైపెచ్చూ ఆర్ధిక రేటుని పరిగెత్తించామని చెప్పుకొంటున్నారు . మరి అంతలా పరిగెత్తిస్తే గత 10 ఏళ్లలో కేవలం 25 లక్షల ఉద్యోగాలు మాత్రమే వచ్చ్చాయే ?
ఆస్తుల విలువ (భూమి ,బంగారం )
 అమాంతం పెరిగిపోవడం తో మన దేశ ఆర్ధిక వృద్ధి పెరిగినట్లుగా అనిపించింది.  అనగా అది కేవలం వాపు తప్ప నిజమైన బలుపు  కానేకాదు .
 మీరు గమనించే ఉంటారు .. గత 10ఏళ్లలో ముఖ్యం గా 2008 తర్వాత మనదేశంలో భూమి ,బంగారం రేట్లు అనూహ్యం గా పెరిగిపోయాయి . కోటికి విలువ లేకుండా పోయింది . ఆయిల్ ధరలు తగ్గినా ద్రవ్యోల్పణం తగ్గకపోవడానికి కారణం డాలర్ కి రూపాయి విలువ దారుణం గా తగ్గిపోవడమే !

మనదేశమే కాదు ప్రపంచ మంతా అట్లనే ఉంది  ! 700 కోట్ల జనాభా  ఉన్న ఈ భూమండలంలోని 60% సంపద కేవలం 1%  ( 7కోట్లు )ప్రజల గుప్పిటి లోనే ఇరుక్కుపోయింది .    
స్వదేశంలో దోపిడీ చేయడం , పోగేసిన డబ్బుని హవాలా ద్వారా విదేశీ బ్యాంకు లకు తరలించడం ,వీ లుకుదిరినపుడు అదే డబ్బుని పార్టిసి పేటరీ నోట్ల ద్వారా మనదేశ స్టాక్ మార్కెట్ లలో  FDI ల రూపంలో  పెట్టుబళ్లుగా  పెడుతున్నారు . అందుకే గత ఏడు (2015 )  ఈ విధం గా 7లక్షలకోట్లు  మనదేశ  స్టాక్ మార్కెట్  లోకి వచ్చ్చింది . పోగేసిన డబ్బులో సింహభాగం రియల్ ఎస్టేట్ , బంగారం ,రత్నాలు, విలాస వంతమైన కారులు ,బంగ్లాలు రూపంలోకి మార్చేసుకోవడం వలన రైతుకి భూమి దొరకడం లేదు ,సామాన్యుడికి నెత్తిపై గూడు ఉండటం  లేదు . 

 నోట్ల రద్దు  నిర్ణయం దేశాన్ని ,ప్రజలను ఎంత కుంగ దీస్తుందో తెలుసా ? !
 ఖర్చు ,పొదుపు సర్వం కాష్ ద్వారానే చేయడం మెజారిటీ భారతీయులకు అలవాటు . వీరంతా ఒక్కసారిగా  చేతిలో కాష్ లేకుండా ప్రతిదానికి ఫోన్ ద్వారానో ,కార్డు ద్వారానో లావాదేవీ లు చేయమంటే ఎంతకష్టమో చూడండి .. ఇది అమలుచేయడం అసాధ్యం . వారి చేతిలో కాష్ ఉండవలసిందే .
ఎందుకంటే
 గ్రామీణ భారతావనికి ఆయువుపట్టు కాష్ లావాదేవీలు . కేవలం 50% మందికే  పనిచేసే బాంక్ ఖాతాలు ఉన్నాయ్ . అంతర్జాలం కేవలం 25% మందికే అందుబాటులో ఉంది . అసలు 20%మందికి కరెంటే లేదు . అంతే కాదు, ఉన్న మొత్తం  1. 5 కోట్ల వర్తక,  వృత్తి , వ్యాపార సంస్థల లో కేవలం 10 లక్షల వాటికే  ఇ -పాస్ మిషన్ లు ఉన్నాయ్ .
ముందస్తు ఏర్పాట్లు అంటే ఇవి .
  మౌలిక సదుపాయాలేమీ  లేకుండా ఆదరా బాదరా గా ఇలాంటి నిర్ణయం తీసుకొని ,మోడీ పెద్దతప్పిదం చేశాడు . ఇది మరికొందరు మేధావుల వాదన . 

మీ వాదనలో నిజం ఉంది . కానీ సమయం లేదు . ఇప్పటికే దేశం ఆర్ధిక దివాళా స్థితిలో ఉంది . బాంక్ లో ద్రవ్య సరఫరా తగ్గిపోయింది . ఒక పక్క ఉగ్రవాదులు ,ఉగ్రవాదదేశాల అండతో నకిలీ కరెన్సీని అప్రతిహతం గా మనదేశంలోకి పంప్ చేస్తున్నారు . దేశంలో మావోయిస్టు లు డ్రగ్ ట్రాఫికింగ్, నకిలీ కరెన్సీ తో ప్రజలను నానా ఇబ్బందులు పెడుతున్నారు . దేశ భద్రత ప్రశ్నర్థకంలొ
 పడిపోయింది . సరిహద్దుల్లోనే కాదు నడిబొడ్డున కూడా టెర్రరిస్ట్ లు పేట్రేగి పోతున్నారు . వీళ్ళను కాచుకోవడానికే లక్షల కోట్ల వ్యయం అవుతుంది . 
గత పాలకులు చేసిన దారుణ అవినీతి వలన సైన్యం నిర్వీర్యమై పోయింది . వారికి కావలసిన అధునాతన ఆయుధాలు లేవు . ఏదైనా ఒకటీ ఆరా కొన్నా
 లంచాలు మెక్కేసి , పనికి రాని  చెత్తను ఎక్కువ ధరకు కొనేసి పడేశారు . ఇంకో దారుణమేమిటో తెలుసా ? గత 10 ఏళ్లలో అడ్డు అదుపు లేకుండా  500 &1000 నోట్లను కోట్లకొద్దీ ముద్రణ చేసి  వ్యవస్థలోకి వదిలేశారు . 
ద్రవ్యోల్పణం తాడి చెట్టంత పెరిగి పోయింది . ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయ్ . సామాన్యుడికి కష్టాలు పెరుగుతున్నాయి . ఇంకా చేతులు కట్టుకొని కూర్చుంటే, దేశం  దివాళా కూపంలో కూరుకుపోవడమే కాదు,  చైనా, పాకిస్తాన్ లు దేశాన్ని ముక్కలు ముక్కలు చేస్తాయంటే
 అతిశయోక్తి కాదు . 
ఇంత లా కల్మషం పేరుకు పోతే, ఇప్పడైనా శుభ్రం చేయ వలసిన అవసరం ఉందా ? లేదా ?
 
ఇంత ఉత్పాతం
 ముంచుకు వస్తుంటే ఏమీ చేయకుండా పాతపద్ధతిలోనే పాలన చేయాలా ?
గత 70 ఏళ్లుగా అవినీతితో ,లంచాలతో, ఓటు బాంక్ రాజకీయాలతో , అమిత మైన కాష్ తో  సమాంతర
 బ్లాక్ మనీ వ్యవస్థ తో కుళ్లిపోతున్న దేశానికి , ముఖ్యం గా మనందరికీ   అత్యవసరం గా  ఆపరేషన్ చేయవలసిన సమయం ఇదే . 
 
ఒక రిపోర్ట్ ప్రకారం  స్విస్ బాంక్స్  లాంటి విదేశీ బాంక్ లలో  మన భారతీయుల సంపద విలువ 150 లక్షల కోట్లు' అని చెబుతారు . అంటే ,2015 లో మన దేశ GDP అంత విలువ అన్నమాట . మన దేశ అప్పు విలువ 60 లక్షల కోట్లు . అంటే సగటున మనందరి నెత్తిన 50000/- అప్పు ఉంది . 

మనం సగటున తలా ఒక లక్షన్నర ఏటా సంపాదిస్తున్నా , అందులో  40%  మన దేశము చేసిన
 అప్పుకిందే పోతుంది .  ఇంకేం అభివృద్ధి చెందుతాం ? రోడ్లు, కాలువలు, డాం లు , విద్యుత్ ఉతిపాదన, విద్య, వైద్యం, ఉద్యోగ భద్రత , సంక్షేమం ఎలా వస్తాయ్ ? 

దొంగ  పరిశ్రమలు పెట్టో, కావాలని పరిశ్రమలను పాడుపెట్టో ,మంది డబ్బుతో విలాసాలు మరిగి కంపెనీలను కుళ్ళపెట్టో , మన పారిశ్రామిక వేత్తలు సుమారు 6లక్షల కోట్ల ప్రజా ధనాన్ని హాంఫట్ చేసేశారు . 
నియోజక వర్గానికి 1000 మంది రాజకీయ నాయకులు చొప్పున , 550 పార్లమెంట్ నియోజక వర్గాలలో ,ఎవరొకొందరు సేవాతత్పరులను మినహాయిస్తే , సుమారు 6లక్షల మంది రాజకీయనాయకులు వారి వారి స్థాయిలో అందినకాడికి ప్రభుత్వ సంపదను , దేశ వనరులను , 
లూటీ చేస్తున్నారు . 

సుమారు గా 2కోట్లమంది ఉద్యోగులు మన దేశంలో కేంద్ర, రాష్ట్ర, లోకల్ ప్రభుత్వాల లో పనిచేస్తున్నారు . వీరందరూ (ఎవరో 1% మినహాయిస్తే )ఎవరి సీటుకి తగ్గట్లు వారు అవినీతికి కొమ్ముకాస్తూ  లంచాలు మేస్తూ  దేశాన్ని ,అమాయకులను లూటీ చేస్తున్నారు . 

50%
 నల్ల ధనం, రియల్ ఎస్టేట్ లోనే ఉంది . ఏటా రియల్ ఎస్టేట్ లో పెట్టుబళ్ళు పెట్టి 5 లక్షల కోట్ల అవినీతి సొమ్ముని , పన్నుకట్టని సొమ్ముని తెలుపు చేసుకొంటున్నారు . 
అలాగే ఏటా ఆడపిల్లలను ట్రాఫికింగ్ చేయడం ద్వారా ఒక లక్షకోట్ల అవినీతి  సొమ్ము చేతులు మారుతుంది . ప్రభుత్వం ఒక్క సారిగా పెద్దనోట్లు రద్దుచేయడం తో ఈ ఆడపిల్లల 
ఎగుమతి ఆగిపోయింది .మోదీ చేసిన నోట్ల రద్దుని  సమర్ధించడానికి  ఇదొక్కటి చాలు.

కానీ దారుణమేమిటంటే , ప్రతిపక్షానికి చెందిన ఆర్థికవేత్తలు ఈ విమేన్  ట్రాఫికింగ్ ఆగిపోవడం వలన దేశ జాతీయ ఉత్పత్తి కుంటు పడిపోయిందని గగ్గోలు పెట్టడం ! 

పల్లెల్లో ముఖ్యం గా అసోం ,జార్ఖండ్ ,బెంగాల్ , తెలంగాణా లోని పల్లెప్రాంతాల ప్రజలు 10ఏళ్ల ఆడపిల్లలను, 5 లేదా 10 వేలకు  అమ్ముకొంటూ ఉంటారు .  మోడీ చేసిన నోట్ల రద్దు వలన ఈ వ్యాపారం ఆగిపోయి , వీరికి నష్టం వస్తుందని , ప్రతిపక్షాలవాళ్ళు మొసలి కన్నీరు కార్చడం చూస్తా ఉంటే , వీళ్ళు ఎంత దైర్యం గా అక్రమాలకు మద్దతు చూపిస్తున్నారో  ఆశ్చర్య మేస్తుంది .  

అంతే కాదు , ప్రభుత్వం ఒక్క సారిగా పెద్దనోట్లు రద్దుచేయడం తో డ్రగ్ ట్రాఫికింగ్ కూడా పూర్తిగా 
ఆగిపోయింది .

 అంటే .మళ్ళీ (కరెన్సీ ) కాష్   వ్యవస్థ లోకి వస్తే  ఈ ట్రాఫికింగ్ మళ్ళీ మొదలవ్వదా ? 
 ఇదివరకటిలాగే 18లక్షల కోట్ల కరెన్సీ  సిస్టంలోకి వస్తే మళ్ళీ మొదలవుతుంది . అందుకే ఈ దఫా ప్రభుత్వం కేవలం 8లక్షలకోట్ల కరెన్సీని మాత్రమే ఆర్ధిక వ్యవస్థ లోకి  విడుదల చేస్తుంది . సాధ్యమైనంత వరకు,కనీసం చదువుకొన్న వారందరూ డిజిటల్ లావా దేవీలు చేస్తే ఈ కరెన్సీ చక్కగా సరిపోతుంది . 

2016 నాటికి ,
 మనదేశంలో , 7కోట్లమంది ఆదాయపన్ను పత్రాలు సమర్పిస్తున్నా ,ఇందులో 
కేవలం 50 లక్షల మంది మాత్రమే ,  తమ ఆదాయం ఏటా 5లక్షల పైన ఉందని  చెబుతున్నారు . 
ప్రత్యక్ష పన్నులద్వారా దేశ ఆదాయం కేవలం 7లక్షల కోట్లు . 

ఏటా ఒక మిలియన్ విద్యార్థులు కాలేజీ ల నుండి
 ఉద్యోగాలకోసం బయటకు  వస్తున్నారు . మరి వీరందరికీ ఉద్యోగాలు ఎక్కడనుండి వస్తాయ్ ? మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ఉద్యోగాలను కల్పించే అవకాశం ఎప్పుడు వస్తుంది ? ప్రభుత్వం దగ్గర డబ్బు ఉండాలి . అప్పులిచ్ఛే బాంక్ ల్లో  కరెన్సీ నిల్వలు ఉండాలి . 

నల్ల డబ్బు ఎంత ఉంటే మనకెందుకు ? మన వ్యాపారం నడిచిపోతుంది . మన పంట చేతికి వస్తుంది . మన ఉద్యోగాలు 3పువ్వులు ,6 కాయల లెక్క వెలిగిపోతున్నాయ్ . మనం రాకెట్ లు ఎగరేస్తున్నాం . మిస్సైల్స్ పంపేస్తున్నాం . మనకు లేనిదేమిటి ? మోడీ చేసిన ఈ పిచ్చ్చి పని వలన లక్షలాది మంది పనులు చెడగొట్టుకొని  తమ డబ్బు  ని తామే వాడుకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు . ఇదెక్కడైనా విన్నామా ? కన్నామా ?
మాయదారి రోజులంటే ఇవేనేమో ? ! ఇదీ కొందరు కుహనా మేధావుల
 ఆంతర్యం .

30కోట్ల మంది
 న తోటి వారికి రెండు పూటలా రెండు వేళ్ళు కూడా నోట్లోకి పోవడం లేదనే సంగతి ఎవరికీ వారు మరచిపోతున్నాం .
 60కోట్లమంది ఇంకా బహిరంగ మల విసర్జన చేస్తూ పరిసరాలను పాడుచేయడమే కాదు ,ఆరోగ్యాలను పాడు పెట్టు కొంటున్నారని తెలిసీ,   మూగజీవాల లెక్క  అలా ఉండిపోతాం .
 దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి వెళ్ళమంటే ,లేదు...  నకిలీ వైద్యుడి దగ్గరకెళ్ళి ఒక్క సూది మందు ఏసుకొంటేనే మహా బాగని అనుకొంటాం .
ఏటా 50000కోట్లు కేవలం ఉగ్రవాదులను కాచుకోవడానికి ఖర్చు చేస్తున్నాం . 
ఉగ్రవాదులు ,నక్సల్స్, సంఘ ద్రోహులు విఛ్చల విడిగా దొంగ నోట్లు వ్యవస్థలోకి వదులుతా ఉంటే  , ఒక పక్క ద్రవ్యోల్పణం పెరిగి పోయి , దేశ ఆర్ధిక వ్యవస్థ చిన్నా భిన్నం అవుతున్నా  మనం ఏమీ పట్టించు కోమ్ .

మార్పురావాలని కోరుకొంటాం గానీ , ఆ మార్పు మనలను కూడా మారుస్తుంటే గొడవ పెడతాం .
ఎవడో దిగి వఛ్చి ఉద్దరించాలని కోరుకొంటాం . 
వాడెవడో వఛ్చి , ఒక చిన్నపాటి ప్రయత్నం చేస్తే ఉక్కిరి బిక్కిరి అవుతాం .

ఉద్యోగం వచ్ఛేదాక ఒక గొడవ, వఛ్చిన తర్వాత లంచాల గొడవ . అవసరార్ధం తమ సీటు దగ్గరకి వచ్చ్చేవారి రక్తాన్ని
 డెంగ్యూ దోమల లెక్క  పీల్చి పిప్పిచేస్తున్నారు .
 రోజంతా కష్టపడి ,అర బాటిల్ మందేసుకో పోతే  తేళ్లు జెర్రులు శరీర మంతా పాకుతున్నట్లు గోల పెట్టేస్తాం .

90శాతం మంది భారతీయులు ,
 ఇలా బతుకులు ఎలామార్చేసు కొంటూ ఉంటే , మిగతా 10శాతం తెలివిడి ఉన్నోళ్లు , గత 70 ఏళ్లుగా లంచాలరూపేణ, మోసాల రూపేణా , పన్నులెగ్గొట్టి, దాచుకొన్న సంపద రూపేణా 75 లక్షల కోట్ల సొత్తుని భూమి, బంగారం, ప్లాటినం, వజ్రాలు, విలాస వస్తువులు ,  స్విస్ బాంక్ లాకర్స్  రూపాలలో బంధించి  దేశాన్ని , తోటి భారతీయులను ఎడా  పెడా  దగా చేస్తూ పాతాళం లో కి తోసేశారు .

విదేశీ బాంక్ ల తొత్తులైన మన దేశ ప్రయివేట్ బాంకులు హవాలా అడ్డాలుగా మారినా ,విదేశీ బేహారులు స్విస్ బాంక్స్ లాంటి వందల బాంకులను పెట్టి మన నల్ల దొంగలు పోగేసిన డబ్బుని వాళ్ళ బాంకుల్లో కుక్కేసుకొని ,భారత్ లాంటి పేదదేశాలను మరింత పేదరికం లోకి తోసేస్తున్నా ,మనమేమీ పట్టించుకోము .

ప్రస్తుత మనదేశ జాతీయ ఉత్పత్తి విలువకు 5 రెట్ల ఉన్న
  నల్ల సంపదను  ఎలా తిరిగి రాబట్టుకోవాలి ?
మళ్ళీ మళ్ళీ ఇలాంటి భయంకర ఆర్ధిక లూటీ లు జరగకుండా
  ఎలా ఆపాలి ?
మనిషిలో పరివర్తన వచ్ఛేదాక ఇలా మాడిపోవలసిందేనా ? ఏదైనా ఉపాయ ముందా ?

మోడీ ముందే చెప్పాడు . గత అవినీతి పా
 లకుల హయాంలో అవినీతితో,లంచాలతో, కుంభకోణాలతో ,
హవాలాలతో
 కుళ్లిపోయిన   మన ఆర్ధిక వ్యవస్థ ని సమూలం గా ప్రక్షాళన చేస్తానని ,అదే తన ప్రధాన ఎజండా అని ఎలక్షన్ మానిఫెస్టో లోనే చాటాడు . ఆ దిశగా ,గత 2 ఏళ్లుగా చేస్తున్న ప్రయత్నాలలో కొన్ని చూడండి . అవగాహన ఉన్నవారు కూడా  ,అవగాహన లేని మూర్ఖులు వాదించినట్లు అటు పార్లమెంట్ లోను, ఇటు మీడియాలోను ఊదర గొట్టేస్తున్నారు . ప్రజలను తప్పుదారి పట్టించి తమ పబ్బం గడుపుకోవడానికి , మోడ్ చేస్తున్న చర్యలను నీరుగార్చడానికి ఎంతకైనా తెగిస్తున్నారు .
గడిచిన
 దశాబ్దం లో మన దేశం ఏమైనా పురోగమించిందీ అంటే ,అది గ్లోబల్ ఆర్ధిక వ్యవస్థలోని చోదక శక్తితోనే తప్ప
మరొక్కరి గొప్పకాదు . పైపెచ్చుఁ
 , అవినీతి జలగలు లక్షలకోట్లు తోడేసినా మన దేశం ఈ మాత్రమైనా ఉందీ అంటే,  మన దేశములోని అంతర్గత మార్కెట్ డైనమిక్స్ తప్ప , నిశబ్ద  ఆర్ధిక వేత్త వలన అసలే కాదు .

అర్ధాం తర ము
   గా ,ఎలాంటి పకడ్బందీ ఏర్పాట్లు చేయకుండా పెద్ద నోట్లు రద్దు చేసి ,సామాన్యులను కష్టాల్లోకి నెట్టేశారని నెపం వేస్తున్న వారు గత 2ఏళ్లుగా మోడీ చేసిన ముందస్తు ఏర్పాట్లు పరిశీలించండి ...
నల్ల సంపద వెలికితీత
  పై సిట్ ఏర్పాటు , విదేశీ సంపద  స్వచ్ఛంద వెల్లడి  పధకం , మారిషస్ ,సైప్రస్ దేశాలతో ఉన్న డబల్ పన్ను చట్టాలకు సవరణ , భారతీయుల అకౌంట్ ల గురించిన సమాచారాన్ని వెల్లడిచేసే  స్విస్ ఒప్పందం, డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహకం , బినామీ చట్ట సవరణ , స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పధకం,  ఇవన్నీ ముందస్తు ఏర్పాట్లు కాక మరేమిటి ? 
అవికాదు ,
 ముందుగానే 100 , 50 , నోట్లు  ఇబ్బడి ముబ్బడిగా  ప్రింట్ చేసి రెడీ గా పెట్టుకో వచ్చుఁ గా ? అని కొంతమంది అతితెలివిడి ఉన్నవాళ్లు మీడియా చర్చల్లో ఊదర గొట్టేస్తున్నారు . 
నేడు మనం చూ
 స్తున్నాం ... బాంక్ అధికారులు, కొంతమంది హవాలా ముఠాలు కలిసి కొత్త నోట్ల ను కమిషన్ పధ్ధతి పై దారి మల్లించి ప్రభుత్వ  ఉదేశ్యాన్ని నీరు కారుస్తున్నారు .ఎప్పుడైతే చిన్న నోట్ల ముద్రణ
ఎక్కువ అవుతుందో ,ఈ దొంగలు తేలికగా విషయాన్ని పసికట్టేస్తారు .
ఇన్నెందుకు , ఒక్కటి చెప్పండి ! మనదేశ పేదరికానికి ,ఆర్ధిక అసమానతలకు కారణం నల్ల ధనం ,అవినీతి ,లంచగొండి తన మే మూల కారణాలని ఒప్పుకొంటారా ?
అత్యధిక కరెన్సీ ముఖ్యం గా
 పెద్ద నోట్ల  చలామణీ  సంఘానికి చేటు . ఎందుకంటే ఏ ఉగ్రవాది ని చూసినా , ఏ హవాలా వ్యాపారిని వెతికినా ,  ఏ లంచగొండిని తడిమినా , ఏ అండర్ గ్రౌండ్ నేరాలను చూసినా
 మూలకారణం ఈ పెద్ద నోట్లే !
ఆర్ధిక వ్యవస్థ చక్కగా నడవాలంటే
 , కరెన్సీ అనేది మన దేశ జాతీయ ఉత్పత్తి విలువలో కేవలం 6%
 మాత్రమే ఉండాలి . అలాంటిది  ప్రస్తుత వ్యవస్థలో మన జాతీయ ఉత్పత్తి విలువైన 150లక్షలకోట్లలో 12% అనగా 18 లక్షలకోట్లు కరెన్సీ  చలామణీ లో ఉంది . అదే  మనకంటే ఎక్కువ జనాభా ఉన్న చైనాలో కేవలం 9% మాత్రమే  ఉంది .

ఒక్క విషయం మరచి పోవద్దు ... పెద్దనోట్ల రద్దు అనేది ఒక చిన్న ఆరంభం మాత్రమే . నల్ల ధనం పేరుకు పోకుండా ఉండాలన్నా , అవినీతి లంచం గొండి తనం రూపు మాపాలన్నా , ఉగ్రవాదం, నకిలీ కరెన్సీ ని అరి కట్టాలన్నా , చేయవలసింది చాలా ఉంది . దానికి తగిన కార్యాచరణ కు సూచనలు చేయవలసిన బాధ్యత మనందరి పైనా .. ముఖ్యం గా ఆర్ధిక మేధావులపై ఉంది . 
చేతనైతే  మంచి  చేద్దాం ..

Comments