Skip to main content

Posts

Showing posts from May, 2017

IMA's Clarion Call: "చలో ఢిల్లీ " ----on "6th June"

ప్రభుత్వానికి ఇప్పటికే ఎన్నో మెమోరాండం లు సమర్పించాము .  బంద్ లు, ధర్నాలు, బ్లాక్ డే లు,సత్యాగ్రహాలు పాటించాము .   చట్ట సభల సభ్యులకు,మీడియా వారికి వైద్య వృత్తి ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించి సాయం చేయమని అర్ధించాం . సుమారు 2. 5 లక్షల మంది సభ్యులున్న సంఘటిత    సంఘమే వైద్యుల సమస్యలు తీర్చే క్రమంలో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఎంతో    సమయం,ధనము   ఖర్చు పెడుతున్నా వైద్యులకు రక్షణ గానీ , సర్వీసులోఉన్నవారికి సరైన జీతాలుగానీ, వైద్యవిద్య లో క్వాలిటీ గానీ , చిన్న   హాస్పిటల్స్ కి ఆర్ధిక సాధ్యత    గానీ   సాధించలేక పోతున్నాం . పరిస్థితి ఇలాగే ఉంటే ,ఆధునిక వైద్య వృత్తి అనేది క్రమేణా కనుమరుగై పోతుంది .       సమస్యలకు స్పందించడం లో   మోడీ ప్రభుత్వం,అలసత్వం చూపకుండా,కేంద్రప్రభుత్వానికి ఒక హెచ్చ్చరికగా  JUNE 6 TH . న ,   IMA   “చలో   ఢిల్లీ " కార్యక్రమాన్ని   చేపట్టింది   .   మన వైద్యుల సమస్యల గురించి అందరికి తెలుసు . కానీ పెడచెవి ని పెట్టి తమాషా చూడటానికి అలవాటు పడిపోయిన సమాజంలో ఒక చిన్న స్పందన రావాలనే ఆకాంక్షతో  ఈ చిన్ని వ్యాసాన్ని మరోసారి మీ ముందుకు తెస్తున్నా ...    వైద్యులపై

మూడేళ్ళ పాలనలో ఒకే ఒక్కడు !

అతడు ఒక మనిషి. పదిమందికీ సేవచేయడమే తన వృత్తి ప్రవృత్తిగా మార్చుకొని సామాజిక కార్యకర్తస్థాయినుండి ఒక బలమైన ప్రాంతీయపార్టీకి నాయకుడిగా ఎదిగినతీరు    చాలామంది నాయకులకు ఒక పాఠం .    ప్రజానాయకులు రెండురకాలు .   పనేమీ చేయకుండా కేవలం    మంచి వాక్దాటి    తో    నెట్టుకొచ్చ్చే వాళ్ళు ఒకరకం.    మాటకారితనం   లేకపోయినా పనిచేసే చేతులు,ముందుకు చూసే చూపు    ఉండే అసలైన నాయకులు    రెండోరకం . ఈ రెండోకోవకి చెందుతాడీ మనిషి .    సమాజం ఎ దగాలంటే   ఒక విజన్, ఒక రీజన్,   ఉండాలని    సంపద సృష్టే కాదు,మంది ఆరోగ్యాన్ని,ఆనందాన్ని కూడా    చూడాలని    నిరూపించిన నాయకులలో    అతనికి ఒక ప్రముఖ స్థానమే ఉంది .   అధికారం ఉన్నా,లేకున్నా అతని పనితీరులో పెద్దగా మార్పేమీ ఉండదు .   పని పని పని ... ! అటు సామాన్యజనం, ఇటు    తోటి మంత్రులు,అధికారులు,   అవినీతి తో,    వర్గ భేదాలతో   లతో,కులాల కుమ్ములాటలతో    కుళ్లిపోతున్నా    తామరాకు పై నీటి బొట్టు లెక్క తన పనేదో తాను చూసుకోవడమే అతనిలో ఉన్న ఒకేఒక బలహీనత .   ఉద్యోగులను కట్టడి చేస్తే    ఎలక్షన్ లలో పోటు పొడుస్తారేమో , కులాలవారీగా నాయకులకు తాయిలాలు,పదవులు ఇవ్వకపోతే