- ప్రతి నెలా సుమారు 47 లక్షల మందికి వివిధ రకాల పెన్షన్లు -వృద్ధాప్య, వితంతు పెన్షన్ రూ.వెయ్యి. వికలాంగుల పెన్షన్‌రూ.1500.ఇస్తున్న ఏకైక ప్రభుత్వం .
- అంతే
కాదు దేశంలో నే మొట్ట మొదటి సారిగా,రైతు రుణాల మాఫీ ...రూ.50వేల లోపు రుణమున్న 24.50 లక్షల మంది రైతులకు ఒకే
విడతలో మాఫీ జరిగిపోయింది.మిగతా 33లక్షల రైతు ఋణ ఖాతాలకు కూడా విడతల వారీగా మాఫీ జరుగుతుంది
. ఇప్పటికే 3 దఫాల డబ్బుఋణ మాఫీ ఖాతాలకు బాంకుల్లో వేసింది ప్రభుత్వం .అంతే కాదు వడ్డీ కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది . ఇలా వాయిదా పద్ధతిలో మాఫీ చేయడం చాలా మంది పెద్దరైతులకు రుచించడం లేదు . నిజానికి పెద్దరైతులకు ఋణ మాఫీ చేయడం పొరబాటు . మొదట, రైతు ఋణ మాఫీ పధకాన్ని ఎలక్షన్ గిమ్మిక్ గా చూసి వ్యతిరేకించిన వారే,నేడు వారి రాష్ట్రాలలో అమలు చేయడానికి ఉరకలు వేస్తున్నారు . పెద్ద పెద్ద పారిశ్రామిక సంస్థలకు సుమారుగా 5 లక్షలకోట్ల ఋణమాఫీ చేసిన బాంకింగ్ వ్యవస్థ ,రైతు ఋణ మాఫికీ వ్యతిరేకత చూపడం రైతు సమస్యలపై సరైన అవగాహన లేకపోవడమే .
- చంద్రన్న భీమాపథకంలో భాగంగా సహజ
మరణానికి రూ.30వేలు, ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.5లక్షల
వరకు పరిహారం ఇస్తున్నారు. గతంలో ఎవరైనా ఒక వ్యక్తి మరణిస్తే మరణ ధ్రువీకరణ
పత్రం కోసం పోలీస్ స్టేషన్‌కు, ఆసుపత్రులకు తిరగాల్సి వచ్చేది. ఇప్పుడవేవీ
లేకుండా ఆన్‌లైన్‌లోనే అన్నీ వచ్చేలా ఏర్పాట్లు చేశారు.
- ఆర్ధిక వెనుకబాటు ను కొలమానం గా ,కుల మతాలవారీగా సంక్షేమ పధకాలు అమలు చేయడానికి సంస్థలను పెట్టి , వేలకోట్లను పంచుతున్న ప్రభుత్వం ఇదే !
- ఇవన్నీ ఒక ఎత్తు ... పరుగులు దీయిస్తున్న సాగు ,తాగు నీ టి ప్రాజెక్ట్ ల నిర్మాణం, మౌలిక సదుపాయాలైన పోర్టులు,రోడ్ల నిర్మాణం, పారిశ్రామీకరణలో మంచి ఒప్పందాలతో బీజాలను నాటడం, రాష్ట్ర సంపద ని ఇబ్బడి ముబ్బడి చేయడం మరో ఎత్తు .
ఇన్ని విధాలుగా "అభివృద్ధి- సంక్షేమ కార్యక్రమాలు" చేస్తున్నా , పాత పెన్షన్ కి 5 రెట్లు ఎక్కువ పెన్షన్ ఇస్తున్నా ఇంకా కొన్ని వర్గాలలో కనబడుతున్న అసంతృప్తి ని చూస్తుంటే ... కొంత మంది ఎంతగా కష్ట పడినా తిట్లు తప్పవని పిస్తుంది . మరికొంతమంది ఎన్ని ఘోరాలు,నేరాలు చేసినా అందలం ఎక్కించడానికి జనం సిద్ధంగా ఉంటారు .
కాచే చెట్టుకే రాళ్ళ దెబ్బలన్నట్లు , చంద్రబాబు గారి తలరాత ఇంతే అనుకోవాలి .
ఎందుకని రావలసినంత మంచి పేరు రావట్లేదు?
అవినీతి ని అదుపు చేయలేక పోవడం వలనా?
మనదేశంలో అవినీతి లేనిదెక్కడ ?
పార్టీలో లుక లుకలు ఎక్కువవ్వడం వలనా ?
ఈ సమస్య అన్ని పార్టీలలో ఉండేదే !
లోతుగా విశ్లేషణ చేస్తే ....
చంద్రబాబు గారి హయాంలో ఇంత అవినీతి... అదీ మెజారిటీ శాసన సభ్యు లు చేస్తారని ఎవ్వరూ ఊహించ లేదు .
ఇసుక, భూదందా లు, సెటిల్ మెంట్ లు , పర్శంటేజీ లు స్వాహా చేయడంలో మెజారిటీ శాసన సభ్యులు ఆరితేరారనే
అపప్రధ ఉంది .
అంతే కాదు,
అధికారుల విషయంలో గానీ, శాసన సభ్యుల ప్రవర్తన విషయంలో గానీ, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండవలసినంత కఠినం గా ఉండి , పరిపాలించడం లేదు .
అన్నివర్గాలను మంచిచేసుకొని అందరి నీ ఒప్పించాలనుకోవడం తప్పుకాదు . కానీ ఎక్కడ కఠినంగా ఉండాలో అక్కడ ఉండకపోతే అది తప్పే !
ఉద్యోగులకు,రైతులకు,ద్వాక్రా వారికి ఇలా ఒక వర్గమేమిటి , అన్ని వర్గాలకు,కులాలకు తాయిలాలు పంచేస్తున్నారు . కేవలం ఓటు బాంక్ కోసమే ఇవి చేస్తున్నారనే వాదన లో కొంత నిజమున్నా, పాదయాత్రలో తాను చూ సిన ప్రజల కష్టాలు కడగండ్లు తీర్చడానికే సంక్షేమ పథకాలకు మొగ్గు చూపుతున్నారనే ది వాస్తవం .
చాలా పేపర్లు,సర్వేలు ఏవేవో వ్రాస్తున్నాయి . 2019 ఎన్నికలలో తి రిగి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా తెచ్చుకో క పోతే నష్ట పోయేది ఎవరో అందరికీ తెలిసిందే !

Comments
Post a Comment