అభివృద్ధి మన నినాదం . ప్రత్యేక హోదా మన హక్కు. విభజన హామీల సాధన మన బాధ్యత. చంద్రబాబు, కేంద్రం తో 4 ఏళ్ళు సఖ్యం గా ఉండటం వల్లనే , 2016లో కేంద్రం ప్యాకేజీ ప్రకటించిన తర్వాత మొత్తం సుమారు 20వేల కోట్ల విలువైన 9 ప్రాజెక్టులకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ముందునుండి తగాదా పడితే ఈ కాస్త సాయం కూడా అందేది కాదు. ఆర్థికపరిస్థితి దారుణంగా ఉన్నపుడు కేంద్రంతో వ్యవహారం ఎలా నడపాలో చంద్రబాబుకి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదనడంలో అతిశయోక్తి లేదు. పాలనా వ్యవహారం నడపడం తలలు పండిన ముఖ్యమంత్రులకు సాధ్యము కానప్పుడు,నేడు జగన్ గారు,పవన్ గారి లాంటి అనుభవ సూన్యులకు ,ఆవేశ పరులకు, వ్యక్తిగత బలహీనతలు పుష్కలంగా ఉన్న వారికి, అధికారం ఇస్తే ఆంధ్రుల చేతికి చిప్ప తప్ప ఏమీ మిగలదు. సందేహాలుంటే ఒక్క సారి ప్రాజెక్ట్ ల వివరాలు పరిశీలించండి ... మొత్తం 9 ప్రాజెక్ట్ లలో, 4 ప్రాజెక్టులకు రుణదాతలతో ఒప్పందం కుదుర్చుకోవడం, రుణం సమకూరడం వంటి కార్యక్రమాలు పూర్తయ్యాయి. మరో 5 ప్రాజెక్టులకు కేంద్రమూ, రుణదాతల అంగీకారమూ కుదిరింది. ఒప్పందం కుదుర్చుకుని ఆ ప్రాజెక్టులను పట్టాలకు ఎక్కించాల్సి ఉంది. ఇవి కాక మరో 5 ప్రతిపాద