ఆదాయ అసమానతలు దేనివలన కలుగుతాయి ? మనుషులందరూ ఒకేరకంగా ఉండరు. వారి నామరూపాలు ఎలా భిన్నంగా ఉంటాయో, వారి తెలివితేటలు,విద్యాసంస్కారాలు ,అలవాట్లు,కష్టపడే సామర్ధ్యం,శారీరక ఆరోగ్యం, వారి జన్యు వుల పనితీరు, అవకాశాలను అంది పుచ్చు కొనే సామర్ధ్యం, రిస్క్ తీసుకొనే సామర్ధ్యం ... ఒకేరకంగా ఉండవు . ఇవన్నీ మనిషిలోలో ని భిన్న విషయాలు ( వేరియంట్స్ ). ఇవికాక,బాహ్యంలో మరికొన్ని భిన్న వేరియంట్స్ ఉంటాయి . కులము,మతము,ప్రాంతం ,ఆచార సంప్రదాయాలు ... ఇవన్నీ మనిషికి కొన్ని అవకాశాలను,మరికొన్ని అడ్డంకులను కలిగిస్తాయి . ఇవే కాక కొన్ని గుహ్యమైన వేరియంట్స్ కూడా మనిషిని ప్రభావితం చేస్తాయి . దానినే "విధి" (తలరాత/కర్మ) అంటాం . వ్యక్తిగత కర్మ , వంశగత కర్మ,సంఘపరమైన కర్మ,దేశ పరమైన కర్మ కూడా నిగూఢం గా పనిచేస్తుందని , అస్సలు, పైన చెప్పుకొన్న వేరియంట్స్ కి మూలకారణం "విధి" అని మహర్షులు చెబితే,నేటి శాస్త్రజ్ఞులు దానిని కొట్టి పారేయడం మనం చూస్తున్నాం . The top 1% of earners captured less than 21% of total income in the late 1930s, before dropping to 6% in the early ...