Skip to main content

Covidology -part 2

ఆంద్ర రాష్ట్రం కోవిద్ యుద్ధం కోసం మౌలిక సదుపాయాలను బాగానే ఏర్పాటు చేసింది. టెస్టింగ్ కిట్స్ కొనుగోలు , పరీక్షల నిర్వహణలో దేశంలోనే టాప్ 3 లో ఉంది. కానీ , రక్షణ దుస్తుల కొనుగోలు,వాటి నాణ్యతా ప్రమాణాలు అంతగా బాగోలేవు. 
ప్రవేట్ హాస్పిటల్స్ లో వసూల్ చేసే ఫీజులపై నియంత్రణ పెట్టడం చేత ప్రవేట్ హాస్పిటల్స్ కోవిద్ వైద్యాన్ని సంపూర్ణం గా అందించలేక పోతున్నాయి. ప్రవేట్ హాస్పిటల్స్ దోపిడీ చేస్తున్నాయని మీడియా ,కొంతమంది ప్రజలు అనవసరమైన అపోహలు వ్యాప్తి చేస్తున్నారు. ప్రభుత్వం వేలాది బెడ్స్ ఏర్పాటు చేస్తే, వాటిని వినియోగించుకో కుండా , స్థోమత ఉన్నవాళ్ళకోసం  ఏర్పాటు చేసిన  కార్పొరేట్ ప్రవేట్ హాస్పిటల్స్ కి వెళ్ళమని ఎవరు చెప్పారు? 
ప్రభుత్వ రంగం లో 40000 బెడ్స్ ఉంటే ప్రవేట్ రంగం లో కేవలం 5000 కోవిద్ బెడ్స్ మాత్రమే ఉన్నాయి. వాటిని మధ్య, ఎగువ తరగతి వారు వినియోగించుకొంటారు. ప్రభుత్వ మరియు  ప్రవేట్ భీమా సదుపాయం ,ధన వంతులకోసం  ఏర్పాటు చేసిన ప్రవేట్ హాస్పిటల్స్ కి లక్షలు చెల్లించే సత్తా ఉన్నవారే వెళ్ళాలి. దిగువ మధ్యతరగతి వాళ్ళు అక్కడకు వెళ్ళకూడదు. రోజుకి అరలక్ష చొప్పున 10 రోజులకు కనీసం 5 లక్షలు చెల్లించే స్థోమత ఉన్నవారే ప్రవేట్ హాస్పిటల్స్ కి వెళ్ళాలి. 

పాయింట్ ఆఫ్ కేర్ అనగా 24/ 7 కోవిద్ టెస్టింగ్ అనేది ప్రతి మండలం లో ప్రభుత్వ మరియు ప్రవేట్ రంగం లో ప్రొవైడ్ చేయలేకపోయారు. 
ఎందుకంటే నాన్ కోవిద్ ఎమర్జెన్సీ లు,కాన్పుల కేసులు టేక్ అప్ చేసే ముందు తప్పనిసరిగా కోవిద్ టెస్ట్ చేయించాలి. 
ఇలాంటి పాండెమిక్ పరిస్థితులలో 70 శాతం సర్వీసులు ప్రభుత్వరంగంలో, 30  శాతం సర్వీసులు ప్రవేట్ రంగంలో ఉండేటట్లు  చూడాలి. 

 15000 ఆక్సిజన్ బెడ్స్ , మరో 15000 నాన్ ఆక్సిజన్ బెడ్స్ , 4000 క్రిటికల్ కేర్ బెడ్స్ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ రంగం లో ఉన్నాయి. మరో 6000 బెడ్స్ నాన్ కోవిద్ రోగులకోసం ఉన్నాయి. 
ఇవికాక ప్రవేట్ రంగం లో  సుమారు 5000  కోవిద్ బెడ్స్ అందుబాటులో  ఉన్నాయి . 
లక్ష యాక్టివ్ కేసులుంటే అందులో 25000 మందికి హాస్పిటల్ అడ్మిషన్ అవసరం అవుతుంది. 
వీరిలో 15000 మందికి ఆక్సిజన్ బెడ్స్ అవసరం అవుతాయి. 
అనగా ఆంద్రా లో ఉన్న సదుపాయాలూ లక్ష యాక్టివ్ కేసుల వరకు చికిత్సను అందించగలవు. 

అలాగే ఇండియా మొత్తాన్ని పరిశీలిస్తే జనవరి 2020 లో కేవలం 10 టెస్ట్ లు మాత్రమే చేసే స్థితి నుండి 9 నెలల్లో అంటే సెప్టెంబర్ మాసాంతానికి రోజుకి 15 లక్షల టెస్ట్స్ చేసే స్థితికి మౌలిక సదుపాయాలను, సుమారు 2000 లాబ్స్ ను ఏర్పాటు చేయడం ప్రభుత్వాల ఘనవిజయం. 
సమన్వయం చేయడం లో ICMR  విజయం సాధించినట్లే. 

సూక్ష్మాతి సూక్షమైన ఈ బుల్లి వైరస్ దావానలం లా మానవ జాతిని చుట్టేస్తోంది. 
ఉదాహరణకు మన దేశం లో ఏప్రిల్ ఆఖరికి అనగా కోవిద్ పై యుద్ధం ప్రకటించిన 45 రోజులకు సుమారు 65 లక్షల ప్రజలను ఈ వైరస్ ఎటాక్ చేస్తే , పరీక్షల ద్వారా కేవలం 85000 మందిని పాజిటివ్ గా కనుక్కో గలిగాము. అంటే , ప్రకటించిన పాజిటివ్ కేసులకంటే సుమారు 80రెట్లు వైరస్ ఇన్ఫెక్ట్ అయినవారున్నారు . 
ఈ విధంగా రోజు రోజుకి మనదేశప్రజలను ఎటాక్ చేస్తున్న వైరస్ , ఇప్పుడు అనగా సెప్టెంబర్ మధ్య సమయానికి 165  రోజుల తర్వాత 45 లక్షల కేసులు పాజిటివ్  గా గుర్తించిన సమయానికి 100రెట్లు అనగా 45 కోట్లమందికి ఈ వైరస్ ఇప్పటికే సోకి ఉంటుంది. 
ఆంధ్రాలో ఆగస్టు రెండవ వారం లో సీరో సర్వే  చేశారు. అంటే జులై లో కొరోనా సోకిన వారి లో ఉన్న యాంటీ బాడీల ను పరిశీలించినట్లుగా అర్ధం చేసుకోవాలి. ఈ రిపోర్ట్ లో తేలిందేమిటంటే , 20 శాతం ఆంధ్రులకు అనగా కోటిమందికి జులై నాటికే కరోనా సోకింది. ఆగస్టు,సెప్టెంబర్ రెండుమాసాలలో కూడా పరిశీలిస్తే సీరో సర్వే చేస్తే ఇప్పటికే అనగా సెప్టెంబర్ ఆఖరు కే 2 కోట్ల జనాభాకి సోకి ఉంటుంది. 

0. 3 మైక్రాన్ సైజున్న ఓ చిన్ని వైరస్ మానవదేహం లో ఎండో థీలియల్  పొరలను, ఆల్వియో లస్  పొరలను  దెబ్బతీసి కణాల వాపు, రక్తం చిక్కబడటం , రక్త నాళాల లోని రక్తప్రవాహానికిఅడ్డంకులు తద్వారా అవయవాలకు  ఆక్సిజన్ కొరత వెరసి  కోవిద్ మహమ్మారి దావానలం లాగా అన్ని అవయవాలను మాత్రమే కాదు అన్ని  దేశాలనూ  చుట్టు ముడుతూ ఉంది. 
విచిత్రమేమిటంటే వైరస్ సోకిన వారిలో 80 శాతం మందికి లక్షణాలేమీ కనబడటం లేదు. వీరివలన(by DROPLETS during talking,heavy breathing,sneezing,coughing) అంటువ్యాధి వేగంగా అందరికీ వ్యాపిస్తుంది. 
140 కోట్ల జనాభా ఉన్న ఇండియాలో ఆగస్టు చివరికి  ఒక మిలియన్ జనాభాకి సుమారు 30000 మందికి మాత్రమే కోవిద్  టెస్ట్ లు చేయగలిగాము. అదే అమెరికాలోనైతే 2. 5 లక్షలమందికి టెస్ట్స్ చేశారు. 
1 మిలియన్ జనాభా లో   =30000 మందికి టెస్ట్ చేస్తే = 2600 పాజిటివ్ కేసులు=50మరణాలు. ఇండియా !
1 మిలియన్ జనాభా లో   =250000 మందికి టెస్ట్ చేస్తే = 18000 పాజిటివ్ కేసులు= 500 మరణాలు.  అమెరికా. 
ఈ లెక్కలు కేవలం మహమ్మారి వ్యాప్తిని సూచిస్తాయి తప్ప ఎన్ని మానవ సంబంధాలు గాలిలో కలిసిపోయాయి,ఎంతవేదన మూటగట్టుకున్నామో , ఎన్ని కష్టాలు పడ్డామో చెప్పవు . 
ఇది ఒక వైరస్ కి,మానవజాతికి మధ్యన రగిలిన పోరాటం . భారీ మూల్యం చెల్లించుకొంటున్న మానవజాతి ఇప్పటికైనా కళ్ళు తెరిచి తన ప్రవర్తనను మార్చుకొంటుందా?

కోవిద్  మంత్రం : 
విరివిగా పరీక్షించు - పాజిటివ్ కేసులను,వారి  సంబంధీకులను ఐసొలేట్ చెయ్ - మొదటి వారం లో నే  సత్వర చికిత్స . 
కోవిడ్  కవచం :
స్టెరాయిడ్స్ + హెపారిన్ + యాంటీ వైరల్స్ 

కోవిడ్ ను త్వరగా డ యాగ్నోస్ చేయడానికి అందుబాటులో ఉన్న సులువైన పరీక్షలు :
రాపిడ్ యాంటీజన్ టెస్ట్ సులువుగా, వేగం గా  చేయవచ్చు. ఫలితం పావుగంట లో వచ్చేస్తుంది. ఖరీదైన లాబ్ లు అవసరం లేదు. 
1. STANDARD Q COVID-19 Ag SD Biosensor South Korea / India SD Biosensor Validated, Approved . 
2. COVID-19 Antigen Lateral Test Device LabCare Diagnostics Ltd. India MyLab Discovery Solutions Validated, Approved.  
3. *COVID-19 Ag Respi Strip Coris Bioconcept Belgium Vishat Diagnostics Pvt. Ltd, Mumbai Validated, Approved.

ఈ పై మూడు రకాల యాంటీ జన్ కిట్ లు మాత్రమే మన ICMR వాలిడేట్ మరియు అప్రూవ్ చేసింది.
పైవాటిలో మొదటి రెండు కిట్స్ మాత్రమే పాయింట్ ఆఫ్ కేర్ టెస్ట్ కి పనికి వస్తాయి. స్వాబ్ ను,
 వైరస్ ను న్యూట్రల్ చేసే బఫర్ ద్రావణం(Extraction buffer) లో ముంచి 5 సార్లు తిప్పితే వైరల్ యాంటీజన్ విడుదల అవుతుంది. స్ట్రిప్ పై నున్న చిన్ని గుంత లో 3చుక్కలు వేస్తె 20 నిముషాలలో రిజల్ట్ తెలుస్తుంది .

మూడోది(Coris Bioconcep) నాసల్  శ్వాబ్ కలెక్ట్ చేసి వైరల్ ట్రాన్స్ పోర్ట్ మీడియాలో పెట్టి  కోల్డ్ చైన్ లో లాబ్ కి తీసుకెళ్లి అక్కడే పరీక్ష చేయాలి. 

ఇతర పరీక్షలు : 
తెల్లరక్తకణాలు ముఖ్యంగా లింపో సైట్ లు, ఇసినో ఫిల్స్  బాగా తగ్గిపోయినా కోవిద్ కేసు తీవ్రతను అంచనా వేయవచ్చు. 
 శ్వాస ఇబ్బందులు ఉంటే డిజిటల్ ఎక్స్ రే , అవసరమైతే సి టి స్కాన్ చేయాలి.
“Coronavirus can affect the heart in three ways, myocarditis, an inflammation/ damage in the heart muscle. Second, it can trigger cardiac arrest because blood supply decreases due to clots, and the third is heart attack due to pneumonia, when oxygen supply decreases,” 

Comments