What has Narendra Modi done so far in his tenure as the Indian Prime Minister? 2nd.part -మోదీజీ పాలనలో మెరుపులు -మరకలు-రెండవ భాగం
అవినీతి, ధరల పెరుగుదల,
అభివృద్ధి, సామాజిక సామరస్యం, రైతుల కష్టాలు, నిమ్నవర్గాల వెతలు, కశ్మీర్, చైనా,
పాక్... ఏ వైపు చూసినా బీజేపీ పట్ల పెదవివిరుపే..!
కేంద్రంలో ఎన్నో పార్టీలు అధికారం చెలాయించాయి. కానీ అన్ని పార్టీలు
ముఖ్యంగా గత 25 ఏళ్ళనుండి చెప్పే సంజాయిషీ ఒక్కటే! ఇండియన్స్ మాకు
పూర్తి మెజారిటీ ఇవ్వలేదు. కాబట్టి మంచి కార్యక్రమాలు
చేయలేకపోయాం .
కానీ 2014లో మోదీజీ కి పూర్తి
స్థాయిలో మాండేట్ ఇచ్చారు. కానీ ఈ 4 ఏళ్లలో ఆయనేమి చేశారు?
దీనికి సమాధానం ఒక్క మాటలో చెప్పవచ్చు. సగటు భారతీయుడి మనస్సులో గూడు
కట్టుకొని ఉన్న ఆక్రోశాలను,ఆవేదనలను,ఆశలను పంచదార
చిలకలాంటి స్లొగన్స్ తో మీడియాలో ప్రసారం చేయడం తప్ప,క్షేత్రస్థాయిలో ఏవైనా
జరిగిందా?అంటే తెల్లమొగం వేయవలసి వస్తుంది.
ఎందుకిలా జరిగిందో,సంఘ్ పరివార్ ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈస్ట్
ఇండియా కంపెనీ పాలనలో జరిగిన విధంగానే కలోనియల్ పాలసీలకు పెద్దపీట వేయడం, భారత్ లో తయారీ
అని చెప్పి,భారతీయ స్టార్తప్ లను విదేశీ కంపెనీలు మింగేసేటట్లు చేయడం ఎంతవరకు
సబబు? ఈ మధ్యనే వాల్ మార్ట్ ఫ్లిప్ కార్ట్ ను మింగేసింది . ఇలాంటి ఉదాహరణలు చాల
ఉన్నాయి.
అనాలోచిత మైన,ముందుచూపులేని నిర్ణయాలైన పెద్దనోట్ల రద్దు , నిర్ణయం
తీసుకొని కూడా సరైన విధానంలో అమలుచేయలేకపోతున్న GST , భీమా,
రక్షణ ,మెడికల్ రంగాలలో విదేశీ పెట్టుబళ్లను ప్రోత్సహించడం, రైతులు పండించే పంటలకు
సరైన గిట్టుబాటు ధరలను నిర్ణయించలేక పోవడం, బాంక్ లూటీ దార్లను విదేశాలకు
వదిలేయడం, బ్యాంకు లపై ఉన్న విశ్వసనీయతను దారుణంగా ధ్వంసం చేయడం, చిన్న చితక
పరిశ్రమలు , చిన్న మధ్యస్థాయి హాస్పిటల్స్ మూతపడే
విధంగా నిర్ణయాలు అమలుచేయడం, కార్పొరేటీకరణ ను వేగంగా ప్రోత్సహించడం
,ఉద్యోగకల్పనలో దారుణంగా ఫెయిలవ్వడం , ఇవన్నీ కూడా మోడీ పాలనలో చెరిపివేయలేని
మరకలు.
పూర్తి మాండేట్ పొంది, ఇతర పార్టీలనుండి ఎలాంటి ఇబ్బందులు
లేకపోయినా, మంచి విప్లవాత్మక మైన సంస్కరణలు అమలుచేయ లేకపోగా , ఆయనే
సర్వం సహాధికారాలతో,మంత్రులను ఉత్సవ మూర్తులుగా మార్చేసి, కేవలం భాజపా ముఖ్యమంత్రిగానే ఆయన
ప్రవర్తించారు తప్ప, ఒక సువిశాల మైన దేశాధినేతగా , విశాలభావాలతో,రాజనీతితో
వ్యవహరించలేకపోయారు.
సంఘ్ పరివార్ యెక్క మూఢ సిద్ధాంతాలను
అమలుచేయడంలో ఉన్న చొరవ, భాజపా పార్టీ మౌలిక సిద్ధాంతాలను అమలు చేయడంలో చూపించలేక
పోయారు.హిందూత్వ అనే పదానికి కేవలం గోరక్షణ అనే అర్ధం వచ్చేటట్లు ప్రవర్తించారు. హిందుత్వా అంటే,ధర్మ రక్షణ,పరమత సహనం , ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశ్నించే హక్కు,సమసమాజ స్థాపన ..అనే విషయాన్ని మరచిపోయారు!
అవినీతితో మెడవరకు కూరుకు పోయిన వాళ్లతో జట్టుకట్టి,భాజపా పార్టీ మౌలిక సిద్ధాంతాలకు తూట్లు పొడిచారు. తనమాట వినని ప్రాంతీయ పార్టీలను నిర్ధాక్షిణ్యంగా నలిపివేయడానికి నిఘా వ్యవస్థలను,న్యాయ వ్యవస్థలను దుర్వినియోగ పరచి, ఫాసిస్ట్ పోకడలతో ఆర్ధిక పరమైన, భావపరమైన, న్యాయపరమైన బెదిరింపులతో నిరంకుశంగా ప్రవర్తిస్తూ దేశాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలని తహతహ లాడుతున్నారని మెజారిటీ ప్రజల ఆరోపణ.
అవినీతితో మెడవరకు కూరుకు పోయిన వాళ్లతో జట్టుకట్టి,భాజపా పార్టీ మౌలిక సిద్ధాంతాలకు తూట్లు పొడిచారు. తనమాట వినని ప్రాంతీయ పార్టీలను నిర్ధాక్షిణ్యంగా నలిపివేయడానికి నిఘా వ్యవస్థలను,న్యాయ వ్యవస్థలను దుర్వినియోగ పరచి, ఫాసిస్ట్ పోకడలతో ఆర్ధిక పరమైన, భావపరమైన, న్యాయపరమైన బెదిరింపులతో నిరంకుశంగా ప్రవర్తిస్తూ దేశాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలని తహతహ లాడుతున్నారని మెజారిటీ ప్రజల ఆరోపణ.
రాష్ట్రాలలో అధికారం దక్కించు కోవడానికి , ఉత్తరభారతంలో
మతాన్ని, ఈశాన్య భారతంలో ప్రాంతాన్ని,దక్షిణభారతంలో కులాన్ని పావుగా వాడుకొని, తమకు
అనుకూలంగా ఓట్లను పోలరైజ్ చేసుకోవడానికి ప్రజలను
చీల్చి అరాచకాలు చేయడం చట్టప్రకారం,న్యాయ
ప్రకారం నేరమే! మోదీజీ హయాంలో ఈ 4 ఏళ్లలో జరిగిన ఇలాంటి నేరాలు,ఘోరాలు
44 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో కూడా జరగలేదని మీడియా వారి
రిపోర్ట్.
మనదేశంలో 70% గ్రామీణ ప్రాంతాలలో
ఉంటారు. వాళ్లలో 3వంతుల మంది భూమిపైనే ఆధారపడి బతుకుతారు. మోడీ వారి పొట్టపై
కొట్టాడు. మోడీ జీ దయ వలన , సన్నకారు రైతులు,చిరుద్యోగులు
నెలలో కేవలం 15రోజులు మాత్రమే భోజనం చేస్తున్నారు.
క్రూడ్ ఆయిల్ ధరలు గత దశాబ్దం కంటే బాగా తగ్గినా కూడా,ఆయిల్ ధరలు పెంచుకొంటూ పోయారు తప్ప
సామాన్యుల బతుకులను అర్ధం చేసుకోలేదు.
2010 -2014 మధ్య క్రూడ్ ఆయిల్ రేటు యావరేజ్ గా 100డాలర్లు ఉంటే, మోడీ
పాలనలో 4ఏళ్లలో అది 55డాలర్లు ఉంది. అయినా, మోడీ ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా
పన్నులు పెంచేసి సామాన్యుడి జేబుని కొల్లగొట్టేసింది. చౌక ఆయిల్
ధరల పుణ్యమా అని కరెంట్ అకౌంట్ లోటు ని తగ్గించుకొంది. అలాగే ఫిస్కల్ లోటుని కూడా
తగ్గించుకొంది. తద్వారా ద్రవ్యోల్పణం కూడా బాగా తగ్గింది. ద్రవ్యోల్పణం
ఎప్పుడైతే తగ్గిందో బాంక్ లు తమ వడ్డీ రేట్లను తగ్గించాయి. దీనంతటికీ ముఖ్యకారణం
క్రూడ్ ఆయిల్ ధరల పతనమే తప్ప మన మోడీగారి తెలివి కాదు.
రేరా చట్టాన్ని అన్ని రాష్ట్రాలలో అమలు చేయించలేక పోయింది .
జి స్ టి అమలు లో ఎన్నో లోపాలున్నాయి.
ప్రభుత్వ గణాంకాలు గమనిస్తే, ప్రత్యక్షపన్నులు బాగా వసూళ్లు అయినాయని అనుకొంటాం . కానీ తరచి పరీక్షిస్తే, స్థూల జాతీయ ఉత్పత్తి లో పెరుగుదలకు ప్రత్యక్షపన్నుల వసూళ్లను బేరీజు వేస్తే
ప్రత్యక్షపన్నులు పెద్దగా పెరగలేదు. నిజానికి ఆర్ధిక స్థితి మెరుగు
పడిన కొద్దీ పన్ను వసూళ్లు
మెరుగైతాయి . అందుకే జి డి పి కి ప్రత్యక్షపన్నుల వసూళ్ల రేషియో
గమనిస్తే మనకు బాగా అర్ధం అవుతుంది. ఆలా చూస్తే పన్ను వసూళ్లు పెరగలేదు.
ఏటా కోటిమంది యువత ఉద్యోగాల కోసం వస్తున్నారు . వారికీ సరైన ఉద్యోగ
అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం దారుణంగా ఫెయిల్ అయింది.
వ్యక్తిగత అవినీతి లేకున్నా,రాజకీయ అవినీతికి తెరదీసి, పార్టీకి
వేలకోట్ల నిధులు సమకూర్చుకొన్నారని కొందరి ఆరోపణ. అలాగే వ్యవస్థలను ముఖ్యంగా
స్వదేశీ పరిశ్రమలను, బాంకింగ్ వ్యవస్థను,న్యాయ వ్యవస్థను,గవర్నర్ వ్యవస్థను
దుర్వినియోగ పరచడంలో కాంగ్రెస్ వారికి తీసిపోరని కొందరి అభిప్రాయం.
అటు హిందూ త్వకు సంబంధించి కామన్ సివిల్ కోడ్ గానీ , జమ్మూలో పండిట్
లకు పునరావాసం గానీ, అయోధ్యలో రామాలయం గానీ ,మదరసాలలో విద్యా విధానంలో గుణాత్మకమైన
మార్పులు గానీ మోదీజీ చేయలేక దారుణంగా విఫలమయ్యారు.
మోదీజీ ఒక పార్టీ కార్యకర్తగా అంకితభావం
ఉన్నవారు. వ్యక్తిగా నీతి మంతులు. కానీ
ఓ ప్రధానిగా అసమర్ధులు.
పార్టీ ని,,ప్రభుత్వాన్ని కలగా పులగం చేసి పాలన చేయడం మోదీజీ బలహీనత!
అలాగే తన వ్యక్తిత్వాన్ని తానే ప్రేమించుకోవడం ఆయన బలమూ,
బలహీనత!
Comments
Post a Comment