*IMA demands bulldozed ruthlessly by the central Govt.*
ఎన్‌ఎంసీ కింద 4 స్వతంత్ర మండళ్లు ఏర్పాటు చేసిన కేంద్రం
వైద్య విద్యా రంగంలో సరికొత్త ప్రయాణం మొదలు ...
వైద్య విద్య పర్యవేక్షణ కోసం ఎంసీఐ స్థానంలో
శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చిన నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్‌ఎంసీ) కింద కేంద్ర
ప్రభుత్వం నాలుగు స్వతంత్ర మండళ్లను ఏర్పాటు చేసింది. ఆ చట్టంలోని నిబంధనల ప్రకారం
వీటికి శ్రీకారం చుట్టింది. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్
బోర్డు(యూజీఎంఈబీ) ప్రెసిడెంట్‌గా అహ్మదాబాద్‌కు చెందిన జీఆర్ దోషి, కేఎం మెహతా
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కిడ్నీ డిసీజ్ రీసెర్చి సెంటర్ ప్రొఫెసర్ డాక్టర్ అరుణ
వి.వాణికర్ నియమితులయ్యారు. పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్
బోర్డు(పీజీఎంఈబీ) ప్రెసిడెంట్‌గా బెంగుళూరు మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్
సర్జరీ విభాగాధిపతి డాక్టర్ ఎంకేరమేష్, మెడికల్ అసెస్‌మెంట్ అండ్ రేటింగ్
బోర్డు (ఎంఏఆర్‌బీ) ప్రెసిడెంట్‌గా దిల్లీలోని డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్
మెడికల్ కాలేజ్ డైరెక్టర్ ప్రిన్సిపల్ డాక్టర్ అచల్ గులాటి నియమించారు.
ఇందులో సభ్యులుగా హైదరాబాద్ అశ్విన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్
జి.సూర్య నారాయణ రాజుకు అవకాశం వచ్చింది. అదేవిధంగా ఎథిక్స్ అండ్ మెడికల్
రిజిస్ట్రేషన్ బోర్డు (ఈఎంఆర్‌బీ) ప్రెసిడెంట్‌గా బెంగళూరు నిమ్హాన్స్ డైరెక్టర్
బీఎన్ గంగాధర్ నియమితులయ్యారు. డాక్టర్ వీకేపాల్ నేతృత్వంలో ఇప్పటివరకు పని
చేసిన పాలకమండలి (ఎంసీఐ విధులను ఈ పాలకమండలి నిర్వర్తించింది) వైద్య విద్యలో
చేపట్టిన సంస్కరణలను ముందుకు తీసుకెళ్తుంది. ఈ పాలకమండలి ఆధ్వర్యంలోనే 2014-20
మధ్యకాలంలో ఎంబీబీఎస్ సీట్లు 54వేల నుంచి 80వేలకు, పీజీ సీట్లు 24 వేల నుంచి
54వేలకు పెరిగాయి. ఇప్పుడు వైద్య విద్యావ్యవస్థనంతా ఎన్‌ఎంసీ క్రమబద్ధీకరిస్తుంది.
విద్యా సంస్థలకు నాణ్యతను బట్టి రేటింగ్స్ ఇస్తుంది. పరిశోధనపై దృష్టి
సారిస్తుంది.
ఎంబీబీఎస్ తర్వాత ఉమ్మడి తుది పరీక్ష
(నెక్స్ట్- *నేషనల్ ఎగ్జిట్ టెస్ట్)* నిర్వహణకు అవసరమైన విధివిధానాలను ఖరారు
చేయనుంది. ఈ పరీక్షే ఎంబీబీఎస్ రిజిస్ట్రేషన్, పీజీలో ప్రవేశానికి
ఉపయోగపడుతుంది.
ఒకే పరీక్ష తో రెండు పనులు పూర్తవుతాయని
ప్రభుత్వం చెబుతున్నా ,అందులో స్పష్టత లేదు. ముఖ్యం గా ఈ విషయం లో మన మెడికల్
విద్యార్థులలో కొన్ని సందేహాలున్నాయి. వాటన్నింటి కీ సరైన సమాధానాలు ఇచ్చి వారి
ఆందోళనను నివృత్తి చేయవలసిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది.
అలాగే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు వసూలు
చేయాల్సిన ఫీజులను నిర్ధారిస్తుంది. వాస్తవానికి ప్రవేట్ మెడికల్ విద్య
అనేది ఏటా 15000 కోట్ల మాఫియా అని కొంతమంది చెబుతున్నారు. ఇందులో
నిజమెంత? అపోహలెంత? అనేది ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి.
మె రిట్ విద్యార్థులకు మెడికల్ సీట్లు దక్కకుండా
డబ్బుతో కొనుక్కొనే మానేజ్ మెంట్ సీట్ల మతలబు పారదర్శకం గా చేయనంత వరకు మెరిట్
విద్యార్థుల ఆందోళన తగ్గదు.
సామాజిక వైద్యం అందించే ( *కమ్యూనిటీ హెల్త్
ప్రొవైడర్స్)* వారికి ప్రమాణాలను నిర్ధారించి ఇలాంటి వారు ప్రాథమిక వైద్యసేవలు
అందించేందుకు పరిమితమైన అనుమతులిస్తుంది.
మెడిసిన్ అంటే మన దేశం లో 90 శాతం మోడ్రన్
మెడిసిన్ పైనే ఆధారపడి ఉన్నారు! అలాంటి స్థితిలో గ్రామీణ భారతీయులకు MBBS వారితో వైద్యం చేయించ కుండా
పారామెడికల్ సిబ్బందికి కొద్దిపాటి ట్రైనింగ్ ఇచ్చి వీరితోనే వైద్యం
చేయించి చేతులు దులిపేసుకొందామని ప్రభుత్వం అనుకొంటే,అంతకంటే వివక్ష మరోటి
ఉండదు.
ఈ సందర్భం గా IMA, ప్రభుత్వానికి కొన్ని డిమాండ్లు సమర్పించింది.
- సబ్ సెంటర్స్ , వెల్ నెస్ సెంటర్స్ లో కూడా MBBS డాక్టర్స్ ను రిక్రూట్ చేసుకోవాలి .
- ఆయుష్ , అలోపతి వైద్య సిలబస్ ల ను కలపకూడదు.
- ఎక్సిట్ పరీక్ష వద్దు. యూనివర్సిటీ పరీక్షనే కొనసాగించాలి.
- మెడికల్ పి జి ప్రవేశాలకు నీట్ -పి జి పరీక్షనే కొనసాగించాలి.
- ప్రజాస్వామ్య బద్ధమైన ఎన్నికల ద్వారా ఎన్నుకోబడిన సభ్యులతో NMC ని నడపాలి .
- NMC కి అటానమస్ అధికారాలివ్వాలి.
- రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ అధికారాలను కత్తిరించరాదు.
- రాష్ట్రాలలో కూడా క్రాస్ పతీ, మిక్సో పతీ ని అరికట్టాలి.
Comments
Post a Comment