Skip to main content

నీటిని పూజిద్దాం

నీటిని కాపాడుకొంటే,నీరు మనలను రక్షిస్తుంది .
ఎన్నో గ్రహాలు,ఖగోళాలలో,జీవనానికి  అత్యంత అనుకూలమైన గ్రహమే మనభూమి .
భూమికి చెందిన  పంచభూతాలను పాడుచేయకుండా వినియోగించు కోవడమే మనిషి ప్రధమ కర్తవ్యం .

నదులు,కాలువలు,చెరువులు,కుంటలు,బావులు మన జీవనాడులు . జలమే జీవనానికి ఆధారం . ఇవన్నీ తెలిసి,నదీగర్భాలను యధేచ్చగా  తవ్వుకొంటూ  నదులను  వక్రమార్గం పట్టిస్తూ , నదుల నడకలను అస్తవ్యస్తం చేస్తున్నాం .
 కాలువల్లో,చెరువుల్లో ప్లాస్టిక్ తదితర వ్యర్దా లను ఇష్టానుసారం విసిరేసి కలుషితం చేసుకొంటున్నాం .
పంటల పై  అసేంద్రియ ఎరువులను ,పురుగుమందులను విరచిమ్ముతూ పంట దిగుబళ్లను పెంచుకొంటున్నామని జబ్బలు చరుచు కొంటూ , నేలతల్లి గుండెల్లో సారాన్ని హరించి వేస్తున్నామనే సంగతి మరచిపోయి మనగతులను పాడుపెట్టు కొంటున్నాం .
మరి మనమేం చేయాలి ?
ముందుగా, నదు లకు అటూ ఇటూ రెండువైపులా 500మీటర్ల వెడల్పులో  పచ్చదనాన్ని పెంచాలి . వేప,కానుగ, దేవదారు,ఓక్ , పళ్ళ వృక్షాలు పెంచి నేలను పటిష్ట పరచాలి . అలాగే కాలువలు,కుంటలు,చెరువుల చుట్టూ కూడా 100 మీటర్ల వెడల్పున చెట్లను పెంచితే ఆక్రమణల ను అరికట్టవచ్చు .
నదుల్లో గానీ మరి ఏ ఇతర జలాశయాలలో గానీ అవసరమైనపుడే పూడికలు తీయాలితప్ప,ఇసుక కోసం మొత్తం నది,కాలువ చాలులను ధ్వంసం చేయకూడదు .ఇసుకకు ప్రత్యామ్నాయం గా క్వారీ డస్ట్ ను వాడటం అలవాటు చేసుకోవాలి .
నదులు,కాలువల వెంబడి ప్రతి కిలోమీటర్ కి పరిశుభ్రం చేయడానికి పనికి వచ్చే చేతివలలను అందుబాటులో ఉంచితే,పౌరులు,ముఖ్యంగా దగ్గర్లోని విద్యార్థులు వాటిని ఉపయోగించి నీటిప్రవాహానికి అడ్డుగావున్న డెక్కను,ప్లాస్టిక్ వ్యర్ధాలను తొలగించే అవకాశం ఉంటుంది .  ప్రభుత్వం పై ఆధారపడకుండానే,ప్రతి పౌరుడు బృందాలుగా మారి ఈ పనులన్నీ చేయవచ్చు. స్వచ్ఛత అనేది ఒకరు చెబితే చేసేది కాదు . మన హృదయాలలోనే ఆ తపన ఉండాలి . పౌరులకు హక్కులు ఎలాఉన్నాయో ,బాధ్యతలు కూడా ఉన్నాయని మరచి పోకూడదు .
ప్రతిగ్రామంలోని నీటి కుంటలు,బావులు,చెరువులు,కాలువలను ఆయా గ్రామస్తులే బాగుచేసుకోవడం ఏమంత కష్టమైన పనికాదు . నీటి ని పూజించి పూలువెదజల్లడం తోనే సరిపెట్టుకొంటున్నాం . పూలకు బదులు, వ్యర్ధాలను హరించే సూక్ష్మజీవులను వెదజల్లితే ఎంతో  ప్రయోజనకరంగా ఉంటుంది . నీటికి నడకలు నేర్పవలసిన అగత్యం లేదుకానీ, నడిచే నీటికి  అడ్డుకట్టలే వేయకూడదు . అలాగని ఉధృతంగా పరిగెత్తే నదులను ఆలా వదిలేయ కూడదు . పరుగుతీసే నదిని నెమ్మదింపచేసే చర్యలు...ఆనకట్టలు ,చెక్ డామ్ లు తగుప్రదేశాలలో నిర్మించాలి .
bacterial bioremediation – or removing pollutants from water using biological products. By introducing  bacteria concentrates into the water (100 litres of concentrate a day) at various  river locations,the bacteria degrades organic pollutants, enhances dissolved oxygen levels and removes odours.By this way, we can reduce Biochemical oxygen demand levels and chemical oxygen demand levels.

Comments