Skip to main content

నకిలీ వైద్యులు - "ఆంటీబయాటిక్ నిరోధకత"- ఒక పరిష్కారం

మన రాష్ట్ర ప్రజానీకానికేకాదు 130కోట్ల భారతీయులకు  మహాప్రమాదం పొంచివుంది. ఆ మహమ్మారి మరేదో కాదు. మనందరికీ బాగాతెలిసిన దే ! దానిపేరు ,"ఆంటీబయాటిక్ నిరోధకత". ఇది సూక్ష్మజీవులవల్ల,వైరస్ వల్ల , జీవనశైలి ద్వారా వచ్చేది కాదు. ఇది కేవలం మన ప్రభుత్వాల అలసత, నిర్లక్ష్యం వలన, మన అమాయక ప్రజల అవగాహనాలోపం వలన , వాటిల్లుతున్న మహమ్మారి.
ఇదేమిటి ,వీరేం తప్పుచేశారు.
చెబుతా! 
వేలాది మంది అర్హత ఉన్న వైద్యులు అందుబాటులో ఉన్నా, నకిలీ వైద్యులు అనగా వైద్యార్హతలేని వ్యక్తుల చేత వైద్యం చేయించుకోవడం వలన , నకిలీ వైద్యులను శిక్షించి అదుపు చేయవలసిన ప్రభుత్వాలు మిన్నకుండిపోవడం వలన అడ్డు అదుపూ లేకుండా నకిలీ వైద్యులు పేట్రేగిపోతూ ప్రజారోగ్యాన్ని సర్వనాశనం చేస్తున్నారు.
తెలిసీ తెలియని వైద్యం తో స్టెరాయిడ్స్ ,ఆంటీ బయాటిక్స్ ఎడా పెడా వాడేయడం వలన ,ఆంటీబయాటిక్ నిరోధకత" పెరిగి, ,జబ్బులు ముదిరిపోవడం, ప్రభుత్వం చేస్తున్న అనేక పబ్లిక్ హెల్త్ ప్రోగ్రామ్స్ విఫలమవ్వడం మనం చూస్తున్నాం.
వైద్య అర్హతలేని (నకిలీ వైద్యులు) వ్యక్తులు గ్రామాలలో,పట్టణాలలోనేకాదు నగరాలలో కూడా లక్షలమంది వైద్యం చేసేస్తున్నారు.  వీళ్ళు సింపుల్ జ్వరాలకు, రొంప కు కూడా మార్కెట్ లోకి కొత్త గా వచ్చే  పవర్ ఫుల్ ఆంటీబయాటిక్ మందుల ను వాడేస్తున్నారు. వైరస్ వలన వచ్చిందా? బాక్తీరియా వలన వచ్చిన ఇన్ఫెక్షనా ? అనేది వారికి అవగాహన ఉండదు. అలాగే ప్రతి జబ్బుకి స్టెరాయిడ్స్ వాడేస్తున్నారు.
In AP and TS, many unqualified practitioners a) prescribe broad spectrum oral antibiotic like ciprofloxacin, ofloxacin, cefixime etc instead of 1st line antibiotics like TMP SMZ, amoxycillin,erythromycin for the simple illnesses like common cold, throat infections, boils etc b) they prescribe for 1 day instead of accepted 3 to 5 days. c) some prescribe broad spectrum inj ceftriaxone, inj ceftriaxone sulbactum or piperacillin tazobactum for few days instead of amoxycillin clavulanate, Ampicillin etc as 1st line on the 1st day of fever.
It is common in every small town to have few centres run by unqualified practitioners where many patients get steroids like Inj Dexamethasone or betamethasone, (40 times more potent than Inj Hydrocortisone) for all ailments. Many patients take one tab. Betnesol (potent steroid) 0.5 mg and one tab Deriphylline for Asthma and COPD exacerbations. Some patients keep taking Tab dexa or Tab Betnesol 0.5 mg for years before reaching qualified drs. Steroid use decreases immune power and causes reactivation of LATENT TB. Govt of india is spending thousands of crores per year to control and eradicate TB.

ఆంటీబయాటిక్ నిరోధకత" అంటే ఏమిటి? దానివలన కలిగే నష్టాలేమిటి?
ఒక మందు వ్యాధిని నయం చేస్తుంది . కానీ అదేమందును సరైన మోతాదు లో వాడకుంటే అది విఫలమవుతుంది. అంతేకాదు అనేక విధాలుగా నష్టం చేస్తుంది .  మందులు,రెండువైపులా పదునున్న కత్తి లాంటివి ! వాటిపై కనీసపరిజ్ఞానం లేనివారిచేతిలో అవి ప్రాణాలను హరించే విషా లవ్వుతాయి.
ఒక మందును సరిగ్గా వాడకపోతే అనగా ఇవ్వవలసిన మోతాదు కంటే తక్కవ లేదా ఎక్కువ,ఇవ్వవలసిన కాలపరిమితి కంటే ఎక్కువ లేదా తక్కువ గా ఇచ్చినపుడు సూక్ష్మజీవులు ఆయా మందులకు  నిరోధాన్ని పెంచుకోవడము చేత, వాటిని అదుపుచేయడం కష్టమైపోతుంది. దీనివలన చిన్న చిన్న జబ్బులు కూడా నయం చేయలేము. అవి త్వరగా ముదిరి పెద్ద జబ్బుగా ప్రాణాంతక జబ్బులుగా పరిణమిస్తాయి. దీనివలన చికిత్సలు విఫలమవ్వడమేకాక, చికిత్సల ఖరీదు కూడా పెరిగిపోతుంది. తద్వారా ప్రజలకు ఆరోగ్యభంగమేకాదు ప్రాణాలు కూడా పోతాయి. దీనివలన సమాజానికి,దేశానికి ఆర్ధిక పరమైన నష్టం అపారంగా సంభవిస్తుంది.
ఉదాహరణకు...
ఒక ఈ కొలై  ఇన్ఫెక్షన్ కు ఒక మామూలు ఆంటీబయాటిక్ ను సరైన విధంగా సరైనమోతాదులో సరైన పరిమితిలో వాడితే అయ్యే ఖర్చు సుమారు రూ. 700/ అవుతుంది. ఈ ఆంటీబయాటిక్ ను సరైన పద్ధతిలో వాడకుండా ఎలాపడితే అలా వాడే నకిలీ వైద్యులవలన ఈ సూక్ష్మ జీవులు ఆయా ఆంటీబయాటిక్స్ లకు నయం కావు.   నిరోధకత ను పెంచుకొన్న సూక్ష్మజీవి ద్వారా  కలిగే ఇన్ఫెక్షన్ ను అదుపు చేయాలంటే మరోకొత్త పవర్ ఫుల్ ఆంటీబయాటిక్ ను వాడవలసి వస్తుంది. దీనివలన చికిత్స ఖరీదు 5000/- నుండి 15000/- కు పెరిగిపోతుంది.
అంటే, 700/ తో అయ్యే ఖర్చు 15000/ వరకు పెరిగిపోవదానికి కారణం ఎవరు?
నకిలీ వైద్యులు మరియు వీరిని అదుపుచేయలేకపోతున్న ప్రభుత్వాలు కాదా? అని ప్రశ్నిస్తున్నాము!

అంతేకాదు కేవలం సింపుల్  చికిత్సల ద్వారా ద్వారా నయం అయ్యే ఇన్ఫెక్షన్ లు కూడా విషజ్వరాలుగా ,సెప్టిక్ షాక్ లుగా ముదిరిపోవడం వలన రోగులను అత్యవసర చికిత్స యూనిట్ (ICU ) లలో వైద్యం చేయవలసి వస్తుంది. వెంటిలేటర్లు, రక్తమార్పిళ్లు, ఖరీదైన మందులు, మానిటర్ లు , రోగనిర్ధారణకు ఎన్నెన్నో ఖరీదైన పరీక్షలు అవసరమవుతాయి. కాస్త పాటి  ఖర్చుతో ఇంట్లోనే నయమయ్యే వ్యాధులకు కూడా ఇప్పుడు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో వైద్యం చేయవలసిన అగత్యం ఏర్పడింది. దీనికి కారణం ఎవరు?
నకిలీ వైద్యులు మరియు వీరి దగ్గర వైద్యం చేయించుకొంటున్న అమాయకప్రజల అవగాహనా రాహిత్యం మరియు వీరికి నాణ్యమైన ప్రాధమిక వైద్యాన్ని అందించలేకపోతున్న ప్రభుత్వాలు కాదా? అని ప్రశ్నిస్తున్నాము!
మరి నకిలీవైద్యులను అదుపు చేయడం లో  ప్రభుత్వాలు ఎందుకు అలసత్వం గా ఉన్నాయి?
ఈ విషయాలు ప్రభుత్వాలకు తెలియవా?
తెలుసు. బాగాతెలుసు!
WHO 2016 లోనే చెప్పింది. కేంద్రప్రభుత్వం 2017 లో  గుర్తించింది. మన డాక్టర్స్ ఈ ప్రమాదం గురించి  గత 20 ఏళ్ళనుండి చెబుతూనే ఉన్నారు.
“Antibiotic Resistance” has been declared as one of the greatest threats to entire mankind by World Health Organisation in 2016, Indian Govt has accepted it in 2017 and taken few measures to tackle it.
"ఆంటీబయాటిక్ నిరోధకత" వలన లక్షలమంది చని పోతున్నారు. దీనివలన పేదవాళ్ళే కాదు,అన్నివర్గాలు నష్టపోతున్నాయి.  ఈ నిరోధాన్ని కలిగి ఉన్న సూక్ష్మజీవికి   పేదవాళ్ళు,ధనికులు అనే తేడా ఉండదు. ఎవరినైనా బాధిస్తుంది. మేము పరి శుభ్రంగా ఉంటాం,మాకెలాంటి చెడు అలవాట్లు లేవు అనేవారినికూడా ఇబ్బందిపెడతాయి. సూక్ష్మజీవులను ఆలా తయారు చేసిందెవరు?
నకిలీవైద్యులు కాదా? 
Because of Antibiotic Resistance, Probably few hundreds to thousands had died in India
yearly in the last few years which will increase to few lakhs per year in the coming decades (reporting is poor in India). 
Antibiotic Resistance affects EVERYBODY including the people who don’t abuse antibiotics, the super rich, the most powerful, the most cautious, and the poorest people. Antibiotic Resistance increases the severity of illness, duration of illness, resources needed to treat them, cost of medicines used to treat them, number of investigations to diagnose and monitor them, machines needed to monitor, trained staff to handle them, need of specialists and ICU care, Infusion pumps, ventilators. All these increase the cost of treatment which is a huge burden to the poor and middle class. The cost has to be borne by the poor themselves or the govt from taxpayers money or loans taken by govt on behalf of the whole population. 
సరిపడా డాక్టర్లు లేరు. డాక్టర్లు పల్లెలకు పోవడం లేదు. పల్లె ప్రజలకు వైద్యం అందించే వాళ్ళు నకిలీలో,మరెవ్వరో మాకు అనవసరం. ప్రస్తుతానికి ఆ నకిలీ వైద్యుల వలన పనిజరిగిపోతుంది. నకిలీ వైద్యులను  ప్రభుత్వం ప్రోత్సహించడం లేదు గదా? ప్రజలే వాళ్ళను కోరుకొంటున్నారు. ఇందులో ప్రభుత్వాల బాధ్యత ఏముంది?
వీటికి సమాధానం ఇదిగో ... 
సరిపడా డాక్టర్లు లేరు." అని అంటున్నారు.  ఇందులో వాస్తవమెంతో పరిశీలిద్దాం. 
  మన తెలుగు రాష్ట్రాలనే ఉదాహరణగా తీసుకొందాం. రెండు  తెలుగు రాష్ట్రాల జనాభా సుమారు 9కోట్లు.WHO   సూచన ప్రకారం ప్రతి 1000 మందికీ ఒక డాక్టర్ ఉండాలి. డాక్టర్ అంటే మోడ్రన్ వైద్యం గానీ,ఆయుష్ వైద్య ములోగానీ  అర్హత ఉన్నవారు.  మన తెలుగురాష్ట్రాలలో సుమారు లక్షమంది MBBS డాక్టర్స్, మరో 60 వేల ఆయుష్ డాక్టర్స్ ఉన్నారు. దీనికి రుజువుగా మన రాష్ట్రాల మెడికల్ కౌన్సిల్ రిజిష్టర్ ను జత చేస్తున్నాం. అంటే WHO సూచించిన దానికంటే ఎక్కువమంది అర్హత ఉన్న డాక్టర్స్ ఉన్నారు.
(From Table 5.1 of National Health Profile(NHP) 2019, released by CBHI, Govt of India & estimates for year 2019) Until the end of year 2015, doctors from both the states were registered in Andhra Pradesh Medical Council (APMC). After that doctors from Telangana were registered in TSMC.As of end 2019, AP has a population of around 5.2 crores and telangana around 3.5 crores. After dividing the total doctors at the end of 2015 (at 54% to AP and 46% to TS) and adding doctors from beginning of
2016 to the end of 2019 to respective states, we get around 61,680 drs in AP and 51,847 drs in Telangana. At current population, we have one qualified dr per 1,000 population even after deducting 5,000 drs from each state. Each state produces 3,000 to 4,000 MBBS per year. 
So in the next 10 years, together, they will produce 60,000 to 80,000 MBBS drs. So by the start of 2020, AP and TS are Doctor Sufficient states and will continue to be in the future.

కానీ మన నాయకులు  ఏమిచెబుతున్నారు? సరిపడా సంఖ్యలో వైద్యులు లేరు, డాక్టర్స్ పల్లెలకు పోవడం లేదు .. అందుకే మన ప్రజారోగ్యం కుంటుపడింది!అని  అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు.
వాస్తవం ఏమిటి?
డాక్టర్లు పల్లెలకు పోవడం లేదు... అని ప్రభుత్వాలంటున్నాయి. ఇందులో వాస్తవమెంతో పరిశీలిద్దాం. 
1. 3000మంది జనాభాకు  ఒక గవర్నమెంట్ వైద్యుడిని రిక్రూట్ చేసుకోవాలి. కానీ మన తెలుగు రాష్ట్రాలలో 10000 మంది జనానికి ఒక గవర్నమెంట్ డాక్టర్ ను రిక్రూట్ చేసుకొంటున్నారు. కరెక్ట్ గా చెప్పాలంటే ప్రాధమిక వైద్య కేంద్రాలలో కనీసం 3 MBBS డాక్టర్స్ , ఇద్దరు  డెంటిస్ట్ లు  , ఒక ఆయుష్ వైద్యుడిని రిక్రూట్ చేసుకోవాలి.  (Policy of Govt of India is to create 1 PHC for 20,000 to 30,000 population.)
2. టీకాలు,మందుల సరఫరా, తగినంత నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది , మెడికల్ పరికరాలు ,కరెంట్,ఫ్రిజిరేటర్,లాబ్,భవనం, తదితర మౌలిక సదుపాయాలను పటిష్టం చేయకుండా,  3000 మంది జనాభాకు అనగా ప్రతి సబ్ సెంటర్ కు  ఒక డాక్టర్ ను రిక్రూట్ చేయకుండా, నెలవారీ మెయిటైనెన్స్ కు సరిపడా నిధులు బడ్జెట్ లో కేటాయించకుండా అబద్ధాలు  చెప్పడం ప్రభుత్వాలకు బాగా అలవాటైపోయింది. నిజానికి మన రాష్ట్రం లో ఉన్న డాక్టర్స్  లో కేవలం 15 శాతానికి మాత్రమే మన ప్రభుత్వాలు ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. మిగతా 85 శాతం ప్రవేట్ హాస్పిటల్స్ లో  చాలీ చాలని జీతాలకు జాబ్ చేస్తున్నారు.
3. 2000 సంవత్సరం వరకు మన రాష్ట్రం లో వైద్యుల కొరత ఉన్నమాట వాస్తవం. కానీ ఆ తర్వాత ఏటికేడాది వైద్య సీట్లు పెరగడం వలన నేడు అనగా 2019 సంవత్సరానికి డాక్టర్ల కొరత అస్సలు ఏమీ లేదు. సరిపడా డాక్టర్స్ ఉండటమేకాదు నేడు MBBS  డాక్టర్లు సరైన ఉద్యోగాలు లేక ఖాళీగా ఉన్నారు. దీనికి రుజువు కావాలంటే ఈ క్రింది వివరాలు పరిశీలించండి.
In 2019, AP and TS have moved from “Qualified doctor DEFICIENT” states a decade ago
to “SUFFICIENT” states i.e one qualified dr per 1,000 population which is widely accepted as recommendation from World Health Organisation.

"Common rumour is “qualified drs don’t go to small towns” and so govt has no choice but to ignore unqualified practitioners. In AP and TS, It is true in year 2,000 AD but not in year 2019. 
In the year 2017, TS notified 500 PHC Medical officer posts and 5,000 MBBS drs applied. In June 2017, DMHO Kadapa notified 19 posts of PHC Medical officer and 193 MBBS drs applied. In Oct 2018, Govt of AP notified 1,150 PHC medical officer posts and 6,500 MBBS drs applied. Things have changed dramatically but policy makers haven’t noticed because of their tight schedule".
  పబ్లిక్ హెల్త్ కు ఇంత ప్రమాదం జరుగుతుంటే ప్రభుత్వాలు ఎందుకు మిన్నకుండి పోతున్నాయి?చట్టాలు లేకనా?లేక అలసత్వమా? జిల్లాలలో  ప్రతి హాస్పిటల్ ను నమోదు చేసి జిల్లాస్థాయిలో వైద్యసేవలనాణ్యత ను కాపాడే కలెక్టర్, ఆరోగ్యశాఖాధికారి ఏమిచేస్తున్నారు? సమాజం లో ఇంత ఘోరం దశాబ్దాలుగా జరుగుతుంటే సామాజిక కార్యకర్తలుగానీ, న్యాయస్థానాలు గానీ ఏమిచేస్తున్నాయి? ఇండియన్ మెడికల్ అసోసియేషన్, మెడికల్ కౌన్సిల్ ఏమిచేస్తున్నాయి? పోలీస్ యంత్రాంగం ఏమిచేస్తుంది?
అర్హతలేనివాళ్ళు వైద్యం చేస్తే శిక్షించే చట్టాలు ఉన్నాయి. అలాగే ప్రజారోగ్యాన్ని భంగం కలిగించేవారిని శిక్షించే క్రిమినల్ సెక్షన్ లున్నాయి.  వైద్యవిద్యార్హత ఉన్నవారే వైద్య వృత్తి  చేయాలనే చట్టాలున్నాయి.

పేరుకు ముందు, బోర్డులో డాక్టర్ అని పెట్టుకొని, సమాజాన్ని తప్పుదారి పట్టించి  ప్రజలను  మోసం చేసేవాళ్లను చీటింగ్ ,ఫోర్జరీ చేసేవాళ్లను అదుపుచేసే చట్టాలున్నాయి, క్రిమినల్ సెక్షన్ లున్నాయి.
ప్రిస్క్రిప్షన్ లో డాక్టర్ యెక్క రిజిస్ట్రేషన్ నంబరు లేకుండా, మందులు అమ్మే రిటైల్ ఫార్మశీ లను అదుపు చేసే చట్టాలున్నాయి.
చట్టాలున్నాయి,సెక్షన్ లున్నాయి, కానీ మనస్సే లేదు.

For all practical purposes, there is no OFFICE or AGENCY  to file CRIMINAL cases against unqualified practitioners,under IPC section 416, 463 & We can’t file Criminal cases under IMC Act 1956, section 15 or AP/TS Medical practitioners Registration Act 1968 with amended act 2013, section 20 in AP and TS. Is it not a deficiency of the govt?

DMHO as chairman of District Registering Authority investigates complaints against
unregistered clinics and hospitals of qualified doctors under APPMER Act/TSPMER Act. Lack of Registration is civil offence, under this act (punishment is fine only, no jail term). There are no provisions under this act to punish unqualified Persons acting as medical practitioner.

It’s also time for DCA, to move its focus from Registration of every pharmacy to strict
implementation of clause 9 (a) of Section 65, of Drugs and Cosmetics Rules 1945 ( Schedule H and
H1 drugs like Antibiotics and Steroids must be sold on qualified Dr prescription only) regarding the sale
of Potent antibiotics and steroids.

section 65 -clause (9)(a) Substances specified in Schedule H or Schedule X shall not be sold by retail except on and in accordance with the prescription of a Registered Medical Practitioner and in the case of substances specified in Schedule X, the prescriptions shall be in duplicate, one copy of which shall be retained by the licensee for a period of two years.

It’s time for govts to notify an effective date to implement clause ii of section 20 of AP/TS
Medical Practitioners registration Act 1968 with amended act 2013, in the gazette.

Clause ii of section 20 AP/TS MPR ACT = (ii) no person other than a registered practitioner shall, with effect from such date as may be specified by the Government by notification in this behalf, practise the modern scientific medicine or hold-himself out whether directly or by implication as practicing or as being prepared to so practise.

గత 2 దశాబ్దాలుగా ప్రభుత్వాలు చేసిన కృషి వలన మన తెలుగు రాష్ట్రాలలో  డాక్టర్స్ సంఖ్య WHO సూచించిన నిష్పత్తికి చేరుకొంది. ఈ విషయం లో ప్రభుత్వాలను అభినందించాలి.  రూరల్ ప్రజలకు కూడా అందుబాటులో నాణ్యమైన వైద్యం అందాలంటే  మన తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వాలు  చేయవలసిన విషయాలు చాలా ఉన్నాయి.  ... 
1. ప్రాధమిక ఆరోగ్యకేంద్రాలలో 3 MBBS డాక్టర్స్, సబ్ సెంటర్స్ లో ఒక MBBS డాక్టర్,ఒక ఆయుష్ వైద్యుడిని రిక్రూట్ చేయాలి. 
2.  AP/TS MPR ACT(Medical Practitioners registration Act)లోని Clause ii of section 20 ను వెంటనే నోటిఫై చేయాలి. 
3. నకిలీ వైద్యులను శిక్షించే అధికారం (quasi judicial powers) జిల్లా వైద్య శాఖాధికారి కి, రాష్ట్ర మెడికల్  కౌన్సిల్ కు  దఖలు పరుస్తూ  ఒక చట్టాన్ని చేయాలి. 
4. ఇప్పటికే ఉన్న  కొన్ని ఇండియన్ పీనల్ కోడ్ లోని సెక్షన్ ల ప్రకారం నకిలీ డాక్టర్స్ ను శిక్షించవచ్చు. 
ఉదాహరణకు ఈ క్రింది సెక్షన్ లను పరిశీలించండి... 
IPC sections to book the quacks ...

IPC SECTIONS applicable to book cases against the quacks.-----

vi.IPC: 416---- CHEATING BY IMPERSONATION.
XVII.IPC:417---- PUNISHMENT FOR CHEATING.
XVIII. IPC : 418- CHEATING WITH KNOWLEDGE.
XIX. IPC : 419 PUNISHMENT FOR CHEATING.
XX. IPC : 471- USING AS GENUINE AS FORGED DOCUMENT.
XXI. IPC : 23,24,25 --WRONGFUL GAIN, DISHONESTY, FRADULENCY
XXV. IPC: 44--INJURY.
XXVI. IPC: 269 , 270---NEGLIGENCE ACT & MALIGNANT ACT.(LIKELY TO SPREAD INFECTION OF DANGEROUS DISEASE ).
XXVIII. IPC: 336,337,338- act endangering life or personal safety,causing hurt and causing grievous hurt.
and
indian medical council act1956- section 15 & section 25.
indian medical degrees act-section 6-A (1 ).
DRUGS AND COSMETICS ACT 1940- SECTION 27.

కాబట్టి జిల్లాలలోని పోలీసులు సుయో మోటో గా నకిలీవైద్యులపై కేసులు నమోదు చేయాలి.
జిల్లా పోలీసు అధికారి, జిల్లా ఆరోగ్య శాఖాధికారి, మెడికల్ కౌన్సిల్ మెంబర్, IMA మెంబర్ ,పొల్యూషన్ కంట్రోల్ అధికారి , బార్ కౌన్సిల్ మెంబర్ లతో  ఆంటీ క్వాకరీ సెల్స్ ను  జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసి ప్రజారోగ్యానికి తూట్లు పొడుస్తున్న నకిలీ డాక్టర్స్ ను అరికట్టాలి. 


5. PHC,CHC &SUB CENTERS లలో భవనాలు,లాబ్ లు,మందుల సరఫరా, కోతలు లేని కరెంటు సరఫరా, బ్యాటరీ బ్యాక్ అప్ తదితర మౌలిక సదుపాయాలు పటిష్టం చేయాలి. అలాగే స్పెషలిస్ట్ లు, నర్సింగ్ సిబ్బంది,లాబ్ టెక్నీషియన్ లు తదితర  మానవ వనరులను సరైన నిష్పత్తిలో రిక్రూట్ చేసుకోవాలి.  

6. The Drugs and Cosmetics Rules, 1945 [As amended upto 15th August, 2013] లోని section 65 -clause (9)(a) ను వెంటనే అమలుచేయాలి.  

రాష్ట్ర మెడికల్ కౌన్సిల్  రిజిష్టర్ నంబరులేని ప్రిస్క్రిప్షన్ ల పై   మందులు అమ్మకూడదని రిటైల్ ఫార్మసీలకు, డిస్ట్రిబ్యూటర్ లకు   మరియు తయారీదారులకు హుకుం జారీ చేసే చట్టం ఇప్పటికే ఉంది. దానిని కఠినంగా అమలుచేయాలి. ఎలక్ట్రానిక్ ప్రిస్క్రిప్షన్ పధ్ధతి ప్రవేశపెట్టి షెడ్యూల్ డ్రగ్స్ అమ్మకాన్ని డిజిటల్ గా మానిటరింగ్ చేయాలి. 

7. ఈ మధ్య కాలం లో కొన్ని స్వచ్చంద సంస్థలు, న్యాయ వ్యవస్థలు,  "నర్సులకు,ఆయుష్ వైద్యులకు ,డెంటిస్ట్ లకు ఓ 6 నెలలు మోడ్రన్ వైద్యం లో తర్ఫీదిచ్చి వారిని వెల్ నెస్ సెంటర్స్ లోనూ,PHC & CHC లలోనూ వినియోగించుకొంటే వైద్యులకొరత తీరుతుందని ప్రతిపాదిస్తున్నాయి. వీరి మాటలు నమ్మేసి ప్రభుత్వాలు ఆర్డర్స్ పాస్ చేస్తున్నాయి. ఇది చట్ట విరుద్ధమైన నిర్ణయం. అంతేకాదు ప్రజారోగ్యానికి గొడ్డలిపెట్టు. ఇది ఒక తిరోగమన చర్య. 
MBBS డాక్టర్స్  కొరత  నిజంగా ఉంటే ఇలాంటి వి ఆలోచించినా అర్ధం ఉంటుంది. కానీ వేలాది MBBS &AYUSH డాక్టర్లు సరైన ఉద్యోగాలు లేక ఖాలీగా ఉన్నారు. 

Skill enhancement is different from skill sharing!ప్రభుత్వాలు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. 


"నకిలీడాక్టర్స  ను శిక్షించే బాధ్యత మా పరిధిలోలేదు" అంటూ అటు ఆరోగ్య శాఖాధికారులు, పోలీసులు,ఇటు రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ తప్పించు కొంటున్నాయి. 
 నేరము  జరుగుతున్నపుడు ఆయా నేరాల ను అదుపుచేసే సంస్థలు సత్వరం  స్పందించాలి. సమాజహితం కోసమే చట్టాలుతప్ప ఊరకే వ్రాసుకొని చూసుకోవడానికి కాదుగదా?
నకిలీవైద్యుల ను ఏ రిజిష్టర్ లో కూడా నమోదు చేయలేదు కాబట్టి వారిపై మాకు అదుపు లేదని వాదించే ప్రభుత్వ సంస్థలు ఒక్క విషయం గమనించాలి. 
 ఏ ప్రభుత్వ సంస్థ అయినా రేపిస్ట్ లు,హంతకులు,దొంగల ను రిజిష్టర్ చేసుకొంటుందా? ఆలా రిజిష్టర్ చేసిన నేరస్థులపైన మాత్రమే చర్య తీసుకొంటుందా?
 కేవలం రూల్ పుస్తకాల మధ్యనే బతికేవారికి ఇంగిత జ్ఞానం లోపిస్తుంది. 

కాబట్టి సహృదయం తో అర్ధం చేసుకొని యుద్ధప్రాతిపదిక పై నకిలీ వైద్యులను అదుపు చేయమని మా ప్రార్ధన.
 
మనదేశం లో ఆయుష్ వైద్యులు ఎందరో ఉన్నారు. పల్లె లలో వారి సేవలను కూడా ప్రభుత్వం సమర్ధవంతం గా వినియోగించుకోవాలి. 
అర్హత ఉన్నవారే వైద్యం చేయాలి-మెజారిటీ ఓట్లు పొందినవారే శాసన కర్తలవ్వాలి . 
ఏ చదువు చదివితే ఆ చదువుకి సంబంధించిన వైద్యమే చేయాలి - నర్సులను కాంపౌండర్ లను వైద్యులుగా నియమించకూడదు. 



Comments