"zero tolerance for violence against Doctors ,staff &Hospitals"
వైద్యులపై దాడులు ఇంకానా? ఇకపై సాగవు!
వైద్యసేవల్లో లోపాలున్నాయనే సాకుతో వైద్యులను మానసికంగా ,ఆర్ధికంగా,శారీరకంగా వేదనకు గురిచేయడం చట్టరీత్యా మహానేరం!
హాస్పి టల్స్ అనేవి దేవాలయాలు . రోగులు దేవుళ్ళు . డాక్టర్స్ ఆరోగ్యసేవకులు. ఇలాంటి పవిత్రమైన ప్రదేశాల్లో హింసకు తావులేదు.
- పోలీసులు, పంచాయితీ &నగర పాలక అధికారులు, ప్రజానాయకులు ,విలేఖరులు వైద్యసేవలపై జరుగుతున్న దాడులను పూర్తిగా ఖండించి , వైద్య సేవలు నిరాఘాటంగా జరిగేటట్లు ప్రశాంత వాతావరణాన్ని కల్పించే దిశగా తోడ్పాటు అందివ్వాలి.
- ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నాయకత్వం లో వైద్యులు, మెడికోలు, పోలీస్ అధికారులు,బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయ వ్యవస్థ కి చెందిన జడ్జీలు, విలేఖరి అసోసియేషన్ సభ్యులు,రెవెన్యూ పాలనాధికారి, ఆరోగ్యశాఖాధికారి ,ప్రజానాయకులతో ఒక అత్యవసర కార్యనిర్వాహక కమిటీని" ఏర్పాటు చేసుకొని, ఎలాంటి హింసాయుత ఘటన జరిగినా, వెంటనే ఈ కమిటీ సభ్యులకు సమాచారం అందించి వారి యొక్క సలహాతో ఆయా హింసాయుత ఘటనలను సమర్ధవంతం గా ఎదుర్కోవాలి.
- ఆంధ్రప్రదేశ్ లో "హాస్పిటల్స్ &డాక్టర్స్ పై హింస ను అరికట్టే చట్టం-2008" ఉంది. దీని ప్రకారం హాస్పిటల్స్ &డాక్టర్స్ పై ఎలాంటి హింస జరిగినా , దాడి చేసినా , ఆస్తికి నష్టం చేసినా - అది నాన్ బెయిల్బుల్ నేరం .
- హాస్పిటల్ లో కెమెరా లు ఏర్పాటు చేసుకోవాలి. రోగులతో,రోగి తాలూకు బంధువులతో రోగం,వైద్యము, దుష్పరిణామాలు, ఫీజు వివరాలు తదితర విషయాల గురించి విపులంగా వారికి అర్ధమయ్యే రీతిలో చెప్పి, వ్రాత పూర్వక అనుమతి తీసుకొన్న తర్వాత మాత్రమే వైద్యసేవలను అందించాలి.
- ప్రతి హాస్పిటల్ లో రిఫరల్ హాస్పిటల్ ,పోలీస్ ,అంబులెన్స్ వారి ఫోన్ నంబర్లు డిస్ ప్లే చేయాలి.
- డాక్టర్ దైర్యంగా ఉండాలి. ప్రతి చిన్న విషయాన్ని డాక్యు మెంటేషన్ చేయాలి. కేసు షీట్ లో ప్రతి పరీక్ష,రోగి యొక్క అనారోగ్య చరిత్ర , వాడుతున్న మందులు,చేయించిన పరీక్షలు,చేసిన ఆపరేషన్,రోగి యెక్క వైటల్స్ ...ఇలా ప్రతీదీ రికార్డ్ చేయాలి. దీనికోసం అవసరమైతే ఒక డేటా ఎంట్రీ ఉద్యోగిని నియమించు కోవాల్సి ఉంటుంది.
- ఏదైనా సంఘటన జరిగితే,వెంటనే IMA లోకల్ నాయకులకు తెలియచేసి వారి సలహా తీసుకోవడానికి వెనుకాడవద్దు. అలాగే అత్యవసర కార్యవర్గ కమిటీ ని కూడా సంప్రదించి తగువిధంగా చర్యలు తీసుకోవాలి.
- అన్నింటికంటే ముఖ్యం,వృత్తిభీమా(Professional indemnity)అనేది చాల అవసరం. మన IMA PPW పథకంలోగానీ లేదా మరేఇతర సంస్థల పధకాల లోగానీ చేరితే మంచిది.
- జిల్లా వైద్యాధికారి ఆఫీసులో (DMHO-DRA) హాస్పిటల్ ని రిజిష్టర్ చేసుకోవడం, మెడికల్ కౌన్సిల్ లో మీ డిగ్రీలను నమోదు లేదా Renewal చేసుకోవడం, అలాగే IMA సభ్యుడిగా చేరడం మరచిపోవద్దు.
జులై 1 నుండి వారం పాటు దేశవ్యాప్తంగా "వైద్యుల రక్షణ " కోసం దీక్ష చేస్తున్నాం ... (Safe fraternity week ).
we demand:
- Central medical protection act.
- Safety to medical fraternity
Comments
Post a Comment