Skip to main content

Emerging technologies in Health care

Assess the  emerging technologies and how they can make the world a healthier and happier place.

మనిషికి   శారీర దృఢత్వం, మేధస్సు,ఉద్వేగం , మాట,భాష ,చిత్రలేఖనం , నాట్యం ,ఊహ సామర్ధ్యం తదితర మైన శక్తులు, అతనియొక్క  ఉత్కృష్ట మైన నాడీ మండలము , చైతన్యము వల్లనే సాధ్యపడుతున్నాయి. 
నేటి యంత్రాలలోకూడా దృఢత్వం, మేధస్సు, తార్కిక మైన లెక్కల తో సమస్యల విశ్లేషణ, జ్ఞాపక శక్తి, పోల్చి చూసుకొనే సామర్ధ్యం, మాటలు, పాటలు, నడక,నాట్యం , తదితర జ్ఞాన ,కర్మ ఇంద్రియాలు ఉంటున్నాయి. కానీ యంత్రాలకు ఉద్వేగము,ఊహ శక్తి ఉండదు. ఎందుకంటే వాటికీ మనస్సు అనే ఇంద్రియం లేదు. ముందుముందు వచ్చే అవకాశం ఉంది. కానీ చైతన్యం,అనగా ఎరుక అనగా తాను /నేను' అనే ఎరుక కలుగుతుందో లేదో  చెప్పలేము. 

చల్లని చిరునవ్వుతో, సానుభూతి తో, మానవతా దృక్పధంతో వైద్యం చేసే వైద్యుడి ముందు ఎలాంటి యంత్రాలు పనికిరావు. కానీ...  ,
వైద్యరంగంలో డాక్టర్స్ కొరత ఉన్నప్రాంతాలలో కృత్రిమ మేధస్సు తో (AI)  పనిచేసే వైద్య యంత్రాలను  - వీటినే బాట్స్ , డా బోట్స్ (డాక్టర్+బాట్స్ ) వినియోగించుకొనే కాలం ఎంతో దూరం లేదు. వైద్యుడు నేడు ముఖ్యంగా చేయవలసింది,లేతదశలోనే వ్యాధిని కనిపెట్టి నిర్ధారణ చేసుకొని వివిధ పద్ధతులలో వైద్యాన్ని అమలుచేయడం . 
A recent survey from PwC found that, 94% of people in Nigeria, 85% in Turkey , 82% in  South Africa, 51% in Germany and 50%in  UK.are willing to engage with AI and robotics for their healthcare needs. 

వ్యాధిలక్షణాలను (Symptoms) , వ్యాధి యొక్క చిహ్నాలను (Signs)  కని పెట్టేక్రమంలో రోగి తనమాటల ద్వారా చెప్పే వ్యాధిలక్షణాల చరిత్ర ( past&present history of complaints and other diseases &allergic history) ఎంతో ముఖ్యమైనది. 
అలాగే  సునిశిత పరిశీలన ద్వారా  ,  వివిధ ప్రశ్నల ద్వారా మరింత సమాచారాన్ని వైద్యుడు రోగినుండి గ్రహిస్తాడు. 
అంతేకాదు రోగిని చేతితో (palpation&percussion) , మరియు వివిధ పరికరాలు (non-interventional) - స్టెత్ , ఫిటో స్కోపి, స్కానింగ్,ఎక్సరే ,వేలితో ప్రవహించే రక్తం వెలువరించే కంపనాలను గుర్తించే ఆక్సీ మీటర్, వైటల్ ఆర్గాన్స్ నుండి వెలువడే విద్యుత్ తరంగాలలోని తేడా లను గ్రహించే ECG&EEG&EMG &CTG(Cardiotocography ) - సాయంతో గానీ, రోగి శరీరములోని భాగాలు-  రక్తము, వివిధ ఆర్గాన్ లలోని కణములు (BIOPSY) , మూలుగ ,లాలాజలం,మూత్రం, మలము, జీర్ణరసాలు, తదితరాల పరీక్ష లద్వారా గానీ, పరీక్షించి రోగనిర్ధారణ,వైద్యము జరుగుతున్న తీరుతెన్నులు, మందులు పనిచేసే విధానాన్ని తెలుసుకొంటున్నాడు. 
ముఖ్యంగా ఈ పైన చెప్పుకొన్న  పరీక్షలన్నీ మానవ వైద్యులకంటే గొప్పగా, వేగంగా, ఎలాంటి పొరబాట్లు లేకుండా  Daabots' చేయగలవని నిరూపణ అవుతుంది. 

మనిషి పలికే మాటలోని సూక్ష్మమైన తేడాలను ఇట్టే పసిగట్టే డాబాట్స్ , ( AI-powered tools that listen to an infant’s cries and detect birth asphyxia (lack of oxygen) using an app instead of relying on a blood gas analyser.), 
అలాగే వివిధ చిత్రాల లో ( xray&scan images) అసాధారణమైన వాటిని  కూడా చక్కగా కనిపెట్టే డాబాట్స్ నేడు ఉన్నాయి. 

అంతేకాదు మేధస్సుతోపాటు,సానుభూతితో చక్కగా విని సలహాలు కూడా చెప్పే "డాబాట్స్"  వస్తున్నాయి. ముఖ్యంగా  135కోట్ల జనాభా ఉన్న మనదేశంలో కేవలం 4000మంది మానసికవైద్యులుమాత్రమే ఉన్నారు.  ఇలాంటి వారికీ ఒక యాప్  "వైసా" అనేది ఉందంటే ఆశ్చర్యమేస్తుంది. కుంగుబాటులో ఉన్నవారికి ఓ మంచిమాట, ఓ చక్కటి ఓదార్పు, సానుభూతితో విని సలహా చెప్పే దాబోట్ ,యాప్ ఉంటే అంతకంటే కావలసింది ఏముంటుంది?
రక్తప్రవాహంలోని అణువులు వెలువరించే కాంతి పట్టిక ను పరీక్షించి ఆయా అణువుల శాతాన్ని కనిపెట్టే చిన్న చిన్న సెన్సార్లు ఉన్నాయి నేడు. అవి మన స్మార్ట్ ఫోన్ లలో  కూడా వచ్చేస్తున్నాయి. ఓ చిన్న చిప్ పై అనేక రకాల సెన్సార్లు (లాబ్ ) వస్తున్నాయి. అలాగే  చిన్న చిన్న చిప్ లపై వివిధరకాల  మానవకణాల ను ముద్రిస్తున్నారు. మందుల యొక్క శక్తి సామర్ధ్యాలను, మోతాదుశాతాన్ని, దుష్ఫలితాలను  ఈ చిప్ లపైనే  పరీక్ష చేస్తున్నారు. 
అణువులో సంభవించే మార్పులన్నింటికీ మూలకారణం చుట్టూ ఉండే శక్తి స్పందనలలో కలిగే మార్పులే! ఆకారంతో కనబడే ఈ సృష్టి సమస్తం ఘనీభవించిన స్పందనలే! ఆయా స్పందనలలో మార్పులు కలిగితే ఆయరూపాలలో కూడా మార్పులు రావడం సహజం. 


Comments