అమరావతి మనందరి రాజధాని!
ఒక ప్రాంతం అభివృద్ధి చెందుతుందీ అంటే అక్కడ భూముల ధరలకు రెక్కలు వస్తాయని అందరికీ తెలుసు. అభివృద్ధి చెందుతున్న దశలో సైబరాబాద్ ఏరియాలో రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎంతగా వృద్ధి పొందిందో మనం చూశాం . నేడు అమరావతి కూడా అదే మాదిరి గా , ఇంకా కాస్త ఎక్కువగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్న ప్రాంతం.
రాష్ట్రప్రభుత్వం ,ప్రవేట్ ఎంటర్ ప్రెన్యూర్ లతో కలిసి అభివృద్ధికి బాటలు వేస్తూ, దేశంలోనే తొలిసారిగా భూములిచ్చిన రైతులను కూడా ఆ వృద్ధిలో భాగస్వాములను చేస్తావుంటే కొందరు కుహనామేధావులు వక్రభాష్యాలు చెబుతూ అభివృద్ధి పై బురద జల్లుతూ ఆనందపడుతున్నారు.
అధికారపార్టీ వాళ్ళే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారని ఏడుస్తున్నారు. తాము పెట్టుబళ్ళు పెట్టిన దొనకొండ లాంటి వేరే ప్రాంతంలో రాజధాని వచ్చి ఉంటే తమకు ఇబ్బడిముబ్బడిగా లాభాలు వచ్చేవని, ఇపుడు ఆ ఛాన్స్ మరొకళ్ళు కొట్టేశారని ఏడుస్తున్నారు.
అభివృద్ధి చెందే ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ బిజినెస్ అపరిమితంగా జరగడం ఎక్కడైనా సహజం. ఈ వ్యాపారంలో అధికారపార్టీ వాళ్ళే సింహభాగం లబ్ది పొందుతున్నారని, తాము పొందలేక వెనకబడి పోతున్నామని ఆ మేధావుల ఆరోపణ. ఒకపార్టీ అధికారంలోకి వస్తే రాజధాని దొనబండ అని, మరోపార్టీ అధికారంలోకి వస్తే కృష్ణాజిల్లా అని ఎప్పటినుండో అనుకొంటున్న సంగతి అందరికే తెలుసు. పార్టీల గెలుపు పై నమ్మకాన్ని అనుసరించి ఆయా ప్రాంతాలలో అటు దొనకొండ,ఇటు నూజివీడు మండలంలోనూ విపరీత మైన స్పెక్యు లేషన్ తో పెట్టుబళ్ళు
పెట్టారు .
కానీ చివరికి నదీ తీరప్రాంతమైన అమరావతి ప్రాంతం ఎంపిక కావడంతో పైన చెప్పుకొన్న రెండుప్రాంతాలలో పెట్టుబళ్ళు పెట్టిన వ్యాపారులు తీవ్ర నిరాశా నిస్పృహలతో రాష్ట్రప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోస్తున్నారు.
మేధావి వర్గానికి చెందిన మాజీ ప్రభుత్వ కార్యదర్శి హయాంలోనే ఇదంతా జరిగినా , మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కినట్టు నేడు తిరిగి, ఆయనపనిచేసిన వ్యవస్థపైనే దుర్మార్గమైన ఉక్రోషపూరిత ఆరోపణలు చేయడం మనం చూస్తున్నాం. చదువులేనివాడు అవినీతిపరుడైనా అతని వలన పెద్దగా చెడు జరగదు. కానీ ఓ తెలివిగల విద్యావంతుడు అవినీతి తో కుళ్ళిపోతే అతడు చేసే చెడు సమాజాన్నే తప్పుదారి పట్టించి చెరుపు చేస్తుంది .
కాబట్టి ఇలాంటి కుహనా అవినీతి విద్యావంతులను అస్సలు నమ్మకూడదు.
ఎవరి రాజధాని ఇది ? అని వెర్రిమొర్రి ప్రశ్నలు వేయడం కాదు.
ఇది అందరి రాజధానిగా ఎలా మలచుకో వాలో చెప్పు! లేదంటే జరుగుతున్న అభివృద్ధిని చూసి తీరు మార్చుకో!

Comments
Post a Comment