Skip to main content

India's QUEST FOR EXCELLENCY...

మన దేశ నాయకత్వం రాజకీయాలను పక్కనపెట్టి కఠినమైనవైనా మంచి నిర్మాణాత్మక నిర్ణయాలు తీసుకొంటే,దేశ ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగానే ఉండే అవకాశం ఉంది. 
రాబోయే మూడు ఏళ్ళు చాలా ముఖ్యమైన మలుపు తిరిగే సమయం. నాయకత్వంలో ఏమాత్రం దూరదృష్టి లోపించి సంకుచిత రాజకీయాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకొన్నా దేశ ఆర్ధిక స్థితి దిగజారే ప్రమాదం ఉంది. 

ఇప్పటికీ,  ఎగుమతులలో  సింహ భాగం కేవలం 5 రాష్ట్రాలనుండే జరుగుతున్నాయి. మిగతా 25రాష్ట్రాలు కూడా ఎగుమతులను పెంచే పరిశ్రమలు,ముఖ్యంగా నానో ఫైబర్ ఉత్పత్తులు ,  విలువలు జోడించిన వ్యవసాయ ఉత్పత్తులు  , శుద్ధి చేసిన  ఆహార పదార్ధాల ఉత్పత్తిని  గణనీయంగా పెంచాలి. 

అంతేకాదు, మానవ వనరుల కు  సాంకేతిక నైపుణ్యాన్ని జోడించి భారతదేశ యువతను  నిపుణులుగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపట్టి , సేవాధారిత పరిశ్రమలను ప్రపంచ వ్యాప్తం చేయాలి. 

GST చాలామంచి సంస్కరణ. పరోక్షపన్నులు ఇంతకుమునుపు 100 వస్తే,GST ప్రవేశ పెట్టినతర్వాత అవి 150 వసూల్ అవుతున్నాయి. 

135కోట్ల మంది జనాభా లో పిల్లా,జెల్లా ముసలీ ముతకా తీసేస్తే,మనదేశంలో 24కోట్లమంది పని చేస్తున్నారు. ఇందులో 16 కోట్లమంది వ్యవసాయ మరియు వ్యవసాయ అనుబంధ పనులు చేస్తున్నారు. 2 కోట్లమంది ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు.  మిగతా 6కోట్లమంది ప్రయివేట్ ఉద్యోగాలు చేసుకొంటున్నారు. 


  • మౌలిక సదుపాయాలను,అనగా రోడ్లు,వంతెనలు,డామ్ లు ,ఇళ్ళు  నిర్మాణం చేయడం ద్వారా ఎక్కువమందికి ఉద్యోగాలను కల్పించాలి . 
  • ఉత్తరభారతంలో జనాభాను గణనీయంగా తగ్గించాలి.  
  • ఎగుమతులను పెంచే ఉత్పత్తులను ప్రోత్సహించాలి. 
  • మనకున్న ఆస్తి మానవ వనరులు. కాబట్టి నైపుణ్యాభివృద్ధి  కార్యక్రమాలు ఉధృతం చేయాలి. 
  • శిలాజాఇంధనాలపై ఆధారపడటాన్నిపూర్తిగా  తగ్గించి పునరుత్పదక ఇంధన వనరులను బాగా పెంచాలి. 
  • విద్యుత్ ని నిల్వవుంచే బాటరీల  శక్తిసామర్ధ్యాలను  గణనీయంగా పెంచే దిశగా పరిశోధనలను ప్రోత్సహించాలి. 
  •  అందరికి అందుబాటులో అత్యవసర వైద్య సేవలు అందే ఏర్పాటు చేయాలి. 
  • లింగవివక్ష, మత్తుపదార్ధాలసేవనం,  ధూమపానం, పరిసరాల అశుభ్రత, రోగాలపై అలసత్వం తదితర సామజిక రుగ్మతల విషయంలో  ప్రజల ప్రవర్తనలో మంచి  పరివర్తన రావాలి. 
  • విద్యాలయాలలో విలువలతోకూడిన విద్యను మాత్రమే నేర్పాలి. రాజకీయ ,కులమత విషయాలతో కలుషితం కానీయకూడదు. 
  • సంతులిత ఆహరం, వ్యాయామం,క్రీడలు ,కళలు  తదితర ఆరోగ్యకరమైన అలవాట్లు అబ్బేటట్లు పిల్లలకు బుద్ధినేర్పాలి. 

Comments