Skip to main content

Posts

Showing posts from November, 2018

సిజేరియన్ వల్ల లాభపడుతున్నది ఎవరు?’??

ఎందుకు సిజేరియన్ ఆపరేషన్ ల గురించి సమాజం(ప్రభుత్వం,మీడియా)   భయపడుతుంది? దీనికి కొన్ని కారణాలున్నాయి.     నార్మల్ డెలివరీ తో పోల్చుకొంటే,   సిజేరియన్ తరవాత రికవరీకి ఎక్కువ టైమ్ పడుతుంది .   సిజేరియన్ వల్ల ఒక్కోసారి చాలా రక్తం పోతుంది. అలాంటప్పుడు నీరసపడిపోవడం, పాలు తయారవ్వకపోవడం, డిప్రెషన్‌కు లోనవ్వడం లాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. విపరీతంగా ఒళ్ళు రావడంతో పాటు డయాబెటిస్ బారినపడే ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. ఎక్కువ మంది డాక్టర్స్, హాస్పిటల్ మంచాలు,    నర్సింగ్ సేవలు అవసరం ఉండటం చేత   దేశ ఆర్ధిక వ్యవస్థపై భారం పెరుగు తుంది .   డాక్టర్స్ పై అపోహలు పెరగడానికి కారణమేమిటి? " పని తేలికవుతుందనీ , డబ్బుకోసం సిజేరియన్లు చేస్తున్నారనీ డాక్టర్ల మీద చాలా సులువుగా ఆరోపణలు మోపుతారు.. కానీ అది నిజం కాదు. చాలామంది మహిళలు వజైనల్ డెలివరీలో వచ్చే నొప్పిని తట్టుకోవడానికి సిద్ధపడరు. వాళ్ళే సిజేరియన్ చేయమని మమ్మల్ని అడుగుతుంటారు".    చాలామంది డెలివరీకి ముహూర్తాలు చూసుకుని వస్తారు. వాళ్ళకు నచ్చిన తేదీ, ఘడియల్లోనే డెలివరీ కావాలని కోరుకుంటారు. అలాంటప్పుడు కూడా సి-సెక్

ఆయుష్ మాన్ భారత్ పధకం మోదీగారి మరో జుమ్లా అవుతుందా ?

50కోట్లమంది పేదలకోసం   కేంద్రప్రభుత్వం ఆర్భాటం గా ప్రవేశ పెట్టిన ఆరోగ్య భీమా పధకం విజయవంతం అవ్వాలంటే ఏమిచేయాలి ? By- Dr.C.Srinivasa Raju- Chairman-HBI-IMA AP. --------------------------------------------------------- కేంద్ర-రాష్ట్రప్రభుత్వాలు, ప్రభుత్వ హాస్పిటల్స్ , ప్రవేటు హాస్పిటల్స్ ,   వైద్యులు, ఆరోగ్యపరిశ్రమలో ఇతర    భాగస్వామ్యులైన నర్సింగ్ సిబ్బంది, మెడికల్ పరికరాలు    మరియు ఫార్మసీ పరిశ్రమలు, మెడికల్ కాలేజీలు, అలాగే ఆరోగ్యబీమా కంపెనీలు ,అన్నింటికంటే ముఖ్యంగా ప్రజలు ఒక్కటిగా సమన్వయము తో అవినీతి,అలసత్వానికి చోటు లేకుండా    నిజాయితీగా    కష్టపడాలి.   ఏదైనా ప్రాజెక్ట్ విజయవంతంగా అమలుచేయాలంటే ఆర్ధిక    పెట్టుబళ్లు అత్యంత అవసరం. అవి ఉంటేనే,   నైపుణ్యం గల   మానవ వనరులు    ,   అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోగలం. 130కోట్ల జనాభా ఉన్న మనదేశం స్థూల జాతీయ ఉత్పత్తి విలువ కేవలం 120 లక్షల కోట్లు . దీనిని తలసరిగా పంచుకొంటే   సాలుసరి గా   దక్కేది కేవలం 150000 మాత్రమే !   కానీ సమానంగా పంచుకోవడమనేది ఎపుడూ జరగనే జరగదు. 70%సంపద కేవలం 1% వ్యక్తుల గుప్పెట్లో ఉందని అందరికీ తెలిసిన వ