What has Narendra Modi done so far in his tenure as the Indian Prime Minister? 2nd.part -మోదీజీ పాలనలో మెరుపులు -మరకలు-రెండవ భాగం
అవినీతి, ధరల పెరుగుదల, అభివృద్ధి, సామాజిక సామరస్యం, రైతుల కష్టాలు, నిమ్నవర్గాల వెతలు, కశ్మీర్, చైనా, పాక్... ఏ వైపు చూసినా బీజేపీ పట్ల పెదవివిరుపే..! కేంద్రంలో ఎన్నో పార్టీలు అధికారం చెలాయించాయి. కానీ అన్ని పార్టీలు ముఖ్యంగా గత 25 ఏళ్ళనుండి చెప్పే సంజాయిషీ ఒక్కటే! ఇండియన్స్ మాకు పూర్తి మెజారిటీ ఇవ్వలేదు. కాబట్టి మంచి కార్యక్రమాలు చేయలేకపోయాం . కానీ 2014లో మోదీజీ కి పూర్తి స్థాయిలో మాండేట్ ఇచ్చారు. కానీ ఈ 4 ఏళ్లలో ఆయనేమి చేశారు? దీనికి సమాధానం ఒక్క మాటలో చెప్పవచ్చు. సగటు భారతీయుడి మనస్సులో గూడు కట్టుకొని ఉన్న ఆక్రోశాలను,ఆవేదనలను,ఆశలను పంచదార చిలకలాంటి స్లొగన్స్ తో మీడియాలో ప్రసారం చేయడం తప్ప,క్షేత్రస్థాయిలో ఏవైనా జరిగిందా?అంటే తెల్లమొగం వేయవలసి వస్తుంది. ఎందుకిలా జరిగిందో,సంఘ్ పరివార్ ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో జరిగిన విధంగానే కలోనియల్ పాలసీలకు పెద్దపీట వేయడం, భారత్ లో తయారీ అని చెప్పి,భారతీయ స్టార్తప్ లను విదేశీ కంపెనీలు మింగేసేటట్లు చేయడం ఎంతవరకు సబబు? ఈ మధ్యనే వాల్ మ...