Skip to main content

2G Spectrum case and Failure of our police-judicial systems.

"2జీ కేసులో దర్యాప్తు మధ్యలో సీబీఐ ఆసక్తి కోల్పోయింది"... అని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యకు సమాధానం తెలుసుకునే హక్కు దేశ ప్రజలకు లేదా?
2014 ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీని ఆరాధించిన ప్రజలే ఇప్పుడు అనుమానంగా చూస్తున్నారు. ఎన్నికలలో గెలుపు కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం ఎంతకైనా దిగజారతారని మోదీపై వ్యాఖ్యలు చేస్తున్నారు.
                             దీని వెనుక ఉన్న కారణాలను పరిశీలిద్దాం.  
1.వ తప్పు. 
 అవినీతి కాలుష్యం మనదేశమంతటా వ్యాపించి పోయిందని అందరికీ తెలుసు. ఇన్నాళ్లూ మన ప్రధానమంత్రిగారికి ఎలాంటి జంజాటం లేదుగదా ...అవినీతికి పాల్పడవలసిన అవసరం ఏముందిలే? అని అందరు అనుకొన్నారు. కానీ సొంత పార్టీ భవిష్యత్ కోసం ఆయన కూడా అవినీతిని ప్రోత్సహించే పనులు చేస్తున్నారా!"...అనే సందేహం దేశవ్యాప్తంగా దావానలం లా వ్యాపిస్తుంది. కేవలం కాసిని సీట్లకోసం, కాస్త సపోర్టు కోసం రెండులక్షలకోట్ల స్పెక్ట్రమ్ అవినీతికేసు ని నీరు కార్చారనే  అపప్రధ మూటకట్టుకొనే స్థితికి దిగజారతారా ఎవరైనా? అనే సందేహం భారతీయులలో పెరిగిపోతావుంది. 
మోడీ చేసిన రెండో పొరబాటు :
గుజరాత్‌లో దళితులు, పాటీదారులు, బీసీలను రాహుల్‌గాంధీ అక్కున చేర్చుకోగా, గుజరాతీయులలో మరో పర్యాయం హిందూ మనోభావాలను ప్రేరేపించే ప్రయత్నం నరేంద్ర మోదీ చేశారు. ఒకరు మతవాదాన్ని నెత్తికెత్తుకోగా, మరొకరు కులవాదాన్ని అందిపుచ్చుకున్నారు.ఈ దేశ చరిత్రలో ఏ ప్రధానమంత్రి కూడా ఇంతకు మునుపు ఇలా వ్యవహరించలేదు.  
 మూడో పొరబాటు :
G 20 దేశాల సమావేశంలో తీసుకొన్న నిరణయానికి అనుగుణంగా, దేశంలో పబ్లిక్ సెక్టార్ లో ఉన్న బాంక్ లను క్రమేణా ప్రవేటీ కరించే  FRDA బిల్లుని ప్రవేశపెట్టాలను కోవడం పెద్దతప్పు. . బలమైన చట్టాలను తెచ్చి  లక్షల కోట్ల పారు బాకీలను  వసూల్ చేయించి, సామాన్యుడికి బాంక్ లపై విశ్వాసాన్ని పెంచవలసింది పోయి, ప్రవేటీ కరణ కు అనుకూలించే చట్టాన్ని తేవాలనుకోవడం పెద్దతప్పు. మొత్తం 10లక్షలకోట్ల పారుబాకీ(NPA) లో  కేవలం 50 కంపెనీల పారుబాకీ 5లక్షలకోట్లు గా లెక్క తేలింది.  కనీసం ఆ 50 కంపెనీలనుండి వసూల్ చేయలేకపోతే ఇక ప్రభుత్వమెందుకు?
అవినీతి: 
మనదేశంలో అవినీతి చేయడానికి అర్హత ఉండాలి. ఏమిటా అర్హత? రాజకీయంగా బలం ఉండాలి .  గుప్పెట్లో కాసిని ఓట్లుంటే చాలు  ఏవైనా చేయొచ్చు!ఏమిచేసినా శిక్షలు పడవు. అక్రమాలకు పాల్పడినా, రాజకీయంగా ఉపయోగపడితే కేసులు కూడా ఉండవు. న్యాయస్థానాల జోక్యంతో కేసులు నమోదు అయినా తర్వాత కాలంలో రాజకీయ ప్రయోజనం ఉందనుకుంటే సదరు కేసులను నీరుగారుస్తారు.ఎటొచ్చీ రాజకీయంగా ఏ మాత్రం ఉపయోగం లేనివారు మాత్రం అవినీతికి పాల్పడిన సందర్భాలలో శిక్షకు గురవుతారు. 
గత ప్రభుత్వాల  వలన పై అభిప్రాయం మనందరిలో బలంగా పాతుకుపోయింది. మోడీ గారొచ్చి,స్వచ్ఛ భారత్ తోపాటు అవినీతిని కూడా సమూలంగా ప్రక్షాళన చేయడానికి ప్రయత్నం చేస్తారని అందరం నమ్మాము . 
కానీ ఈయనకూడా ఇంతే! అనే అనుమానం వచ్చేస్తుంది.  
మోడీ కూడా ఇంతేనా? BJPకూడా కాంగ్రెస్ లాంటిదేనా?! అనే సందేహం ప్రజల్లో వచ్చిందీ అంటే BJPవారు,ముఖ్యంగా మోడీ గారు ఒకసారి ఆలోచించుకోవాలి.  
కానీ భారతీయ ఓటర్లు కూడా మరీ అంతత్వరగా మోడీని,BJP ని  అనుమానించి వ్యతిరేక నిర్ణయాలు తీసుకో కూడదు. కాంగ్రెస్ కి 60 ఏళ్ళు సమయం ఇచ్చాము . కనీసం అందులో పాతికశాతమైనాBJP కి ఇవ్వాలి. 

Comments