గడిచిన 70ఏళ్ల స్వాతంత్రంలో
భారతదేశం ఏది ఎలా సాధించిందో, ఎక్కడ ఎవరిచేతిలో దెబ్బతిన్నదో , ఎక్కడ ఎవరివలన
భ్రష్ట్టు పట్టిందో పరిశీలిస్తే కొన్ని చిత్రమైన విషయాలను మనం చూడ వచ్చు!
బలమైన ప్రభుత్వం వలన ఎక్కువ మేలు జరుగుతుందని మనం
అనుకొంటాం. బలమైన నాయకుడి వలన దేశం అభివృద్ధి పధంలో దూసుకు పోతుందని భావిస్తాం.
కానీ గత 2 దశాబ్దాల ప్రపంచ చరిత్ర చూసినా , గత 70
ఏళ్ల భారతదేశాన్ని చూసినా మన ఊహ తప్పేమో ,మన ఆలోచన ఎంత రాంగో అర్ధం అవుతుంది.
మీరుకూడా చూడండి.
మన దేశంలో గత 70 ఏళ్లలో తీసుకొని అమలుచేసిన కొన్ని కీలక నిర్ణయాలను
చూద్దాం .
అత్యవసర పరిస్థితి , పంచాయితీ వ్యవస్థకు రాజ్యాంగ పరమైన గుర్తింపు తో
కొన్ని అధికారాలు దఖలు పరచడం, జాతీయ రహదారుల
విస్తరణ , పోక్రాన్ అణుపరీక్ష, సాంఘిక-రాజకీయ-ఆర్ధిక స్థితిగతుల మెరుగుదలకోసం ఆర్ధికంగా
సామాజికంగా
వెనకబడిన కులాలైన షెడ్యూల్ కులాలవారికే కాక మండల్ కమిషన్ సిఫారస్
ప్రకారం ఆర్ధికంగా వెనుకబడిన తరగతుల (కులాలు కాదు )
వారి కోసం రాయితీలు ( ఓబీసీ రిజర్వేషన్ లు ) , గ్రామీణ ఉపాధి
హామీ, ఆర్ధిక సంస్కరణలు , సమాచారహక్కు చట్టం, ఇండో అమెరికా అణు సహాయ ఒప్పందం ,
పెద్దనోట్లరద్దు .
వీటిలో ఎంతోఉపయోగకరమైన నిర్ణయాలన్నీ ప్రభుత్వాల బలంతో ,పార్టీ బలంతో
సంబంధం లేకుండా మంచి సంస్కారవంతమైన రాజనీతిజ్ఞత ఉన్న వ్యక్తులు
ప్రధాన మంత్రులు గా తీసుకొన్న కీలకనిర్ణయాలు దేశానికి ఎంతో
మేలుచేశాయి. అధికారబలం ఎంత ఎక్కువగా ఉంటే అంతగా దేశం భ్రష్ట్టు పట్టిపోయింది.
దీనికి ఉదాహరణ మనదేశంలో ఇందిరాగాంధీ (ఎమర్జెన్సీ) , మోడీ (నోట్లరద్దు ),
సోనియాగాంధీ & మోడీ ( కుంభకోణాలు) . అలాగే
ప్రపంచ పటాన్ని చూస్తే రష్యాలో పుతిన్, టర్కీలో ఎర్డోగన్ గత 2 దశాబ్దాలుగా ఆయా
దేశాలను పూర్తిగా నాశనం చేసేశారు .
పార్టీలు, ప్రభుత్వాలు ఎంత బలంగా ఉంటే అంతగా దేశం అభివృద్ధి
చెందుతుందనే భ్రమ నుండి మనం బయటపడాలి. నాయకుడికి నిబద్ధత,సంస్కారం, రాజనీతిజ్ఞత
ముఖ్యం. అందుకు ఉదాహరణ, వాజ్ పేయీ, పి వి
నరసింహా రావ్ !
ఒక ప్రధాని ఎలా పనిచేయకూడదో ఉదాహరణ గా మోడీ ని
చూస్తే చాలు!
Comments
Post a Comment