Skip to main content

Covid & its Treatment' made easy -కోవిడ్ విచికిత్స

 కరోనా వైరస్ మానవ దేహం లోని కణాలను ఎలా ఏ విధంగా  దెబ్బ తీస్తుంది?      
కరోనా వైరస్ మన శరీరానికి చేసే హాని కంటే మన రోగ నిరోధ వ్యవస్థలో జరిగే ఒక విధమైన మార్పులే మన దేహానికి ఎక్కువగా హాని చేస్తున్నాయి. కానీ   ప్రతిఒక్కరిలో రోగ నిరోధ వ్యవస్థలో హానికరమైన మార్పు జరగదు . కేవలం 15 శాతం కేసుల్లోనే ఇది జరుగుతుంది . 
కొందరికి పెన్సిలిన్ విపరీతమైన రియాక్షన్ కలిగిస్తుంది. అదే మాదిరి , ఈ కరోనా కూడా చాలా తక్కువమందిలో పెన్సిలిన్ లాగానే కాపోతే 7రోజులు ఆలస్యం గా విపరీతమైన రియాక్షన్ (Cytokine storm or/ మరియు  bradykinin storm)కలిగిస్తుంది. 
ఈ సైటో కైన్స్ మరియు బ్రాడీ కైన్స్ అనేవి సూక్ష్మజీవులను, పరాయి పదార్ధాలను  తుద ముట్టించే ప్రోటీన్ అణువులు. కానీ ఇవి పనిచేసే ప్రోగ్రామ్ ను వైరస్ దెబ్బతీస్తుంది కాబట్టి కైన్స్ అణువులు పరాయి పదార్ధాన్ని తరిమివేయకుండా మన సొంత కణాలనే దెబ్బతీస్తాయి.  
ముఖ్యంగా రక్త నాళాలను దెబ్బతీయడం చేత వాటి  నుండి ప్లాస్మా  తదితర ప్రోటీన్స్ లీక్ అవుతాయి. ముఖ్యంగా లంగ్స్ లో లీక్ ఐన ద్రవం ఒక జెల్లీ లా తయారై ఆక్సిజన్ వినిమయం /శోషణం తగ్గిపోతుంది . 
మనదేహం లో తలుపులు, కిటికీలు లాంటివి ఉంటాయి. వాటినే ACE2 ఎంజైమ్ లని అంటాం. కరోనా వైరస్  ఈ తలుపులను (ACE2 అనే ప్రొటీన్ల ను)  అంటిపెట్టుకొని లాక్ ఓపెన్ చేసేసి  కణాలలోనికి ప్రవేశించి జన్యు ప్రోగ్రామ్ ను దెబ్బతీస్తుంది. అంటే ఒక విధంగా "ACE2  నిరోధకం"(ACE INHIBITORS) లా పనిచేస్తుంది. 
అనగా రక్తపోటు ను తగ్గించే  ACE2  నిరోధకాలైన కొన్ని మందుల(enalapril) లాగానే ఈ కరోనా పనిచేస్తుంది. 

ACE2 అనే ప్రొటీన్లు  ఎక్కడ ఎక్కువ ఉంటాయి?
ముక్కు , జీర్ణాశయం,కిడ్నీలు ,గుండె. 
మొన్నటి వరకు కేవలం సైటో కైన్ లు మాత్రమే ముద్దాయిలని అనుకొన్నారు. కానీ కొందరు సైన్టిస్ట్ లు బ్రాడీ కైనిన్ లు కారణమని చెబుతున్నారు. 
రక్త ప్రసరణ, రక్త పోటును నియంత్రిమ్చే "రెనిన్ -యాంజియో టెన్సిన్ వ్యవస్థ"(RAS) ను పాడు చేయడం వలన బ్రాడీ కైనిన్స్ ఎక్కువగా విడుదల అవుతాయి. ఈ బ్రాడీ కైనిన్స్ ను  అదుపుచేసే ACE2 అణువులను కూడా వైరస్ ఆక్రమించు కోవడం వలన బ్రాడీ కైనిన్స్ తుఫాన్ హోరెత్తుతుంది. ఈ బ్రాడీ కైనిన్స్ వలన  రక్తనాళాలు  లీక్ అవుతాయి. తద్వారా  ద్రవం బయటకు  వెళ్ళిపోతుంది. 
అంతేకాదు, లంగ్స్ లో ఎప్పుడైతే ద్రవాలు ఎక్కువైతాయో అప్పుడు లంగ్స్ లో ఈ ద్రవాలను పీల్చుకొనే హయలూరినిక్ యాసిడ్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. అప్పుడు ఇవన్నీకలిసి ఒక బయోజెల్ లా మారి ప్రాణవాయువు శోషణను ఆపుతాయి . 

కరోనా --- ACE2 అనే ప్రొటీన్ లను పాడుచేస్తుంది. 
కరోనా --- రెనిన్ -యాంజియో టెన్సిన్ వ్యవస్థ"(RAS) ను పాడు చేస్తుంది . 
తద్వారా  - బ్రాడీ కైనిన్స్  అడ్డు అదుపులేక ఎక్కువగా పెరుగుతాయి. వీటివలన గుండె వేగం లో అనిశ్చితి(arrhythmia),రక్తపోటు పడిపోవడం జరుగుతుంది. 
లంగ్స్ లోని ఆల్వియో లు బయో జెల్ తో నిండిపోతాయి . 
అంతేకాదు , బ్లడ్ బ్రెయిన్ అడ్డంకిని కూడా ఈ బ్రాడీ కైనిన్స్ ఛేదిస్తాయి. తద్వారా మెదడు లోని  రక్తనాళాలు కూడా  లీక్ అవుతాయి.  
అంతేకాదు ఈ బ్రాడీ కైనిన్స్ థై రాయిడ్ గ్రంధిని కూడా అస్తవ్యస్తం చేస్తుంది . 


Type3 hypersensitive Reaction. దీనివలన అవయవాలలో ,రక్త నాళాలలో పొరల వాపు  సంభవిస్తుంది. 
టై ప్ 3 ఇమ్మ్యూన్ రియాక్షన్ వలన శరీరం లోని లంగ్స్, జీర్ణాశయం, మెత్తని కండరాలు (గుండె) తదితర అవయవాలలో  ఇన్ఫలమేషన్ ఏర్పడి ,దానికి గుర్తు గా బ్రాడీ కైనిన్స్ ,  సైటో కైన్స్ , ఫెర్రీ టిన్ , "సి-రియాక్టివ్" ప్రోటీన్ రక్తం లో ఎక్కువగా  విడుదల అవుతాయి.  అందుకే వీటిని అంచనావేయడానికి తద్వారా వ్యాధి తీవ్రత ను అంచనా వేయడానికి అలాగే మందుల పనితీరుని అంచనా వేయడానికి  రక్తపరీక్షలు తరచుగా చేయాలి. 

రక్త నాళాల లోపలి  సున్నితమైన ఎండో ధీ లియల్  పొర దెబ్బతిని రక్తం చిన్న చిన్న గడ్డ లు కడుతుంది.    దీనివలన సున్నితమైన అవయవాలు రక్తసరఫరా తగ్గి పాడవుతాయి. అందుకే మెదడు కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. 
రక్తం గడ్డ కట్టే విధానం లో లోపాలు ఏర్పడటం వలన D-Dimer రక్తం లో బాగా పెరుగుతుంది. 

గుండె కండరాలలో ఇన్ఫలమేషన్ ఏర్పడి మయో కార్డయిటీస్ వచ్చే ఛాన్స్ ఉంది. 
చెప్పుకొన్న కాంప్లికేషన్స్ అన్నీ కోవిడే కాదు,  ఏ వైరస్ జబ్బులోనైనా వచ్చే అవకాశం కొందరిలో  ఉంటుంది.  

                      మన రోగ నిరోధ వ్యవస్థ  సహజ సిద్ధమైన( INNATE) ఇమ్యూనిటీ, అందిపుచ్చుకొన్న(Acquired) ఇమ్యూనిటీ అనే రెండువిధాలుగా  పనిచేస్తుంది. 
కారు లో గేర్ సిస్టం ఎలా ఉంటుందో రోగ నిరోధ వ్యవస్థ లో కూడా ఉంటుంది. కొందరిలో కరోనా ఈ గేర్ సిస్టం ను పాడుచేస్తుంది. 


                రోగ నిరోధ వ్యవస్థ పనితీరు కు ముఖ్యంగా గ్లైసిన్ అనే ఎమినో యాసిడ్,vitamin C,Zinc,vitamin D  అత్యవసరం . ( గుడ్లు, నువ్వుల లో  గ్లైసిన్ ఎక్కువగా ఉంటుంది. )
రోగ నిరోధ వ్యవస్థ పనితీరు మన జన్యు క్రమాన్ని బట్టి ఉంటుంది. అంతేకాదు చిన్నప్పటి నుండి మనం ఎదుర్కొన్న వైరస్ లను బట్టి కూడా ఉంటుంది. 

నిజానికి కరోనా వైరస్‌ దశలవారీగా ఆరోగ్యం మీద దెబ్బ కొడుతుంది. ఆ దశలు ఏవంటే....

1. ఇంక్యుబేషన్‌ పీరియడ్‌: ఇది తొలి దశ. ఈ దశలో వైరస్‌ శరీరంలోకి చేరినా లక్షణాలు బయల్పడవు. its also called pre-symptomatic phase.ఈ సమయం లో రోగికి ఎలాంటి లక్షణాలూ ఉండవు. 

2. సింప్టమాటిక్‌ పీరియడ్‌:(1ST.DAY OF SYMPTOM onset to 6th.day of symptoms) వైరస్‌ శరీరంలోకి చేరిన ఐదు నుంచి ఏడవ రోజు వరకూ రెండవ దశగా భావించాలి. ఈ దశలో జ్వరం, జలుబు, దగ్గు, తలనొప్పి, ఒళ్లునొప్పులు, వాసన, రుచి తెలియకపోవడం... ఇలా కరోనా లక్షణాలు మొదలవుతాయి. అందర్లో ఈ లక్షణాలన్నీ ఉండకపోవచ్చు. కొందరిలో వేర్వేరు లక్షణాలు రెండు కలిసి ఉండవచ్చు. లక్షణాలు కనిపించిన తర్వాత ఆరు నుంచి ఏడు రోజులు ఎంతో కీలకం. ఈ దశలో చికిత్స సత్వరం మొదలవ్వాలి.
In some persons these symptoms may not be present called them as asymptomatics. 80% patients in India are asymptomatic. 

ఈ పీరియడ్ లోనే స్టెరాయిడ్స్ ఇవ్వాలని ఇప్పుడు కొత్తగా సలహా ఇస్తున్నారు. అంతేకాదు,ఈ పీరియడ్ లో వైరస్ చాలా యాక్టివ్ గా ఉంటుంది కాబట్టి యాంటీ వైరల్ మందులు కూడా ఆరంభించాలని సూచిస్తున్నారు. అంతేకాదు, రక్తాన్ని చిక్కపరచే అవకాశం ఉందికాబట్టి ముందు జాగ్రత్తగా Prophylactic LMWH (హెపారిన్) కూడా సూచిస్తున్నారు. అనగా లక్షణాలు మొదలై పాజిటివ్ రిపోర్ట్ రాగానే ఈ మూడు మందులు బిగిన్ చేయాలి. 

కోవిడ్  లక్షణాలు మొదలవ్వగానే టెస్ట్ చేయించుకొని ,రిపోర్ట్ రాకమునుపే ఈ క్రింది మందులు మొదలుపెట్టాలి. 
Doxy100mg Bd,paracetamol, deflazocort30mg bds,ivermectin 12mg bds,zinc.

యాంటీ వైరల్స్ ఏవి సెలెక్ట్ చేసుకోవాలి?
60 ఏళ్లకంటే ఎక్కువవయస్సు, కో మార్బిడ్ కండిషన్ లు ఉన్నవాళ్ళకి హాస్పిటల్ లో అడ్మిట్ చేసి REMDESVIR ఇస్తే మంచిది. 
మిగతా వారికీ -FAVIVIR -సరిపోతుంది. 


కోవిద్ లక్షణాలున్నవారికి  చేయించవలసిన టెస్ట్ లు - 
CBP,D-DIMER,CRP,LFT,RFT,IL-6, XRAY,CT SCAN . 

బయో మార్కర్స్ ను బట్టి వ్యాధి విస్తృతి ని మరియు వ్యాధి తీరును అంచనా వేయవచ్చు . 


కోవిద్ ఎవరిలోసీరియస్ కాంప్లికేషన్స్ కలిగిస్తుందో ముందుగానే  చెప్పగలమా?
చెప్పగలం. న్యూట్రోఫిల్ అనే తెల్ల రక్తకణం విపరీతమైన చురుకుదనంతో  resistin, lipocalin-2, HGF, IL-8, and G-CSF అనే ప్రోటీన్ అణువులను రక్తంలో విడుదల చేస్తుంది . 
 a prominent signature of neutrophil activation, including resistin, lipocalin-2, HGF, IL-8, and G-CSF, as the strongest predictors of critical illness. Neutrophil activation was present on the first day of hospitalisation in patients who would only later require transfer to the intensive care unit,

ఆహరం: 
బలమైన ఆహరం- పండ్లు ,డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి.  బ్రీ థింగ్ ఎక్సర్ సైజులు,యోగా ,ధ్యానం కూడా చేస్తే చాలా మంచిది. భయం,ఆందోళన మన ఇమ్యూనిటీని దెబ్బతీస్తాయి. కాబట్టి దైవ ప్రార్ధన, మంచి పుస్తకాలను పటించడం  అలవాటు చేసుకోవాలి. 

చాలామంది లో ఈ దశ లోనే పూర్తిగా నయ మవుతుంది .  మూడవదశలోకి సామాన్యంగా వెళ్ళరు . 

కొంతమందిలో లక్షణాలున్నా టెస్ట్ లో నెగిటివ్ వస్తుంది. అప్పుడు డిజిటల్  Xరే ,బ్లడ్ టెస్ట్,సి టి స్కాన్ చేయించి వ్యాధిని గుర్తించాలి. 

ఎక్కువ శాతం ప్రజలకు లక్షణాలు ఉండటం లేదు. ఆగస్టు లో చేసిన సీరో సర్వే ప్రకారం 99% మందికి వైరస్ సోకినా వారి ఇమ్యూనిటీ బలం గా చక్కగా పనిచేయడం వలన అస్సలేమీ లక్షణాలు ఉండటం లేదని తేలింది. వాస్తవానికి ఈ 99% మందీ వైరస్ ను అస్సలు లెక్క చేయలేదని అర్ధం. వారికి ఏమాత్రం నొప్పి  తెలియకుండానే వారిలో కరోనాకి వ్యతిరేకంగా  యాంటీ బాడీలు తయారై ఉన్నాయి. 
కానీ కొందరిలో ఇమ్యూనిటీ తక్కువ లేదా సరైన పద్ధతిలో పనిచేయకపోవడం వలన లక్షణాలు బయటపడతాయి. 
కొందరి లో ఇమ్యూనిటీ  బోర్డర్ లైన్ లో పనిచేస్తూ ఉండటం చేత అత్యల్ప లక్షణాలు ఉండీ లేనట్లుగా ఉంటాయి.  వారికి ఎలాంటి జాగ్రత్తలు చెప్పాలి?
నిజానికి అస్సలేమీ లక్షణాలు లేకుండా ఉండదు. కొద్దిపాటి లక్షణాలు ఏవో కొన్ని చాలా  కొద్దీ స్థాయిలో ఉండవచ్చు. 

కొంచెం నలతగా ఉన్నా, నీరసంగా ఉన్నా రోజూ 2 సార్లు పల్స్ ఆక్సీ మీటర్ తో ఆక్సిజన్ శాతం చెక్ చేసుకోవాలి. కనీసం 6 నిముషాలు నడిచి మళ్ళీ రీ చెక్ చేసుకొని, విశ్రాంతి దశలోని రీడింగ్ కి , నడిచినతర్వాత PaO2 రీడింగ్ కి 4 శాతం తేడా ఉన్నా కూడా వెంటనే అలర్ట్ అవ్వాలి. 
 ఎందుకంటే  రోగికి తెలియ కుండానే అనగా ఎలాంటి విపరీత లక్షణాలు లేకుండానే  అవయవాలకు  ఆక్సిజన్ కొరత (Happy Hypoxemia) ఏర్పడుతుంది. 

3. 3వ దశ - ఎర్లీ పల్మనరీ ఫేజ్‌: మూడు రోజుల పాటు కొనసాగే ఈ దశ ప్రమాదకరం. లక్షణాలు కనిపించిన ఏడవ రోజు నుంచి రక్తంలో ఆక్సిజన్‌ పరిమాణం తగ్గడం మొదలవుతుంది. పల్స్‌ ఆక్సీమీటరుతో ఈ స్థితిని పరీక్షించుకోవాలి. ఈ దశను తప్పించుకోవాలంటే రెండవ దశలోనే చికిత్స ప్రారంభించాలి. పల్స్‌ ఆక్సీమీటరులో రీడింగ్‌ 94ు - 86ు కంటే తగ్గితే అలర్ట్‌ కావాలి. లేదంటే లేట్‌ పల్మనరీ ఫేజ్‌కు చేరుకుంటారు.

4. 4వ దశ- లేట్‌ పల్మనరీ ఫేజ్‌:(10వ రోజు నుండి మొదలు) ఈ దశలో ఆయాసం ఉంటుంది. ఊపిరి ఆడని స్థితి ఉంటుంది. ఈ దశలో చికిత్స క్లిష్టమైనా కోలుకునే అవకాశాలు లేకపోలేదు. ఎక్కువ శాతం బాధితులు ఈ దశకు చేరుకున్న తర్వాతే ఆస్పత్రికి చేరుకుంటున్నారు. దాంతో చికిత్స కొంత క్లిష్టమవుతోంది.

 ఈ పాండెమిక్ సమయం లో ప్రతి పౌరుడు తమ మొబైల్ ఫోన్ లలో డౌన్ లోడ్ చేసుకోవలసిన యాప్ లు- 
arogya setu
covid-19 AP.
ఎందుకంటే ఎలాంటి భయం,సందేహం కలిగినా ఈ పై యాప్ ల ద్వారా హెల్ప్ లైన్  లేదా   మీ లోకల్ వాలంటీర్ & ANM లను సంప్రదించి - కోవిడ్ టెస్ట్ ,చికిత్స,సలహా ,హాస్పిటల్ జాయినింగ్,అంబులెన్స్- ఇలా  పలురకాల సహాయం పొందవచ్చు. 

కోవిద్ టెస్ట్ లు, చికిత్స అన్నీ ఉచితమే!ఒక్క పైసా కూడా చెల్లించనక్కర లేదు. కానీ కొంతమంది అపోహలతో,లేనిపోని భయాలతో ప్రవేట్ లాబ్ ల్లోనో  ,తమ ఇంటివద్దో  శ్వాబ్ కలెక్ట్ చేయించుకొని  3000 నుండి 5000/ ఖర్చుపెడుతున్నారు. 

అలాగే ప్రవేట్ హాస్పిటల్స్ లో శుభ్రత, జవాబుదారీ బాగుంటుందనే ఉద్దేశ్యం తో అక్కడ  చేరి రోజుకి 40000 నుండి లక్షవరకు చెల్లిస్తున్నారు.  ఇది వారిష్టం . కానీ పాండెమిక్ లో  ప్రభుత్వ హాస్పిటల్స్ లోనే ఖచ్చితమైన ప్రొటొకాల్స్ అమలు అవుతాయనే నిజాన్ని గుర్తు పెట్టుకోవాలి. 

వ్యాధి ఉన్న వారితో కలిసి ఉన్నవారు -స్నేహితులు,కుటుంబసభ్యులు - ఏవైనా కోవిద్ లక్షణాలున్నప్పుడే తప్పనిసరిగా కోవిద్ టెస్ట్ చేయించుకోవాలి.  లక్షణాలు లేకపోతె తమ ఇళ్లలోనే ఒక 10 రోజులపాటు  సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండాలి. 

కోవిడ్  అనేది మన సమాజం లో ఒక సాంఘిక మైన తిరస్కరణ గా,శాపం గా  భావిస్తున్నారు. ఆ అభిప్రాయాన్ని మనస్సులో నుండి తుడిచేయాలి. 
కోవిద్ వైరస్ శవం లో కేవలం 6గంటలు మాత్రమే యాక్టివ్ గా ఉంటుంది. కాబట్టి భయం తో  అంతిమ సంస్కారాలను వెలి వేయకూడదు.
ఒక సారి కోవిద్ వచ్చి తగ్గిపోయిన వారి కి మళ్ళీ కోవిద్ వస్తుందని ఇంతవరకు ఎవ్వరూ నిరూపణ చేయలేదు. 

ప్రభుత్వాల ఘోర తప్పిదాలు :
వలస కార్మికులను మార్చి నెలలోనే వారి స్వ స్థలాలకు వెళ్ళ నిచ్చి నట్లయితే మహమ్మారి ఇంత ఎక్కువగా వ్యాపించేదికాదు. అలాగే మద్యం షాపుల దగ్గర నియంత్రణ లేకపోవడం,మధ్య షాపులను తెరవడం  పెద్ద శాపంగా మారింది. ఈ రెండువిషయాలలో ప్రభుత్వాలు  వైఫల్యం చెందాయి. 
ప్రభుత్వాల గొప్ప పనితీరు :
కేవలం 150 రోజులలో 1500 వైరల్  లాబ్ లను ఏర్పాటుచేసి రోజుకి   ఒక మిలియన్ కోవిద్ పరీక్షలు చేయడం , కేవలం 100 రోజుల్లో రక్షణ దుస్తుల తయారీలో స్వయం సమృద్ధి సాధించడం, కేవలం 120 రోజుల్లో రైల్వే కోచ్ లను లక్ష ఐసోలేషన్ బెడ్స్ గా నవీకరించడం, దేశవ్యాప్తం గా మెడికల్ ఆక్సిజన్ నిల్వలను ,బెడ్స్ ,ఇతర మెడికల్ డివైస్ లను ప్రొక్యూర్ చేసుకోవడం, ఢిల్లీలో కేవలం 10 రోజుల్లో 10000 బెడ్స్ తో హాస్పిటల్ నిర్మించడం తదితర విషయాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాగా పనిచేశాయి. 

కేస్ ఫాటాలిటీ రేట్ ప్రపంచం లో అన్నిదేశాల కంటే మన దేశం లోనే తక్కువగా (< 2%) ఉండటానికి కారణం వైద్యుల నైపుణ్యం, కోవిద్ వారియర్స్ అంకిత భావం , దేశ నాయకత్వ విజయమే!

కోవిద్ వచ్చి తగ్గిపోయిన వారి లో సుమారు 70% మందిలో  అమృతం వంటి యాంటీ బాడీలుంటాయి. అలాంటి యాంటీ బాడీలున్న అమృతం వంటి  ప్లాస్మా ను అవసరమైన వారికీ ఇస్తే త్వరగా కోలుకొంటారు.  కేవలం 300ml Plasma ని దానం చేసి ఈ పాండెమిక్ లో ఒక హీరోగా నిలబడండి. Plasma  ను ఎంత త్వరగా ఇస్తే అంతగా పనిచేస్తుంది. టైమింగ్ చాలా ముఖ్యం.
హై  రిస్క్ ఉన్నవారికి మొదటి వారం లోనే Plasma  ఇస్తే బాగా పనిచేస్తుంది. 

ప్రభుత్వ కోవిద్ హాస్పిటల్స్ లో బెడ్స్ కొరత లేదు. 
కానీ కొన్ని జిల్లాలలో ఎక్కడైతే కేసులుబాగా పెరిగాయో ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలలో బెడ్స్ కొరత ఉంది. 
మన రాష్ట్ర  ప్రభుత్వము  25000 ఆక్సిజన్ బెడ్స్ ను AP లోని  జిల్లాలంతటా సుమారు 400 హాస్పిటల్స్ లో సిద్ధం చేసింది .  కాబట్టి బెడ్ దొరకదనే  భయం తో ప్రవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ కి వెళ్లి భరించలేని ఫీజుల బారి న పడవద్దు. 

రియల్ టైం లో ఏ హాస్పిటల్ లో ఎన్ని బెడ్స్ ఖాళీ గా ఉన్నాయో ప్రభుత్వ డాష్ బోర్డు లో చూడవచ్చు. (dashboard.covid19.ap.gov.in). 

ఈ పాండెమిక్ పై చేస్తున్న పోరాటంలో తమ ప్రాణాలను ఫణం గా పెట్టి  సేవలందిస్తున్న ప్రభుత్వ మరియు మెడికల్ కాలేజీ  వైద్య సిబ్బంది,పోలీస్ మరియు శానిటేషన్ సిబ్బంది ,రెవెన్యూ ఉద్యోగులు ,IMA సభ్యులైన ప్రవేట్ డాక్టర్స్ కి శత సహస్ర వందనాలు . 
ఈ పోరాటం లో అసువులు బాసిన కోవిడ్ అమర వీరులు  -ముఖ్యంగా వైద్యులు,నర్సులు,పోలీసులు ,శానిటరీ వర్కర్స్ కు వినమ్ర శ్రద్ధాంజలి.  

అలాగే ప్రాణాలను నిలబెట్టే వెంటిలేటర్స్, ఆక్సిజన్  ఫ్లో మీటర్లు , డయాగ్నోస్టిక్ కిట్ లు ,మాస్క్ లు, రక్షణ దుస్తులు, శానిటేషన్ యంత్రాలు, తదితర పరికరాలను  అతి చౌకలో తయారు చేసి మన దేశ సత్తా చాటిన ఎన్నో వి శ్వవిద్యాలయాలు ముఖ్యంగా,DRDO& IIT శాస్త్ర వేత్తలకు హృదయపూర్వక నమస్కారాలు. 

"మాస్క్ & 6అడుగుల దూరం " అనేవి అనుక్షణం గుర్తుపెట్టుకొని అమలుచేయాలి. 
ఇవేవీ లెక్క చేయకపోవడం వల్లనే , ఆగస్టు నాటికి 30 లక్షల కేసులను గుర్తించాము . నిజానికి దీనికి 30 రెట్లు మందిని  వైరస్ ఎటాక్ చేసిందని ఎపిడెమాలజిస్ట్ ల అంచనా.  అనగా వారి అంచనా ప్రకారం, సుమారు 10కోట్ల భారతీయుల ను వైరస్ ఎటాక్ చేసింది. 

దేశ వ్యాప్తంగా పరిశిలిస్తే,ఏప్రిల్ నెలలో 100 టెస్ట్ లు చేస్తే 4 పాజిటివ్ వచ్చేవి. అలాంటిది, ఆగస్టు చివరినాటికి అనగా 150 రోజులయుద్ధం తర్వాత కూడా  100 టెస్ట్ లు చేస్తుంటే 8 పాజిటివ్ వస్తున్నాయి.అంటే, మనం తీసు కోవలసిన  జాగ్రత్తలు  తీసుకోవడం లేదు. కనీసం కాటన్ లేదా పట్టు బట్టతో మూడు నుండి 6 పొరలతో చేసిన మాస్క్  ఇచ్చే రక్షణ మరేదీ ఇవ్వలేదు. మన జనం కనీసం మాస్క్ ను కూడా ధరించడం లేదు . అందుకే ఇప్పటివరకు వైరస్ దే పైచేయిగా ఉంది.

ఆగస్టు 31 కి స్కోర్ ఇలా ఉంది. 
4 కోట్ల పరీక్షలు 36 లక్షల పాజిటివ్ కేసులు 64000 మరణాలు,కేస్ ఫాటలిటీ రేట్ 1.8. 
మన దేశం లో కేస్ ఫాటలిటీ రేట్ జూన్ లో 3% , జులై లో 1. 7% , ఆగస్టు లో 1.4% ఇలా క్రమేణా తగ్గుముఖం పడటానికి  కారణం మెరుగైన చికిత్సలు, ఆక్సిజన్ సరఫరా.  

కనబడుతున్న కోవిద్ యుద్ధం చేసే గాయాలు ఎంతతీవ్రంగా ఉంటాయో ఊహించలేం.  ఎందుకంటే మన సర్వ శక్తులూ కోవిద్ పై యుద్ధానికే ఖర్చుపెట్టేయడం వలన నాన్ కోవిద్ వ్యాధుల ను పట్టించుకొనే హాస్పిటల్ కరువైపోవడం చేత నాన్ కోవిద్ మరణాల శతం కూడా పెరుగుతుంది. అంతేకాదు దేశ ఆర్ధిక వ్యవస్థ చిన్నా భిన్నం అయింది. తల కి(per capita) 50000 రూపాయల నష్టం కనబడుతుంది. 2 కోట్ల ఉద్యోగాలుపోయాయి. రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకు పోయాయి. 


వాక్సిన్ అనేది తప్పకుండా  వస్తుంది. బహుశా మనదేశం లో  డిశంబర్ లో మార్కెట్ లోకి వస్తుంది. 
యాక్టివ్ ఇమ్యూనిటీని ప్రేరేపించే వాక్సిన్ లు, పాసివ్ ఇమ్యూనిటీ తో రక్షణ నిచ్చే ఇమ్యునోగ్లోబ్యులిన్ లేదా మోనోక్లోనల్ యాంటీ బాడీలను కూడా తయారు చేస్తున్నారు. 

అందరూ ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి. ప్రజలు తమ రోగ నిరోధక శక్తిని తగ్గించే చెడు అలవాట్లనుండి దూరమైనప్పుడే వైరస్ ల పై చేసే పోరాటం విజయవంతం అవుతుంది. 

 సీరో సర్వే   ప్రకారం ఆగస్టు లోనే మన దేశ జనాభాలో 25% మందికి కోవిద్ వైరస్ వచ్చి వెల్లింది. 

డిశంబర్ నాటికి ఇది 50% గా ఉండవచ్చు. అనగా హెర్డ్ ఇమ్యూనిటీ అనేది అప్పటికి వచ్చేసే అవకాశం ఉంది.  
అంటే వైరస్ దానంతట అదే కనుమరుగు అవ్వవచ్చు!
                                                       సర్వే జనా సుఖినో భవంతు 

Comments