Skip to main content

Black Money is injurious to wealth!

 మోడీ ఎందుకింత రిస్క్ తీసుకొని ఆర్ధిక సంస్కరణ లను తెచ్చాడు ?
  • దేశంలో ఆర్ధిక అసమానతలు నానాటికీ పెరిగిపోతున్నాయి . 
  • నక్సలిజం,టెర్రరిజం గత 70 ఏళ్ల నుండి  ఏటికేడు  పేట్రేగుతా ఉంది . 
  •  కేవలం అరకోటి  మంది ఆదాయ  పన్నుకట్టే వాళ్ళ డబ్బుతో నే 130కోట్ల భారతీయులకు సదుపాయాలు,అన్నపానీయాలు,ఆరోగ్య సంరక్షణ ఇవ్వవలసి వస్తుంది . 
  • దీనివలన, ఆల్కహాల్,సిగరెట్స్,ఆయిల్ ,  తదితర హానికర పదార్ధాలపై లపై  ఇబ్బడిముబ్బడిగా పరోక్షపన్నులు వేసి  ఖజానా  నింపుకో వలసి వస్తుంది . 
నల్లధనం వలన నష్టమేమిటి?
  • 130కోట్లమందిలో కేవలం కోటిమంది దగ్గరే కోట్లాది సంపద పోగుపడిపోతుంది . ఇదంతా ప్రభుత్వ లెక్కలకు అందకుండా మన ఆర్ధికవ్యవస్థలో ప్రవహిస్తూ ఉంటుంది . 
  • బంగారం,ఇల్లు,పొలాలు,స్థలాలు ఏటికేడు పెరిగిపోతా ఉంటానికి కారణం ఈ నల్లధనమే!
  • నక్సల్స్ కి, ఉగ్రవాదులకు,సినిమా నిర్మాణాలకు లకు అంతేసి డబ్బు ఎక్కడినుండి వస్తుంది? అందులో సింహ భాగం నల్లధనమే!
  • వ్యవసాయ ఉత్పత్తులపై ఫార్వార్డ్ ట్రేడింగ్ చేయడానికి నల్లడబ్బే ఆధారం . దీనివలన వ్యవసాయ ఉత్పత్తుల ను  కారుచౌకగా కొనేసి,కోల్డ్ స్టోరేజీ లలో దాచేసి ,కృత్రిమ కొరతను సృష్టించి ఆహారధాన్యాల ధరలను పెంచేసి దండిగా లాభాలు కుమ్మేసుకొంటారు. ఆరుగాలం కష్టించి పంట పండించిన రైతు సరైన ధరలేక అయినకాడికి అమ్మేసుకోవడంతో, కోట్లాదిరైతు కుటుంబాలు ఏటికేడు అప్పులఊబిలో కూరుకుపోతున్నారు . రైతుఆత్మహత్యలు నానాటికీ పెరిగిపోవడానికి ఒక కారణం,మద్దతుధర లేకపోవడమే!
  • నల్లధనాన్ని పెట్టుబడిగా పెట్టి బడా కాంట్రాక్ట్ లు సంపాదించి మరింత డబ్బు ని సంపాదిస్తారు . డబ్బు,డబ్బుని ఎలా సంపాదిస్తుందో బడా కాంట్రాక్టర్ లను, ప్రభుత్వంలో అవినీతి అధికారులను,రాజకీయాలలో ఆరితేరిన నాయకులను అడిగితే తెలుస్తుంది . 
  • కొంతమంది, ఈ నల్లధనంతో కంపెనీలు పెట్టి బాంక్ లనుండి కోట్లాది డబ్బు లోన్ తీసుకొని, కొంతకాలానికి కంపెనీలను మూసేసి అడ్రస్ లేకుండా చేసి, బాంక్ లకు ఎగనామం పెడతారు . గత 70ఏళ్లలో ఇలా 10లక్షలకోట్లను బాంక్ లనుండి దోచేశారు. దీనివలన నిజమైన అవసరమున్న రైతులకు, నిరుద్యోగ యువతకు, సన్న చిన్న సైజు పరిశ్రమలకు ఋణాలివ్వడానికి బ్యాంకు ల దగ్గర డబ్బు లేకుండా పోతుంది. దీనివలన వడ్డీ రేట్లు పెరిగిపోతున్నాయి . ఎక్కువవడ్డీ కి, బయట ప్రయివేట్ గా అప్పు తెచ్చ్చు కోవలసిన అగత్యం కలుగుతుంది . అవి తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడే వారెందరో!
  • కొంతమంది, లక్షలకోట్ల పన్నుకట్టని డబ్బును  కంటైనర్లలో దేశం దాటించి,  పన్నుల్లేని  దేశాలలోని బాంక్ లలో డిపాజిట్ చేస్తారు. ఉదాహరణకు స్విస్ బాంకులు ఈ రకమైన డిపాజిట్ లకు ఎలాంటివడ్డీ చెల్లించవు . పైపెచ్చు,ఆలా డిపాజిట్ చేసుకున్నందుకు 2% సర్వీస్ ఫీజు వసూల్ చేస్తారు. ఆ దేశాలు మన నల్లడబ్బు మీదే బతికేస్తున్నాయి . 
  • కొంతమంది , హవాలా ఏజంట్ల ద్వారా డాలర్లు,బంగారం కొని తిరిగి ఆ డాలర్లను మనకంపెనీలలోనే విదేశీ పెట్టుబళ్ల రూపంలో పెట్టి,తెలుపుగా మార్చుకొంటారు . 
  • దేశం దాటిన నల్లడబ్బు లో కొంత,  పార్టిసిపేటరీ నోట్ రూపంలో మనదేశంలోని కంపెనీలలో పెట్టుబడిగా తిరిగి వచ్చినతర్వాత ,  కాస్త కాపిటల్ గైన్ టాక్స్  కట్టేసి, తెల్లగా మార్చేసుకొంటారు .  
  • లక్షలకోట్ల నల్లధనం మారిషస్ లాంటి దేశాలలోని దొంగకంపెనీలలో  పెట్టుబడిగా వెళ్లి ,తిరిగి ఇండియా వస్తుంది . 
  • విదేశాలకు పోయిన నల్లడబ్బు తిరిగి NGO సంస్థలకు విరాళాల రూపంలో ఇండియా వస్తుంది . 
  • ముఖ్యంగా హవాలా లావా దేవీలకు అడ్డాగా ఉన్న దుబాయ్ లాంటి గల్ఫ్ దేశాలలో జరిగే లావాదేవీ లన్నీ పాకిస్థాన్ పెంచి పోషించే ఉగ్రమూకల కనుసన్నలలోనే జరుగుతాయి . మన దేశం లోని నల్లధనంలో కొంత ఆ విధంగా ఉగ్రతాండాల చేతిలోకి వెళ్లి,తిరిగి ఆ డబ్బుతోనే కొన్న ఆయుధాలతో మనదేశాన్నే నాశనం చేస్తున్నారు . అంతేకాదు, భారతీయులు ఎవరైతే ఈ విధంగా హావాలా ద్వారా నల్లధనాన్ని దేశం దాటిస్తున్నారో, వారి లిస్టు కూడా పాకిస్థాన్ ఏజంట్ల చేతిలో ఉంటుంది . దానిని చూపించి, వీళ్ళను బ్లాక్ మెయిల్ చేసి , మరికొంత డబ్బు గుంజేసి దానిని ఉగ్రకార్య కలాపాలకు వాడతారు.  
ధనమంతా కొందరి చేతిలో ఉంటే జరిగే నష్టం ఎలాఉంటుందో చూడాలనుకొంటే,భారత్ దేశం తిరిగి
 చూస్తే చాలు. 
వ్యవసాయ ఉత్పత్తులపై ఫార్వార్డ్ ట్రేడింగ్ చేసే వీలు కల్పించింది ఎవ్వరు?
కాంగ్రెస్ ప్రభుత్వం!
చాటుమాటు  గా జరిగే హవాలా లను   పార్టిసిపేటరీ నోట్ రూపంలో  లీగలైజ్ చేసింది ఎవరు? 
కాంగ్రెస్ ప్రభుత్వం!
షెల్ కంపెనీలను,క్రిస్టియన్ మిషనరీలుగా రంగుమార్చి హవాలావ్యాపారం చేసే NGO సంస్థల ను  ప్రోతసహించిందెవరు ?
కాంగ్రెస్ ప్రభుత్వం!
మారిషస్,స్విస్ లాంటి పన్నులు,చట్టాలు లేని దేశాలనుండి సరైన సమాచారాన్ని తెచ్చు కొనే ద్వారాలను మూసేసిందెవరు?
కాంగ్రెస్ ప్రభుత్వం!
మరి ఇంత దారుణాలకు కారణమైన నల్లధనాన్ని అదుపు చేయవలసిన అవసరం ఉందా?లేదా?
ఉంది!
ఎలాచేయాలో,ఏమిచేస్తే నల్లధనం అదుపులోకి వస్తుందో ఎవ్వరూ  ఏమీ చెప్పనపుడు ,ఈ ప్రభుత్వం ఏమి చేయాలి?
ఆర్థికవేత్తలు...అదీ మనదేశ సంప్రదాయాలు,మన అలవాట్లు, ప్రజల కొనుగోలు శక్తి, వస్తు సేవల వినియోగ సామర్ధ్యం, వీటిలో ఉన్న భిన్నత తదితర విషయాలపై అవగాహన ఉన్న ఆర్థికవేత్తలు చెప్పింది అమలుచేయాలా?లేక  మన దేశంలోని భిన్నత గురించి ఏమాత్రం అవగాహనలేని విదేశీ ఆర్థికవేత్తలు చెప్పింది చేయాలా? .
మన ఆర్థికవేత్తలు చెప్పింది చేస్తే నే మంచిది.
మరి మోడీ చేసింది అదే!
కానీ సరిగా అమలుచేయడం లేదు. ఇంతకంటే బాగాచేయవచ్చు  ...
చెప్పడం తేలిక ... చేయడం ఎపుడూ కష్టమే!ఇన్నాళ్లూ ఇలాంటి ఆర్ధిక సంస్కరణ ల గురించి  ఆలోచనే చేయలేనివాళ్ళు , నేడు ఒకడొచ్చి చేస్తున్నపుడు,  పోసుకోలు దివాలాకోరు విమర్శలు చేయడం కంటే మరింకేమి చేయగలరు?

నగదు కొరత వలన, కామాఠిపురాలో బాలికలను అమ్మే వాళ్ళ కష్టాలు, కాశీలో బట్టలు నేసేవాళ్ల  బాధలు,
గుజరాత్ లోని  అనగాడియాల(Angadias are the nucleus of India’s rural and urban cash transactions and are central to the functioning of the cash economy) అగచాట్లు,   మద్రాస్ లో తోపుడుబళ్లు,కిరాణా వ్యాపారాలు పడిపోయినతీరు, ఆంధ్రాలో వ్యవసాయకూలీల కరెన్సీ కట కటలు , కర్ణాటకలో కాంట్రాక్ట్ లేబర్ తదితరులు పడిన ఇబ్బందులను కధలు కధలుగా ప్రచురించిన విదేశీ మీడియా పేపర్లు,చానళ్ల కు, ఇండియా బాగుపడటం ఏమాత్రం ఇష్టం లేదు .భారతదేశ ఆర్ధిక వ్యవస్థ భ్రష్ట్టు పట్టి పోవాలి . భారత దేశంలో ఆర్ధిక అసమానతలు ఏటికేడు పెరుగుతావుంటే,దేశంలో నక్సలిజం,సరిహద్దుల్లో ఉగ్రవాదం పేట్రేగాలి . భారత దేశం నిరంతరం యూరప్,అమెరికా యూదు సామ్రాజ్య వాదులు చెప్పినట్లుగా  బిచ్చమెత్తుతూ కీలుబొమ్మలా ఆడాలి .
కోటి రూ పాయల విలువున్న వేయి నోట్లు బరువు సుమారు 12  కేజీలు  ఉంటుంది .  హవాలా ఏజంట్లకు ఈ బరువు బాగా తెలుసు . ఎందరో ఏజంట్లు గోళ్లు గిల్లుకొంటున్నారిప్పుడు .
మాజీ ప్రధానివర్యులు మన్మోహన్ సింగ్ గారు అన్నట్లు, పడిపోయింది ఇండియన్ ఎకానమీ కాదు!
  పడిపోయింది  బ్లాక్ ఎకానమీ!
మాజీ ఆర్థికమంత్రివర్యులు,చిదంబరం గార్కి ఇది బాగాతెలుసు .
బ్లాక్ ఎకానమీ ఎంతపడితే అంత మంచిది! దీర్ఘకాలంలో మంచి ఫలితాలను ఇస్తుంది . రోగగ్రస్థ దేహానికి సర్జరీ అవసరం . సర్జరీ చేసినపుడు కొంతరక్తం పోతుంది . రోగి కోలుకోవడానికి సమయమూ పడుతుంది . అలాగని సర్జరీ చేయడం మానేస్తే అసలుకే మోసం వస్తుంది.

GST,నోట్ల రద్దు, నగదురహిత లావాదేవీలు, నకిలీ నోట్లరద్దు,బినామీ నిరోధం,షెల్ కంపెనీలరద్దు, లావాదేవీలు చూపని NGO సంస్థల మూసివేత తదితర సంస్కరణ  ల వలన మోడీకిగానీ,మోడీ బంధువులు,స్నేహితులకుగానీ, మంత్రివర్గ కుటుంబాలకు గానీ లాభం ఉందా?
లేదు!
మరెవరికి లాభం?
మొత్తం దేశానికే లాభం! దేశ ఆర్ధిక వ్యవస్థకు ప్రాణం పోయడమే ఇది . సుపరిపాలనకు నాంది ఇది .

మన ఆర్ధికవ్యవస్థలో  నల్లధనాన్ని అదుపుచేయగలిగితే .... 
  • రైతుపండించిన పంటలకు మంచి మద్దతు ధర వస్తుంది . 
  • సామాన్యులకు ఇంత గూడు,నీడ దొరుకుతుంది . 
  • షేర్ లు,భూములు తదితర సంపదలు ఆకాశాన్ని అంటకుండా ఎక్కువమందికి అందుబాటులో ఉంటాయి . 
  • ద్రవ్యోల్పణం అదుపులో ఉంటుంది . ధరలు అదుపులో ఉంటాయి. 
  • చెడ్డవారు మరీ ధనవంతులుగా మారలేరు . 
  • పేదలకు రెండు పూటలా కడుపు నిండుతుంది . 
  • ఆల్కహాల్ తదితర మత్తుమందులు,హానికర పదార్ధాలను  పూర్తిగా నిషేధించే అవకాశం ఉంటుంది . 

ధనం  ఎల్లవేళలా మంచిదే!కానీ దుష్టుల చేతిలో పడితే అది హానికరమే!
బ్లాక్ మనీ is injurious to wealth!

Comments