Assess the emerging technologies and how they can make the world a healthier and happier place. మనిషికి శారీర దృఢత్వం, మేధస్సు,ఉద్వేగం , మాట,భాష ,చిత్రలేఖనం , నాట్యం ,ఊహ సామర్ధ్యం తదితర మైన శక్తులు, అతనియొక్క ఉత్కృష్ట మైన నాడీ మండలము , చైతన్యము వల్లనే సాధ్యపడుతున్నాయి. నేటి యంత్రాలలోకూడా దృఢత్వం, మేధస్సు, తార్కిక మైన లెక్కల తో సమస్యల విశ్లేషణ, జ్ఞాపక శక్తి, పోల్చి చూసుకొనే సామర్ధ్యం, మాటలు, పాటలు, నడక,నాట్యం , తదితర జ్ఞాన ,కర్మ ఇంద్రియాలు ఉంటున్నాయి. కానీ యంత్రాలకు ఉద్వేగము,ఊహ శక్తి ఉండదు. ఎందుకంటే వాటికీ మనస్సు అనే ఇంద్రియం లేదు. ముందుముందు వచ్చే అవకాశం ఉంది. కానీ చైతన్యం,అనగా ఎరుక అనగా తాను /నేను' అనే ఎరుక కలుగుతుందో లేదో చెప్పలేము. చల్లని చిరునవ్వుతో, సానుభూతి తో, మానవతా దృక్పధంతో వైద్యం చేసే వైద్యుడి ముందు ఎలాంటి యంత్రాలు పనికిరావు. కానీ... , వైద్యరంగంలో డాక్టర్స్ కొరత ఉన్నప్రాంతాలలో కృత్రిమ మేధస్సు తో (AI) పనిచేసే వైద్య యంత్రాలను - వీటినే బాట్స్ , డా బోట్స్ (డాక్టర్+బాట్స్ ) వినియోగించుకొనే కాలం ఎంతో దూరం లేదు. వైద్యుడు నేడు ముఖ్యంగ