అతడు ఒక మనిషి. పదిమందికీ సేవచేయడమే తన వృత్తి ప్రవృత్తిగా మార్చుకొని సామాజిక కార్యకర్తస్థాయినుండి ఒక బలమైన ప్రాంతీయపార్టీకి నాయకుడిగా ఎదిగినతీరు చాలామంది నాయకులకు ఒక పాఠం .
ప్రజానాయకులు రెండురకాలు .
పనేమీ చేయకుండా కేవలం మంచి వాక్దాటి తో నెట్టుకొచ్చ్చే వాళ్ళు ఒకరకం.
మాటకారితనం లేకపోయినా పనిచేసే చేతులు,ముందుకు చూసే చూపు ఉండే అసలైన నాయకులు రెండోరకం . ఈ రెండోకోవకి చెందుతాడీ మనిషి .
సమాజం ఎదగాలంటే ఒక విజన్, ఒక రీజన్, ఉండాలని సంపద సృష్టే కాదు,మంది ఆరోగ్యాన్ని,ఆనందాన్ని కూడా చూడాలని నిరూపించిన నాయకులలో అతనికి ఒక ప్రముఖ స్థానమే ఉంది .
అధికారం ఉన్నా,లేకున్నా అతని పనితీరులో పెద్దగా మార్పేమీ ఉండదు .
పని పని పని ... !
అటు సామాన్యజనం, ఇటు తోటి మంత్రులు,అధికారులు, అవినీతి తో, వర్గ భేదాలతో లతో,కులాల కుమ్ములాటలతో కుళ్లిపోతున్నా తామరాకు పై నీటి బొట్టు లెక్క తన పనేదో తాను చూసుకోవడమే అతనిలో ఉన్న ఒకేఒక బలహీనత .
ఉద్యోగులను కట్టడి చేస్తే ఎలక్షన్ లలో పోటు పొడుస్తారేమో , కులాలవారీగా నాయకులకు తాయిలాలు,పదవులు ఇవ్వకపోతే ఓట్లు పోతాయేమో , ఉచితపథకాలతో బడుగు వర్గాల ను ఆకట్టు కోకపోతే ఓడిపోతామేమో అనే భయాలతో ఒక రాష్ట్రాన్ని పాలించడం కత్తిమీద సామే !
చేయూత పేరుతొ సామాన్యుడిని సోమరిగా మార్చుతున్న కాలమిది. ఉన్నతవిద్యకు,ఉన్నతఉద్యోగాలకు రిజర్వేషన్ ల పేరిట నైపుణ్యాన్ని అణగదొక్కుతున్న
సమాజమిది .
ప్రాధమిక విద్య,ప్రాధమిక వైద్యానికి ప్రభుత్వం చేయూత నివ్వాలి తప్ప ఉన్నత విద్య ను ఉచితంగా ఇస్తే అపాత్ర దానమే అవుతుంది . కేవలం ప్రభుత్వ ఫీజులకోసమే ఇబ్బడిముబ్బడిగా ఇంజనీరింగ్ కాలేజీలు పుట్టుకు వఛ్చి మానవ వనరుల ముఖ చిత్రాన్ని అతలా కుతలం చేయడం మనం చూస్తున్నాం . ఇంజనీరింగ్ డిగ్రీతో అటు మామూలు నాన్ -టెక్నీకల్ ఉద్యోగాలు చేయలేక , ఇటు సరైన ఉద్యోగాలు రాక 80% నిరుద్యోగులుగా వీధుల్లో నిలబడిపోతున్నారు.
ఈ విధమైన ఓటు బాంక్ రాజకీయాలతో సమాజంలో అసమతుల్యత కు,అసంతృప్తికి కారణం మవుతున్న నేటి కాలపు రాజకీయ ప్రస్థానంలో నెగ్గుకు రావడం రాజకీయ నాయకుడికి తేలికేమో గానీ,ప్రజానాయకులకు చాలా కష్టం !

రోడ్లు , పోర్ట్స్, సెజ్ లు, మొదలైన మో లిక సదుపాయాల కల్పన , నదుల అనుసంధానం,
నీటి సంరక్షణ, ఉద్యోగాల సృష్టి, అటు వ్యవసాయరంగానికి చేయూత ,ఇటు సేవా రంగంలో ,పారిశ్రామిక రంగంలో కొత్త కొత్త స్వదేశీ-విదేశీ సంస్థలను బతిమాలో , బామాలో ఒప్పించి పలుపరిశ్రమలను,కంపెనీలను స్థాపించడం ఒక ఎత్తు ఐతే, కేంద్రాన్ని ఒప్పించి పలు నిధులు తెచ్చ్చు కోవడం,విదేశీ రుణాలకు కేంద్ర సహకారం ,అనుమతి పొందడం మరో ఎత్తు .

అతని ముందు చూపు గురించి సామాన్యుడికి అర్ధం అవ్వాలంటే ఒక్క ఉదాహరణ చూడండి ...
జలవిద్యుత్థ ఉత్పత్తి కేవలం నాలుగు నెలలు మాత్రమే వీలవ్వడం,
ధర్మల్ విద్యుదుత్పత్తికి అధిక వ్యయం కావడంతో పాటు పర్యావరణానికి హాని కలుగుతున్న నేపథ్యంలోరాష్ట్ర విద్యుత అవసరాల కోసం,కేవలం యూనిట్ 3/-రూపాయలకే సౌర, పవన విద్యుత్ అందేటట్లుగా సౌర-పవన విద్యుత్కేంద్రాలపైనే పూర్తి స్థాయిలో దృష్టి సారించడం ,అతని విజన్ కి ఓ మచ్ఛు తునక!
పర్యావరణాన్ని పాడుచేయని విద్యుత్ కార్లను ప్రోత్స హించే భాగంలో టెస్లా కంపెనీని తీసుకురావడానికి అతను చేసే ప్రయత్నం , అత్యంత చౌక రవాణాకోసం కాకినాడ నుండి పుదుచ్చేరి వరకు జలరవాణా పధకం, సీమలోని ఎడారి భూములను పారిశ్రామికంగ సుసంపన్నం చేసి సీమ వాసులకు ఉద్యోగాలను పంచే పలు పరిశ్రమలు,కంపెనీలు స్థాపించడం ,ముచ్చ్చటగా
మూ డు నగరాలను అభివృద్ధిచేసి మూడు అంతర్జాతీయ విమానాశ్రయాలను ఏర్పరచడం, పలు పట్టణాలలో ,పంచాయితీలలో మౌలిక సదుపాయాల అభివృద్ధి ,
నకిలీ కరెన్సీ ని అడ్డుకోవడానికి పెద్దనోట్లరద్దు ని ప్రోత్స హించడం ,అలాగే డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే చర్యలు , రాయలసీమ దాహార్తిని తీర్చడానికి సూక్ష్మంలో మోక్షం లెక్క న కేవలం 1500కోట్లతోనే పట్టిసీమ ఎత్తిపోతల పధకం పూర్తి చేయడం ,
పోలవరాన్ని పరుగులు పెటించడం ,కుడి-ఎడమ కాల్వలను యుద్ధ యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసి అటు శ్రీకాకుళం నుండి ఇటు కర్నూల్ వరకు నేలకు ,జనం గొంతుల కు గంగను అందివ్వ డానికి చేస్తున్న పనులు, ఇవన్నీ కేవలం అతని వల్లనే సాధ్యమైన విషయాలు.
అదీ కేవలం మూడంటే మూడేళ్ళలో ఆంధ్రుల కలను సాకారం చేసిన విజన్ అతనిది .

కట్టుబట్టలతో ఇంటినుండి తరిమేస్తే ఎలా ఉంటుంది మీకు?
ప్రజలకు ఆ బాధ ఏమిటో తెలియకుండా , ఒక్కరూపాయి ప్రజాధనం ఖర్చు పెట్టకుండా అమరావతి కి భూమి ని సమీకరించి భూమి పూజ చేయడం అతని తప్పు!ప్రజలకు బాధ తెలిస్తేనే గదా, దాని విలువ తెలిసేది?
రక్తపాతం లేకుండా స్వాతంత్రం రావడం వలనే మనకు స్వాతంత్రం విలువ తెలీక
కొట్టుకొంటున్నాం .
రక్తపాతం లేకుండా స్వాతంత్రం రావడం వలనే మనకు స్వాతంత్రం విలువ తెలీక
కొట్టుకొంటున్నాం .
రాజధానికోసం పచ్చ్చని పొలాలు పాడుబెట్టడం ఎందుకు? ఒక వంద ఎకరాలలో రాజధాని కట్టుకొంటే చాలదా? అని తెలిసీ తెలియని ఎందరో ఆఫీసర్స్,రాజకీయనాయకులు విమర్శిస్తున్నా ,ఒక రాజధాని, ఆ జాతి ఆకాంక్షలను,సంస్కృతిని ప్రతిబింబించడమే కాక రాబోయే తరాలకు ఉద్యోగాలను,సేవలను,వినోదాన్ని,ఆరోగ్యాన్ని,విజ్ఞానాన్ని అందించాలనే ముందు చూపు, తపన ఎంతమంది ప్రజానాయకులలో చూస్తాం మనం?
రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసమే చేస్తున్నారని కొందరి ఆరోపణ. విషయాన్ని నెగెటివ్ గా తీసుకోవడం మొదలెడితే ,గాంధీగారు ఆనాడు స్వాతంత్రం తెచ్చ్చే వారే కాదు .
రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసమే చేస్తున్నారని కొందరి ఆరోపణ. విషయాన్ని నెగెటివ్ గా తీసుకోవడం మొదలెడితే ,గాంధీగారు ఆనాడు స్వాతంత్రం తెచ్చ్చే వారే కాదు .
అరలక్ష ఎకరాలలో రాబోయే రాజధాని ఎలావుండాలో,భూమండలంలోనే అత్యాధునికమైన సమీకృత ప్రజా రాజధాని అంటే ఏమిటో తెలియచెప్పి ఆ కల ను సాకారం చేసే దిశగా వడివడి గా అడుగులు వేస్తున్న అతడిని చూసి అర్ధం చేసుకొనే వాళ్ళకంటే విమర్శలు చేసే వాళ్ళు ఎక్కువగా ఉండటం కేవలం తెలుగుభాషీయులకే చెల్లింది .
ఒక ఇల్లు కట్టుకో వాలంటే వంద సమస్యలు,వేయి అగచాట్లు పడుతున్న కాలంలో బహుళార్ధ సాధక రాజధాని నిర్మాణం అంటే మాటలుకాదు . అందునా,అడుగు అడుగునా అవినీతి,రాజకీయ వికృతి చెలరేగి పోతున్న సమాజంలో మామూలు విషయం కాదు .
ఆర్ధికం గా దివాళా అంచున ఉన్న రాష్ట్రాన్ని , కుల వర్గాల కుమ్ములాటలతో, స్వార్ధ ముతో కరడు గట్టి పోయి క్రమశిక్షణ లోపించిన ప్రజలు, అన్నీ తమకే తెలుసనుకునే కుహనా మేధావులు ఉన్న రాష్ట్రాన్ని ,వ్యాపారాలకు,పరిశ్రమలకు,ఆరోగ్యానికి,పర్యాటకానికి, స్వర్గధామం లా మార్చడానికి ప్రయత్నం చేయడం అతని తప్పు .
ప్రజలకు కావలసింది కాసిని తాయిలాలు . మీరెన్నైనా దోచుకొండి . మాకు కావలసింది ఉచిత కానుకలు ,పన్నుతగ్గింపులు .
అధికారం లోఉన్న పార్టీ వాళ్ళ సొమ్మేమీ పోయింది . ఎపుడో ఎలక్షన్ లలో పంచేది ఇపుడే... అదీ ప్రభుత్వ సొమ్ము ... పంచితే పోలా?
గత 60 ఏళ్లుగా అధికారం చెలాయిస్తూ దేశానికి , ప్రజలకు ఏమీ చేయకుండా కాసిని
మెతుకులు విదిలించి అదే సంక్షేమం అని గప్పాలు కొట్టుకొనేవాళ్లనే అమాయక ప్రజలు
నమ్మేవాళ్ళు . ఇంకా నమ్ముతున్నారు .

85శాతం మంది రైతులకు ( రూ. 50000/ లోపు ఉన్న రుణ ఖాతాలు 85% ) పూర్తిగా ఋణ మాఫీచేసినా, ఆ విషయాన్నిసరిగా చెప్పుకోలేని పార్టీ అతనిది.
అంతరాయం లేకుండా 7గంటలు వ్యవసాయ విద్యుత్ ఇస్తున్నా సరిగా చెప్పుకోలేని పార్టీ అతనిది.
వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లేక మిగతా రాష్ట్రాలలో రైతులు అలాడిపోతుంటే, రాష్ట్రంలోని రైతులకు, గిట్టుబాటు ధర ఇఛ్చినా చెప్పుకోలేని పార్టీ అతనిది.
ఆర్ధిక దివాళా అంచున ఉన్న రాష్ట్రాన్ని "ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్" లో ప్రధమ స్థానంలో నిలపడం ఎంత పెద్ద గొప్ప విషయమో ,అవినీతిలో రాష్ట్రాన్ని ప్రథమస్థానంలో నిలబెట్టడం
అంత పెద్ద తప్పు !
అంత పెద్ద తప్పు !
రాబోయే ఎలక్షన్ లలో డబ్బుఖర్చు పెట్టే అభ్యర్థులకోసం ,ఇపుడే వల పన్ని ప్రతిపక్షపార్టీ MLA లను చేర్చుకోవడం,పైగా వారికి పదవులివ్వడం అతనిలాంటి ప్రజానాయకుడికి నప్పదు .
ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు,పెద్దలు,మంత్రులు ,అవినీతి దందాలు సాగిస్తున్నా
చూస్తూ ఊరుకోవడం అతడు చేస్తున్న చాలా పెద్దతప్పు.
క్రమశిక్షణ తప్పిన పార్టీ పెద్దలను ఉపేక్షించడం పార్టీ అధ్యక్షుడిగా అతని వైఫల్యమే!
9 మరియు 10వ షెడ్యూల్ ఉమ్మడి ఆస్తుల పంపకం గురించి దృష్టి సారించక పోవడం ముఖ్యమంత్రిగా అతని పెద్ద వైఫల్యం .
మైనింగ్,ఎర్రచందనం ,గిరిజన కాఫీ పంటలను ఎంత గొప్పగా కాపాడారో
,ఇసుక,అటవీ భూములు,దేవాదాయ ఆస్తుల కబ్జాను అంత గా అరికట్ట లేకపోయారు .
వైద్యసేవ,ఆరోగ్యరక్ష,ముఖ్యమంత్రి క్లినిక్ లు, తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్ లాంటి వైద్యసేవలతో ఆరోగ్యరంగాన్ని ఎలాగైతే దేశంలోనే మొదటిస్థానంలో ఉంచారో , రెవెన్యూ వ్యవస్థను అంతగా ప్రక్షాళన చేయలేకపోయారు .
నాటుసారా,గంజాయిసాగు, ను అరికట్టలేక పోవడం,
ఉద్యోగులను క్రమశిక్షణలో ఉంచలేకపోవడం,
MLA లను ఉత్సవ మూర్తులుగా ఉంచేయడం ,
పార్టీలో వ్యాపారస్తుల ను,కార్యకర్తలను సమతుల్యతలో ఉంచలేకపోవడం ,
ప్రతిభ ను చూడకుండా కేవలం వర్గాలు,కులాలవారీగా మంత్రిపదవులివ్వడం ,
నేటికాలపు రాజకీయ వ్యవస్థ లో ఇవన్నీ మామూలైనా ,వ్యవస్థలను రక్షించే వారిలో ప్రథముడైన ఇతని హయాం లో ప్రతిభను నిర్లక్ష్యం చేయడం అతని వైఫల్యమే!
సర్వే పేరుతో MLAలకి,MINISTERS కి మార్కులిచ్చి ఊరుకొంటే ప్రయోజనం ఉంటుందా ? వారికి కొన్ని బాధ్యతలు అప్పగించి,వారితో పనిచేయించు కోవాలి. వారి నడుములు వంచాలి .
ఇవన్నీ అతనికి తెలియనివి కావు .
విదేశీ కంపెనీల ను ఆకర్షించాలన్నా , నిధులకోసం పోరాడి సాధించాలన్నా , పార్టీలోని లుక లుక లు తీర్చాలన్నా , కొత్తరాజధాని కోసం ఏ ప్రయత్నం చేయాలన్నా, ప్రతిపక్షం వాళ్ళు, పొరుగురాష్ట్రం వారి కుతంత్రాలను కాచుకోవాలన్నా అతనే ముందుండాలి. ఎందుకంటే అతడే ఒక సైన్యం!
ఒక ప్రజానాయకుడిగా, రాష్ట్రీయ వ్యవస్థలను గౌరవించే మనిషిగా,అతని ఈ మూడేళ్ళ పాలనకు 60 మార్కులే వేస్తాను .
కానీ ఒక రాజకీయనాయకుడిగా ,ఆర్ధికంగా దివాళాలోఉన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా,అతనికి 80 మార్కులు వేస్తాను .
నిశితంగా పరిశీలిస్తే....
అనుభవజ్ఞుడు, అన్నీ తెలిసినవాడు, బడా బడా సంస్థల అధికారులతో సమా న స్థాయి లో చర్చ లుచేసే వాడు , ఇంతగా కష్టపడే ముఖ్యమంత్రి మన దేశంలో ప్రస్తుతం ఎవ్వరూ లేరు . అది ఆంధ్రుల అదృష్ట మని అంటే , కొంతమంది ఆంధ్రులే ఒప్పుకోరు .

కానీ ఒక్క విషయం !
రాబోయే ఎలక్షన్ ల గురించి అతడు అంత ఎక్కువగా ఆలోచించ నక్కర లేదు .
ఒకటి మాత్రం నిజం ... గెలుపు ఓటముల గురించి మధన పడే స్థాయి కాదు అతనిది . అయినా మధనపడుతున్నాడు అంటే .... అది ఆంధ్రుల పుణ్యమే !
Comments
Post a Comment