Skip to main content

What has Narendra Modi done so far in his tenure as the Indian Prime Minister?

మోడీ పాలన లో మెరుపులు- మరకలు :
ముందు మెరుపుల గురించి చెప్పుకొందాం. 
మోదీగారు మంచి పనులు చేయాలని కోరుకొన్నవాళ్లలో నేనూ ఒకడిని. 2014లో ఆయన పై ఎన్నో ఆశలు పెట్టుకొన్న కోట్లాది మందిలో నేనూ ఒకడిని. ఆయన చేసే ఉపన్యాసాలు,ఆయనలో ఉప్పొంగే ఆత్మవిశ్వాసం ,భారతీయులనేకాదు,అంతర్జాతీయ సమాజాన్ని కూడా ముగ్దులను చేసింది. 
మొట్టమొదట టర్మ్ లో ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి దేశానికీ దిశానిర్దేశం చేస్తాడని గాఢంగా నమ్మామ్ . 
కానీ ఆయన,  పైపై పటాటోపమే తప్ప,కోర్ సంస్కరణల జోలికే పోలేదు. 
విద్యా,వైద్య,వ్యవసాయ,సాంస్కృతిక  రంగాలలో మౌలికమైన సమూలమైన మార్పులు వస్తాయని కలలు కన్నాం. ఆర్ధిక రంగంలో మరింత స్వదేశీ పారిశ్రామిక ఉత్పత్తులకు  మద్దతు ఇస్తారని ఆశపడ్డాం.  
పన్నుల వల శక్తిమంతం చేశారు . 
By linking PAN and Adhaar with our bank account and even our phone Network provider,tax compliance has been bettered. పన్ను చెల్లించే వాళ్ళ సమాఖ్య పెరిగింది. అనగా పన్నుల వలను బలపరిచారు. 
కానీ జి ఎస్ టి అమలులో 28శాతం,18%  పన్నులు పెట్టి మధ్యతరగతి,చిన్న పరిశ్రామలను నీరు గార్చేశారు . అంతేకాదు వినియోగదారుల జేబులకు కూడా తూట్లు పెట్టారు . 

దేశంలో ప్రతీ ఇంటికి విద్యుత్ సౌకర్యం కల్పించాలనే లక్ష్యాన్ని చేరుకొంటున్నారు. 
పేదలకు ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నారు. 
రోజుకు 28 కిలోమీటర్ల చొప్పున జాతీయ రహదారులను నిర్మిస్తున్నారు. 
 నెట్వర్క్ లు అనగా రోడ్ ,రైల్వే, ఫైబర్ నెట్ వర్క్   నిర్మాణం ఇంతకుమునుపు కన్నా  వేగవంతం అయింది . విదేశీ పెట్టుబళ్ళు (FDI ) బాగా పెరిగాయి. 
అలాగే స్టాక్ మార్కెట్ బుల్లిష్ గా అనగా 2014లో 24000 ఉన్న సెన్సెక్స్ 2018 కి 30000 పెరగడంతో మదుపరుల సంపద 50% పైగా పెరిగింది. 
స్టాక్ మార్కెట్ పరుగులు, పెరిగిన గ్రామీణ విద్యుత్ వెలుగులు,  పెరిగిన వంట గాస్ వినియోగదారులు,మోడీ ప్రభుత్వ విజయాలు. 
 మోడీ జీ వైఫల్యాలు .  
దురదృష్ట వశాత్తు,మెరుపుల కంటే మరకలే ఎక్కువగా ఉన్నాయి. 
నేను ఒక ఆర్ధికవేత్తను ఇంటర్వ్యూ చేసినపుడు,ఆయన చేసిన కామెంట్ ఇది... 
"గుడ్డి ముసలమ్మను ప్రధానిగా కూర్చో పెట్టినా ఇంతకంటే బాగా చేసేది. ఎందుకంటే,కనీసం ఆర్ధిక వ్యవహారాలలో ఎలాంటి జోక్యం చేసుకొనేదికాదు. కానీ మోడీ చేసిన తప్పిదం వలన సాఫిగా సాగుతున్న ఆర్ధిక నావ సుడిగుండంలో చిక్కుకు పోయింది.  నోట్లరద్దు జరిగి  2ఏళ్ళు అవుతుంది . పారిశ్రామిక,సేవారంగాలు ఇంకా కోలుకోలేదు. కనీసం 2% జి.డి. పి తగ్గిపోయింది".  అనగా సుమారు 5లక్షల కోట్లు నష్టం కలిగింది. అంటే కాంగ్రెస్ జమానాలో జరిగిన కుంభకోణాల నష్టం కంటే అధికం!

జాతీయ ఉత్పత్తి, విలువ ఆధారిత లెక్కింపు".. ఇలాంటి పదాలు సామాన్యుడికి అర్ధం కావు. అతడికి అర్ధం అయ్యేది ఒక్కటి. రోజు రోజుకీ అతని జేబు చిక్కిపోతుంది. కడుపు కాలుతుంది. పెట్రోల్, బంగారం లెక్క పెరిగిపోతుంది. ఆర్ధిక కుంభకోణాలు జరిగినా , లేకున్నా అతనికి పట్టదు! ఏడాది పొడుగునా పని ఉండాలి. మూడుపూటలా కడుపు నిండాలి.అనారోగ్యం కలిగితే దగ్గరలో దవాఖానా , మందులు అందుబాటు లో ఉండాలి, కష్టం వస్తే ఆసరా ఉండాలి. అంతే !
ఒక నిరుద్యోగి కేరళ ఎక్స్ ప్రెస్ లో కలిశాడు . అతని అభిప్రాయం ఇలాఉంది. 
"స్కిల్ ఇండియా,ముద్రా యోజనా " అంటూ గాలిపోగేసి ఊకదంపుడు ఉపన్యాసాలతో చెవులు హోరెత్తించారు తప్ప , పరిశ్రమలలో మిషన్ లు తిరగలేదు, ఫాక్టరీ గొట్టాలలో పొగ రాలేదు, యువతకు  ఉద్యోగాలు కొత్తగా ఏమీ రాలేదు. ఇవి కేవలం  స్లోగన్  లా గానే మిగిలాయి. అలాగే మేకిన్ ఇండియా, ష్టాండప్ ఇండియా, అంటూ మీడియాలో ఎన్నికోట్ల ప్రకటనలు ఇచ్చినా పరిశ్రమ లు రాలేదు,ఉత్పత్తులు పెరగలేదు,ఎగుమతులు పెరగలేదు. 
కేవలం గాలిపోగేసి మీడియాలో కోట్లకొలది ప్రజాసంపదను ఖర్చు పెట్టడం తప్పించి, క్షేత్రస్థాయిలో ఆ దిశగా ప్రయత్నాలేమీ చేయకుంటే ఫలితాలు ఇలాగె ఉంటాయి. 
పక్కనే కూర్చున్న ఒక ముంబై వాలా ఇలా కామెంట్ చేశాడు ... 
the Make in India scheme, when it was started it gathered up many voices in its support but now they are reluctant voices. The scheme's core was a good effort but lacked the implementation that it needed. 
ఒక రోజు, హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఒక తెలుగు ఎకనామిక్స్ లెక్చరర్ కలిసినపుడు,ఆయన చేసిన కామెంట్స్ ...  
"2015 లో స్థూల జాతీయ ఉత్పత్తి లెక్కించడంలో ఒక మార్పు పట్టుకొచ్చింది మోడీ ప్రభుత్వం. విలువ జోడింపును (GVA) ఆధారం చేసుకొని లెక్కించడం వలన  GDP పూర్వం కంటే  ఎక్కువ ఉన్నట్లు కనబడుతుంది తప్ప నిజానికి  బాగా తగ్గిపోయింది. అన్ని రకాల సరుకుల  ధరలు రోజురోజుకీ పెరుగుతా ఉంటే   ద్రవ్యోల్పణం తగ్గిందని గణాంకాలు చెబుతున్నాయి. ఏది కరెక్ట్? ప్రజల జేబులకు చిల్లులు పడటం కరెక్టా? ప్రభుత్వం చేస్తున్న గణాంకాల గిమ్మిక్కులు కరెక్టా? క్రూడ్ ఆయిల్ ధరలు బాగా తగ్గినా కూడా ప్రజల జేబుకి చిల్లులేయడం మరింత తీవ్రం చేశారు తప్పించి అదేమని అడిగితే సమాధానం లేదు. 
 అలాగే పారిశ్రామిక ఉత్పత్తి ముఖ్యంగా వినిమయ వస్తు ఉత్పత్తులు (కన్స్యూమర్ గూడ్స్) కూడా బాగా తగ్గిపోయాయి. అనగా ప్రజల  కొనుగోలు సామర్ధ్యం బాగా తగ్గింది. ఎగుమతులు తక్కువ -దిగుమతుల ఎక్కువ కారణం చేత వాణిజ్య లోటు పెరిగింది. ( The numbers also back this, in Q1 of 2017year, the Index of Industrial Production slumped to three year low of 5.7% )

   "నోట్లరద్దు -దాని ప్రభావం"  పైన విజయవాడలో జరిగిన  ఓ సమావేశంలో, వక్తలు  తేల్చిన సారాంశం ఇది ... 
"నోట్లరద్దు , సన్నకారు రైతులు, చిన్న స్థాయి పారిశ్రామికవేత్తల జేబుల్లో నుండి  కాష్ కొట్టేస్తే, జి.ఎస్.టి చిన్న చిన్న పారిశ్రామికవేత్తల వర్కింగ్ కాపిటల్ ని లాగేసింది. నిజానికి మన భారతదేశం వీళ్ళమీదే ఆధారపడివుంది. వీళ్ళనే దోచేయడంతో దేశాన్ని లూటీ చేసినట్లు అయింది" .  
కానీ అత్యంత ముఖ్యమైన విషయాలైన  నిరుద్యోగం, అవినీతి,నల్లధనం, మరింతపెరిగాయి. ( Corruption complaint in central government offices have increased by 67% in 2016 against 2015 as per CVC report indicates that corruption hasn't reduced). 

విదేశీ వ్యవహారాలు చూస్తే,ఒక్క అమెరికా తప్పించి  చిరకాల మిత్రుడైన రష్యా , నేపాల్,బర్మా,పాలస్తీనా  మనకు దూరమయ్యాయి. 
అత్యంత ముఖ్యమైన మౌలిక రంగాలైన విద్య,వైద్యానికి బడ్జెట్ కేటాయింపులు మరింతగా తగ్గించారు. సంస్కరణలు ప్రవేశపెడతారని భావిస్తే, అప్రజాస్వామిక  చర్యలతో అప్రజాస్వామిక, సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకమైన సంస్కరణలను (జాతీయ వైద్య కమిషన్) ప్రవేశపెట్టడానికి చేసిన ప్రయత్నం దేశమంతటా  చర్చనీయాంశ మై ప్రభుత్వ పరువు పోయింది. 
విద్యా ,వైద్య  రంగాలకు జి.డి.పి లో  మునుపటి కంటే మరింత తక్కువ శాతం కేటాయించడం గర్హనీయం. అలాగే కేటాయించిన బడ్జెట్ ను కూడా కుదించడం మరింత శోచనీయం. 
అన్నింటికంటే అత్యంత ముఖ్యమైన వ్యవసాయ రంగానికి ఈసమెత్తు సాయం అందించలేదు. స్వామినాధన్ సిఫార్సులు బుట్ట దాఖలు చేసారు. మద్దతు ధరల గణనలో సంస్కరణలు తేలేదు.( కంటి తుడుపు గా ఏదో కొద్దిగా పెంచారు తప్ప రైతులకు ఉపశమనం లేదు) రైతు ఆత్మహత్యలు మరింతగా పెరుగుతున్నా  నిమ్మకు నీరెత్తి నట్లు ఉండిపోయారు తప్ప క్షేత్ర స్థాయిలో మార్పు పట్టుకు రాలేకపోవడం అత్యంత గర్హనీయం. 
అత్యంత నీచమైనదేమిటంటే, రాష్ట్రాల మధ్య నీటి యుద్ధాలను,వివాదాలను పెంచి పోషించి రాష్ట్రాలను బలహీనపరచడం మోడీ చేసిన అత్యంత పెద్ద నేరం. ఉదాహరణకు, ఆంధ్రా ,తెలంగాణ మధ్య వివాదాలను పెంచి పోషించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులను ఒకరిపై మరొకరిని ఉసిగొల్పే చర్యలు గమనిస్తే,ప్రధానిగా ఉన్నవ్యక్తి రాజనీతితో వ్యవహరించకుండా,నేలబారు గా ప్రవర్తించే ఫక్తు రాజకీయనాయకుడు లెక్క ప్రవర్తిస్తే రాష్ట్రాల మధ్య సమాఖ్య స్ఫూర్తి తీవ్రంగా దెబ్బ తింటుంది. దీని ఫలితం ఇపుడు కనబడకపోయినా రాబోయే కాలంలో దేశ సంఘటితానికి పెనుప్రమాదం వచ్చే అవకాశం ఉంది. 
అలాగే కులాలు,ప్రాంతాలు,మతాలు,ఆచారాలు,ఆహారఅలవాట్లు వారీగా భారతీయులను విడగొట్టి,రెచ్చగొట్టి, తమ కు అనుగుణంగా ఓట్లు పోలరైజ్ అయ్యేటట్లు చేసే కుట్రలు రాష్ట్రాల మధ్య సమాఖ్య స్ఫూర్తికి , ప్రజల మధ్య చీలికలకు  దారితీసే విధమైన చర్యలు మోడీ జీ నేతృత్వం లో  చేయడం అత్యంత నీచం. దీనివలన,  రాబోయే కాలంలో మరిన్ని ఘోరాలు జరిగి,దేశం ముక్కలైపోయినా ఆశ్చర్యం లేదు. 
రాష్ట్రాలను అలాగే స్థానిక సంస్థలను బలోపేతం చేయకపోగా మరింత బలహీన పరిచేవిధంగా 14 మరియు 15వ  ఆర్ధిక కమిషన్ వేసి రాష్ట్రాలన్నీ కేంద్రం పై ఆధారపడి ఉండేటట్లు, రాష్ట్రాలు, కేంద్రాన్ని అడుక్కునే  పరిస్థితికి దిగజార్చడం సమాఖ్య స్ఫూర్తిని చిన్నాభిన్నం చేయడమే!
కాంగ్రెస్ చేసిన ఆర్ధిక కుంభకోణాల కంటే.  మోడీ చేస్తున్న ఈ సామాజిక  చీలికలు,  సమాఖ్య కు కలిగే విఘాతాలు మరింత ప్రమాదకరం. 
సంఘ్ పరివార్ పనితీరేమీ బాగాలేదు. హిందూ సురాజ్యాన్ని స్థాపన చేయకుండా , పనికిమాలిన మూర్ఖత్వం తో గోవధ నిషేధం పేరిట చేసిన అరాచకాలు భాజపా పార్టీ పరువు తీసేశాయి . 
అంతేకాదు, కాస్మెర్ పండిట్ లను సెటిల్ చేయలేదు, వారికి  ప్రామిస్ చేసిన హామీలు ఏవీ నెరవేర్చలేదు. జమ్మూ లో ఉన్న పాకిస్తానీ హిందూ శరణార్ధులకు పౌరసత్వం ఇవ్వలేదు. సబ్ జుడిస్ అనే వంకతో, రామజన్మభూమి నిర్మాణం దిశగా అడుగులు కొద్దిగా కూడా వేయలేదు. బలవంతపు మత మార్పిడులకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 
ఇలాంటి నిర్దుష్టమైన చర్యలు తీసుకోకుండా గోవులను రక్షిస్తాం,లేకుంటే శిక్షిస్తాం "అంటూ సంఘ్ పరివార్ రంకెలేస్తూ బెంగాల్,కేరళలో   భీభత్సం సృష్టిస్తా ఉంటే  కేంద్రం నోరు  మెదపలేదు. 

రెండవ భాగం తరువాత .... 


Comments