Skip to main content

Modi Care-Facts&Myths...

మోడీ కేర్  లో  వాస్తవమెంత ? 
మనదేశంలో అట్టడుగు -బడుగు బలహీనవర్గాల జాబితా లో  సుమారు 10కోట్లకుటుంబాలు అనగా 50కోట్లజనాభా ,అనగా  మొత్తం జనాభాలో 40% ఉన్నారు. శారీరక  శ్రమయే  వీరికి జీవనోపాధి. అంటే,శరీరం ఆరోగ్యంగా పనిచేస్తేనే వీరికి  కనీస అవసరాలు తీరతాయి. ఎన్నో సంక్షేమ పధకాలు న్నా ,ఆరోగ్యరక్షణకు భరోసా ఇచ్చే పధకాలు లేవు. కొన్ని పధకాలున్నా( RSBY providing 30000/-coverage), అవి పూర్తి  ఆరోగ్య భద్రత ను ఇవ్వకపోవడం చేత, ప్రతి ఏటా  మరింత దారిద్య్ర కూపంలోకి జారిపోతున్నారు .
ఇప్పటివరకు  ఈ 40% జనాభాలో (50కోట్లప్రజల లో ) కేవలం 5 కోట్లమందికి మాత్రమే RSBY ఆరోగ్యబీమా రక్ష ణ  ఉంది. ఈ పధకానికి కేంద్రం బడ్జెట్ లో ఏటా కేవలం  1000కోట్లు కేటాయిస్తుంది .

నిజానికి పేదల (50కోట్లప్రజలు )  హాస్పిటల్ ఖర్చులు ఏటా 20000కోట్లు ఉంటుంది. ఎందుకంటే, ఏటా సుమారు 12.5కోట్లమంది పేదలు (25%  of 50crore people)   హాస్పిటల్ పాలవ్వుతున్నారు.  ఇదే ఉన్నతవర్గాల హాస్పిటలైజేషన్ పరిశీలిస్తే, 33% మంది హాస్పిటల్ పాలవ్వుతున్నారు. అంటే, ఆరోగ్యం పై అవగాహన ఉన్నవారు,ధన వంతులు  మరింత ఎక్కువగా హాస్పిటల్ సౌకర్యాలు పొందుతున్నారు. కానీ కొన్ని రిపోర్ట్ లు ఏమి చెబుతున్నాయంటే,భీమా సౌకర్యం ఉన్నవారు అనవసరమైన వైద్యానికి  లోనవ్వుతున్నారని ,దీనికి కారణం హాస్పిటల్స్ దోపిడీ  అని  చాలామంది ఆరోపణ. ఇందులో వాస్తవమెంతో తెలియాలంటే ప్రభుత్వం, IMA కలిసి నిజనిర్ధారణ చేయాలి.

మధ్యతరగతి,  ఉన్నతవర్గాలను పరిశీలిస్తే, భీమా సౌకర్యమున్నవారు మరింత ఎక్కువగా (33% )  హాస్పిటల్ సౌకర్యాలు పొందుతున్నారు. ఆరోగ్యబీమా లేనివాళ్ల లో  కేవలం 5% మాత్రమే హాస్పిటల్ పాలవ్వుతున్నారు. ఈ తేడా పేదల్లో కూడా గమనించవచ్చు. భీమా సౌకర్యమున్నవారు 25% హాస్పిటల్ పాలవ్వుతుంటే ,లేనివారు కేవలం 4% మాత్రమే హాస్పిటల్ పాలవ్వుతున్నారు.

disease induced demand or  hospitals induced demand (unnecessary hospital stay, diagnostic tests and surgeries ) ?
ఎప్పుడైతే ఒక్కసారిగా ఖరీదైన  ప్రభుత్వ ఆరోగ్య భీమా ( పేదలకు 5 లక్షల ఆరోగ్యబీమా-  మోడీ కేర్ )  మొదలైందో, ప్రభుత్వం, IMA ,సమాజం చాలా ఎలర్ట్ గా ఉండాలి. అంతేకాదు,ప్రభుత్వ వైద్య సౌకర్యాలు ,ప్రయివేట్ సౌకర్యాలతో పోటీ పడాలి. లేకుంటే ప్రయివేట్ వైద్యం అనగా కార్పొరేట్ వైద్యం (దోపిడీ)  మరింత ఖరీదైపోతుంది. దీనివలన భీమా కంపెనీలు,ప్రీమియం లను ఎక్కువగా పెంచేస్తాయి.
కాబట్టి ,కేవలం మోదీకేర్ అంటూ  ప్రకటనలు చేసేసి,  ఆరోగ్య రంగానికి ముఖ్యంగా బ్లాక్ మరియు జిల్లా స్థాయిలో సెకండరీ,క్రిటికల్ వైద్య సౌకర్యాలను మెరుగు పరచ డానికి తగినంత బడ్జెట్ కేటాయింపులు చేయకపోతే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేనట్లే! మొన్న పార్లమెంట్లో ప్రవేశబెట్టిన బడ్జెట్ లో ఈ విధమైన కేటాయింపులు  ఏమాత్రం కనబడలేదు.
అందరూ అంటున్నట్లు, మోడీ జీ కేవలం మాటల  మనిషె ! 

Comments