సుమారు 5వేలకోట్లు ఖర్చుపెట్టి, నోట్ల
రద్దు అనే సాహసం దేనికోసం చేసింది ప్రభుత్వం?
మనదేశంలో పన్ను చెల్లింపు దారులు చాలా తక్కువ. దీనివలన ప్రభుత్వానికి ఆదాయం లేదు . కానీ కోట్లాది జనాభాకి మౌలిక సదుపాయాలు ,కనీస అవసరాలు కల్పించాలంటే ధనం కావాలి . కానీ ఆదాయం లేదాయె! అందుకే గత 70ఏళ్లుగా ప్రభుత్వాలు ఇబ్బడి ముబ్బడి గా కరెన్సీ ని ముద్రమ్చేయడం వలన ద్రవ్యోల్పణం పెరిగి పోయి, కరెన్సీ కి నానాటికి విలువ తగ్గిపోయింది .
అంతేకాదు, వ్యవస్థలో నల్లధనాన్ని తొలగించడానికి , ఉగ్రవాదులకు,నక్సల్స్ కు ధన ప్రవాహాన్ని తగ్గించడానికి , నకిలీ కరెన్సీ ని అరికట్టడానికి , వ్యవస్థను నగదురహిత వ్యవస్థ గా మార్చడానికి, పన్ను చెల్లింపు వ్యవస్థను బలవత్తరం చేయడానికి, ధనవంతుల దగ్గర నిరర్ధకం గా మూలుగుతున్న ధనాన్ని వ్యవస్థలోకి తీసుకొని రావడానికి, ఎక్కువమందిని పన్నుపరిధిలోకి తీసుకు రావడానికి , యుద్ధ ప్రాతిపదికన ఆర్ధిక వ్యవస్థను ప్రక్షాళనం చేయవలసి ఉంది . ఇప్పటికే ఆలస్యం అయింది . ఎన్నో మధ్యతరగతి పరిశ్రమలు,సంస్థలు,వ్యాపారాలు , ఎలాంటి పన్నుపరిధిలోకి రాకుండా తప్పించుకొని పబ్బం గడుపు కొంటున్నాయి . దీనివలన పన్నుకట్టేవారిపైనే సెస్సుల రూపంలో దబిడి దబిడిగా పన్నులు వేస్తున్నారు .
అందుకే , విలువ ఎక్కువగా ఉన్న నోట్లను
(1000 & 500) రద్దు చేయడం జరిగింది. ఈ మహా
యజ్ఞం లో నోట్ల రద్దు అనేది ఒక చిన్న చిట్కా
మాత్రమే!
అసలైన కార్యాచరణ ముందు ముందు చాలా ఉంది . షెల్ కంపెనీలను మూసివేయడం,
బాంకుల నిరర్ధక ఆస్తులను తగ్గించడానికి ఋణగ్రహీత ల ఆస్తులను జప్తు చేయడం ,
పన్ను పరిధి నుండి గత 70ఏళ్లుగా తప్పించు కు తిరుగుతున్న లక్షలాది
కంపెనీలు,ట్రస్టు లను,వ్యక్తులను పన్ను పరిధిలోకి లాక్కోవడం
,బినామీ ఆస్తులను జప్తు చేయడం, నగదురహిత లావాదేవీ లను ప్రోత్స హించడం అనేవి కొన్ని
అవసరమైన చర్యలు! ఇవన్నీ గాడిలో పడి ఫలితాల నివ్వాలంటే సమయం పడుతుంది .
మన దేశంలో ఉన్న నగదు వ్యవస్థకు
, సమాంతర వ్యవస్థ ఉందని దానివలన నష్టం జరుగుతుందని ఎప్పటి నుండో ఆర్ధిక మేధావులు
మొత్తు కొంటున్నారు .
నిజానికి, మనదేశంలోని నల్లడబ్బు అత్యధికశాతం రియల్
ఎస్టేట్,బంగారం,డాలర్లు,కంపెనీ షేర్ల రూపంలోనే ఉంది . కేవలం 5శాతం మాత్రమే కరెన్సీ
రూపంలో ఉంది . అన్నింటికంటే దారుణమైన విషయం ఏమిటీ అంటే, పోగుబడుతున్న నల్లధనం
ఎప్పటికపుడు మనీ లాండరింగ్ ద్వారా తెలుపు గా మారుతుంది .
మరికొంత విదేశీ బాంక్ ల్లో మూలుగుతుంది .
మనదేశంలో పన్నుకట్టే వారి సంఖ్య తక్కువ... .
ప్రశ్నించే వారు ఎక్కువ!
కేవలం 2కోట్ల మంది మాత్రమే ఆదాయపన్ను పత్రాలను దాఖలు చేస్తున్నారు .
వీరిలో కేవలం అరకోటి మంది మాత్రమే ఎంతో కొంత పన్ను కడుతున్నారు .
ఒక రీతి గా, లెక్క గా లేని (Uunorganized system) వ్యవస్థను
గాడిలో పెట్టడానికి, వ్యవస్థకు బ్రేక్ లు వేయక తప్పదు . దానివలన వ్యవస్థ నెమ్మ
దించినా (Reduced GDP) , దూరం
ఆలోచిస్తే మేలే జరుగుతుంది .
నిజానికి భారత దేశం GDP ఎందుకు తగ్గిందో ఒక్క సారి ఆలోచిద్దాం .
గత ఏడాది నుండి,అనగా 2015 నుండి మనదేశంలో పారిశ్రామిక ఉత్పత్తు లు గణనీయం గా
తగ్గాయి . GDP లో వాటి విలువ తగ్గుతా వస్తుంది . అలాగే సాఫ్టువేర్ రంగంలో కూడా మాంద్యం వచ్చ్చింది
. మనదేశ GDP లో ఈ రెండు రంగాల వాటానే అధికం,అనగా సుమారు 70% ఉంటుంది .
ఇక్కడ ఇంకోవిషయం కూడా గమనించండి ... ఆంద్ర ప్రదేశ్ కొత్తగా ఏర్పడిన
ఆర్ధిక లోటు ఉన్న చిన్నరాష్ట్రం . వనరులు లేవు,రాజధాని లేదు . ఆ AP రాష్ట్రం కూడా
నోట్లరద్దు ప్రభావానికి లోనయింది . అయినా ఈ రాష్ట్ర GDSP(
2016-17) 12% చూస్తే మీకు ఆశ్చర్యం వేస్తుంది . నోట్లరద్దు వలన GDP తగ్గుతుందనే ఆర్థికవేత్తల వాదన లో నిజం లేదని అర్ధం అవుతుంది . .
నోట్లరద్దు జరిగినతరువాత,2016-17 లో 3 కోట్లమంది ఆదాయపన్ను పత్రాలను దాఖలు చేశారు . అంటే
సుమారు కోటిమంది కొత్తవారు పన్ను వలలో చిక్కినట్లే!అంతేకాదు,బ్యాంకు ల్లోకి
తిరిగొచ్చిన 15 లక్షల కోట్ల డబ్బులో సుమారు 4లక్షల కోట్లు నల్లధనమే
(పూర్వం ఎలాంటి లెక్కలు చూపనిదే ) అని ప్రభుత్వ బాంక్ ల సంఘం ఒక అంచనా వేసింది . ఎందుకంటే, 30శాతం
పన్నుకట్టి , మిగతా ధనాన్ని తెల్లడబ్బుగా మార్చుకొనే వీలు ప్రభుత్వం
కలిపించింది . ఆ విధంగా పన్నురూపంలో కనీసం లక్షకోట్లు ప్రభుత్వానికి వస్తుంది .
ఇప్పటికే లక్ష నకిలీ హవాలా కంపెనీలను గుర్తించారు .
నల్లడబ్బుని తెల్లడబ్బుగా మార్చే దారులన్నింటినీ మూసేసు కొంటూ
వస్తుంది ప్రభుత్వం .
పెద్దనోట్ల రద్దు ప్రకటన అనంతరం ఎలాంటి లావాదేవీలు
జరపకుండా ఉన్న బ్యాంకుల ఖాతాల్లో కేవలం 2 నెలల వ్యాధిలో అనగా డిసెంబర్
31 వరకు, కేవలం పన్నెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల లోనే రూ.31, 300
కోట్లకు పైగా నగదు డిపాజిట్ అయినట్టు ఆయా బ్యాంకు అధికారులు వెల్లడించారు.
అంటే జూన్-2017 వరకు అన్ని బాంకులలో జరిగిన ఇలాంటి లావాదేవీలను
లెక్కిస్తే సుమారు లక్ష కోట్ల నల్లధనం లెక్క తేలుతుందని అంచనా . మరి,ఇది
నోట్లరద్దు వలన జరిగిన శుభ పరిణామమే గదా?
అవినీతిని అరికట్టడం అత్యంత కష్టం . ఎందుకంటే వ్యక్తుల్లో
పరివర్తన రావాలి .దీనికి చాలా సమయం పడుతుంది . నేడు మనం చేయవలసింది ,ఎవరికి వారు
సాధ్య మైనంత వరకు నీతినిజాయితీలతో మెలగాలి . ఆర్ధిక అసమానతలను తగ్గించాలి .
దేశం
యెక్క ఉత్పత్తుల విలువ కంటే ప్రజల సంతోషం గొప్పది .
ఎంత GDP
అని కాదు,ఎంతమంది సంతోష శాంతులతో ఉన్నారనేది మన అభివృద్ధికి
సూచీ
కావాలి .
నిజానికి ఒక దేశ ఆర్ధిక సామర్ధ్యాన్ని కేవలం GDP మాత్రమే ప్రతి
బింబించ లేదు. ఎందుకంటే, ప్రస్తుత వ్యవస్థలో GDP అధిక పెరుగుదల ఉన్నా, అది
ఎవరికీ ఎక్కువ మేలు చేస్తుంది ? కేవలం 10శాతం ధనికులకు మాత్రమే ఆ ఫలాలు
దక్కుతున్నాయి . GDP పెరుగుదల 10 శాతం ఉండీ , దేశంలోని 80 శాతం మందికి ఆ
ఫలాలు దక్కనపుడు ఏమిటి లాభం? కాబట్టి లోపాలున్న ఈ ప్రస్తుత ఆర్ధిక వ్యవస్థను
బాగుచేయాలంటే కాస్త బ్రేక్ వేయకతప్పదు . మోడీ ప్రభుత్వం చేసింది అదే!
ప్రతి ఎలక్షన్ కి మన నాయకు లు గానీ, ప్రభుత్వాలుగానీ ఎంత ఖర్చు
చేస్తున్నాయి?
అలాగని చెప్పి, ప్రజాధనం వృధా
అవుతుందని,ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టు ఐన
ఎన్నికలను మానేయలేము గదా?
ఇవ్వాళ నోట్లరద్దు గురించి ఎక్కువగా బాధపడుతూ గుండెలు బాదుకొనేది
ఎవరో తెలుసా?
ధనవంతులు,రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఎగువ మధ్యతరగతి యువరాజులు వారి
ఆస్తుల విలువలు పడిపోయాయనే బాధ ఒక పక్క, నల్ల డబ్బుని తెలుపు చేసుకొనే వీలు లేదనే
దుగ్ధ ఇంకోపక్క ...ఇలా సతమత మైపోతూ ప్రభుత్వాన్ని ముఖ్యంగా మోడీ ని తిట్టి
పోస్తున్నారు .
బినామీ చట్టం, దివాళా చట్టం, నగదురహిత ఆర్ధిక వ్యవస్థ,
GST- ( "ఒకేదేశం
-ఒక వస్తువు-ఒక సేవ-ఒకేవిధమైన పన్ను ");
అధిక విలువ కరెన్సీ రద్దు తదితర ప్రక్రియలు రాబోయే దశాబ్దంలో మనదేశ
ఆర్ధిక వ్యవస్థను
ఒక నూతన సమాన ఆర్ధిక వ్యవస్థకు దారి తీస్తాయి .
మార్పు సహజం . సహజంగానే మనం మార్పుని ఇష్టపడం . మనకిష్ట మున్నా,కష్ట
మున్నా, మార్పు అనేది నిరంతర ప్రక్రియ. కాలం అసమానతలను కరెక్షన్
చేస్తుంది . దానిని మనం ఎదిరిస్తే,కాస్త ఆలస్యం అవుతుంది తప్ప,మార్పు జరగక మానదు!
Comments
Post a Comment