Skip to main content

covidology- part 3

భూమౌ స్ఖలితపాదానాం భూమిరే వావ లంబనమ్‌ 
త్వయి జాతాపరాధానాం త్వమే వాలంబనం గురోః. 
నేలను ఛిద్రం చేసినా పచ్చటి పంటను ప్రసాదించినట్లే,గురువును ఏమన్నా క్షమించి మంచి దారిలో పెట్టడానికే శ్రమిస్తాడు. 
నేలను తన్నినా నేలకేమీ కాదు. మన కాలే దెబ్బతింటుంది. అలాగే గురువును ఏమన్నా గురువుకేమీ కాదు. నష్టపోయేది శిష్యుడే. 

అలాగే వైద్యుల పై దాడి చేస్తే నష్టపోయేది రోగులే !

 
భారతదేశ ఆరోగ్యరంగం లో ఎన్ని బలహీనతలున్నాయో వాటన్నింటినీ బహిర్గతం చేసిందీ వైరస్. ఒక విధంగా పాలకుల ప్రయారిటీలను సమూలంగా మార్చి ఆరోగ్యరంగ సామర్ధ్యాన్ని పెంచ వలసిన అవసరాన్ని కఠినంగా గుర్తు చేసింది. 


సెప్టెంబర్ మాసాంతానికి 60 లక్షల పాజిటివ్ కేసులను కనుగొన్నారు. కానీ సీరో సర్వే సమాచారాన్ని విశ్లేషిస్తే కనుగొన్న (recorded cases) కేసులకు 60 రెట్లు జనాభాకు వైరస్ సోకిఉంటుందని శాస్త్రవేత్తల అంచనా . లక్ష  కోవిద్ మరణాలు లెక్క తేలాయి. కానీ రాష్ట్రాల రిపోర్టింగ్ లోప భూయిష్టంగా ఉందని కొందరు చెప్పిన విషయాన్ని పరిగణన లోకి తీసుకొంటే ప్రకటించిన దాని కంటే రెట్టింపు అనగా సెప్టెంబర్ నెలా ఖరుకి 2లక్షల కోవిద్ మరణాలు సంభవించాయని అనుకోవచ్చు. 


ఎంతమందికి సోకింది? ఎంతమందికి లక్షణాలున్నాయి? ఎన్ని టెస్ట్ లు చేశారు? పాజిటివిటి రేట్ ఎంత?ఎన్ని ఆక్సిజన్ బెడ్స్ ఏర్పాటు చేశారు? ఎంతమంది హెల్త్ వర్కర్స్ ను నియమించారు? లాబ్ పరీక్షలు సకాలం లో చేయగలిగారా? వైద్య సిబ్బందికి క్వాలిటీ  రక్షణ కిట్లు , మాస్క్ లు అందించారా?
సకాలం లో ట్రేసింగ్ ,టెస్టింగ్, వైద్యం అందే  ఏర్పాట్లు జరిగాయా?
క్వారంటైన్ సెంటర్ల లో సదుపాయాలు ,ఆహరం,నీరు, వైద్య అజమాయిషీ సరిగ్గా అందాయా ?
ఇవన్నీ చేదుమాత్ర లాంటి ప్రశ్నలు. 
సుమారు 33 శాతం జాతీయ ఉత్పత్తి తగ్గిపోయింది. ఉత్పత్తి తో పాటు సరఫరా చైన్ తెగిపోయింది. షాపుల్లో సరకులు లేవు. ఉన్నవాటి ధర రెట్టింపు అయింది.  వ్యాపార సంస్థల టర్నోవర్ అమాంతం పడిపోయింది. 2కోట్ల ఉద్యోగాలు ఊడిపోయాయి.ప్రజల ఆదాయం పడిపోవడం తో  కొనుగోలు శక్తి బాగా తగ్గి పోయింది. కోటి మంది కూలీలు  కాలి నడకన సొంతగ్రామాలకు తిరిగి వెళ్లిపోయారు. మద్యం వరదలై పారడమేకాదు మహమ్మారి ఇంత ఎక్కువగా వ్యాపించడానికి కూడా ప్రధాన కారణం అయింది. 

భూ గోళమంతటా వైరస్ వ్యాపించినా ఎక్కువగా  భారత దేశమే అన్ని విధాలా -ఆరోగ్యపరంగా , ఆర్ధిక పరంగా ఎక్కువగా నష్టపోయిందని IMF & ECONOMIST లెక్కలు గట్టాయి .


మే మొదటి వారానికి కనిపెట్టిన పాజిటివ్ కేసులు 50000. కానీ సీరో సర్వే ప్రకారం 6మిలియన్ ప్రజలకు వైరస్ సోకి ఉండవచ్చని ICMR  తేల్చింది.

ICMR’s First Sero-Survey Paper Out: India Missed 81 Infections Per Case in May.  ( tested blood samples obtained from 28,000 individuals in a little over 80 districts for immunoglobulin G antibodies using the COVID Kavach ELISA kit. 0.73% of adults in India had been exposed to the novel coronavirus, translating to 6.4 million infections and an infection fatality rate (IFR) of 0.08% by early May). 

The infection to case ratio implies that for every person who tested positive on an RT-PCR test and entered India’s official case tally, we missed 81.6 to 130.1 other persons who were also positive, in the survey period.

Given the period in which the survey was conducted and the virus’s incubation period, its results pertain to people who were infected in late April or so.

About 7% of Indians exposed to Covid-19 by August end: ICMR second sero survey report.

సెప్టెంబర్ మాసాంతానికి   సుమారు 30 నుండి   50 శాతం ప్రజలకు వైరస్ సోకి ఉంటుందని అంచనా వేయవచ్చు.

 ఇండియా లో కేస్ ఫాటాలిటీ రేటు మిగతా దేశాల కంటే తక్కువ . దీనికి కారణం ?

కోవిడ్ అనేది రక్తాన్ని చిక్క బరచి, రక్త  నాళాల ఎండో దీలియం ను ఛిద్రం చేసి వైటల్ ఆర్గాన్స్ కి రక్త సరఫరాని తగ్గించే వ్యాధిగా ఎప్పుడైతే గుర్తించారో ,అప్పటి నుండి చికిత్స లో చాలా మార్పు వచ్చింది. 

  1. that antibodies against the dengue virus, endemic to at least 100 countries including India, can confer some level of protection against SARS-CoV-2. డెంగు వ్యాధి నిరోధక యాంటీ బాడీలు కొంత రక్షణ నిచ్చి ఉండవచ్చు. క్షయ వ్యాధి నిరోధక యాంటీ బాడీలు కూడా కొంత సహాయం చేసి ఉండవచ్చు. 

 2. that the country’s healthcare authorities got time to learn about treatment strategies since the virus wrought havoc here later.  మహమ్మారి మిగతా దేశాలకంటే మనదేశానికి  ఆలస్యంగా రావడం, ఎర్లీ లాక్ డౌన్ వలన రోగ వ్యాప్తి నెమ్మదిగా క్రమేణా  వ్యా పించడం ,  అప్పటికే దేశం సన్నద్ధం గా ఉండటం, ట్రీట్ మెంట్ లో కొన్ని కొత్త విషయాలు తెలియడం కూడా వ్యాధిని ఎదుర్కోవడానికి ఉపయోగపడ్డాయి. మొదటి వారం లోనే ఆక్సిజన్ శాతాన్ని గమనిస్తూ అవసరమైతే స్టెరాయిడ్స్ ను , హెపారిన్ లాంటి మందులను త్వరగా సకాలం లో ఇవ్వడం అనే ప్రోటోకాల్ బాగా ఉపయోగపడింది. అలాగే దేశ వ్యాప్తం గా ఆక్సిజన్ బెడ్స్ ను బాగా ఎక్కువ సంఖ్య లో ఏర్పాటు చేయడం , రెమ్ డేస్ వీర్ లాంటి యాన్తి వైరల్ మందులు మార్కెట్ లోకి రావడం , రాపిడ్ యాంటీ జన్ లాంటి పరీక్షలు సకాలం లో చేయడం కూడా దోహద పడ్డాయి. 

 3.Several sociological factors are thought to be contributing to the low rate of death from Covid in India. One is India’s demographics. Compared to countries in the West, South Asian nations have a younger population.

The average age of the Indian population is 26.8 years, while that of the US and Brazil is 38.5 years and 33.2 years, respectively. Among other South Asian nations, Pakistan has an average age of 22 years and Bangladesh, 27.9 years.

 భారతీయుల సగటు వయస్సు 27 సంవత్సరాలు. యువ భారత్ మహమ్మారిని బాగా తట్టు కొని నిలబడింది.

 

Comments