Skip to main content

Posts

ఒక ప్రధాని ఎలా పనిచేయకూడదో ఉదాహరణ గా మోడీ ని చూస్తే చాలు!

గడిచిన 70ఏళ్ల స్వాతంత్రంలో భారతదేశం ఏది   ఎలా సాధించిందో, ఎక్కడ ఎవరిచేతిలో దెబ్బతిన్నదో , ఎక్కడ ఎవరివలన భ్రష్ట్టు పట్టిందో పరిశీలిస్తే కొన్ని చిత్రమైన విషయాలను మనం చూడ వచ్చు!   బలమైన ప్రభుత్వం వలన ఎక్కువ మేలు జరుగుతుందని    మనం అనుకొంటాం. బలమైన నాయకుడి వలన దేశం అభివృద్ధి పధంలో దూసుకు పోతుందని భావిస్తాం. కానీ గత 2 దశాబ్దాల ప్రపంచ    చరిత్ర చూసినా , గత 70 ఏళ్ల భారతదేశాన్ని చూసినా మన ఊహ తప్పేమో ,మన ఆలోచన ఎంత రాంగో అర్ధం అవుతుంది. మీరుకూడా చూడండి. మన దేశంలో గత 70 ఏళ్లలో తీసుకొని అమలుచేసిన కొన్ని కీలక    నిర్ణయాలను చూద్దాం . అత్యవసర పరిస్థితి , పంచాయితీ వ్యవస్థకు రాజ్యాంగ పరమైన గుర్తింపు తో కొన్ని   అధికారాలు దఖలు పరచడం,   జాతీయ   రహదారుల విస్తరణ , పోక్రాన్ అణుపరీక్ష, సాంఘిక-రాజకీయ-ఆర్ధిక స్థితిగతుల మెరుగుదలకోసం   ఆర్ధికంగా సామాజికంగా వెనకబడిన కులాలైన షెడ్యూల్ కులాలవారికే కాక మండల్ కమిషన్ సిఫారస్ ప్రకారం ఆర్ధికంగా వెనుకబడిన    తరగతుల (కులాలు కాదు ) వారి కోసం రాయితీలు ( ఓబీసీ   రిజర్వేషన్ లు ) , గ్రామీణ ఉ...

ఎడారీకరణ :

మన ఆంధ్ర తీరప్రాంతంలోని తక్కువ సారవంతం గల ఇసుక భూములు, డెల్టాలోని సారవంతమైన నేలలు, లాటరైట్, నల్లరేగడి, ఎర్ర నేలలు వంటి  వివిధ రకాల నేలల ను పరిశీలించి,  ఐసీఏఆర్-నేషనల్ బ్యూరో ఆఫ్ సోయిల్ సర్వే అండ్ లేండ్ యూజ్ ప్లానింగ్' సంస్థ    ఎడారీకరణపై సునిశిత అధ్యయనం చేసింది.  వీరు    హైరెజల్యూషన్ రిమోట్ సెన్సింగ్ డేటా, జియో కంప్యూటింగ్ విధానాలను వినియోగించి ఎడారీకరణ స్థాయి, తీవ్రతను తెలుసుకుంటున్నారు.   * ఆంధ్రప్రదేశ్‌లో  2018 కి, సుమారు అరలక్ష ఎకరాలలో  మానవ సంబంధిత కారణాల వల్ల ఎడారీకరణ ముప్పు ఏర్పడింది.  ఎడారిగా మారిపోవడం అంటే, నేలలు తమయొక్క సారవంతమైన పైపొరని కోల్పోవడమే. అలాగే వృక్ష సంబంధ పోషకాల వాడకం తగ్గిపోయి, రసాయన ఎరువులు ఎక్కువగా వాడటం, అలాగే నేలను గుల్లపరిచే వానపాముల వంటి పంట సహాయ కారులు, పురుగుమందుల వలన నశించిపోవడం చేత, వరదలు వానలు వచ్చి నేల పొరలు కొట్టుకు పోకుండా తగినన్ని కాంటూర్ చెక్ డామ్ లు, వాలుకుతగినట్లుగా వ్యవసాయ పద్ధతులు అవలంబించక పోవడం చేత పడిన వర్షం పడినట్లుగా వాలుకు జారిపోతూ తనతో సారవంతమైన మట్టిని కూడా కొట్టుకు పో...

Do you know how much tax you actually pay each year? #ABCofTaxes