Skip to main content

గుజరాత్ ఎన్నికలు-2017

  • గుజరాత్ ఎన్నికలు,ప్రధాని యొక్క సమర్ధత కు, అలాగే ఆయన తీసుకొన్న ఆర్ధిక సంస్కరణల కు పరీక్ష.
  • అలాగే కాంగ్రెస్ పార్టీ మరికొన్ని ప్రాంతీయ కుల సంఘాలతో కలిసి, కులాల వారీగా తాయిలాలు పంచుకోవడానికి  చేసిన  ప్రచారానికి కూడా ఈ ఎన్నికలు ఒక పరీక్ష. 
  • మొన్నటివరకు హిందూత్వ ను అతివాదం,ఉగ్రవాదం అని తెగనాడిన కాంగ్రెస్ పార్టీ నేతలు, నేడు  గుళ్ళు గోపురాలు తిరుగుతూ హిందుత్వాన్ని కొమ్ముకాస్తామని నమ్మబలుకుతూ  చేసిన  ప్రచారం  ప్రజలు నమ్మారో లేదో తేల్చే పరీక్ష ఈ ఎన్నికలు. 
  • వ్యక్తిగత దూషణలు అనేవి  మామూలై పోయిన ఈ రోజుల్లో,కాంగ్రెస్ వారు చేసిన దూషణలను అవకాశంగా మలచుకొని గుజరాతీయుల నందరినీ దూషించినట్లు ప్రచారం చేసుకోవడం, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు తనను చంపడానికి పాకిస్తాన్ వారితో కుమ్మక్కు అవుతున్నారని ప్రధాని ప్రచారం చేసుకోవడం సమంజసమా ?కాదా?  వీటన్నింటినీ ప్రజాదర్బార్ లో తేల్చే ఎన్నికలివి. 
  • మోదీ సొంతరాష్ట్రంలో ఆయనకున్న ప్రజాభిమానంపై తీర్పు ఇచ్చే ఎన్నికలివి. 
  •  అలాగే కేంద్రం తీసుకొన్న ఆర్ధిక సంస్కరణలైన  "పెద్ద నోట్ల ఉపసంహరణ", పదులకొద్దీ ఉన్న పన్నులను తీసేసి "దేశమంతటా ఒకే విధమైన పన్నును"(GST)ప్రవేశపెట్టడం, పన్నులు కట్టకుండా ఎగవేసే వాళ్లకు ముకుతాడు వేసి పన్నులు కట్టేవిధంగా చట్టాలను పటిష్టం చేయడం తదితర నిర్ణయాలకు ప్రజామోదం ఉందోలేదో,ఈ ఎన్నికలు ఒక పరీక్షగా నిలిచాయి. 
  • నమో  గురిచూసి పేల్చిన డెమో(Demonitization) బాంబు ని ఉత్తరప్రదేశ్ ప్రజలు కరెక్టే అని ఒప్పుకొన్నారు. వాణిజ్యం,వ్యాపారం,పరిశ్రమలు ఎక్కువగా నడిపే గుజరాతీయులు "ఒక వస్తువు- ఒకే పన్ను " అనేది ఎంతవరకు  కరెక్ట్ అని ఒప్పుకొంటారో ఈ ఎన్నికల్లో తేలుతుంది. 

 గుజరాత్ ప్రజలు ఏమి కోరుకొంటున్నారు?
  • దేశం ఏమైపోయినా ఫర్వాలేదు, మా కులం బాగుంటే చాలను కొంటున్నారా?
  • కులాలవారీగా వర్గీకరింపబడి లాభాలు పొందాలను కొంటున్నారా?
  • పన్నులు సక్రమంగా కట్టడానికి వ్యాపారులు సిద్ధంగా ఉన్నారా?
  • అవినీతి,నల్లడబ్బు ని తగ్గించే ఆర్ధిక సంస్కరణల కు ఓటేస్తారా?
  • కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రవర్తనను,వారు చేసిన హామీలను ప్రజలు నమ్ముతారా?
  • స్థానిక కులసంఘాల నాయకులను ఆదరిస్తారా?
  • ముఖ్యంగా రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ఆహ్వానిస్తారా?

వీటన్నింటికీ సమాధానమే గుజరాత్ ఫలితాలు !
కులమత వివక్షతను ఎగదోసి పబ్బం గడుపుకోవడానికి విఫల ప్రయత్నం చేసిన కాంగ్రెస్ వారు, ఓడిపోయినా కూడా ,పూర్వం కంటే 15సీట్లు ఎక్కువ గెలవడమే తమ  నైతిక విజయంగా చెప్పు కొంటున్నారు.  
ఎన్నికల సమయంలో పార్టీ పరంగా రకరకాల కామెంట్స్ చేస్తారు. కాబట్టి, పార్టీ ప్రవర్తనను ,ప్రభుత్వ పనితీరుని ఒకే గాటన కట్టేయకూడదు. ఏది ఏమైనా అవినీతి ని తగ్గించే మోడీ చర్యలకు సర్వత్రా ఆమోదం కనబడుతుంది. కానీ చేయవలసింది చాలాఉంది. కేవలం 3 ఏళ్లలో వ్యవస్థను నిష్కళంకం  చేయడం ఎవ్వరికీ  సాధ్యం కాదు. 


Comments