జనరిక్ మందులు అంటే ఏమిటి? జనరిక్ మందులపై విశ్వసనీయత ను ఎలా పెంచాలి ? ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధి పథకం అంటే ఏమిటి? జనరిక్ మందుల ధరలు ఎందుకు తక్కువగా ఉంటాయి? వైద్యులు జనరిక్ మందులకన్నా ఎక్కువగా బ్రాండెడ్, బ్రాండెడ్ జనరిక్ మందుల వైపు మొగ్గు చూపటానికి ప్రధాన కారణం ఏమిటి ? జనరిక్ మందులు నాణ్యమైనవేనా ?
ఈ ప్రశ్న లన్నింటికీ సమాధానం కావాలంటే ఇక చదవండి ...
ఓ కంపెనీ తయారు చేసిన
మందు మీద పేటెంట్ హక్కు కాలపరిమితి ముగిసిన తర్వాత.. అదే ఫార్ములాతో ఇతర కంపెనీలు
కూడా ఆ మందు తయారు చేసి విక్రయించవచ్చు.
అంటే ఈ కంపెనీలు
పరిశోధనలు, ప్రయోగాలు, పరీక్షలు లేకుండానే ఆ మందును తయారు చేస్తాయి. ఈ మందుకు
అందులో ఉపయోగించిన ఔషధం పేరును మాత్రమే పెడతాయి. ఇలా తయారు చేసే మందులనే జనరిక్
మందులు అంటారు.
ఇలాంటి జనరిక్ మందుల
ధరలు.. బ్రాండెడ్ మందులతో పోలిస్తే తక్కువగా ఉంటాయి.
బ్రాండెడ్ మందులకు -
జనరిక్ మందులకు ధరలో తేడా ఉంటుంది కానీ.. ఈ రెండిటిలో ఒకే రకమైన ఔషధ మిశ్రమం, ఔషధ
పరిమాణం, నాణ్యత ఉంటుంది .
ప్రపంచంలో జనరిక్
మందులను సరఫరా చేయటంలో అతి పెద్ద దేశం భారతదేశమే. అయితే.. దేశీయ మార్కెట్‌లో కేవలం
రసాయన పేర్లతో విక్రయించే జనరిక్ మందుల వాటా కేవలం 10 శాతం గానే ఉంది.
బ్రాండెడ్ జనరిక్
మందులు'. అంటే..?
భారతదేశంలో విక్రయించే
మందుల్లో 87 శాతం ఔషధాలు.. 'బ్రాండెడ్ జనరిక్ మందులు'. అంటే.. బ్రాండ్ పేరుతో
అమ్మే జనరిక్ మందులు.
ఏదైనా బ్రాండెడ్ మందు
మీద ఒక కంపెనీకి పేటెంట్ హక్కు ముగిసిన తర్వాత.. ఇతర కంపెనీలు అదే ఫార్ములాతో
మందును తయారు చేసి తమ బ్రాండ్ పేరు పెట్టుకుని విక్రయించవచ్చు. ఇలాంటి మందులను
'బ్రాండెడ్ జనరిక్ మందులు' అంటారు.
బ్రాండెడ్ మందుల ధర
కన్నా ఈ బ్రాండెడ్ జనరిక్ మందుల ధర కాస్త తక్కువగా ఉంటుంది. కానీ మామూలు జనరిక్
మందుల ధరకన్నా ఎక్కువగా ఉంటుంది.
ఉత్పత్తులు నాణ్యంగా
ఉండేలా చూడటానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ - గుడ్ మాన్యుఫాక్చరింగ్ ప్రాక్టీసెస్
(డబ్ల్యూహెచ్ఓ - జీఎంపీ) సర్టిఫై చేసిన సరఫరాదారుల నుంచి మాత్రమే ఈ మందులను
సేకరించటం జరుగుతోందని ప్రభుత్వం చెప్తోంది.
జనౌషధి కేంద్రాల్లో
విక్రయించే జనరిక్ మందులను ఈ-టెండర్ల ద్వారా సేకరిస్తోంది.
ఉత్తమ నాణ్యత ఉండేలా
చూడటానికి.. ప్రతి బ్యాచ్ మందునూ 'నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్
కాలిబరేషన్ లేబరేటరీస్ (ఎన్ఏబీఎల్) అధీకృత లేబరేటరీల్లో పరీక్షించటం జరుగుతుందని
పేర్కొంది.
జనరిక్ మందుల ధరలు
ఎందుకు తక్కువగా ఉంటాయి?
ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధి పథకం.. షార్ట్ కట్‌లో పీఎం బీజేపీ అని పిలుస్తున్నారు.
- ప్రభుత్వ సంస్థలతో పాటు, ప్రవైటు వ్యాపారుల ద్వారా కూడా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.
- బ్రాండెడ్ మందులతో పోలిస్తే
జనరిక్ మందులు 50 % నుంచి 90% రాయితీతో లభిస్తాయి.
- డయాబెటిస్ మందులు గరిష్టంగా 100
రూపాయలకు, ఆర్థరైటిస్ మందులు గరిష్టంగా 65 రూపాయలకు, యాంటీబయోటిక్స్
గరిష్టంగా 56 రూపాయలకు, క్యాన్సర్ చికిత్స మందులు గరిష్టంగా 440 రూపాయలకు
లభిస్తున్నాయి.
- మందులే కాకుండా రోజువారీ పోషణకు
సంబంధించిన న్యూట్రిషనల్ సప్లిమెంట్లు కూడా ఈ దుకాణాల్లో లభిస్తాయి.
- 2022 అక్టోబర్ రెండోవారం నాటికి
1616 జనరిక్ మందులు, 250 రకాల మెడికల్ పరికరాలు జన ఔషధి దుకాణాల్లో
అందుబాటులో ఉన్నాయి.
- దేశవ్యాప్తంగా 8700 ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాలు (పీఎంబీజేకే) ఉన్నాయి.
- జనరిక్ మందుల సమాచారం, వాటి
ధరలు, వాటిని విక్రయించే షాపుల వివరాలు మొత్తం జన ఔషధి సుగమ్ మొబైల్ యాప్
ద్వారా పొందవచ్చు. ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్, ఉమంగ్
స్టోర్‌ల ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
- జనౌషధి
సుగమ్' అనే మొబైల్ అప్లికేషన్‌ను కూడా ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది.
దీనిద్వారా.. సమీపంలో జనౌషధి కేంద్రం ఎక్కడ ఉందనే వివరాలతో పాటు, జనౌషధి
కేంద్రాల్లో లభించే జనరిక్ మందుల వివరాలను కూడా తెలుసుకోవచ్చు.
- వైద్యులు సాధ్యమైనంత వరకూ మందుల చీటీలో జనరిక్ మందులు స్పష్టంగా, పెద్ద అక్షరాలతో రాయాలని భారత వైద్య మండలి తన నియమావళిలో నిర్దేశించింది. అలా చేయకపోతే చర్యలు ఉంటాయని కూడా స్పష్టంచేసింది.
- వైద్యులు జనరిక్ మందులకన్నా ఎక్కువగా బ్రాండెడ్, బ్రాండెడ్ జనరిక్ మందుల వైపు మొగ్గు చూపటానికి ప్రధాన కారణం..?
- ఏది ఎలాఉన్నా వైద్యులకు కావలసింది నాణ్యతా భరోసా! ఏ మందుల నాణ్యత మంచిదని వారు నమ్ముతారో వాటినే వాడతారు.
''డాక్టర్లు సాధారణంగా
బ్రాండెడ్ జనరిక్ మందులు సిఫారసు చేస్తుంటారు. ఎందుకంటే సాధారణ జనరిక్ మందుల
నాణ్యత గురించి వారికి కచ్చితంగా తెలీదు. అందువల్ల రోగి ఆరోగ్యాన్ని రిస్కులో
పెట్టదలచుకోరు. ఇంకోవైపు బ్రాండెడ్ మందులు డాక్టర్లు నమ్మే నాణ్యమైన కంపెనీకి
చెందినవి. గత అనుభవాన్ని బట్టి కూడా డాక్టర్ ఒక బ్రాండును ఎంచుకుంటారు'.
''డయాబెటిస్, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులకు రోగి దీర్ఘ కాలం పాటు మందులు వాడాల్సి ఉంటుంది. ఆ మందు నాణ్యతలో తేడా ఉంటే రోగి ఆరోగ్యం మీద తీవ్ర దుష్ప్రభావం ఉండొచ్చు. ప్రాణాంతక జబ్బులతో బాధపడే రోగుల మీద వైద్యులెవరూ జనరిక్ మందులతో ప్రయోగం చేయరు''.
''జనరిక్ మందులు ఎక్కువగా పెద్దగా తెలియని కంపెనీల నుంచి వస్తాయి. బ్రాండెడ్ మందులు తయారు చేసే కంపెనీలకు ఒక నాణ్యతా నియంత్రణ వ్యవస్థ, తయారీ విధానాలు, సరఫరా వ్యవస్థ వంటి మౌలిక సదుపాయాలు ఉంటాయి. జనరిక్ మందులు తయారు చేసే కంపెనీలకు ఇదే తరహా పటిష్ట వ్యవస్థ ఉందా లేదా అన్నది ఒక పెద్ద ప్రశ్న. ఈ సందేహమే జనరిక్ మందుల నుండి వైద్యులను దూరం చేస్తుంది .
''జనరిక్ మందులను విస్తృతంగా
అందుబాటులోకి తెచ్చేముందు నాణ్యత తనిఖీ చేసే నియంత్రణ వ్యవస్థలను ప్ర భుత్వాలు మరింత బలోపేతం చేయాలి.
ప్రస్తుతం వనరులు, సిబ్బంది పరిమితంగా ఉండటం వల్ల.. మందుల పరీక్షలు, తనిఖీలు
తగినంతగా జరగటం లేదు. దీనివల్ల నాసిరకం మందులు, కలుషిత మందులు పంపిణీ వ్యవస్థలోకి
ప్రవేశించే అవకాశం ఉంటుంది''
జనరిక్
మందులు నాణ్యమైనవా? కావా?
భారతదేశంలో ఔషధ పరిశ్రమ
టర్నోవర్ 1990లో 1,750 కోట్లుగా ఉండగా.. మూడు దశాబ్దాల్లో 2019-20 నాటికి ఆ
టర్నోవర్ 2.89 లక్షల కోట్లకు పెరిగింది. ఈ ఔషధ వ్యాపారంలో సగ భాగం విదేశీ
ఎగుమతులదే. అలా విదేశాలకు ఎగుమతయ్యే ఔషధాల్లో జనరిక్ మందులదే సింహ భాగం.
దేశంలో ప్రభుత్వ ఔషధ సేకరణ
సంస్థలు ప్రధానంగా జనరిక్ మందులనే సేకరించి వినియోగిస్తాయి. అంటే ప్రభుత్వ
ఆస్పత్రులు, ప్రభుత్వ విభాగాలు నిర్వహించే ఆస్పత్రుల్లో అత్యధికంగా ఉపయోగించేది
జనరిక్ మందులనే.
''ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్ ఆఫ్
జనరిక్ మెడిసిన్' అని పేరున్న భారతదేశంలో చౌక ధరకు జనరిక్ మందులు పొందటం చాలా
సులభం. 'నాణ్యమైనవని భావించే' జనరిక్ మందులు వరదలా ముంచెత్తే మార్కెట్‌లో..
'నాణ్యమైనవని భరోసా ఇచ్చే' జనరిక్ మందులను కనుగొనటం అసలైన కష్టం'' .
Explosive exports of generics!
''ప్రస్తుతం మార్కెట్‌లో దాదాపు 2,00,000 మందులు అందుబాటులో ఉన్నాయి. సుమారు 10,000 సంస్థలు వీటిని మార్కెట్ చేస్తున్నాయి. బ్రాండెడ్ మందులైనా, జనరిక్ మందులైనా.. వాటిని ఏ లైసెన్సు కింద తయారు చేశారనే దానినిబట్టి వాటి నాణ్యతలో తేడా ఉంటుంది. .
చాలా కంపెనీలు 'లోన్ లైసెన్స్' మీద కానీ, పీర్ టు పీర్ లైసెన్స్ మీద కానీ, థర్డ్ పార్టీ లైసెన్స్ మీద కానీ.. సుమారు 6,000కు పైగా ఉన్న స్మాల్ స్కేల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్లలో అతి తక్కువ ధరకు తయారు (Job work) చేయించుకుంటాయి. వాటిని తమ బ్రాండ్ పేరుతో ఎక్కువ ధరకు మార్కెట్ చేస్తాయి'' .
దాదాపు 1,000 కంపెనీలు అసలు ఏ మందులూ తయారు చేయవని, చిన్న స్థాయి తయారీ యూనిట్లలో మందులు తయారు చేయించి, వాటిని మార్కెట్ చేస్తాయి.
ఆ మందులు నాసిరకమని
తేలితే తయారు చేసిన సంస్థకు ఇబ్బందుల్లో పడుతుంది కానీ, మార్కెట్ చేసిన కంపెనీ
తప్పించుకుంటుందని, వేరే చిన్న స్థాయి యూనిట్లలో మందులు తయారు చేయించి మార్కెట్
చేస్తుంది .
భారతదేశం ఫార్మా రంగం
మార్కెట్‌లో సగ భాగం ఎగుమతులదే. ఇలా మందులు ఎగుమతి చేసే భారత కంపెనీలు.. అమెరికా,
యూరప్, జపాన్, ఆస్ట్రేలియా వంటి కఠిన నియంత్రణ మార్కెట్లకు ఎగుమతులు చేసేట్లయితే..
అంతర్జాతీయ ప్రమాణాలైన 'గుడ్ మాన్యుఫాక్చరింగ్ ప్రాక్టీసెస్'కు కట్టుబడి
ఉండాలి.
''కానీ, దేశీయ మార్కెట్‌కు ఈ కఠిన ప్రమాణాలు పాటించటం తప్పనిసరి కాదు. కాబట్టి ఒక నిర్దిష్ట సంస్థ అభివృద్ధి చెందిన దేశాలకు ఎగుమతి చేయటానికి అత్యధిక నాణ్యతలతో కూడిన మందులు తయారు చేయవచ్చు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎగుమతి చేయటానికి మధ్యస్థ ప్రమాణాలతో మందులు తయారు చేయవచ్చు. దేశీయ మార్కెట్ కోసం, నైజీరియా, యెమెన్ వంటి నియంత్రణ లేని మార్కెట్ల కోసం అతి తక్కువ ప్రమాణాలతో మందులు తయారు చేయవచ్చు.
కాబట్టి.. భరోసా గల నాణ్యతతో అతి తక్కువ ధరలకు జనరిక్ మందులను అందించటం అనేది అనేక స్థాయిల్లో, అనేక అంశాలతో ముడిపడి ఉన్న సంక్లిష్టమైన అంశం'.
what the govt should do to improve the utilization of generics?
మందులకు సంబంధించి
వినియోగదారుల్లో అవగాహన పెంచటం, మందుల మీద పూర్తి వివరాలు వెల్లడించటం వంటి
చర్యలతో పాటు.. ప్రభుత్వ మందుల సేకరణ కోసం డబ్ల్యూహెచ్ఓ-జీఎంపీ సర్టిఫికిషేన్,
సొంత లైసెన్సు ఉండటం వంటి నిబంధనలు, ప్రమాణాలను పాటించటం వల్ల ఈ సమస్యను
సమర్థవంతంగా పరిష్కరించవచ్చు .
Courtesy : BBC News, Drug Controller General of India , Pharmaco-vigilence center &MOH
Comments
Post a Comment