Skip to main content

Vote for development

అభివృద్ధి మన నినాదం . ప్రత్యేక హోదా మన హక్కు. విభజన హామీల సాధన మన బాధ్యత.
చంద్రబాబు, కేంద్రం తో 4 ఏళ్ళు  సఖ్యం గా ఉండటం వల్లనే, 2016లో కేంద్రం ప్యాకేజీ ప్రకటించిన తర్వాత మొత్తం సుమారు 20వేల కోట్ల విలువైన  9 ప్రాజెక్టులకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ముందునుండి తగాదా పడితే ఈ కాస్త సాయం కూడా అందేది కాదు. 
 ఆర్థికపరిస్థితి దారుణంగా ఉన్నపుడు కేంద్రంతో వ్యవహారం ఎలా నడపాలో చంద్రబాబుకి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదనడంలో అతిశయోక్తి లేదు. పాలనా వ్యవహారం నడపడం తలలు పండిన ముఖ్యమంత్రులకు సాధ్యము కానప్పుడు,నేడు జగన్ గారు,పవన్ గారి లాంటి అనుభవ సూన్యులకు ,ఆవేశ పరులకు, వ్యక్తిగత బలహీనతలు పుష్కలంగా ఉన్న వారికి, అధికారం ఇస్తే ఆంధ్రుల చేతికి చిప్ప తప్ప ఏమీ మిగలదు. 
సందేహాలుంటే ఒక్క సారి ప్రాజెక్ట్ ల వివరాలు పరిశీలించండి ... 

మొత్తం 9 ప్రాజెక్ట్ లలో, 4 ప్రాజెక్టులకు రుణదాతలతో ఒప్పందం కుదుర్చుకోవడం, రుణం సమకూరడం వంటి కార్యక్రమాలు పూర్తయ్యాయి. మరో 5 ప్రాజెక్టులకు కేంద్రమూ, రుణదాతల అంగీకారమూ కుదిరింది. ఒప్పందం కుదుర్చుకుని ఆ ప్రాజెక్టులను పట్టాలకు ఎక్కించాల్సి ఉంది. ఇవి కాక మరో 5 ప్రతిపాదనలు కేంద్రం వద్ద పెండింగులో ఉన్నాయి.
 1. విశాఖపట్నం- చెన్నై పారిశ్రామిక కారిడార్‌ -3200కోట్ల ప్రాజెక్ట్ . బ్యాంకు రుణం రూ.2442 కోట్లు. రాష్ట్రం వాటా రూ.712.80 కోట్లు. గ్రాంటు రూ.33 కోట్లు.
2. కరవు నివారణ పథకం రాష్ట్రంలో కరవు నివారణ పథకం రూ.1148.57 కోట్లతో చేపడుతున్నారు. 
రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.113.68 కోట్లు.; విదేశీ ఆర్థిక సాయం కింద రూ.570.89 కోట్లు;350కోట్లు  గ్రాంటు . 
3. నిరంతర విద్యుత్‌ .3584 కోట్ల ప్రాజెక్ట్ . విదేశీ రుణం రూ.2560 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.1024 కోట్లు. 
4. వెనుకబడిన ప్రాంతాల్లో నీటిపారుదల
 రూ.2000 కోట్ల ప్రాజెక్టు.  విదేశీ రుణం రూ.1700 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.300 కోట్లు. ఇందులో చిన్ననీటి వనరులను అభివృద్ధి చేస్తారు. రైతుల భాగస్వామ్యానికి ప్రాధాన్యం ఇస్తారు. 
5. సమగ్ర నీటిపారుదల :  రూ.1600 కోట్ల ప్రాజెక్ట్. ఇందులో రూ.1120 కోట్లు ప్రపంచ బ్యాంకు రుణం కాగా, రూ.480 కోట్లు రాష్ట్రం భరించాల్సి ఉంటుంది. రుణ ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంది.
6. అమరావతి నగరాభివృద్ధి
 రూ.4749 కోట్ల అంచనా.  ప్రపంచ బ్యాంకు వాటా రూ.3324 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వం రూ.1425 కోట్లు భరించాల్సి ఉంటుంది. రాజధాని నగరంలో రోడ్లు, ఇతరత్రా మౌలిక సౌకర్యాల కల్పనకు ఈ నిధులు వినియోగిస్తారు.
7. పట్టణ నీరు సరఫరా  రూ.3723 కోట్ల ప్రాజెక్ట్ . 
 విదేశీ రుణం 70శాతం కాగా రాష్ట్ర ప్రభుత్వ వాటా 30శాతం. రూ.2606 కోట్ల రుణం మంజూరుకు అంగీకారం పూర్తయింది. రాష్ట్ర ప్రభుత్వం రూ.1117 కోట్లు భరించాల్సి ఉంది. ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంది.
8. గ్రామీణ రహదారుల అభివృద్ధి రూ.4234 కోట్ల ప్రాజెక్ట్ .   ఒప్పందమూ కుదిరింది. ఇందులో విదేశీ రుణం రూ.2963.80 కోట్లు కాగా, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.1270.20 కోట్లు. 
9. వైద్య సౌకర్యాల మెరుగు రూ.3127 కోట్ల  ప్రాజెక్ట్ . 
 రూ.2189 కోట్లు విదేశీ రుణంగా లభిస్తుంది. రూ.938 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ వాటాగా భరించాలి. ఇక రుణదాతతో ఒప్పందం కుదర్చుకోవాల్సి ఉంది. 

ఇవి కాక,దాదాపు రూ.15725 కోట్ల విలువైన మరో 5 ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. కేంద్రం ఆమోదిస్తే రుణదాత ముందుకు వస్తారు. ఇందులో రూ.4717.20 కోట్లు రాష్ట్రం తన వాటాగా భరించాల్సి ఉంది. 
సాగుతున్న ప్రాజెక్ట్ లకోసం,రాష్ట్రం గత 2 ఏళ్లలో(2016- 18 )  సుమారు 2700కోట్లు తనవాటాగా ఖర్చు చేసింది. 

ఇంత అభివృద్ధి మరే రాష్ట్రంలో కూడా జరగలేదని కేంద్రమే చెబుతుంది. ఎన్నో అవార్డులు కూడా ఇచ్చింది. 
సుమారు 2లక్షలకోట్ల పెట్టుబళ్లతో పరిశ్రమల స్థాపన , పోలవరం లాంటి బృహత్తర ప్రాజెక్ట్ ని కేవలం 4ఏళ్లలో 60శాతం పూర్తి చేయడం ,పట్టిసీమ,పురుషోత్తమ పట్నం లాంటి "నదుల అనుసంధాన ప్రాజెక్ట్ లు" పూర్తి చేయడం, విద్యుత్, గ్రామీణ రోడ్లు, తాగునీరు, ఇళ్ళు , మరుగుదొడ్ల నిర్మాణం ,ఆరోగ్యసేవలు , ప్రక్రుతి వ్యవసాయం లాంటి ఎన్నో పథకాలతో దేశంలోనే మన రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలబెట్టిన ఘనత చంద్రబాబు దే అని జాతీయ అభివృద్ధి మానిటరింగ్ సంస్థ ప్రకటించింది !
 ఎగువ రాష్ట్రాలు కట్టిన ప్రాజెక్ట్ ల వల్ల  కృష్ణా నది నీళ్లు అందకపోయినా , మాగాణి వ్యవసాయానికి  పుష్కలంగా సాగునీరు, మెట్ట వ్యవసాయానికి బిందు సేద్యం, ఆక్వా రంగం,హార్టీ కల్చర్,డైరీ, లాంటి అనుబంధ రంగాలలో  ఇంత తక్కువ సమయంలో  దేశంలోనే మన రాష్ట్రము ముందు ఉందని కేంద్రమే చెబుతుంది. ఇలా నిలబెట్టిన ఘనత చంద్రబాబుదే అని చెప్పడంలో ఏమైనా అతిశయోక్తి ఉందా ?!
ఇవన్నీ ఒక ఎత్తు . మనిషి జననం నుండి మరణం వరకు భిన్న దశలలో అవసరమయ్యే ఆసరా ని సుమారు 200 సంక్షేమ పధకాల ద్వారా అందించడం మరే ఇతర రాష్ట్రాలలో చూడలేము. దీనివలన నేడు,ఆంధ్రాలో పేదరికం,ఆకలిచావులు , దారిద్య్రం బాగా తగ్గిపోయాయని ప్రపంచబ్యాంక్ కితాబు ఇచ్చింది. 
సుమారు అరకోటి మందికి ప్రతి నెలా 1000/-పెన్షన్, ఆర్ధికంగా వెనకబడిన విద్యార్థులకు విదేశీ విద్య కోసం లక్షల విలు వైన స్కాలర్ షిప్  లు , తల్లీ బిడ్డ ఎక్స్ ప్రెస్ ద్వారా కాన్పు సమయము లో ఉచితసేవలు మరే రాష్ట్రంలో చూడలేము. 
ఆర్థికపరిస్థితి సహకరించక పోయినా, బాంకర్లు ,కేంద్రమూ సహకరించక పోయినా ,  రైతులకు , డ్వాక్రా మహిళలకు,చేనేత వారికీ  రుణ మాఫీ చేయడం అనేది మిగతా రాష్ట్రాలకు ఆదర్శముగా నిలిచింది.   

అన్నింటికంటే అసలు సిసలైన ప్రాజెక్ట్ అమరావతి నగర నిర్మాణం. ప్రభుత్వ ఖజానా నుండి ఒక్క రూపాయ్ ఖర్చు చేయకుండా, 10000కోట్ల విలువైన 33000ఎకరాల భూమిని సమీకరించడం అనేది మనదేశంలోనే విప్లవాత్మక మైన చర్య. వచ్చే 10ఏళ్ల లో అక్కడ ఒక  "సమీకృత ఆర్ధిక హార్దిక సామాజిక మహానగరం" ఆవిష్కరింప బడుతుంది. దీనికి అవసరమైన ప్రణాళికలు, రోడ్లు,పార్క్ లు,జలాశయాలు,వంతెనలు,విద్యా -వైద్యాలయాలు,హొటళ్ళు ,వినోదకేంద్రాలు,సేవారంగపు కంపెనీలు,భారీ పరిశ్రమలు  తదితర మౌలిక సదుపాయాల బీజం కేవలం 4 ఏళ్లలో వేయడమంటే మాటలుకాదు. 
అత్యంత అధునాతన ఐకొనిక్ పాలనా భవనాలు(Assembly,secrateriyat&high court) , ఉద్యోగుల, చట్ట సభ్యుల(MLA&MLC) నివాసాలు మరో ఏడాదిలోనే పూర్తవుతాయి. 

ఇలా అభివృద్ధిని, సంక్షేమాన్ని రెండు కళ్లుగా ,సమానంగా నడిపించిన వారు మనదేశంలో ఎవ్వరు లేరు.
 చివరికి ఎన్నో ఆశలు పెట్టుకొన్న మోడీ లాంటి అనుభజ్ఞుడు కూడా నోట్లరద్దు అసమర్ధం గ అమలుచేస్తున్న GST,తదితర అనుభవ రాహిత్య మైన  చేష్టలతో దేశ ఆర్ధిక వ్యవస్థను భ్రష్ట్టు పట్టించారు. 

కాబట్టి ,ఎన్నికల సమయంలో ఆవేశ కావేషాలకు, ప్రలోభాలకు లొంగిపోకుండా,అభివృద్ధి చేస్తున్న వారిని, అభివృద్ధి మరింత  చేసే సత్తా ఉన్నవారిని గెలిపించు కోవలసిన బాధ్యత అందరిపైనా,ముఖ్యంగా  ఆంధ్రులపై ఉంది . 
అవినీతి అన్నిరాష్ట్రాలలో,అన్ని వర్గాలలో,అన్ని పార్టీలలో ఉంది.
ఈ కాలంలో  పావలా తిని ,ముప్పావలా పనిచేస్తే అదే గొప్ప. 

మనదేశంలో పార్టీల గురించి ఎక్కువ ఆలోచించ వలసిన అవసరం లేదు. పార్టీ నాయకుడు ముఖ్యం. భాజపా కి మోడీ,తెలుగుదేశానికి బాబు,యువపార్టీలకు జగన్&పవన్ లే ప్రాధాన్యం. వీరి వ్యక్తిత్వాన్ని, సమర్ధతను,కష్టపడే సామర్ధ్యాన్ని,పాలించే అనుభవశీలతను  పరిశీలించి నిర్ణయించుకొందాం. 

 ఎవరు తక్కువ అవినీతిపరులో పరిశీలించండి. సోషల్ మీడియా ని పూర్తిగా నమ్మే పరిస్థితులు లేవు. అది కూడా పక్షపాత బుద్ధితో ఉంటుంది. అంతేకాదు కొత్తగా పుట్టిన యువ పార్టీలు ,సేనలు ఎన్నో వేల   నకిలీ అకౌంట్ లతో సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయి. తస్మాత్ జాగ్రత్త. 

Comments