Skip to main content

How Modi betrayed andhra pradesh?

జాతీయ సంస్థలకు కేంద్రం ఇచ్చిన నిధులెంత ?
మన రాష్ట్రానికి 14 జాతీయ  సంస్థలను కేటాయించినా , ఇంతవరకు దేనికీ భవనాలు నిర్మించు కోవడానికి నిధులు విడుదల చేయలేదు.
మరి ఈ 4 ఏళ్లలో నిధులేమీ ఇవ్వలేదా?
ఈ 4ఏళ్లలో సుమారు 800 కోట్లు కేటాయించారు గానీ ఇంతవరకు విడుదల చేసింది కేవలం 400కోట్లు. అంతేకాదు ఈ సంస్థల కు సరిపడా మానవ వనరులను, ప్రొఫెస్సర్ లు గానీ స్టాఫ్ గానీ కేటాయించలేదు .
చట్టం ప్రకారం 10ఏళ్లలో ఈ సంస్థలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలి. కానీ కేంద్రప్రభుత్వం తీరు చూస్తా ఉంటే 3 దశాబ్దాలకు కూడా ఈ సంస్థలు తయారయేటట్లు లేదు.
ఆంద్ర రాష్ట్రానికి అన్ని రాష్ట్రాలకు ఇస్తున్నట్లే ఇస్తాం తప్ప చట్ట ప్రకారం ఇవ్వవలసి ఉన్నా ,  ఎక్సట్రా ఏమీ ఇవ్వం అని కేంద్రం తేల్చేసింది.
కేంద్రం విడుదల చేసిన నోట్ లో,   రాబోయే 10ఏళ్లలో ఆంధ్రాకి కేంద్రం ఇవ్వాలనుకొంటున్న నిధుల వివరాలు మాత్రమే చెప్పారు తప్ప,ఈ 4 ఏళ్లలో ఎంత ఇచ్చారు? అనేది మాత్రం చెప్పడం లేదు . కేంద్రం  చెప్పిన అంకెలన్నీ
కాగితాలకే పరిమితమైన వే తప్ప,ఆంద్ర రాష్ట్రానికి న్యాయంగా, చట్టప్రకారం రావలసిన నిధుల ఊసు మాత్రం లేదు .
ఒక నియమిత  కాల పరిధిలో ఫలానా వాటికి ఇన్ని నిధులు రిలీజ్ చేస్తాం"అనే మాట చెప్పకుండా ఏదేదో పై పై మాటలతో,హామీలతో ఇప్పటివరకు సమయం వృధా చేయడమే కాకుండా ఆంధ్రాప్రజలను హేళన చేసే ప్రకటనలు ఇస్తున్నారు.

Comments