ప్రభుత్వానికి ఇప్పటికే ఎన్నో మెమోరాండం లు సమర్పించాము .
బంద్ లు, ధర్నాలు, బ్లాక్ డే
లు,సత్యాగ్రహాలు పాటించాము .
చట్ట సభల సభ్యులకు,మీడియా వారికి వైద్య వృత్తి ఎదుర్కొంటున్న సమస్యల
గురించి వివరించి సాయం చేయమని అర్ధించాం .
సుమారు 2. 5 లక్షల మంది సభ్యులున్న సంఘటిత సంఘమే
వైద్యుల సమస్యలు తీర్చే క్రమంలో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఎంతో సమయం,ధనము
ఖర్చు పెడుతున్నా వైద్యులకు రక్షణ గానీ , సర్వీసులోఉన్నవారికి సరైన
జీతాలుగానీ, వైద్యవిద్య లో క్వాలిటీ గానీ , చిన్న హాస్పిటల్స్
కి ఆర్ధిక సాధ్యత గానీ సాధించలేక పోతున్నాం .
పరిస్థితి ఇలాగే ఉంటే ,ఆధునిక వైద్య వృత్తి అనేది క్రమేణా కనుమరుగై
పోతుంది .
సమస్యలకు స్పందించడం లో మోడీ
ప్రభుత్వం,అలసత్వం చూపకుండా,కేంద్రప్రభుత్వానికి ఒక హెచ్చ్చరికగా JUNE 6TH. న , IMA “చలో ఢిల్లీ
" కార్యక్రమాన్ని చేపట్టింది .
మన వైద్యుల సమస్యల గురించి అందరికి తెలుసు . కానీ పెడచెవి ని పెట్టి తమాషా చూడటానికి అలవాటు పడిపోయిన సమాజంలో ఒక చిన్న స్పందన రావాలనే ఆకాంక్షతో ఈ చిన్ని వ్యాసాన్ని మరోసారి మీ ముందుకు తెస్తున్నా ...
- వైద్యులపై దేశవ్యాప్తంగా నా నాటికీ పెరిగిపోతున్న దాడులను చూస్తుంటే ప్రభుత్వానికి,మీడియావారికి,మేధావులకు మనస్సు కొద్దిగానైనా స్పందించడం లేదా?దాడిచేసిన వారిపై నాన్-బెయిలబుల్ అరెస్ట్ లు, 14ఏళ్ల కఠిన కారాగార శిక్షలు వేసే విధంగా , వైద్యులకు ,హాస్పిటల్స్ కి రక్షణ కల్పించే కేంద్రీయ చట్టాన్ని ప్రభుత్వం తేవాలి.
- తప్పు జరిగితే ఎలాంటి శిక్షకైనా వైద్యులు సిద్ధంగా ఉన్నారు . కానీ తప్పు జరగకుండానే జరిగిపోయినట్లు , వైద్యుల ను ఒక సాదా క్రిమినల్ గా , హంతకుడిగా చూడటం అనేది ఎంతవరకు న్యాయం? రోజు రోజుకి ప్రభుత్వం తెస్తున్న చట్టాలు ,మీడియా చేస్తున్న ప్రచారాలు వైద్యులను నేరగ్రస్తులుగా ముద్ర వేసేటట్లు గా ఉండటం అనేది మన దౌర్భాగ్యం . మెడికల్ నిర్లక్ష్యపు(Medical negligence) కేసుల విచారణకు ఏక గవాక్ష (single window)సౌకర్యం తో , మెడికల్ ట్రిబ్యునల్ అనేది ఏర్పాటు చేయాలి .
- వైద్యులు ఎదుర్కొంటున్న పలుసమస్యలపై ఎన్నోదఫాలుగా అర్జీలు పెట్టుకున్నాం . ధర్నాలు చేసాము . బంద్ లు పాటించాం . సత్యాగ్రహం చేయడానికి సిద్ధమైన తర్వాత ప్రభుత్వంలో కదలిక వఛ్చి, అంతర మంత్రిత్వ కమిటీ వేసి, పలు దఫాలు చర్చలు జరిపినపుడు, మా అసోసియేషన్ విన్నవించు కొన్న పలు సూచనలను అమలు చేస్తామని హామీ ఇచ్చ్చారు . ఇది జరిగి కూడా చాలాకాలం అయిపోయింది . ఇంకెంతకాలం మీ దయకోసం మేము వేచిఉండాలి ? అంతర మంత్రిత్వ కమిటీ ఒప్పుకొన్న డిమాండ్లను 6వారాల లోగా అమలుచేయాలి.
- ప్రాధమికవైద్యం,అత్యవసరవైద్యం అనేది పౌరులకు సకాలంలోఅందించ వలసిన బాధ్యత ప్రభుత్వానిదే . అది మరచిపోయి, ప్రయివేట్ హాస్పిటల్స్ ఉచిత సేవలు అందించాలనే నియమం పెట్టి,కేవలం ప్రయివేట్ వైద్యులపైనే భారంవేయడం ఎంతవరకు సబబు? ప్రభుత్వ హాస్పిటల్స్ లో వైద్యుల కొరత ఉన్నచోట ,ప్రవేట్ వైద్యుల సర్వీసు లను వినియోగించు కోవాలి. IMA demands,Reimbursement of all emergency services in private sector.
- ఏది నేర్చుకొంటే అదే ప్రాక్టీస్ చేయాలనే ప్రాధమిక సూత్రాన్ని పక్కనపెట్టేసి , మీ ప్రభుత్వాల అసమర్ధతను కప్పిపుచ్చుఁ కోవడానికి ,ఆయుష్ వైద్యులను వారి వృత్తి వదిలేసి,ఆధునికవైద్యం చేయమని ఆర్డర్స్ వేయడం ఎంతవరకు సబబు? ఎవరిని మోసం చేద్దామని ? ఆయుష్ వైద్యులను వారి వారి వృత్తిని చేసుకొనేటట్లు ప్రోత్స హించాలి . Anti-quackery law (no one other than qualified MBBs or BDS can prescribe scheduled modern medicine drugs)
- వైద్యవిద్యలో ఉన్నతప్రమాణాలు ఉండాలని, నేటిఅవసరాలకు తగినట్లు సిలబస్,కరిక్యులం మార్పుచేయాలని మేము ఎప్పటినుండో మొత్తుకొంటున్నాం . అది మానేసి, పనికిమాలిన "ఎక్సిట్ పరీక్ష" పెట్టడం అనేది వైద్య విశ్వ విద్యాలయాల సమగ్రతను, నైపుణ్యతను దెబ్బతీయడమే తప్ప మరోటికాదు . We demand Nation wide Uniform final MBBS exam by respective universities or by NBE instead of ‘NEXT’
- అత్యంత పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్న మనదేశంలో ప్రభుత్వాలను కొంతమంది న్యాయమూర్తుల చేతిలోనో , ఆఫీసర్స్ చేతిలోనో పెట్టేసి ప్రభుత్వాలను నడపడం లేదుగదా?మరెందుకు ఎలక్టెడ్ బాడీ MCIని తీసేసి,నామినేటెడ్ బాడీ NMA ని పెట్టాలని ఉబలాట పడుతున్నారు?
- ఆరోగ్యం అనేది కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సమిష్టి వ్యవస్థ . అంతే గానీ,దేశంలో మరెక్కడా లేని క్లాజులతో,క్రిమినల్ సెక్షన్ లతో, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చేసిన హాస్పిటల్ నియంత్రణా చట్టం గురించి ప్రభుత్వం పునరాలోచించాలి .
- హాస్పిటల్స్ లో ఏమి ఉండాలో,ఎలా వైద్యం చేయాలో,ఏ మందులు వ్రాయాలో అన్నీ ప్రభుత్వాలే నిర్ణయిస్తే ఇక వైద్యులెందుకు?వైద్యవిద్య నేర్పే కాలేజీ లెందుకు?
- ఓటర్లు పై నమ్మకం లేదు . ఓటింగ్ మెషిన్ లపై నమ్మకం లేదు . వైద్యులపై నమ్మకం లేదు .షాపు ల్లో ఎలాంటి అర్హత లేకుండా మందులు ఇచ్ఛే వారిపైనే నమ్మకం. లాబ్ రిపోర్ట్ లు ఎవరు ఇవ్వాలి ? లాబ్ డాక్టరా? లేక పనిచేసే టెక్నీషియనా ? ఇదంతా చూస్తుంటే ప్రభుత్వపెద్దలకు వారిపై వారికే నమ్మకం లేదని పిస్తుంది .
- ఫార్మశీ కంపెనీలు తయారు చేసే మందుల పై సరైన స్పష్టత, ఆజమాయిషీ ప్రభుత్వానికి లేదు . ఒక రసాయనాన్ని ఒకే విధమైన క్వాలిటీ తో తయారుచేసి,మూడురకాలుగా లేబెల్స్ వేసి,మూడు రకాల ధరల తో అమ్మడం అనేది వినియోగదారుడిని తప్పుదోవ పట్టించడం కాదా? ఒక కంపెనీ ఒక మందుని ఒకే ధర కి అమ్మడం అనేది అందరికీ మంచిది . ప్రభుత్వం ఇదిమానేసి , జనరిక్ మందులు వ్రాయాలని వైద్యులను వత్తిడి పెట్టడం ఎంతవరకు సబబు?we demand,Protection of professional autonomy (No interference in freedom to choose affordable quality drugs, investigations and treatment) .
- పల్లె ప్రాంతపు ప్రజలకు వారికి దగ్గరగా, అందుబాటులో క్వాలిటీ వైద్యం అందించడం , దానికోసం గ్రామీణప్రాంతాలలో పనిచేసే వైద్యులకు ఎక్కువ జీతభత్యాలు ఇవ్వడం అనేది ప్రభుత్వం నిర్వర్తించ వలసిన అత్యవసర బాధ్యత ."ప్రభుత్వ వైద్య సర్వీసు" (National medicorp") అనే సంస్థను ఏర్పాటుచేసి ,”ఒకేదేశం ,ఒకే పే స్కెల్” అనే నియమాన్ని సర్వీసు రెసిడెంట్స్ కు, వైద్యులకు అమలుచేయాలి . అంతే కాదు,మూడు ఏళ్ళు పైబడి కాంట్రాక్ట్ ఉద్యోగాలలో పనిచేసే వైద్యులను శాశ్వత ఉద్యోగులుగా మార్చాలి.
- పూర్వకాలంలో ఆంగ్లేయులు మనదేశాన్ని పాలించే సమయంలో నిరంకుశ జ్యూరీ వ్యవస్థ ఉండేది . వారు చెప్పిందే న్యాయం . మీరు తెస్తున్న చట్టాలను చూస్తుంటే, వైద్యులను మళ్ళీ ఆ చీకటి యుగాలకు తోసేస్తున్నారా"అనిపిస్తుంది . వైద్యులంటే మీ ఉద్దేశ్యం ఏమిటి? తెల్లకోట్లు వేసుకొన్న నేరస్థులనా?వైద్యం' అనేది నేరపూరితమైన అంశమా? thats why we demand, IMA member in every government health committee.
- అన్ని వృత్తులలో ఉన్నట్లే, వైద్యంలో కూడా పొరబాట్లు,నిర్లక్ష్యాలు ఉంటాయి తప్పితే నేరపూరిత ఉద్దేశ్యాలు ఉండవు . అంతేకాదు, పొరబాటుకి,నిర్లక్ష్యానికి ఉన్న సన్నటి తేడా కనిపెట్టాలంటే కేవలం అనుభవజ్ఞులైన వైద్యులకే సాధ్యం . కాబట్టి సందేహం ఉంటే ,మెడికల్ బోర్డు తో విచారించి ,ఆ తర్వాత మాత్రమే వైద్యులపై కేసు పెట్టాలి తప్ప,పోలీసులు వారి సొంత నిర్ణయాలతో కేసులు ఫైల్ చేయకూడదు . వైద్య నిర్లక్ష్యపు కేసులలో,మామూలు నేరస్థుల వలె వైద్యులను అరెస్ట్ లు చేయ కూడదు . ఏ కోర్టు లో తీర్పు ఇస్తే, ఆ కోర్ట్ లోనే ఆ యా తీర్పులను ఛాలెంజ్ చేసుకొనే అవకాశం వైద్యులకివ్వాలి .
- ప్రభుత్వ పథకాలలో పాలుపంచుకోవడానికి IMA ఎపుడూ సిద్ధంగా ఉంటుంది . కానీ,ప్రయివేట్ వైద్యుల ను ప్రభుత్వం ఎపుడూ సీరియస్ గా తీసుకోదు . ప్రతి వైద్యుడు ప్రతినెలా 9 వ తారీఖున ఉచిత వైద్యం అందించాలని కోరిన ప్రభుత్వం, WHO కి కేటాయించి నట్లుగా , నిర్మాణ్ భవన్ లో ఒకగదిని మా IMA కి కేటాయిస్తే బాగుంటుంది .
IMA also demands,
- Health budget shall be 2.5% of our GDP.
- Promotion of family medicine in India with 25000 PG seats in family medicine.
Comments
Post a Comment