Skip to main content

Why everyone may be wrong about corona?

కరోనా వైరస్ అనేది సరికొత్త జంతు సంబంధ వైరస్ అనే ప్రచారం నిజమేనా?
కరోనా వైరస్ అనేది కొత్తది కాబట్టి దానికి వ్యతిరేకంగా పనిచేసే రోగ నిరోధ వ్యవస్థ (immunity) ఎవ్వరికీ లేదనే మాట వాస్తవమేనా?
లక్షణాలు ఏవీ లేకుండానే కరోనా వ్యాధి ఉంటుందా? సైలంట్ గా  వ్యాధిని వ్యాప్తి చేసే అవకాశం ఉందా? ఇది నిజమేనా?
పరిశీలించి చూద్దాం. 
 1. Is it a  new virus? ఇది కొత్తగా పుట్టుకొచ్చిన వైరసా?
సార్స్ -1 మరియు ఏటా పడిశం కలిగించే  ఇతర బీటా కరోనా వైరస్లకు , కరోనా వైరస్ 2 కి దగ్గర పోలికలున్నాయి.  పాత కరోనా వైరస్లలో ఉత్పరివర్తన(mutation) వలన కరోనా వైరస్ 2 ఉత్పన్నమై ఉండవచ్చు. కాబట్టి కరోనా వైరస్ 2  మరీ కొత్తదేమీ కాదు. 
2.  ఎలాంటి శాస్త్రీయ మైన పరీక్షలు చేయకుండా, కరోనా 2 ని ఎదుర్కొనే రోగ నిరోధ శక్తి ప్రజలలో లేనే లేదని  ప్రచారం చేశారు. కానీ ఇలా ఎలా చెప్పగలరు?  వాస్తవానికి నేటికీ యాంటీ బాడీ టెస్ట్ ల ద్వారా సరైన సమాచారాన్ని పొందలేకపోతున్నాం. ఎప్పటి నుండి ఇమ్యూనిటీ ఉందో ? వైరస్ లోని ఏ భాగానికి  వ్యతిరేకంగా ఇమ్యూనిటీ ఉందో ?అనే సమాచారం రాబట్టలేక పోతున్నాం . 

ఆంటీ బాడీ టెస్ట్ చేస్తున్న కిట్ లోని ఆంటీజన్ ఎక్కడనుండి తెచ్చారు ? సార్స్ 1  జన్యు పదార్ధాన్ని ఉపయోగించి తయారు చేసిందేగదా అది?
ఇంకో ముఖ్య విషయం, చైనాలో ఎక్కడైతే సార్స్ 1 వ్యాధి ప్రబలంగా ఉండిందో అక్కడ కోవిడ్  వ్యాపించలేదు. దీనిని బట్టి మనకేమి అర్ధం అవుతుంది. మన రోగ నిరోధక వ్యవస్థ, Sars-1 and Sars-Cov-2  ని ఒకే రకంగా చూస్తుంది . అంటే Sars-1 కి వ్యతిరేకం గా ఉన్న ఇమ్యూనిటీ, పాక్షికంగా నైనా Sars-Cov-2  కి కూడా వ్యతిరేకంగా పనిచేస్తుంది. 
3. 80 శాతం వ్యక్తులలో రోగ  లక్షణాలు లేకపోవడం నిజమేనా? వీరు సైలంట్ గా వ్యాధిని అందరికీ అంటించేస్తారా?ఇది జోకా? నిజమా?దీనిని నమ్మేసి లాక్ డౌన్ చేయడం వలన ఏమైనా ప్రయోజనం ఉందా?

ఒక సారి మనదేహం వైరస్ ల ను ఎలా ఎదుర్కొంటుందో చూద్దాం: 
వైరస్ శరీరంలోనికి ప్రవేశించగానే యాంటీ బాడీ లు ఎటాక్ చేసి మానవ కణాలకు, వైరస్ లు  ఎటాచ్ కాకుండా నిరోధిస్తాయి. కానీ కొన్ని వైరస్ కణాలు మానవకణాల కు ఎటాచ్ అయ్యి , లో నికి చొర బడతాయి. వీటిని ఎదుర్కోవడానికి టి కణాలు( T Lymphocytes)  బయల్దేరి ఎక్కడెక్కడ వైరస్ దాగుందో కనిపెట్టి ,ఆయా మానవ కణాలను వైరస్ తో సహా తుద ముట్టిస్తాయి. ఇదే కొందరిలో  పెద్ద ఉపద్రవం గా మారుతుంది. 

పోషకాహార లోపాలు, ఇతరత్రా వ్యాధులు, వయస్సు , ఇమ్యూనిటీ వ్యవస్థ పనితీరును తీవ్రంగా ప్రభావితం చేసి కుంటు ప రు స్థాయి. అప్పుడు  రక్షణ వ్యవస్థ మొత్తం కేవలం టి కణాలపైనే పూర్తిగా ఆధారపడటం చేత   మానవకణాల పై విపరీతమైన దాడి జరుగుతుంది. దీనినే సైటో కైన్ తుఫాన్ అంటున్నాం. ఇదే చిన్న పిల్లల లో జరిగితే  కావసాకి సిండ్రోమ్ అంటారు. 

4. పాలి మరైజ్ చైన్ రియాక్షన్ పరీక్ష (PCR test) : 
ఇది సంపూర్ణ సమాచారాన్ని ఇచ్చే పరీక్షే నా? దీనికి పరిమితులనేవి లేవా?
చూద్దాం.. 
 ఆక్టివ్ వైరస్ ని  మాత్రమేకాదు  నిర్వీర్యమైపోయిన వైరల్ జన్యుపదార్ధం కూడా PCR పరీక్ష లో పాజిటివ్ రిజల్ట్ నే చూపిస్తుంది . 
            వైరల్  జన్యు పదార్ధాన్ని పదింతలు చేసి పరీక్ష చేసే PCR టెస్ట్ ద్వారా వైరల్ జన్యు పదార్ధాన్ని కనిపెట్టవచ్చు తప్ప, అది యాక్టివ్ జన్యుపదార్ధమా? అది రోగాన్ని కలిగిస్తుందా?లేదా? అనేది చెప్పలేము. 
ఈ పరీక్ష 70 శాతం  సున్నితమైనదే( SENSITIVITY)  తప్ప సంపూర్ణ సమాచారాన్ని ఇచ్చేది కాదు.   

5. Sars-Cov-2  కి వ్యతిరేకంగా  మనలో ఇమ్యూనిటీ ఇప్పటికే ఉందా?
  Sars-Cov-2  కి వ్యతిరేకంగా మన దేహాలలో బేసిక్ రక్షణ అనేది ఉండి ఉండవచ్చు. ఎందుకంటే, ఇంత సుదీర్ఘమైన incubation time (2 to 14 days and  22 to 27 days in some cases),
ఎక్కువశాతం రోగులు వారం తర్వాత వ్యాధిని వ్యాప్తి చేయ లేని స్థితికి(due to quick immunity) వచ్చేయడం , చూస్తుంటే  మన దేహాలలో Sars-Cov-2  కి వ్యతిరేకంగా బేసిక్ రక్షణ వ్యవస్థ అనేది ఉండి ఉండవచ్చు. 

 6. ప్రస్తుత  గ్లోబల్ కోవిడ్ మరణాల డేటా ను పరిశీలిస్తే - <65 span="">  వయస్సు ఉన్నవారిలో మరణాలు కేవలం 0.6 నుండి 2.6%మాత్రమే.

పైవిషయాలను బేరీజు వేసుకొని  మన ప్రభుత్వాలు ఏమి చేయాలి?

 >65 కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి రక్షణ కలిగించి,  జీవన వ్యవస్థకు విఘాతం కలిగించే లాక్ డౌన్ లను మానేయాలి. 
లక్షణాలేవీ  లే కుండా  సైలంట్ గా  వ్యాధి వ్యాపిస్తుంది అనే అబద్ధాలను అపోహలు , భయాలు తొలగించాలి. 
 ప్రజల ఇమ్యూనిటీ పెంచే దిశలో రీసెర్చ్ జరిగితే,ఈ వైరస్ మాత్రమేకాదు రాబోయే వైరస్ లనుండి కూడా రక్షణ పొందవచ్చు. 
ఈ కోవిద్ వైరస్ మరీ కొత్తదేమీ కాదు. ఇది మిగతా కరోనా వైరస్ ల మాదిరిగా సీజనల్ గా వచ్చి పోవచ్చు. 
పోలీ సు, రెవిన్యూ వారు కేవలం ట్రేసింగ్  మరియు కంటైన్ మెంట్  బాధ్యతలను మాత్రమే నిర్వర్తించాలి. 

ఎవరిని టెస్ట్ చేయాలి?ఎవరిని హోమ్ ఐసోలేషన్ చేయాలి? ఎవరిని క్వారంటైన్ చేయాలి? అనే బాధ్యత ను కేవలం డాక్టర్స్ ముఖ్యం గా ఎపిడెమాలజిస్ట్ లు, ప్రివెంటివ్ మెడిసిన్  వారే నిర్వర్తించాలి. ఎపిడెమాలజిస్ట్ ల కొరత ఉంటె జనరల్ ఫిజీషియన్ ల నాయకత్వం లో  పనులు  నిర్వర్తించాలి. 

డెడ్ బాడీ లో 6 గంటల తర్వాత యాక్టివ్ వైరస్ ఉండదు . శానిటైజ్ చేసి బంధువులకు అప్పగించి  ఆచారాలకు తగినట్లు అంత్యక్రియలు జరిగే ఏర్పాటు  కు ప్రభుత్వం సహకరించాలి.  దీనికి తగినట్లు ప్రజలలో అపోహలను తగ్గించే ప్రచారాన్ని ప్రభుత్వం చేపట్టాలి. 

కేసుల సంఖ్య తగ్గుతున్న ప్రాంతాల నుంచి వైద్య సదుపాయాలను – డాక్టర్లు, ఆరోగ్య సిబ్బంది, పరికరాలు, మందులు, వెంటిలేటర్లను – కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న ప్రాంతాలకు వేగంగా తరలించాల్సిన అవసరం ఉంటుంది.

సైన్యానికి చెందిన వైద్య సర్వీసుల వంటి మొబైల్ వనరులను సంసిద్ధంగా ఉంచటం చాలా ఉపయోగపడుతుంది . 

అన్నింటికంటే దారుణం  అసంఘటిత రంగ కార్మికుల గురించి ఏమాత్రం అవగాహన లేకుండా కేంద్రం హఠాత్తుగా విధించిన లాకౌట్. 
భారతదేశంలో అకస్మాత్తుగా లాక్‌డౌన్ విధించటంతో అర్థంతరంగా ఉపాధి కోల్పోయి, డబ్బు లేక నగరాల నుంచి వలసబాట పట్టిన కోట్లాది మంది అసంఘటిత రంగ కార్మికుల ద్వారా ఈ వైరస్ వ్యాపించింది. ఉదాహరణకు ఒడిషాలో,ఆంధ్రాలో,కేరళ,తమిళ్ నాడు లలో  నమోదైన కేసుల్లో 80 శాతం మంది ఇలా వచ్చిన వలస కార్మికులే ఉన్నారు.

మార్చి 25న - లాక్‌డౌన్ విధించటం తెలివైన పనే ! కానీ అది కేవలం నాలుగు గంటల ముందు మాత్రమే ప్రకటించారు. అసంఘటిత రంగ కార్మికులు నగరాల నుంచి వలస పోవటం మొదలుపెట్టటంతో అది ఎంత విఫలమైందో వెల్లడైంది.

లాక్‌డౌన్ కన్నా ముందు, రోజుకు కేవలం 1,000 గా ఉన్న పరీక్షల సంఖ్య ఇప్పుడు దరిదాపు 3 లక్షలకు పెరిగింది. కానీ.. ప్రపంచవ్యాప్తంగా ఈ పరీక్షల తలసరి రేటును పోలిస్తే భారత్‌లో ఇంకా అత్యంత తక్కువగానే ఉంది.
దేశంలో మొదటి కేసు జనవరి 30వ తేదీన నమోదైనందున.. కేసులను మరింత ముందుగానే పెంచి ఉండవచ్చునని చాలా మంది నిపుణులు భావిస్తున్నారు.
‘‘మనకు వనరులు ఉన్నాయి. సామర్థ్యం ఉంది. కానీ ముందస్తు ప్రణాళిక లేదు. పైగా లాక్‌డౌన్ వల్ల లభించిన తొలి ప్రయోజనాలకు మురిసిపోతూ కూర్చున్నాం’’. 
కేసుల సంఖ్య, ఆస్పత్రుల్లో చేరికలు, మరణాల సంఖ్య అమాంతం పెరిగిపోయిన దేశ రాజధాని దిల్లీ ఇటువంటి అలసత్వానికి, విఫల ప్రణాళికలకు ఒక ఉదాహరణ.
రాబోయే వారాల్లో కేసుల సునామీ వెల్లువెత్తుతుందనే ఆందోళనతో.. ప్రైవేటు ఆసుపత్రులు మరిన్ని పడకలను కోవిడ్-19 రోగులకు కేటాయించాలని స్థానిక ప్రభుత్వం ఆదేశించింది. పెళ్లి మండపాలు, స్టేడియంలు, హోటళ్లలోనూ ఐసోలేషన్ పడకలు ఏర్పాటు చేస్తోంది. 5000 రైల్వే కోచ్ లను లక్ష ఐసోలేషన్ బెడ్స్ గా మార్చేసింది.  
‘‘ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి. మనం ఇంకా మహమ్మారి ఆరంభ దశలోనే ఉన్నాం. మలుపు తిరగటానికి ఇంకా ఏడాది, అంతకన్నా ఎక్కువ సమయం ఉంది. ప్రశ్న ఏమిటంటే.. రాబోయే 12 – 16 నెలల కాలాన్ని ఎదుర్కొని ముందుకు సాగటానికి ఉన్న ప్రణాళిక ఏమిటి?’
గమనిక : ఇందులోని అ భిప్రాయాలు యూరప్ లోని ఇమ్యునాలజిస్ట్ లు,మరికొంతమంది ఎపిడెమాలజిస్ట్ లు, వైరాలజిస్ట్ ల నుండి సేకరించినవే తప్ప, నా సొంత అభిప్రాయాలు కాదు. పాండెమిక్  లో అనవసర భయాందోళనలు , గుంపు మనస్తత్వం ఉంటే వాస్తవాలు వక్రీకరింపబడి వృధాకాలయాపన,ఖర్చు పెరిగిపోతూ ఉంటాయి. దీనివలన దేశ ఆర్ధిక వ్యవస్థ, సాంఘిక న్యాయం , కుటుంబ బంధాలు చిన్నాభిన్నమవుతాయి . 









Comments