Skip to main content

జనసైన్యాధినేతకి బహిరంగ లేఖ

సినిమాలోకం నుండి దారితప్పి  రాజకీయ రంగంలోకి వచ్చినట్లు ఉంటుంది మీ ప్రవర్తన!
భావోద్వేగాలెక్కువ . భావ సంపన్నత తక్కువ! 
నిలకడ అనేది నీటికి ఉండకూడదు గానీ మనిషికి  అవసరం!
మీరు ఎంతత్వరగా వీలయితే అంతత్వరగా నిలకడ గా ఆలోచించి,  కుదురుగా ఉండటం నేర్చుకోవాలి. 
ఈ మధ్యన మీరు పడుతున్న వేదన చూసిన తర్వాత , ఈ ముక్కలు వ్రాయకుండా ఉండలేక వ్రాస్తున్నాను. సహృదయం తో అర్ధం చేసుకొంటారని అనుకొంటా !

మనిషికి తల్లి ఎంత ముఖ్యమో, వ్యక్తిత్వం కూడా అంతే ముఖ్యము .
తల్లిని దూషించడం ఎంత పాపమో,  ఒకరి వ్యక్తిత్వాన్ని నేల రాయడం కూడా అంతే పాపం.

రాజ కీయ నాయ కులపై అవినీతి ఆరోపణలు రావడం ఎంత సహజమో ,
సినిమా వృత్తి లో ఉన్నపుడు   ఆపోజిట్ సెక్స్ తో అనేక రకాల వాద వివాదాలు రావడం  అంతే సహజం.

 ఆధారాలు ఉన్నా,లేకున్నా ,మీరు  ఆరోపిస్తే అది నిజం.
అదే మిమ్మల్ని  ఎవరైనా అంటే అది మహా కుట్ర !

గాలి పోగేసి మీరు  ఇష్టం వచ్చినట్లు బురద జల్లవచ్చు, ఇతరులు మాత్రం మీ  పైన ఈగ నుకూడా 
వాలనీయ కూడదు .

మీ కు అన్యాయం జరిగిందని  అనుకొంటే జనాలను పోగేసి  అలజడి సృష్టించి, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తారు .  పోలీస్,న్యాయ వ్యవస్థ ఇంకా బతికే ఉందనే విషయం మరచిపోతారు. . 

భగవంతుడు మీకు మంచి జనాకర్షణ నిచ్చాడు. దానిని సంఘానికి మేలుచేయడానికి ఉప యోగిస్తే ఎంత బాగుంటుంది? 

ప్రత్యేకహోదాకోసం చేస్తున్న ధర్మదీక్ష కు మీ లాంటి జనాకర్షణ ఉన్న నాయకులు కూడా  తోడ్పాటునిస్తే  జనం నెత్తిన పెట్టుకొంటారు. అపుడు  మిమ్మల్నెవరూ  వేలుపెట్టి చూపించలేరు. 
చేసే వన్నీ చేస్తూ ఎవ్వరూ ఏమీ అనకూడ దంటే ప్రజాస్వామ్యం లో కుదరదు గదా? 


రాజకీయాలస్సలు తెలియవు అని చెప్పుకొంటూ అతితెలివి తో,స్వార్ధం తో, పూర్వం చేసిన అనైతిక  కార్యాలు బట్టబయలవుతాయనే భయంతో ఒక జాతీయపార్టీకి దాసుడిగా మారార ని లోకం కోడై కూస్తోంది. .అందులో నిజమెంతో మీరే చెప్పాలి. 

ఆంద్ర రాష్ట్రానికి హక్కుగా రావలసిన ప్రత్యేక హోదా,ఇంకా రాష్ట్ర  పునర్నిర్మాణ చట్టంలోని  18 క్లాజులను అమలు చేయకుండా   కుట్రలు  పన్నుతున్న జాతీయ పార్టీ చేతిలో కీలు బొమ్మై, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని  మెజారిటీ జనం అభిప్రాయం. .ఇది నిజం కాదని దైర్యంగా చెప్పండి. 
ఇది రాష్ట్రానికి,దేశానికి కూడా క్లిష్ట సమయం. బాంక్ లపై విశ్వసనీయత పోయింది. 
ప్రభుత్వం అమలుచేస్తున్న డెమో, జి.ఎస్.టి తీరుతెన్నులు అటు వ్యవసాయ రంగాన్ని, ఇటు పారిశ్రామిక రంగాన్నికుదేలు చేసేశాయి. దేశంలో 30కోట్లమంది కడుపులు కాలి ,డొక్కలు ఎండిపోతున్నాయి. చిన్నా చితక వ్యాపారులు మూలపడ్డారు. భూముల ధరలు పడిపోయాయి. 
సంపద విలువ తగ్గిపోతుంది. శ్రమ విలువ పెరిగి పోతుంది. దీనివలన రైతులేకాదు, మధ్యతరగతి వర్గాలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. 
కాస్త నల్లధనం కూడా ప్రభుత్వం తిరిగి తెచ్చుకో లేకపోయింది. 
దేశంలోని  సంపదలో సింహభాగం కేవలం వందమంది దగ్గర పోగు పడుతుంది.  
ప్రపంచంలో ఆయిల్ ధరలు తగ్గుతున్నా ,మనదేశంలో మాత్రం విపరీతంగా పెరుగుతున్నాయి. తుగ్లక్ ఇంతకన్నా మంచిగా పాలించేవాడేమో! అనే భావం కలుగుతుంది . 
ఇలాంటి సమయంలో రాష్ట్రప్రయోజనాలకోసం అందరినీ,అన్నిపార్టీలు,సంఘాలను ఐక్యం చేసి ఒక సంఘటిత శక్తిలా , మన రాష్ట్ర ముఖ్యమంత్రి ధర్మపోరాటం చేస్తున్నారు. 
ఇక్కడో చిన్న ప్రశ్న. 
అవినీతి చరిత్ర లేని  ప్రభుత్వ ఉద్యోగిని కానీ , రాజకీయనాయకుడిని గానీ  మీరు చూపించగలరా?

  నిజానికి అది తిట్టో కాదో తెలియదుగానీ,  సరిగ్గా ముఖ్యమంత్రి దీక్ష చేస్తున్నరోజే, 
మీ తల్లిని తిట్టారని   మీరు అనుకొన్న  4 రోజులతర్వాత మీ కుటుంబాన్ని వెంటేసుకొని , గలాభా చేసి ఆంధ్రుల దృష్టిని మరల్చుదామని ప్లాన్ చేసావని కొందరు చేస్తున్న కామెంట్లలో 
నిజముందే మో అనిపించక మానదు.
మీరు  JFC- అనే నిజనిర్ధారణ కమిటీ వేశారు.  . ఆ కమిటీలోఉన్న వాళ్లలో మెజారిటీ సభ్యులకు నేటి ఆర్ధికపరిస్థితులపై ఉన్న అవగాహన కంటే రాజకీయ అవగాహనే ఎక్కువని అందరూ చెప్పుకొంటున్నది నిజమేనా?
సరే కమిటీ వేశారు  . కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అల్టిమేటం ఇచ్చే స్థాయికి ఎదిగార ని అభిమానులు కూడా  సంతోషించారు. పాపం ముఖ్యమంత్రిగారు మీ  అల్టిమేటం కి భయపడో, మీ  పై గౌరవం తోనో,    లెక్కలన్నీ మీకు సమర్పించారు. ( కేంద్రప్రభుత్వం లోలోపల నవ్వు కొంటూ,  మనోడు యాక్షన్ బాగానే చేస్తున్నాడని పొంగిపోయిందని ' ఒక వార్త ).

కమిటీ తేల్చిన లెక్క ఎవ్వరికీ చెప్పకుండా బుట్ట దాఖలు చేశారు .  . ఎందుకంటే నిజం మాట్లాడితే కేంద్రానిది తప్పని తేలుతుంది గదా! కాబట్టి ఆ  డ్రామా అంతటితో  అలా ముగించారు .

పార్టీ ప్లీనరీ మీటింగ్ పెట్టి మీ  పార్టీ ఏది ఎలా సాధిస్తుందో చెప్పకుండా అవతలివారి వ్యక్తిత్వం పై బురద జల్లారు !  మోసం చేస్తున్న కేంద్రానికి సారధ్యం వహిస్తున్న మోడీగారిని కనీసం  ఒక్కమాట అనలేదు. ప్రశ్నలు వేయడమే జన్మ హక్కని చెప్పే మీరు కేంద్రాన్ని ఒక్క ప్రశ్నకూడా వేయలేదు. కారణం ఏమిటి? 
మీకు రాష్ట్ర పరి స్థితుల పైన,ఆర్ధిక విషయాలపైనా కనీస అవగాహన కూడా ఉన్నట్లు  లేదని అందరికీ ఓ పెద్ద అనుమానం. అంతేకాదు మీరు కన్ఫ్యూస్ అవుతూ ప్రజలను కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నారని కొందరు, ఇదో కొత్త అతితెలివి రాజకీయం అని మరికొందరు  మధనపడుతున్నారు. 

అందరికీ అల్టిమేటం ఇచ్చే అధికారం గానీ, అందరినీ డిమాండ్ చేసే హక్కు గానీ మీకు దఖలు పడాలంటే , ప్రజల్లో మీ  పట్ల ఉన్న శతకోటి అపోహలను తొలగించి,మళ్ళీ నమ్మకాన్ని నిలబెట్టుకునే చర్యలు పాటించాలి.రాజకీయపార్టీ నాయకుడిగా అది మీ బాధ్యత. 

 ఇంకో విషయం! ఎపుడూ మీరే ప్రశ్నలు వేయడం కాదు, జవాబులు కూడా కరెక్ట్ గ చెప్పాలి. 
మరో విషయం , రాబోయే ఎన్నికలలో, అవినీతి ఆరోపణలు అస్సలేవీ లేనివారికి మాత్రమే మీరు టికెట్ లు ఇవ్వాలని బడుగు ప్రజల కోరిక.  
నోట్ : స్త్రీలను, అన్నదాతలైన  రైతులను,కంటికి రెప్పలా కాపాడే జవాన్ ను , సంఘానికి మేలుచేసే నాయకులను క్షోభ పెట్ట్టన  వారికి ఎలాంటి శిక్ష వేయాలో...  ప్రజలే వేస్తారు.

మీకు ఎల్లపుడూ మేలు కలగాలని ... 
మీవలన అందరికీ మేలు జరగాలని ... ప్రార్ధన. 



Comments