Skip to main content

ఎడారీకరణ :

మన ఆంధ్ర తీరప్రాంతంలోని తక్కువ సారవంతం గల ఇసుక భూములు, డెల్టాలోని సారవంతమైన నేలలు, లాటరైట్, నల్లరేగడి, ఎర్ర నేలలు వంటి  వివిధ రకాల నేలల ను పరిశీలించి, ఐసీఏఆర్-నేషనల్ బ్యూరో ఆఫ్ సోయిల్ సర్వే అండ్ లేండ్ యూజ్ ప్లానింగ్' సంస్థ  ఎడారీకరణపై సునిశిత అధ్యయనం చేసింది. వీరు  హైరెజల్యూషన్ రిమోట్ సెన్సింగ్ డేటా, జియో కంప్యూటింగ్ విధానాలను వినియోగించి ఎడారీకరణ స్థాయి, తీవ్రతను తెలుసుకుంటున్నారు. 
* ఆంధ్రప్రదేశ్‌లో  2018 కి, సుమారు అరలక్ష ఎకరాలలో  మానవ సంబంధిత కారణాల వల్ల ఎడారీకరణ ముప్పు ఏర్పడింది. 
ఎడారిగా మారిపోవడం అంటే, నేలలు తమయొక్క సారవంతమైన పైపొరని కోల్పోవడమే. అలాగే వృక్ష సంబంధ పోషకాల వాడకం తగ్గిపోయి, రసాయన ఎరువులు ఎక్కువగా వాడటం, అలాగే నేలను గుల్లపరిచే వానపాముల వంటి పంట సహాయ కారులు, పురుగుమందుల వలన నశించిపోవడం చేత, వరదలు వానలు వచ్చి నేల పొరలు కొట్టుకు పోకుండా తగినన్ని కాంటూర్ చెక్ డామ్ లు, వాలుకుతగినట్లుగా వ్యవసాయ పద్ధతులు అవలంబించక పోవడం చేత పడిన వర్షం పడినట్లుగా వాలుకు జారిపోతూ తనతో సారవంతమైన మట్టిని కూడా కొట్టుకు పోవడం చేత ఎడారీకరణ పెరిగిపోతుంది. 
ఆంధ్రాలో , వార్షిక కనిష్ఠ, గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణంగా 16 నుంచి 45 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య నమోదవుతుంటాయి. మన రాష్ట్రంలో,సుమారు 48% భూమి వ్యవసాయానికి వినియోగిస్తుండగా, 20% భూమిలో అడవులున్నాయి.
ముఖ్యకారణాలు : ప్రకృతి సిద్ధమైన కారణాలతో పాటు, మానవ సంబంధిత కారణాలు : 
వ్యవసాయానికి అనుకూలం కాని భూములను  వ్యవసాయానికి వినియోగిస్తుండడం.. నేల, నీటి పరిరక్షణ చర్యలు తగినంతగా లేకపోవడం.. పరిమితికి మించి సాగు చేయడం, జల యాజమాన్యం సక్రమంగా లేకపోవడం.. భూగర్భ జలాల అపరిమిత వినియోగం ఎడారీకరణకు ప్రధాన కారణాలని నివేదికలో ప్రస్తావించారు. 
 మృత్తికా క్రమక్షయం కారణంగా ఏటా 530 కోట్ల టన్నుల సారవంతమైన మట్టి, 80 లక్షల టన్నుల వృక్ష పోషకాలను నేల కోల్పోతోంది.
భూక్షీణత వల్ల ప్రత్యక్షంగా 25 కోట్ల మంది ప్రభావితమవుతున్నారు. రోడ్లు, భవనాల నిర్మాణం, గనుల తవ్వకం వంటి కారణాల వల్ల వ్యవసాయం, చెట్ల పెంపకానికి భూమి లభ్యత తగ్గిపోతోంది.
వర్ధమాన దేశాల్లో ఎక్కువగా కనిపిస్తున్న ఈ సమస్యను విధాన లోపాలు మరింత తీవ్రం చేస్తున్నాయి. ఫలితంగా ఎడారీకరణ మరింత వేగవంతమవుతోంది. .
వాతావరణ మార్పులు, అడవుల నరికివేత, కార్చిచ్చులు, వ్యవసాయ విధానాలు, జలయాజమాన్య లోపాలు, భూగర్భజలాల మితిమీరిన వినియోగం, పారిశ్రామికీకరణ, గనుల తవ్వకం వంటివి ఎడారీకరణకు ప్రధాన కారణాలు. ప్రకృతి సిద్ధమైన కారణాలతో పాటు, మానవ సంబంధిత కారణాల వల్ల కూడా ఎడారీకరణ వేగవంతమవుతోంది. ఇలాంటి అధ్యయనం ఆంధ్రాతో పాటు , తెలంగాణా, కర్ణాటక  రాష్ట్రాల్లోనూ  జరిగింది. పదేళ్ల కాలంలో మానవ ప్రమేయం వల్ల కలిగిన నష్టం పెరుగుతున్నట్లు స్పష్టమైంది.

Comments