ఇది కష్టకాలం. కోవిద్ మహమ్మారినిఎదుర్కొవాలంటే ప్రభుత్వమేకాదు ప్రవేట్
హాస్పిటల్స్ కూడా కొన్ని త్యాగాలకు సిద్ధం కావలసిన సమయం .
భిన్న రాష్ట్రాలలో వైద్య సౌకర్యాలు,వైద్య బృందాల అందుబాటు
భిన్నంగా ఉంటాయి.
భిన్న పార్శ్వాలున్నభారతదేశం లోని అన్ని రాష్ట్రాలకూ ఒకే రకమైన విధి విధానాలను
ఖరాఖండీగా సూచించలేము.
ట్రీట్ మెంట్ చార్జీలైనా , టెస్టింగ్ విధానాలైనా భిన్నంగా
ఉంటాయి.
అలాగని వదిలేయలేం. ప్రభుత్వమే బాధ్యతతీసుకొని విధి విధానాలను సూచించాలి.
-ఇదీ సుప్రీం కోర్ట్ చెప్పిన మాట.
ఏ హాస్పిటల్స్ ఐతే ప్రభుత్వాలనుండి సహాయాన్ని పొందాయో కనీసం ఆ హాస్పిటల్స్
సబ్సి డైజెడ్ ట్రీట్ మెంట్ అందివ్వాలని ఒక పిటిషనర్ కోరిన మీదట కోర్ట్ పై
విధంగా వాఖ్యానించింది.
కరోనా: ‘అధిక ఫీజులపై సమాధానం ఇవ్వండి’
Jun
05, 2020, 12:59 IST
కరోనా రోగుల చికిత్సకు ప్రైవేటు ఆస్పత్రులు వసూలు చేయాల్సిన ఫీజుకు పరిమితి
విధింపుపై సుప్రీంకోర్టు లో శుక్రవారం విచారణ
జరిగింది. ప్రైవేటు ఆసుపత్రులు కోవిడ్ రోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని,
అందువల్ల చాలా మంది బాధితులకు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లలేక, వాటి సేవలు
అందుబాటులో లేవని పిటిషనర్ అవిషేక్ గోయెంకా కోర్టుకు తెలిపారు. కోవిడ్ రోగుల చికిత్స
కోసం ప్రైవేట్ ఆస్పత్రులు వసూలు చేస్తున్న ఫీజుపై అధిక పరిమితిని విధించడంపై జస్టిస్
అశోక్ భూషణ్, ఎంఆర్ షా, వి.రామసుబ్రమణియన్ ధర్మాసనం కేంద్రం స్పందనను కోరింది.
వారం రోజుల్లో సమాధానం చెప్పాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది.
"Clinical Establishments Act, 2010 ప్రకారం కూడా ఎలా వైద్యం చేయాలి?
ఎంత ఫీజు వసూల్ చేయాలి? అనే విషయాలలో హాస్పిటల్స్ ను శాసించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి
లేదు. కానీ రాష్ట్రాలకు కొన్ని విధి విధానాలను సూచించే అధికారం ఉంది. " ఇదీ కేంద్రం అభిప్రాయం!
ప్రవేట్ హాస్పిటల్స్ వారి వాదన ఇలా ఉంది -
" కోవిద్ అనేది ఒక వ్యాధి. అది అందరినీ ఒకేరకంగా వ్యాధిగ్రస్తులను చేయలేదు. కాబట్టి ఒకేరకమైన చికిత్స సాధ్యం కాదు. కాబట్టి చార్జీలు కూడా అందరికీ ఒకే రకంగా ఉండవు. నర్సింగ్ సిబ్బంది కొరత ఎక్కువగా ఉంది. స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత సరేసరి. అంతేకాదు ఆక్సిజన్ బ్లాక్ మార్కెట్ లో కొనవలసి వస్తుంది. కొన్ని యాంటీ వైరల్ మెడిసిన్స్ లభ్యత కూడా కష్టంగా ఉంది. కాబట్టి "డిమాండ్ మరియు సప్లై " సూత్రం పై ఆధారపడిపనిచేసే ప్రవేట్ రంగం లో ఫీజులు ఎక్కువగా ఉన్నాయని తేలికగా కామెంట్ చేయడం సబబు కాదు.

Every district has different constraints and needs’.
every hospital has different liabilities&assets.
every patient is different in their needs&response!
ఎపిడెమిక్ ని అదుపు చేయాలంటే ప్రవేట్ రంగం సహాయం,ప్రజల సహకారం అత్యవసరం.
వీరిని ఎడ్యుకేట్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వానిదే. అందరినీ కలుపుకొని కో ఆర్డినేట్ చేసుకోకుండా
ఎస్మా లాంటి అప్రజాస్వామిక ,రాజ్యాంగ విరుద్ధ చట్టాలతో భయపెట్టి పనిచేయించుకోవాలనుకోవడం
తెలివితక్కువ తనం.
80% ప్రవేట్ హాస్పిటల్స్ చిన్న స్థాయివి . ఇప్పటికే అన్నిరంగాల మాదిరిగా
ఈ ప్రవేట్ హాస్పిటల్స్ కూడా ఆర్ధికంగా కుదేలైనట్లు మనం చూస్తున్నాం.
కోవిద్ భయం తో గానీ , లాక్ డౌన్ వలన గానీ నాన్ కోవిడ్ రోగులెవ్వరూ హాస్పిటల్స్ కు ఎక్కువగా రావడం
లేదు. కేవలం 30% నర్సింగ్ సిబ్బంది మాత్రమే హాజరు అవుతున్నారు. కోవిద్ మహమ్మారి
పై యుద్ధం చేయాలని ప్రవేట్ రంగానికీ ఉంది.
కానీ,
కానీ,
ప్రభుత్వం ప్రవేట్ హాస్పిటల్స్ లో కోవిద్ వైద్యం చౌకగా చేయాలంటుంది.
ప్రవేట్ హాస్పిటల్స్ లో మానవ వనరులు,ఆర్ధిక వనరులు లేని పరిస్థితి.
ఎక్కువ జీతాలిచ్చి కోవిద్ వైద్యం అందివ్వాలంటే ఎక్కువ ఫీజులు ఛార్జ్ చేయవలసి వస్తుంది. దానికి ప్రభుత్వం విధించిన రూల్స్ ఒప్పుకోవడం
లేదు. అగ్నిమాపక చట్టం,కాలుష్యనియంత్రణ చట్టం, ఫీజు నియంత్రణ ఆర్డర్ ఇన్ని రకాల నిబంధనల
తో సరసమైన క్వాలిటీ వైద్యం అందించే పరిస్థితి లేదు.
మానవతా భావనతో కొందరు డాక్టర్స్ తమ హాస్పిటల్స్ ను కోవిద్ చికిత్సా కేంద్రాలుగా మార్చి ప్రభుత్వం సూచించిన ఫీజులు మాత్రమే వసూలు చేస్తూ, ప్రజలకు సేవ చేస్తుంటే ఎక్కువ ఫీజులు కలెక్ట్ చేస్తున్నారని కొన్ని మీడియా చానళ్లు అబద్ధపు ప్రచారం చేయడం వలన కొందరు డాక్టర్స్ విరక్తితో తమ కోవిద్ హాస్పిటల్స్ మూసేస్తున్నారు. దీనికి తగ్గట్లు ఒకటి రెండు అగ్ని ప్రమాదాలు జరగగానేప్రభుత్వ అధికారులు కూడా కొన్ని హాస్పిటల్స్ ను మూసేస్తున్నారు. దీనివలన ప్రజలు నష్టపోతున్నారు.

Few more Misunderstandings:
ప్రవేట్ డాక్టర్స్,సిటి స్కాన్ లు అనవసరం గా తీస్తూ పేషంట్ ల భయాన్ని కాష్ చేసుకొంటున్నారనే అభియోగాన్ని రాష్ట్ర IMA తీవ్రంగా ఖండిస్తూ ఈ క్రింది విధంగా వివరించింది.
సి టి స్కాన్ అనేది కొన్నిపరిస్థితులలో తీయవలసిన అవసరం వస్తుంది.
. RT PCR పరీక్షా ఫలితాల జాప్యం వలన రోగి ఇబ్బంది పడుతున్నప్పుడు లంగ్స్ లో వ్యాధిని అంచనా వేయడానికి తప్పనిసరిగా x ray , స్కాన్ తీయవలసి వస్తుంది.
.RTPCR పరీక్ష 100% కోవిద్ వ్యాధిని గుర్తించలేదు. నెగటివ్ రిపోర్ట్ వచ్చి,శ్వాస ఇబ్బందులున్న రోగులలో తప్పనిసరిగా ఎక్స్ రే ,స్కాన్ తీయవలసి వస్తుంది. కోవిడ్ వ్యాధి అనుమానం ఉన్న కేసులకు సి టి స్కాన్ తీయాలని రేడియాలజీ సొసైటీ కూడా రికమెండ్ చేసింది.
. అంతేకాదు, కొందరు రోగులు భయం తో డాక్టర్ వద్దకొచ్చి సి టి స్కాన్ పరీక్షలు చేయమని ప్రాధేయపడుతున్నారు. ఈ భయాల ను, అపోహలను తొలగించవలసిన బాధ్యత ప్రభుత్వం పైనా, వైద్యులపైనా సమానం గా ఉంది.
. ప్రవేట్ హాస్పిటల్స్ లో పాయింట్ అఫ్ కేర్ టెస్టింగ్ కు అనుమతులిస్తే సి టి స్కాన్ చేయవలసిన అగత్యం తప్పుతుంది. ప్రభుత్వం ఈ విషయాన్ని గమనించి కనీసం రాపిడ్ ఆంటీజన్ కిట్ లను ప్రతి హాస్పిటల్, ప్రతి లాబ్ నందు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఆయా హాస్పిటళ్ళులేదా లాబ్ లలో చేసిన టెస్టుడేటాను జిల్లా అధారిటీ వాళ్లకు ఏరోజు కారోజు రిపోర్ట్ చేయవచ్చు.
.PCR టెస్ట్ నెగిటివ్ వచ్చినా, లక్షణాలు అనుమాస్పదం గా ఉన్నప్పుడు ఆ కేసును కోవిద్ కేసుగానే పరిగణించి చికిత్స అందించాలని రాష్ట్రప్రభుత్వమే ఆర్డర్ పాస్ చేసింది గదా?
ముఖ్యంగా ఈ పాండెమిక్ లో కేవలం ప్రభుత్వమే అన్నీ చేయాలనుకోవడం ఒక చేత్తో ఈదడం లాంటిది. ప్రవేట్ హాస్పిటల్స్,ప్రవేట్ లాబ్స్ 24/ 7పనిచేసేటట్లు ఎంకరేజ్ చేస్తే మధ్యతరగతి వారికి ముఖ్యంగా ఎవరికైతే ఆరోగ్యబీమా ఉందో వారందరి కీ పాయింట్ అఫ్ కేర్ టెస్టింగ్, ట్రీట్ మెంట్ కూడా అందుబాటులో ఉంటుంది.
మీడియాలో కొన్ని కధనాలు, డిబేట్ ల సారాంశం ఇలా ఉంది -మీరూ వినండి.
ఒక రోగికి రోజుకి రూ. 3000 నుండి 10000 వసూల్ చేసుకోవచ్చని ప్రభుత్వ
సూచన.
అది సరిపోదు 10000 నుండి 35000 వసూల్ చేస్తే తప్ప క్వాలిటీ కోవిద్ వైద్యాన్ని అందించలేమని
ప్రవేట్ హాస్పిటల్స్ వాదన
ఈ కష్టసమయం లో సొంత లాభం కొంత మానుకొని రోగులకు సేవలందించాలని ప్రభుత్వ
హితవు
లాభం మాట దేవుడెరుగు , ఉన్న ఆస్తులు, ఆరోగ్యం కూడా ఫణంగా పెడుతున్నామని
ప్రవేట్ వైద్యుల దైన్యం.
ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ నిధులు కోట్లు కోట్లు తీసుకొన్నారుగా?
ఇపుడు ఆ పాటి త్యాగం చేయలేరా?అని ప్రభుత్వ,మీడియా వర్గాల ఆరోపణ.
ఊరకే తీసుకోలేదుగా? వైద్యం అందించాం, కష్ట పడ్డాం, మాకు రావలసిన ఫీజులు
తీసుకొన్నాం. కొందరిలా ఊరకే తేరగా ప్రభుత్వ ధనాన్ని స్వాహా చేయడం లేదుగదా?
అని ప్రవేట్ హాస్పిటల్స్ జవాబు.
మీది నోబుల్ వృత్తి. కాబట్టి సామాజిక బాధ్యతగా కష్ట నష్టాల కోర్చి ప్రభుత్వ
సూచిక ప్రకారం వైద్యం చేస్తే బాగుంటుంది " ప్రభుత్వ పెద్దల సలహా!
వైద్యం వ్యాపారం కాదు,కేవలం నోబుల్ సేవ అని ప్రభుత్వం నిజంగా నమ్మితే
-
కరెంట్,నీరు,సంపదపన్ను ,ఆదాయపన్ను ,వృత్తి పన్ను, GST,కస్టమ్స్ సుంకాలు
అన్నీ తీసేయ మని చెప్పండి. కనీసం రైతులకు ఇచ్చినట్లు టారిఫ్ డిస్కౌంట్
ఇవ్వమని చెప్పండి.
ప్రవేట్ పరిశ్రమలకు రాయితీ లిచ్చినట్లు , ప్రవేట్ హాస్పిటల్ నిర్మాణానికి
సాఫ్ట్ లోన్స్ , రాయితీలు ఇప్పించమని చెప్పండి.
ప్రభుత్వ వైద్యులను కట్టు బానిసలుగా చూడకుండా వారి కష్టానికి తగిన
ప్రతిఫలం - UGC SCALE జీతాలు, PRC అమలు ,తదితర కనీస ఉద్యోగ సంక్షేమం అమలు చేయమని చెప్పండి.
ఇంత కష్ట సమయం లో గొంతెమ్మ కోర్కెలు కోరితే ఎలా? ఆర్థికపరిస్థితి దివాళా
అంచుల్లోఉందని తెలుసుగదా?
అంతగా దిగజారితే ఒక్కరాజధాని సరిపోదా? మూడెందుకు ?
అంతగా దిగజారితే ఇన్ని ఓట్ల ఆకర్షణ పథకాలెందుకూ ?
అయినా, భీమా ఉన్న రోగులకు కూడా పూర్తి భీమా రక్షణ ఇవ్వకుండా మోసం చేస్తున్న భీమా
కంపెనీలను అదుపు చేయలేక , మా పై మీ జులుం చూపిస్తే ఎలా?
ఏమప్పా ! ప్రవేట్ డాక్టర్స్ మూలకూర్చున్న ముసలి బాతుల్లా
కనబడుతున్నారా ?
మీరిలా దారికిరారు. హాస్పిటల్స్ ను మూయించితే అపుడు మీరే దిగి వస్తారు
. ఒక్క హాస్పిటలూ రూల్స్ పాటించదు . మిమ్మల్ని ఎలా దారికి తేవాలో మాకు తెలుసు.
గుడ్డి కన్ను తెరిస్తే ఎంత?మూస్తే ఎంత! మా హాస్పిటల్స్
తెరిచినా ఒకటే, మూసుకున్నా ఒక్కటే.
మీ మద్యం దుకాణాల వలన అదుపు తప్పిన మహమ్మారి కొందరు క్వారంటైన్
కాంట్రాక్టర్లకు , ప్రభుత్వ అధికార్ల కు లాభదాయకం గా ఉన్నంత కాలం మా బతుకింతే!
ఇసుక,మైనింగ్ ,రోడ్లు,ఇళ్ళు , ఇళ్ల స్థలాలు ఇలా ఏది చూసినా ఏముంది గర్వకారణం?
అధికారమదం సమస్తం పరపీడన పరాయణత్వం !
అలా నిరాధార ఆరోపణలు చేస్తే సైబర్ క్రైమ్ లో బుక్ చేయవలసి ఉంటుంది. జాగ్రత్త!
IT Act సెక్షన్ 66 A మాకూ తెలుసు. సుప్రీం కోర్ట్ ఆ సెక్షన్ 66 ని
రద్దు చేసి ఏమి చెప్పిందో గుర్తు పెట్టుకొండి .
కోర్టులు గీర్తులు మీలాంటోళ్లకు. మాకు మేమె రాజులం.
అదీ చూద్దాం !మొండివాడు రాజుకంటే బలవంతుడని తెలియదా?
సరే, ఇలాంటి డిబేట్ ల వలన కొత్తగా సాధించేదేమీ ఉండదు ఇరువర్గాలు
ఘర్షణ పడటం తప్ప! కోవిడ్ టైమ్స్ లో ఒక నిర్మాణాత్మక పరిశీలన, సమస్యను
అర్ధం చేసుకొనే ఓర్పు, అంకితభావం ఇరు వర్గాలలో ఉన్నప్పుడే విజయం సాధించవచ్చు.
5కోట్ల ఆంధ్రులు మీ వంక చూస్తున్నారు. మీలోమీరు దెబ్బలాడుకొంటూ మమ్మల్ని ఆ మహమ్మారికి వదిలేస్తారా? ఇంతపెద్ద విపత్తు ఎప్పుడో శతాబ్దానికి ఒకటి వస్తుంది. ఛాలెంజ్ కి తగినట్లు ఎదురు నిలిచేవాడే మనిషి. తమను తాము నిరూపించుకోవడానికి డాక్టర్స్ కి మంచి అవకాశం. ఈ ఛాలెంజ్ కి తగినట్లు మన హృదయాలు ఎదగాలి.
ప్రభుత్వాలు,అధికారులు,నాయకుల తీరు మారదు. వైద్యుడు నారాయణ స్వరూపుడు. ప్రాణాలుపోయవలసిన పవిత్రమైన వృత్తిలో ఉంటూ రూపాయలు లెక్కపెట్టు కోవడం చాలా పెద్ద తప్పు. అయినా మీ కష్టం మేము ఉంచుకోము . మరీ రోజుకి 50వేలు,లక్షా చెల్లించుకోలేము గానీ ప్రభుత్వం ఫిక్స్ చేసిన దానికి రెట్టింపు చెల్లించుకొంటాం. కాస్త మా వంకచూసి బెడ్ ఇవ్వండి" ఇదీ సామాన్యుడి వేడుకోలు!

National Disaster Management Act, 2005,
చట్టం ఇచ్చిన అధికారం తో కేంద్రం అమిత్ షా నేతృత్వం లో ఒక కమిటీ ని
ఏర్పాటు చేసి ప్రవేట్ కోవిడ్ ట్రీట్ మెంట్ చార్జీలను ఫిక్స్ చేసింది.
దానిని అనుసరించి రాష్ట్రాలు కూడా వారి పరిస్థితులకు అనుగుణంగా ప్రవేట్ కోవిడ్
ట్రీట్ మెంట్ చార్జీలను ఫిక్స్ చేశాయి.
- for isolation beds within ₹8,000 to₹10,000.
- For ICU unites without ventilators, the charges will be
between ₹13,000 to ₹15,000.
- For ICU with ventilators, a bed will cost between ₹15,000
to ₹18,000. All the charges include PPE costs.
తమిళనాడు లో రూ . 5000 జనరల్ ఐసోలేషన్ కి
,15000/ For ICU.
రాజస్థాన్ లో 2000 జనరల్
ఐసోలేషన్ కి ,4000/ For ICU.
హర్యానా లో 7000 జనరల్
ఐసోలేషన్ కి ,16000/ For ICU.
మహారాష్ట్ర లో 4000 జనరల్ ఐసోలేషన్
కి ,8000/ For ICU.
తెలంగాణ లో 4000 జనరల్ ఐసోలేషన్ కి ,
8000/ For ICU.
ఆంధ్రాలో 3000 జనరల్ ఐసోలేషన్ కి ,
10000/ For ICU.
ఏవైనా ఖరీదైన యాంటీ వైరల్ మందులువాడితే ఆ
ఖర్చును అదనంగా రోగినుండి వసూల్ చేసుకోవచ్చని ప్రభుత్వాలు సూచించాయి.
కానీ , హాస్పిటల్స్ అస్సోసి యెషన్ వారు సూచించిన
రేట్లు ఇలా ఉన్నాయి -
జనరల్ ఐసోలేషన్ 15000/day
ఆక్సిజన్ బెడ్స్ 20000/ day
ICUs with ventilator support Rs
35,000/day .
(immunoglobulin, tocilizumab and plasma
therapy which, if used, will be charged separately. Also, management management
of co-morbid complication will be charged as per actuals).
ఫిక్కీ (FICCI task
force on Covid 19) సూచించిన రేట్లు :
from Rs 17,000—Rs 45,000 per day.
ప్రభుత్వ కోవిద్ హాస్పిటల్స్ లో బెడ్స్ సరిపోవడం లేదు. కాబట్టి ప్రవేట్ హాస్పిటల్స్ లో , చివరికి హోటల్స్ లో కూడా కోవిద్ వైద్యానికి తెర తీసిన ప్రభుత్వం ఒక్క అగ్ని ప్రమాదం జరగ గానే నెపం మొత్తం ప్రవేట్ డాక్టర్స్ పైన వేసేసి చేతులు దులుపుకోవడమే కాదు అధిక ఫీజులు వసూలు చేయడం, ఫైర్ సేఫ్టీ అనుమతులు సక్రమంగా లేవన్న ఆరోపణలతో..కొన్ని ఆసుపత్రుల్లో కోవిడ్ వైద్యానికి ప్రభుత్వం అనుమతులు రద్దు చేసింది.
దేశం లోనే అత్యధికంగా కోవిద్ టెస్టులు చేస్తున్న ఆంధ్ర రాష్ట్రం లో ఇన్ని లక్షల కేసులా? అస్సలు టెస్ట్ లు ఏమీ చేయకుండా చేతులెత్తేసిన తెలంగాణ రాష్ట్రం లో తక్కువ కేసులా ? ఎవరిని నమ్మాలి?అంతా మాయ గా ఉందే ! ఓ ఎపిడెమాలజిస్ట్ స్వగతం !
ఇన్ని కష్టాల మధ్య చీకట్లో చిరు దివ్వె లెక్క , కేసు ఫాటాలిటీ రేటు మన తెలుగు రాష్ట్రాలలో చాలా తక్కువగా (< 0. 9) ఉంది. దీనికి కారణం మన డాక్టర్స్ నైపుణ్యం, నర్సింగ్ సిబ్బంది అంకితభావం.
లాబ్ సపోర్ట్ చాలా తక్కువగా ఉంది. స కాలంలో అందుబాటులో ఆక్సిజన్ బెడ్స్ ,ఆక్సిజన్ లభ్యత, లాబ్స్ ఇంకా వేగం గా రిపోర్ట్ లు ఇస్తే మరణాలను బాగా తగ్గించ వచ్చు.
అటు కోవిద్ టెస్ట్ లు ఇటు క్రిటికల్ బ్లడ్ టెస్ట్ లు(D-dimer, IL) రోజుల తరబడి ఆలస్యం అవుతున్నా, ప్రభుత్వం ఆ విషయం పట్టించుకోవడం లేదు.
ప్రభుత్వం చిన్న చిన్న కియోస్క్ లలోగానీ, లేదా ప్రభుత్వ హాస్పిటల్స్ లో గానీ 24/7 రాపిడ్ యాంటీ జన్ టెస్ట్స్ అందుబాటులో ఉంచితే, నాన్ కోవిడ్ ఎమర్జెన్సీ లకు కూడా కోవిడ్ టెస్ట్ చేయడానికి వీలుగా ఉంటుంది. ప్రవేట్ డాక్టర్స్ సూచనపై ఇక్కడ టెస్ట్ లు చేస్తే అటు నాన్ కోవిద్ రోగులకు, ఇటు ప్రవేట్ డాక్టర్స్ కి సౌకర్యంగా ఉంటుంది.
ఈ పరీక్షలను ప్రభుత్వం ఉచితంగా చేయనక్కరలేదు. ఉదాహరణకు, -
రాపిడ్ యాంటీ జన్ టెస్ట్స్ కి 500/ -; ట్రూ నాట్ పరీక్ష కి 1000/ - , RT-PCR కి 1500/- ఛార్జ్ చేసినా ఎవ్వరూ ఇబ్బంది పడరు .
TESTING @doorstep:govt can charge extra 20%.
మొహమాటం లేకుండా చెప్పాలంటే మద్యం షాపులు పూర్తిగా బంద్ చేయాలి. జొమాటో, స్విగ్గి ద్వారా ఆన్ లైన్ లోనే ఇళ్లకు సప్లై చేస్తే ప్రభుత్వ ఆదాయం కూడా పడిపోదు. - ఓ సోషియాలజిస్ట్ సలహా!
ప్రభుత్వ కోవిద్ హాస్పిటల్స్ లో బెడ్స్ సరిపోవడం లేదు. కాబట్టి ప్రవేట్ హాస్పిటల్స్ లో , చివరికి హోటల్స్ లో కూడా కోవిద్ వైద్యానికి తెర తీసిన ప్రభుత్వం ఒక్క అగ్ని ప్రమాదం జరగ గానే నెపం మొత్తం ప్రవేట్ డాక్టర్స్ పైన వేసేసి చేతులు దులుపుకోవడమే కాదు అధిక ఫీజులు వసూలు చేయడం, ఫైర్ సేఫ్టీ అనుమతులు సక్రమంగా లేవన్న ఆరోపణలతో..కొన్ని ఆసుపత్రుల్లో కోవిడ్ వైద్యానికి ప్రభుత్వం అనుమతులు రద్దు చేసింది.
లక్షలు ఖర్చుపెట్టి హోటల్స్ ను, తమ హాస్పిటల్స్
ను కోవిద్ వైద్యానికి అనువుగా మార్చుకున్న డాక్టర్స్ కు ఎంత నష్టం? ఎంత కష్టం?
ఇన్ని కష్టాల మధ్య చీకట్లో చిరు దివ్వె లెక్క , కేసు ఫాటాలిటీ రేటు మన తెలుగు రాష్ట్రాలలో చాలా తక్కువగా (< 0. 9) ఉంది. దీనికి కారణం మన డాక్టర్స్ నైపుణ్యం, నర్సింగ్ సిబ్బంది అంకితభావం.
లాబ్ సపోర్ట్ చాలా తక్కువగా ఉంది. స కాలంలో అందుబాటులో ఆక్సిజన్ బెడ్స్ ,ఆక్సిజన్ లభ్యత, లాబ్స్ ఇంకా వేగం గా రిపోర్ట్ లు ఇస్తే మరణాలను బాగా తగ్గించ వచ్చు.
అటు కోవిద్ టెస్ట్ లు ఇటు క్రిటికల్ బ్లడ్ టెస్ట్ లు(D-dimer, IL) రోజుల తరబడి ఆలస్యం అవుతున్నా, ప్రభుత్వం ఆ విషయం పట్టించుకోవడం లేదు.
ప్రభుత్వం చిన్న చిన్న కియోస్క్ లలోగానీ, లేదా ప్రభుత్వ హాస్పిటల్స్ లో గానీ 24/7 రాపిడ్ యాంటీ జన్ టెస్ట్స్ అందుబాటులో ఉంచితే, నాన్ కోవిడ్ ఎమర్జెన్సీ లకు కూడా కోవిడ్ టెస్ట్ చేయడానికి వీలుగా ఉంటుంది. ప్రవేట్ డాక్టర్స్ సూచనపై ఇక్కడ టెస్ట్ లు చేస్తే అటు నాన్ కోవిద్ రోగులకు, ఇటు ప్రవేట్ డాక్టర్స్ కి సౌకర్యంగా ఉంటుంది.
ఈ పరీక్షలను ప్రభుత్వం ఉచితంగా చేయనక్కరలేదు. ఉదాహరణకు, -
రాపిడ్ యాంటీ జన్ టెస్ట్స్ కి 500/ -; ట్రూ నాట్ పరీక్ష కి 1000/ - , RT-PCR కి 1500/- ఛార్జ్ చేసినా ఎవ్వరూ ఇబ్బంది పడరు .
TESTING @doorstep:govt can charge extra 20%.
మొహమాటం లేకుండా చెప్పాలంటే మద్యం షాపులు పూర్తిగా బంద్ చేయాలి. జొమాటో, స్విగ్గి ద్వారా ఆన్ లైన్ లోనే ఇళ్లకు సప్లై చేస్తే ప్రభుత్వ ఆదాయం కూడా పడిపోదు. - ఓ సోషియాలజిస్ట్ సలహా!
కోవిద్ మహమ్మారి
వాస్తవం -- మానవ సంబంధాలు ఓ మాయ!
కోవిద్ మహమ్మారి ఒక
ఛాలెంజ్ - వైద్యుల ప్రవర్తన ఓ సర్రియలిజం.
కోవిద్ మహమ్మారి
పెను ప్రమాదం - ప్రభుత్వాల పనితీరు అసంబద్ధం.
Comments
Post a Comment