Skip to main content

Posts

Showing posts from May, 2019

EXIT POLLS - సర్వే భాగోతం -ఎగ్జిట్ పోల్స్- వాటి వెనక ఉన్న కథా కమామిషు

అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం లో ఎక్జిట్ పోల్స్ గానీ,సర్వే లు గానీ కామెడీ ప్రహసనం గా దిగజారిపోవడానికి కారణం ఏమిటి?  ఎన్నికల కమిషన్ కొన్ని రాష్ట్రాల పై  ఎందుకు విచక్షణ చూపింది? సర్వే చేసే వాళ్లకు ఓటరు నిజమే చెబుతాడా? సర్వేలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? వీటికి సమాధానాలు కనుగొనే ప్రయత్నం చేద్దాం.  సాధారణ   ఓటరు మనస్తత్వం ఎలాఉంటుందో పరిశీలిద్దాం.   మనం ఎవరికి ఓటు వేశామో అందరికీ చెప్పేస్తామా? లేదా రహస్యంగా ఉంచుతామా?లేదా ఏదో నోటికొచ్చింది చెప్పేస్తామా?   సహజంగా తమ ఓటును రహస్యంగానే ఉంచడానికి ఇష్టపడతారు. ఎవ్వరైనా బయటి వ్యక్తులు సర్వేల పేరిట అడిగే ప్రశ్నలకు నోటికొచ్చిన సమాధానం చెబుతారు తప్ప,నిజమే చెబుతారని అనుకో కూడదు. ఈ విషయం సర్వ్ సంస్థలకూ తెలుసు. అందుకే వారు కేవలం "ఓటు ఎవరికీ వేశారు?అనే ఒక్క ప్రశ్న మాత్రమే అడగకుండా ఇంకా దానికి సంబంధించిన ప్రశ్నలు వేసి అభిప్రాయాలు సేకరిస్తారు. శాస్త్రీయబద్ధమైన ప్రశ్నావళి ద్వారా ఓటరు మనోగతాన్ని పట్టే స్తారు .   కొన్ని ప్రత్యేక పరిస్థులున్నపుడు , ఓటరు తన అభిప్రాయాలను పంచుకోవడానికి కూడా ఇష్టపడడు. తీవ్రమైన ...

What if Modi comes again ? మాటలమోలీ , మోడీ జీని ని మళ్ళీ భరించాలా?

విద్యావంతులతో సహా   సమస్త   భారతీయులు ఉద్వేగ భరితులు. హృదయంతో ఆలోచిస్తారు తప్ప తార్కిక  దృక్పధం తో ఆలోచించడానికి ఇష్టపడరు. అంతేకాదు వారి జ్ఞాపకశక్తి కూడా ఉద్వేగపరమైన విషయాలనే గుర్తుపెట్టు కొంటుంది తప్ప,తమ అభివృద్ధికి ఉపయోగపడేవాటిని పెద్దగా గుర్తు పెట్టుకోదు.  పేరుకి అతిపెద్ద ప్రజాస్వామ్యమే గానీ ,   ఏది మంచి?ఏది చెడు ? ఏది అవసరం?ఏది అనవసరం? అనే విచక్షణా సామర్ధ్యం అత్యంత తక్కువఉన్న దేశం భారతదేశం. ఇలా చెబితే కోపం వస్తుంది గానీ వాస్తవం ఇదే! జనాభా పరంగా ,మూఢనమ్మకాల పరంగా ప్రపంచం లో ముందువరుసలో ఉంటారు. సామాజిక బాధ్యత నిర్వహణ  విషయంలో భారతీయులు  అంతగా ముందుకురారు. దీనికి కారణం పేదరికం,అవకాశాల లేమి,విపరీతమైన పోటీ ! ప్రపంచంలో   మనుషులందరూ ఒక్కటే. కానీ ఆయా దేశకాలమాన పరిస్థితులను అనుసరించి వారి ప్రవర్తన ఉంటుంది. కానీ చారిత్రిక వారసత్వం, సంప్రదాయ వారసత్వం ఎక్కువగా ఉన్న నాగరికత గల మనదేశ  ప్రజలు కష్ట నష్టాలలో కూడా వారి బాధ్యతానిర్వహణలో లోపం చేయరు. కానీ సుమారు 1000 ఏళ్లపాటు పరాయి దేశ సైన్యాలు భారతదేశాన్ని అతలా కుతలం చేసేశాయి. ...