Skip to main content

Vaccines - టీకాలంటే తెలియనిది ఎవరికి ?

టీకాలంటే తెలియనిది ఎవరికి ?

ప్రతి వారికీ టీకా యెక్క  గొప్పతనం తెలుసు. కానీ టీకా వేసుకోవాలంటే కొందరికి ముఖ్యంగా పిల్లలకు భయం,పెద్దలకు నిర్లక్ష్యం. 

 టీకాలంటే హాని చేయని రోగకారక సూక్ష్మజీవులను శరీరంలోకి చొప్పించి, (ఇంజెక్షన్లు, నోటిలో వేసే చుక్కలు, ఇతరత్రా) రోగ నిరోధక శక్తిని కలిగించడమే.   రోగ నోరోధక వ్యవస్థను పునరుత్తేజ పరిచేదే టీకా  !

ఎన్నో కోట్లరకాల  వైరస్  , బాక్తీరియా లలో  ఏవో కొన్ని మాత్రమే మానవ రోగ నిరోధక వ్యవస్థను ప్రభావితం చేసి రోగ లక్షణాలను కలిగిస్తాయి. ఏ వైరస్ నుండి రక్షణ కావాలో ఆ వైరస్ లోని ఏదో ఒక అణువు -  అమైనో యాసిడ్ లేదా కార్బో హైడ్రేట్ అణువును గానీ లేదా నిర్వీర్యం చేయబడిన వైరస్ లేదా బాక్టెరియాను గానీ యాంటీ జెన్ ( టీకా ) గా ఉపయోగిస్తారు. 

   

ఏదైనా ఒక రోగానికి ఒకసారి యాంటీబాడీలు ఏర్పడ్డ తర్వాత, అదే రోగ క్రిములు మరోసారి శరీరంలోకి ప్రవేశించినపుడు యాంటీబాడీలు పునరుత్పత్తయ్యి యాంటీ జెన్ ‌లను నిర్వీర్యం చేసి, శరీరాన్ని రోగం నుండి కాపాడతాయి. ఇలాంటి రోగ నిరోధకశక్తిని 'చురుకైన రోగ నిరోధకశక్తి' (యాక్టివ్‌ ఇమ్యునైజేషన్‌) గా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి రోగ నిరోధకశక్తి దీర్ఘకాలం ఉంటుంది.

ఒక జీవి తనపైదాడిచేసే పరాన్న జీవులను ఎలా ఎదుర్కొంటుంది?

''రోగనిరోధక శక్తిలో మూడు విభిన్న అంశాలుంటాయి''. 

1. ''మొదటిగా.. చర్మం, శ్వాస నాళాలు, శ్లేష్మపొర అనేవి ఉంటాయి. ఇవి ఇన్‌ఫెక్షన్ నుంచి రక్షణ కల్పించే అడ్డుగోడలుగా పనిచేస్తాయి. వైరస్ వీటిని దాటి శరీరంలోకి వెళ్లినపుడు 

2.  సహజ (ఇన్నేట్) రోగనిరోధక వ్యవస్థ  స్పందిస్తుంది. ఇందులో రసాయనాలు, శరీరకణాలు అత్యంత వేగంగా అప్రమత్తం చేస్తూ.. చొరబాటుదారులను తరిమివేయటానికి పోరాటం మొదలుపెడతాయి. ''ఇవన్నీ సరిపోకపోతే.. అప్పుడు 

3. సహాయక (అడాప్టివ్) రోగనిరోధక వ్యవస్థ రంగంలోకి దిగుతుంది''. ఇది.. సంబంధిత చొరబాటుదారు మీద యుద్ధం చేయటానికి ప్రత్యేకమైన యాంటీబాడీస్‌ను తయారు చేసి పంపుతుంది. ఈ యాంటీబాడీస్ తయారవటానికి కొన్ని రోజులు కానీ, వారాలు కానీ పట్టొచ్చు. ముఖ్యమైన విషయమేమిటంటే.. సహాయ రోగనిరోధక వ్యవస్థ తయారు చేసే ఈ యాంటీబాడీస్ నిర్దిష్ట వైరస్ లేదా బ్యాక్టీరియా మీద మాత్రమే పోరాడగలవు. ''ఉదాహరణకు.. కోవిడ్-19 మీద పోరాటానికి తయారైన ఓ నిర్దిష్ట టీ-సెల్.. ఇన్‌ఫ్లుయెంజా కానీ, బాక్టీరియాకు కానీ స్పందించదు''. 

చాలా వరకూ ఇన్‌ఫెక్షన్లు ఈ సహాయక రోగనిరోధక శక్తిని ప్రేరేపిస్తాయి. అయితే.. దీనిని రంగంలోకి దించటానికి మరొక మార్గం కూడా ఉంది. అదే టీకాలు వేయటం. అంటే.. ఒక నిర్దిష్ట వైరస్ లేదా బ్యాక్టీరియా సజీవ లేదా నిర్జీవ కణాలను పరిమిత మోతాదులో శరీరంలోకి పంపించటం. దానివల్ల ప్రేరేపితమైన ఈ సహాయ నిరోధక శక్తి.. సదరు సూక్ష్మజీవి మరోసారి శరీరంలోకి వచ్చినపుడు దానిని ఎదుర్కోవటానికి సంసిద్ధంగా ఉంటుంది. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయటం అంటే.. ఈ ప్రతిస్పందనలను మరింత క్రియాశీలంగా, మరింత బలంగా తయారుచేయటంగా భావించ వచ్చు. 

మీకు తెలుసా?  వ్యాధి నిరోధక టీకాలు ప్రతి బాలుడి జన్మ హక్కు ! చిత్రమేమిటంటే పిల్లలకే కాదు,వృద్ధులకు అంతేకాదు సెర్వైకల్ కాన్సర్ నిరోధానికి స్త్రీలకు కూడా టీకాలు అవసరమని చాలామందికి తెలియదు. డాక్టర్స్ కూడా అడల్ట్ టీకాల గురించి ఎక్కువగా శ్రద్ధ చూపడం లేదు. 

ఇప్పటికే ఎన్నో రకాల టీకాలు మార్కెట్ లోకి వచ్చినా, టీకాలపై ఉన్న కొన్ని అపోహల వలన ఇప్పటికీ 30 శాతం పిల్లలు,  99  శాతం వృద్ధులు  టీకాలు వేసుకోవడం లేదు. 

వివిధ వ్యాధులకు ఇప్పటికే  ఉన్న టీకాల గురించి  ఒక సారి చదవండి. 

1.    క్షయ వ్యాధి - బిసిజి; 

2.    డిఫ్తీరియా, టెటనస్‌, కోరింత దగ్గు - డిటి డబ్ల్యుపి. 

3.    డిఫ్తీరియా, టెటనస్‌ - డిటి; 

4.    టెటనస్‌-టిటి; 

5.    హెపటైటిస్‌(కామెర్లు)-హెపటైటిస్‌ బి;

6.    పొంగు, తట్టు (మీజిల్స్‌, రూబెల్లా) - ఎంఎంఆర్‌;

7.   న్యూమోనియా (ఊపిరితిత్తుల వ్యాధి), మెదడువాపు వ్యాధి - హెచ్‌ఐబి

8.   పోలియో - ఐపివి; 

9.    టెటనస్‌, డిఫ్తీరియా (గవదబిళ్లలు) - టిడి.

10.                      సర్వైకల్‌ క్యాన్సర్‌-హెచ్‌పివి(గార్డాసిల్‌,సర్వారిక్స్‌);

11.                      న్యూమోనియా-పిసివి7,పిపివి23

12.                      సీజనల్ ఫ్లూ వేక్సిన్ . 

ఇప్పుడివన్నీ ఎందుకు చెబుతున్నారు?

కోవిద్ మహమ్మారి కి కూడా టీకాలు వచ్చేస్తున్న శుభవేళ , ఇంతకూ మునుపు మానవుడు సాధించిన కొన్ని ఘనవిజయాలు ముఖ్యంగా రోగ నిరోధానికి ఉపయోగపడే వేక్సిన్ ల గురించి ఒకసారి ముచ్చటించు కొంటె బాగుంటుందనే ... 

ముఖ్యంగా భారతదేశపు సొంత కరోనా టీకా- కోవిద్ షీల్డ్ - మరో 5 నెలలు అనగా మార్చి 2021 లోపే ప్రజలకు అందుబాటులోకి వస్తుందనే శుభవార్త తోపాటు ఆక్స్ఫర్డ్ టీకా అంతకంటే ముందే అందుబాటులోకి వస్తుందనే సమాచారం అందుతుంది. 

అయినా , సీరో సర్వే ల ప్రకారం ఇప్పటికే అనగా  అక్టోబర్ నెలాఖరు కే సుమారుగా 50% భారతీయులను కోవిద్ వైరస్ ఎటాక్ చేసిందని తెలుస్తుంది . అంటే హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చేసిందని అనుకోవాలి. అందుకే కేసులు తగ్గుతున్నాయని కూడా అర్ధం అవుతుంది . మరి ఇలాంటి సమయం లో వాక్సిన్ వలన కలిగే లాభం ఏమిటి?

వ్యాధి ద్వారా వచ్చే ఇమ్యూనిటీ ఎంతకాలం ఉంటుందో తెలియదు. కేవలం 6నెలలే ఉంటుందని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలంటి పరిస్థితిలో అందరికీ  వాక్సిన్ అవసరం ఉంటుంది. 

యాంటీ బాడీలు 6 నెలల్లో తగ్గిపోయినా T cell  ఇమ్యూనిటీ జీవితాంతం ఉండ వచ్చని కొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.  అలంటి పరిస్థితిలో అందరికీ  వాక్సిన్ అవసరం ఉండకపోవచ్చు! 



 కానీ ఒక ముఖ్యమైన జాగ్రత్త ఏమిటంటే mRNA  ను వినియోగించి తయారు చేసే టీకాల వలన మానవులలో  జన్యు ఉత్పరివర్తనాలు కలిగే ఛాన్స్ ఉందనే వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంత వాస్తవముందో ముందు ముందు తెలుస్తుంది !

 శుభవార్త ఏమిటంటే , పైన చెప్పుకొన్న రెండు టీకాలు కూడా mRNA ని వినియోగించడం లేదు. 

కోవిడ్ ని అదుపుచేసే వాక్సిన్ , మందుల తయారీలో కంపెనీల మధ్యన జరిగే పోటీ లో నలిగిపోయేది సామాన్యుడే! కాబట్టి తస్మాత్ జాగ్రత్త!

అసలైన వాక్సిన్ వచ్చేటంత వరకు మనకున్న ఏకైక వాక్సిన్- మాస్క్ ( Mask) మాత్రమే!

Regarding INDIAN vaccination project in 2nd.part...

Comments