ఒక్క నిముషం ఆగండి . ఇది చదవండి. మన ఆంధ్రరాష్ట్రంలో 12 ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో 1900 MBBS సీట్లున్నాయి. 19 ప్రవేట్ మెడికల్ కాలేజీల్లో 2400 MBBS సీట్లున్నాయ్. ప్రభుత్వ మెడికల్ కాలేజీలలోని సీట్లలో 15% అఖిలభారత కోటా లో ఉంటాయి. ప్రవేట్ మెడికల్ కాలేజీల్లో ని సీట్లలో 50% మేనేజ్ మెంట్ కోటా లో ఉంటాయి. ఇంటర్ పాస్ తర్వాత, నీట్ పరీక్షలో రాంక్ సంపాదించాలి. ప్రవేట్ మానేజ్ మెంట్ సీట్లు కూడా నీట్ పరీక్ష ఆధారంగానే మెడికల్ యూనివర్సిటీలు కౌన్సిలింగ్ చేస్తాయి. ఇదీ మనరాష్ట్రంలో మెడికల్ విద్యతీరుతెన్నులు . నీట్ రాంక్ సాధించారు. కష్టపడి చదివి MBBS డిగ్రీ కూడా సాధించేశారు? ఓకే! నెక్స్ట్ ఏమిటి?? చూద్దాం రండి.... 50000 మోడ్రన్ డాక్టర్స్ , ఉన్న మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిఏటా 4000 కొత్త MBBS డాక్టర్స ,మరో 2000 ఆయుష్ వైద్యులు చేరుతున్నారు. మన రాష్ట్ర జనాభా 5కోట్లు. WHO ప్రకారం ప్రతి 1000మంది జనాభాకి కనీసం ఒక డాక్టరైనా ఉంటె మంచిది. ఇప్పటికే ఈ నిష్పత్తి ప్రకారము మన రాష్ట్రంలో మోడ్రన్ వైద్యులు(MBBS) ఉన్నారు...
Its a web blog of Dr.Srinivasa Raju,ENT Surgeon from ELURU of A.P. Dr. C S Raju is a Member of IMA& A.P.Medical council& Association of otorhinolaryngology &Member of the Red cross society. DrCSRaju is CWC Member of IMA HQ &Past state president of IMA AP. This blog is for up dates on-" current affairs, Medical fraternity, Medico-legal information, Health care acts. The content can not be copied. please mail csrajuent10@gmail.com for all queries and suggestions.