1.ఏడాదికి రెండు సార్లు నీట్,
జేఈఈ పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వం జాతీయ పరీక్షా సంస్థ (ఎన్‌టీఏ)ను
ఏర్పాటు చేస్తుంది .
2. ప్రభుత్వం ఈ ఏడాది నీట్‌లో మైనస్ మార్కుల విధానాన్ని
ప్రవేశపెట్టింది. ఈ పద్ధతిలో ఒక తప్పు జవాబుకు ఒక మార్కు చొప్పున తగ్గించేస్తారు.
దీని వల్ల రెగ్యులర్ వైద్య విద్యార్థులకంటే.. సర్వీస్ డాక్టర్లు ఎక్కువగా
నష్టపోయే ఛాన్స్ ఉంది .
3. రెండు రాష్ట్రాల్లోని మొత్తం మెడికల్ సీట్లల్లో 30
శాతం సర్వీస్ అభ్యర్థులకు కేటాయింపు జరిగేది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలు నేషనల్ పూల్‌లోకి
వెళ్లడం వల్ల ఈ సీట్లను ఇతర రాష్ట్రాల అభ్యర్థులకు కేటాయించాల్సి ఉంది. దీనివల్ల
సర్వీస్ అభ్యర్థుల కోటా 15 శాతానికి పడిపోయింది.
వైద్య విద్య సీట్ల భర్తీలో 371-డి ఆర్టికల్ నుంచి ఏపీకి మినహాయింపు
రావడం వలన , 285 సీట్లు కేంద్రానికి ఇస్తే.. 4482 MBBS సీట్లు పొందే అవకాశం
ఉంది. 330 పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు కేంద్ర కోటాకు ఇచ్చేస్తే... 7236 Medical PG సీట్లు ,మన
ఆంధ్ర విద్యార్థులు అదనంగా పొందే అవకాశం ఉంది .
4. సర్వీస్ వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేసేందుకు దక్షిణ
భారత ప్రభుత్వ వైద్యుల ఫోరం ఏర్పాటైంది. ఇందులో ఏపీ, తెలంగాణ , తమిళనాడు, కర్ణాటక,
కేరళతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పాండిచ్చేరికి చెందిన సర్వీస్ వైద్యులు
ఉన్నారు.
Comments
Post a Comment