Skip to main content

EXIT POLLS - సర్వే భాగోతం -ఎగ్జిట్ పోల్స్- వాటి వెనక ఉన్న కథా కమామిషు

అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం లో ఎక్జిట్ పోల్స్ గానీ,సర్వే లు గానీ కామెడీ ప్రహసనం గా దిగజారిపోవడానికి కారణం ఏమిటి? ఎన్నికల కమిషన్ కొన్ని రాష్ట్రాల పై  ఎందుకు విచక్షణ చూపింది? సర్వే చేసే వాళ్లకు ఓటరు నిజమే చెబుతాడా? సర్వేలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి?
వీటికి సమాధానాలు కనుగొనే ప్రయత్నం చేద్దాం. 
సాధారణ  ఓటరు మనస్తత్వం ఎలాఉంటుందో పరిశీలిద్దాం. 
మనం ఎవరికి ఓటు వేశామో అందరికీ చెప్పేస్తామా? లేదా రహస్యంగా ఉంచుతామా?లేదా ఏదో నోటికొచ్చింది చెప్పేస్తామా? 
సహజంగా తమ ఓటును రహస్యంగానే ఉంచడానికి ఇష్టపడతారు. ఎవ్వరైనా బయటి వ్యక్తులు సర్వేల పేరిట అడిగే ప్రశ్నలకు నోటికొచ్చిన సమాధానం చెబుతారు తప్ప,నిజమే చెబుతారని అనుకో కూడదు. ఈ విషయం సర్వ్ సంస్థలకూ తెలుసు. అందుకే వారు కేవలం "ఓటు ఎవరికీ వేశారు?అనే ఒక్క ప్రశ్న మాత్రమే అడగకుండా ఇంకా దానికి సంబంధించిన ప్రశ్నలు వేసి అభిప్రాయాలు సేకరిస్తారు. శాస్త్రీయబద్ధమైన ప్రశ్నావళి ద్వారా ఓటరు మనోగతాన్ని పట్టే స్తారు . 
కొన్ని ప్రత్యేక పరిస్థులున్నపుడు , ఓటరు తన అభిప్రాయాలను పంచుకోవడానికి కూడా ఇష్టపడడు. తీవ్రమైన పోటీ వాతావరణం ఉన్నప్పుడు, కుల మత పరమైన వత్తిడి ఉన్నప్పుడు, డబ్బు ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు , నిజం  చెబితే ప్రమాదమేమో ' అనే భయాందోళనలున్నప్పుడు ఓటరు మనోగతాన్ని పట్టుకోలేము. ముఖ్యంగా మహిళా ఓటర్లు, వృద్ధులు  నిజం చెప్పలేరు. యువత మాత్రం దైర్యంగా చెప్పేస్తారు. 

మోడీ , కల్వకుంట్ల,  జగన్ కు దన్నుగా నిలిచి ధన సహాయం,మంది సహాయం, ఇంకా ఏమేమి సాయం అందచేయాలో అన్నీ అందించారు. వీరందరూ కలిసి,  అభివృద్ధి చేస్తున్న బాబుని అడ్డుకొంటున్నారనే భావన రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. లక్షలాది ఓట్లు రద్దు చేసే కుట్రలు, తెలంగాణ పోలీస్ సాయంతో ఆంధ్రా ప్రభుత్వం పై దాడిచేయడం,  పోలింగ్ రోజున ఓటు మెషిన్ లు మొరాయించడం, జగన్ వర్గం చేసిన రౌడీయిజం చూసి ప్రజల్లో ఆందోళన మరింతపెరిగిపోయింది. ఆ సమయంలో బాబు ఇచ్చిన పిలుపుతో దైర్యం తెచ్చుకొని మరింత కసిగా ఓటేశారు. అందుకే పోలింగ్  80శాతం నమోదైంది.  
ఆంధ్రాలో  "నువ్వా?నేనా? అన్నట్టుగా సాగిన ఎలక్షన్ తీరుతెన్నులు చూసిన సగటు ఓటరు భయపడిపోయాడు . ఏమి చెబితే ఎవరికీ కోపం వస్తుందో అని గుంభనగా ఉండిపోయారు. కానీ ఈ ఎన్నిలలో మెజారిటీ యువత (మన రాష్ట్రం లో 18 నుండి 35 వయస్సు ఉన్నవాళ్లు సుమారు 1. 30 కోట్లు ఓటర్లు)  జగన్ మరియు పవన్ కి ఓటు వేసినట్లుగా తెలుస్తోంది .వీరినే ఓకల్ ఓటర్లు అంటారు. టిడిపి కంటే సుమారు  15% ఎక్కువ జగన్ పార్టీకి  కి వేశారు వీరికి ఎలాంటి భయమూ ఉండదు. పైపెచ్చు దూకుడుగా వుంటూ గొడవలు రెచ్చ గొట్టే పార్టీకే వేశారు కాబట్టి ఎవ్వరికీ భయపడకుండా నిజం చెప్పేశారు. దీనివలన జగన్ పార్టీ గెలుస్తుందనే ప్రచారం ఊపందుకుంది. అయితే టిడిపి కి మెజారిటీరైతులు ,వృద్ధులు,డ్వాక్రా మహిళలు,వ్యాపారవర్గాలు,మేధావులు, మహిళా విద్యార్థులు ,ప్రవేట్ ఉద్యోగులు,తటస్థులు ఎక్కువగా  ఓట్లు  వేశారు. వీరు సాధారణంగా గుంభనగా, నిశ్శబ్దం గా ఉంటారు. మనకెందుకులే గొడవలు" అనుకొంటారు. 

ఇలాంటి పరిస్థితుల్లో సర్వే సంస్థలు ఏదో అల్లాటప్పాగా నాలుగు ప్రశ్నలు వేసి రిపోర్ట్ లు తయారు చేయ కూడదు. ఆంద్ర రాష్ట్ర మాతృభాషపై  పట్టులేనివాళ్ళు, ఇతరరాష్ట్రాల వాళ్ళను ప్రజలు తేలికగా నమ్మరు. మనసువిప్పి మాట్లాడలేరు. జాతీయపత్రికలకు ,చానళ్లకు  సంబంధించి మనరాష్ట్రంలో కనీసపాటి రిపోర్టర్లు కూడా ఉండరు. ఇలాంటివాళ్ళు సర్వేలు చేస్తే  వాస్తవాలు బయటపడవు. అందుకే జాతీయ సంస్థలు,చానళ్లు చేసే సర్వేల లలో ఎక్కువశాతం తప్పులుంటాయి.
కొన్ని జాతీయ సర్వే సంస్థలు పాత రిపోర్ట్ లనే మళ్ళీ కొత్తగా చూపించాయి. ముఖ్యంగా మోడీ గుప్పెట్లో ఉన్న సంస్థలు, జాతీయ చానళ్లు పనికట్టుకొని అబద్ధాలు కూడా  ప్రచారం చేస్తున్నాయి. 
గత రెండు దశాబ్దల  కాలంలో మన రాష్ట్రానికి సంబంధించినంత వరకు లగడపాటి గారి  ఫ్లాష్ సర్వే , చాణక్య,  సి- ఓటరు సర్వేలు మాత్రమే ఎక్కువశాతం వాస్తవాన్ని పట్టి చూపెట్టాయి. 
 ఆంధ్రా ఎన్నికలకు సంబంధించినంత వరకు - మోడీ, అమిత్ షా,  కల్వకుంట్ల, ఎన్నికల కమిషన్ , కొందరు విశ్రాంత ఆఫిసర్లు, కొన్ని చానళ్లు  -సామాన్య ప్రజల పాలిట ,రాష్ట్రం పాలిట సైన్ధవుల్లా ప్రవర్తించారు. 
ఎన్నికల కమిషన్ దారుణమైన మోసాలు చేసింది" అనే అపప్రధ వార్తల్లో ప్రముఖంగా వినిపించింది. 
బెట్టింగ్ లను కంట్రోల్ చేయలేదు. ఓటింగ్ మెషిన్ల పై ఉన్న అనుమానాలను తొలగించలేదు. వి వి పాట్ స్లిప్ లను లెక్కించడానికి ఒప్పుకోలేదు.  స్లిప్ లను లెక్కపెట్టలేనప్పుడు 9000 కోట్లతో వి వి పాట్ యంత్రాలు ఎందుకు అమర్చారు? ఇంతకూ మునుపు,పేపర్ బాలట్ లను కేవలం 2 రోజుల్లో లెక్కించేవారు. విశ్వసనీయత కోసం ఆ మాత్రం లెక్కించలేరా? 
ఎన్నికల కమిషన్ గానీ,సు ప్రీం కోర్ట్ గానీ దేశ రాజ్యాంగాన్ని రక్షించి అమలుచేసే సంస్థలు.అవి  ప్రజాస్వామ్యం పై విశ్వసనీయతను పెంపొందించే చర్యలను ప్రోత్సహించాలి. 
"నిరంకుశత్వాన్ని ,కర్కశత్వాన్ని ప్రదర్సించడం లో 2019 ఎన్నికల కమిషన్ రికార్డుల కెక్కింది. అప్రజాస్వామికం గా శాసన సభాధిపతుల పై జులుం చేయడానికి ప్రయత్నీమ్చిమ్ది". - ఇలాంటి అపవాదు భారతదేశ ఎన్నికల కమిషన్ కు ఇంతకూ మునుపు ఎపుడూ రాలేదు. 
ఏది ఏమైనా , ప్రజాస్వామిక విలువలను కాపాడే క్వాసీ జుడీషియల్ సంస్థలు మరింత విశ్వసనీయత తో పనిచేయాలంటే పూర్వం పనిచేసిన శేషన్ లాంటి దైర్యం, అంకితభావమున్న అధికారులు రావాలి. వ్యక్తిగత కక్షలతో ,అహంకారపూరితమైన చర్యలతో అల్లకల్లోలం సృష్టించే నాయకులను ఓడించే పరిపక్వత ఓటర్లకు రావాలి. గల్లీ టైప్ గలీజు నాయకుడు కాకుండా , రాజనీతిజ్ఞుడే  ప్రధానమంత్రి గా ఉండాలి. పార్టీలు, తాయిలాలు,తాత్కాలిక ప్రలోభాలను మేనిఫెస్టో లో పెట్టకుండా అదుపు చేసే నియంత్రణా చట్టం రావాలి. రాష్ట్ర ఆర్థికపరిస్థితి కి తగిన విధంగా,అనుగుణంగా మాత్రమే మేనిఫెస్టో లు తయారు చేయాలి. ఎన్నికలవేళ పార్టీలు చూపే ప్రలోభాలకు ఓటర్లు లొంగిపోకూడదు. ఏదో , 2000/ చేతిలో పెట్టి,వాళ్ళు 200కోట్లు సంపాదించే కుట్రలు చేస్తారు. తస్మాత్ జాగ్రత్త!

Comments