Skip to main content

AP Demands Modi ...

1.రాష్ట్రవిభజన చేసినపుడు కాంగ్రెస్ 5సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాం అంటే లేదు లేదు10సంవత్సరాలు ఇవ్వాలని మీరు రాజ్యసభ సాక్షిగా డిమాండ్ చేసి,ఇపుడు మీ హయాంలో సొల్లు వాగుతారా?
2.ప్రధానమంత్రి నరేంద్రమోదీగారు 2014లో తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి, మాట తప్పలేదా?
3.విశాఖపట్నంలో రైల్వే జోన్ ఏర్పాటు  
చేస్తామన్నారు. ఇంతవరకు దాని ఊసే లేదు. 
4.పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా 
 ప్రకటించారు.  కానీ అక్కడి జనాలకు నష్టపరిహారం 30000కోట్లు ఎపుడు ఇస్తారో ఎందుకు  చెప్పరు?
5.ప్రత్యేక హోదా కుదరదు ప్రత్యేక ప్యాకేజి అన్నారు ప్రత్యేక ప్యాకేజీ కింద ,ముఖ్యమంత్రిగారు  పరిశ్రమలకు,ప్రాజెక్ట్ లకు సంబంధించి,విదేశీ బాంక్ రుణాల గురించి ఎన్ని సార్లు ఫైల్స్ పంపినా ఏదో కొర్రీలు వేసి ఆలస్యం చేయడానికి కారణమేమిటి? 
6.రాజధాని నిర్మాణం మరియు సచివాలయ నిర్మాణానికి ఎంతిచ్చారు..? నిజానికి ప్రతి ఏటా 10000కోట్లు ఇవ్వాలి. కానీ మీరు కేవలం 5ఏళ్లకు కలిపి 4000కోట్లు మాత్రమే ఇస్తామంటున్నారు.  4 ఏళ్ళు గడిచినా అదీ పూర్తిగా ఇవ్వలేదు. ఇదెక్కడ న్యాయం?
7.లోటు బడ్జెట్లో నడుస్తున్న రాష్ట్రానికి మీరు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ఓటు బ్యాంకు రాజకీయాలు నడుపుతున్న మీరు దగ్గరలో ఎలక్షన్ ఉన్న రాష్ట్రలకు16వేల కోట్లు,20వేల కోట్లు ఇస్తూ మాకు బిక్షమేస్తారా?
8. గత నాలుగు సం నుండి వివిదపన్నులరూపేనా ఆంధ్రా  ప్రజల కష్టాలనునుండి ముక్కుపిండీవసూలుచేసేది అక్షరాలా నాలుగు లక్షల ఎనబైయ్ వేలకోట్ల పైచిలుకు రూపాయలు . సుమారు 5లక్షలకోట్లు . 
9.ఇప్పటికి 4ఏళ్ళు పూర్తయింది. మీరు హామీ ఇచ్చిన విద్య సంస్థలు,జాతీయసంస్థలకు వేలకోట్ల భూమి రాష్ట్రప్రభుత్వం సేకరించి ఇచ్చినా, కనీసం వాటికీ ప్రహరీగోడలు కట్టడానికి సరిపోని బిచ్చమ్ వేశారు. 
10. 14వ ప్రణాళిక సంఘాన్ని రద్దుచేసి,దాని స్థానంలో నీతి ఆయోగ్ ని ఏర్పాటు చేసి, దానికి ప్రణాళిక రచనాధికారాన్ని మాత్రమే ఇచ్చి,నిర్ణయాధికారాన్ని మీ గుప్పెట్లో పెట్టుకొన్నారు. 15వ ఆర్ధిక సంఘాన్ని మీ గుప్పెట్లో పెట్టుకొని ఇష్టానుసారం,తమకు రాజకీయలబ్ది చేకూరే రాష్ట్రాలకు వేలకోట్లు గుమ్మరించి,మాకు పది, ఏభై కోట్లు ఇచ్చి,అన్నీ ఇచ్చేస్తున్నాం... ఇకముందు ఇస్తాం... మీపై సానుభోతి ఉంది ... అనే దగుల్బాజీ మాటలు పార్లమెంటు సాక్షిగా మాట్లాడతారా?
11. మీరిస్తారు ... కానీ ఇచ్చేది  పది, ఏభై కోట్లు . అది ఏటా పెరిగే ద్రవ్యోల్పణానికి కూడా సరిపోదు. ఇలా బిచ్చమ్ వేసుకొంటూ మీరు,ఆ బిచాన్ని పుచ్చుకొంటూ మేము ఎప్పటికీ బిచ్చగాళ్ల లా ఉండిపోవాలనా మీ కోరిక? ఇలాగైతే మాకు మౌలిక సదుపాయాలు పూర్తయేదెప్పుడు? మా రాజధాని లో మేముండేదెప్పుడు? మాకు ఉద్యోగాలొచ్చేదెప్పుడు ?
12. కాలికి బలపం కట్టుకు తిరుగుతున్న మా ముఖ్యమంత్రికి అపాయింట్ మెంట్ ఇవ్వడానికి మీకు 18నెలలు పట్టిందంటే , ఆంధ్రా అంటే మీకు ఎంత అలుసో? ఆయన ఏవో పరిశ్రమలు పట్టుకొస్తుంటే ఆయనకు సహకరించలేరు. పోలవరం ఉరుకులు పెట్టిస్తుంటే ఎవ్వడో దగుల్బాజీలు చెప్పిన చాడీలు వినేసి కొర్రీ లు పెట్టి బ్రేకులేస్తారు ? విదేశీ బాంక్ లనుండి అప్పు తెచ్చుకొంటుంటే లేనిపోని రూల్స్ మాట్లాడతారు. పోనీ,అప్పటిలోగా నాబార్డ్,హడ్కో నుండి ఋణం ఇప్పించమని అంటే, నీళ్లు నములుతారు. 
13. అన్నిరాష్ట్రాల కు  ఇచ్చినట్లుగానే  మాకు ఇస్తున్నారు తప్ప ,ప్రత్యేకంగా చూసింది,ఇచ్చింది ఎక్కడ?
Issue
Disbursed amounts.
Demand of AP.
Amaravati. DPR was already submitted.
already 6lac sqft was built. 34roads,80lac sft buildings,&other infrastructure is under construction which costs about 45000crores.
1500 crores +1000crores to underground drainage of Vijayawada&Guntur.
10000crore/anum. So for 4years center has to give 40000crores.
Backward districts development. promised bundelkhand model assistance and agreed to award 24000crores to 7backward districts.
At 350crores/anum,center gave just 700crores.
Pay the 24000crores in the span of 3years.  
Eleven National edu.institutions.
400crores in last budget.
At least allocate 250crores per each institution annually,otherwise its impossible to complete them even in 20years.
Railway zone
Nil
We demand immediate announcement.
Special package that’s equal to special status.
AP govt sent DPR for 18000crore value projects for  assistance
HUDCO agreed to advance 7500crores but as on today disbursed a meager 700crores.
Allocate the grant-in aid immediately through HUDCO&NABARD to the proposed 13 projects.
Revenue deficit. As per CAG&14th.planing commission,the deficit is 16000 crores.
3400 crores.
So pay the remaining 12600crores.
Polavaram.
Estimation of project at 2015 is 54000 crores. of which 33000crores is dislocated families.
Assisting well though with lot of pleading.
Assure  33000crores to award the compensation to dislocated families &allocate 10000crore annually.
AP govt already expended 8000crores,of which still3500crores is not reimbursed.
Petro-corridor
Nil
Take decision&Allocate  funds judiciously in the budget
Industrial corridors
nil
Take decision&Allocate  funds judiciously in the budget
Dugarajapatnam port
nil
Take decision&Allocate  funds judiciously in the budget
Kadapa steel factory.
nil
Take decision&Allocate  funds judiciously in the budget
జాతీయరహదారులు,అమృత,ఉజ్వల, స్మార్ట్ సిటీ, స్వచ్చ భారత్ , ఓడీఫ్ , ఇళ్ళు , వంటగాస్,రైల్వె , తదితర విభాగాల పద్దుకింద మా రాష్ట్రానికి, ఇతర అభివృద్ధి చెందిన  రాష్ట్రాలకు ఇస్తున్నట్లే ఇస్తున్నారు.  మాకేమీ ప్రత్యేకంగా ఎక్కువ ఇవ్వడం లేదు.  
మా రాష్ట్రం ఏటా లక్షకోట్లు పన్ను కేంద్రానికి చెల్లిస్తుంది. చట్ట ప్రకారం కనీసం 5 నుండి 10 ఏళ్లపాటు ప్రత్యేక సాయం ( hand holding) చేయవలసిన రాష్ట్రం మాది. మీరు 2014 ఎన్నికలలో ఆంధ్రా ప్రజలకు,”ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీ కరణ  చట్టాన్ని” చక్కగా అమలు చేస్తానని వాగ్దానం కూడా చేశారు . 
అదంతా మీరు మరచిపోతే ఎలా? 4ఏళ్ళు గడిచిపోయింది. ఇప్పటికైనా  మీరు మారతారని గట్టిగ గుర్తుచేస్తున్నాం 
కొందరు మేధావులు, రాష్ట్రపరిపాలనపై అవగాహన లేకో లేదా కావాలనో రాష్ట్రం పెట్టిన ఖర్చులు,కేంద్ర ఇచ్చిన నిధుల పై స్వేత పత్రం విడుదల చేయాలనీ  అడుగుతున్నారు.  ప్రతి ఏటా కాగ్ ,ప్రతి రాష్ట్రం యెక్క జమపద్దులను ఆడిట్ చేస్తుంది . 
కాబట్టి  సమాచారహక్కు చట్టం ద్వారా కాగ్ కి పిటిషన్ పెడితే అవన్నీ ఇస్తుంది. అలాగే కేంద్ర ఆర్ధిక వ్యయ సంస్థ కూడా ఇవ్వగలదు. 
ఆర్థికపరమైన విషయాలపై అందరికీ సరైన అవగాహన ఉంటుందని అనుకోలేము. లేనిపోని అపోహలు వ్యాప్తి చేస్తారు మరికొందరు. కాబట్టి కేంద్ర రాష్ట్ర  ప్రభుత్వాలు పారదర్శకతతో స్వేతపత్రాన్ని సామాన్యులకు అర్థమయ్యేటట్లు విడుదల చేస్తే బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అఖిల పార్టీ లను  సమావేశపరచి ప్రస్తుత పరిస్థితిని తేటతెల్లం చేసి కార్యాచరణ కు  ఉపక్రమించాలి. 


Comments