Skip to main content

We Indians .........

ఎన్నికల సీజన్ రాబోతుంది. దేశంలోని పార్టీలు రకరకాల వేషాలు వేసే సీజన్ ఇది . అందులో భాగంగానే, కేంద్రప్రభుత్వం విదిల్చిన ఆరోగ్యరక్ష పధకం ,రైతు పండించే పంటకు మద్దతు ధర పధకం .  కేవలం కాగితాల్లో చేసే అంకెలగారడీ తప్పించి, భారతీయుల నుదిటిరాత ను మార్చే పధకాలు కావవి. దారిద్ర్యరేఖకు దిగువున 50కోట్లమంది ఉన్నారని అంచనా. మరో 40కోట్లమంది మధ్యతరగతి వాళ్ళున్నారు. 
దారిద్ర్యరేఖకు దిగువున ఉన్నవాళ్ళకి బిచ్చమ్ వేస్తావుంటే, వారు దారిద్ర్యరేఖకు పైకి వస్తున్నారు. కానీ దేశంలో పేదవాళ్ళసంఖ్యలో ఎలాంటి మార్పు లేదు. ఎందుకంటే, మధ్యతరగతి వాళ్ళు ఆ ఖాళీని భర్తీ చేస్తున్నారు. 
ప్రభుత్వాలు చేస్తుందల్లా , వారి కి పెట్టె టోపీని వీరికి పెడుతుంది. ఇలా టోపీలు మార్చి మార్చి పెట్టడంలో అన్ని పార్టీలు విజయవంతం అవుతున్నాయి. పదిమంది పేదలు పైకి ఎగబాకుతూ ఉంటే , 20మంది మధ్యతరగతి వారు పేదరికంలోకి జారుకొంటున్నారు. 
వెర్రి చూపులు చూస్తూ భారతీయ ఓటర్లు ఇలా  ఉండిపోవడానికి కారణమేమిటి?
ఆకలితీర్చే పధకాలే తప్ప, వారి ఆకలిని వారే తీర్చికొనే సామర్ధ్యాన్ని ప్రజలకు ఇవ్వనంత కాలం, మన దేశం ఇంతే!
ప్రజలు మా రాలి. ఎంతసేపు కులవర్గ  హక్కులకోసం కాట్లాడుకోవడం తప్పించి, దేశపౌరుడిగా బాధ్యతల నేవి ఉన్నాయని గుర్తుమ్చు కొని మసలుకోవడం  ఇంకెప్పుడు?

Comments