Skip to main content

Dont worry about cholsterol !

అందరూ కొలెస్ట్రాల్ ని తిట్టే వాళ్ళే ! కానీ నిజాన్ని పరిశీలిస్తే,అసలు విలన్ అది కాదు, " లైపో ప్రోటీన్ - B" అనే ప్రోటీన్.  ఇది ఒక పడవలా రక్తంలో చక్కర్లు కొడుతూ కొలెస్ట్రాల్ ని మోసుకొంటూ తిరుగుతా ఉంటుంది.
నిరంతరం రక్తాన్ని పంపు చేసే గుండెకి పోషకాలను సరఫరా చేసే కరోనరీ రక్త నాళాల లోని గోడలకు పాచి ఎందుకు పడుతుంది ?
రక్తనాళముయొక్క గోడలలోపలి పొర సున్నితంగా  మెత్తగా గులాబీ రేకులా  ఉంటుంది . దానికి  కొలెస్ట్రాల్ ని మోసుకెళ్లే  లైపోప్రోటీన్ అనే పడవ అతుక్కు పోతాఉంటుంది . ఇలా అతుక్కొని  పోవడానికి కారణం ఏమిటో కూడా పరిశీలిద్దాం .  అంతేకాదు, కొలెస్ట్రాల్ ,గోడ లోపలిపొర ని దాటుకొని మధ్యలో ఉన్నపొరని చేరినపుడు   అక్కడే ఉన్న మాక్రో పేజ్ లు కొలెస్ట్రాల్ ని తింటాయి . దానితో  ఇన్ఫల మేటరీ చర్యలు (Inflammation ) ఆరంభం అవుతాయి . ఇది గొలుసుకట్టు చర్యలా మారి పాచి పెరిగిపోవడానికి ,ఆపాచిలో కాల్షియం పేరుకు పోవడానికి మూలకారణం అవుతుంది .పాచి పట్టడం వలన రక్త నాళం ఇరుకై పోవడమేకాక, ఈ పాచి బద్దలై రక్తంలో కలిసినపుడు రక్తం గడ్డ కట్టుకుపోయి గుండెకి సరఫరా ఆగిపోతుంది .

ఇక్కడ  ఒక నగ్న సత్యాన్ని గుర్తుఉంచుకోవాలి మనం ! వాటి వాటి ఆరోగ్యంకోసం మనదేహంలోని ప్రతికణము  కొలెస్ట్రాల్ ని ఉత్పత్తి చేస్తుంది . అంతేతప్ప మనం తినే ఆహరం ద్వారా మాత్రమే  కొలెస్ట్రాల్  పెరిగి పోతుందని అనుకోవడం ఓ పెద్ద అపోహ!
స్టెరాయిడ్ హార్మోన్ ల ఉత్పత్తికి, విటమిన్ D  ఉత్పత్తికి కొలెస్ట్రాలే   మూల కారణం.

కొవ్వుల్లో కరిగే గుణమున్న ప్రతి అణువు(Fat solubles) తనంతతానుగా రక్తంలో ప్రవహించలేదు . వాటికి ఓ వాహకం (vehicle)కావాలి .
ఆలా పడవలా  పనిచేసేవే లైపో ప్రోటీన్ లు . కొవ్వులో కరిగే విటమిన్ అణువులు, కొలెస్ట్రాల్ అణువులు, భాస్వరపు  కొవ్వు (phospholipids) అణువులు, ట్రై గ్లిసెరైడ్ లు...  వీటన్నింటికీ వాహకం, లైపో ప్రోటీన్ లే!
లైపో ప్రోటీన్ లు ఓ  సబ్ మరైన్ లా ఉంటాయి . దీని  యెక్క బాహ్య పొర,  కొవ్వు (LIPIDS) ,మాంస కృత్తులతో (APO LIPOPROTEINS) తయారవుతుంది . ఈ సబ్ మెరైన్ లు (లైపో ప్రోటీన్ లు )  తమ లోపల కొలెస్ట్రాల్ ని నింపుకొని తిరుగుతా ఉంటాయి .
సాంద్రత ను బట్టి  లైపో ప్రోటీన్ లు రెండురకాలు .
 తక్కువ సాంద్రత (LDL ) , ఎక్కువ సాంద్రత (HDL)  లైపో ప్రోటీన్ లు  ఉంటాయి తప్ప  అవి మోసుకెళ్లే కొలస్ట్రాల్ అంతా ఒక్కటే!
అంటే పడవల్లో రెండురకాలున్నాయితప్ప  అవి మోసుకెళ్లే  సరుకు ఒక్కటే !
అలాగే, సాంద్రత తక్కువఉన్న  లైపో ప్రోటీన్ లు కూడా వాటియొక్క సైజుని బట్టి రెండురకాలు  . పెద్ద సైజు LDL  ,చిన్న సైజు LDL .
గమనించ వలసిందేమిటంటే,  ఎన్ని ఎక్కువ చిన్నసైజు  LDL లు ఉంటే అంతప్రమాదం . 
అపొ లైపో ప్రోటీన్  అనేది ప్రతి చిన్నసైజు  LDL బాహ్యపొరపై  ఉంటుంది .కాబట్టి చిన్నసైజు  LDL ల సంఖ్యా( LDL Particles number) లేదా  అపొ లైపో ప్రోటీన్ సంఖ్యని లెక్కిస్తే మనకు రక్తనాళాలలోని కధ అర్ధమవుతుంది .
Plz remember, Refined carbs and sugar (not fat) are the major drivers of elevated  LDL-p (LDL particle number). 
కాబట్టి, కొలెస్ట్రాల్ మనకు మంచి మిత్రుడే తప్ప శత్రువు కాదు . 
కానీ ఎప్పుడైతే "చిన్న సైజు సాంద్రత తక్కువ" పడవల సంఖ్య ( small size LDL-p)  పెరిగిందో,  అవి  రక్త నాళాల గోడలకు  అంటుకు పోయే అవకాశం ఎక్కువ. 
కానీ ఒక చిన్న విషయం మరచిపోకూడదు . 
 రక్తప్రవాహం వేగం పెరిగినా ,కొన్నిరకాల విషతుల్యమైన అణువుల వలన రక్త నాళాల గోడలు గరుకుగా మారి బీటలు ఇస్తాయి . ఆ పగుళ్లలో కొల్లాజిన్ అనే పదార్ధంతో రిపేర్ చేసుకొంటుంది శరీరం . కానీ ఎప్పుడైతే విటమిన్- C లోపం వలన  కొల్లాజిన్ అందుబాటులో లేదో అపుడు , అప్పటికే అక్కడ అతుక్కుని ఉన్న  చిన్న సైజు LDL ల లోని కొలెస్ట్రాల్  తో రిపేరు చేసుకొంటుంది . ఈ క్రమంలో కొంత కొలెస్ట్రాల్ లోపలిపొర ని చీల్చుకొని మధ్యపొరల్లోకి ఇంకుతుంది . మాక్రోఫేజ్ లు ఈ కొలెస్ట్రాల్ ని ఎటాక్ చేయడంతో కధ మొదలైనట్లే!

గ్లూకోజ్ అనేది పెద్ద విలన్ ! అది ఎప్పుడైతే LDL కి  అంటుకొందో, LDL  ఆకారాన్ని గరుకుగా మార్చివేసి నాళాల గోడలకు అంటుకు పోయేటట్లు  చేస్తుంది .Thats why Metformin, a diabetes drug which lowers blood sugar levels, reduces the risk of heart disease.

వృద్ధులలో,డయాబెటిస్ రోగులలో  జిగురుగా ఉండే మెగ్ మిన్  LDL ( MGmin-low-density lipoprotein (LDL) ) ఎక్కువగా ఉంటుంది . 
                                                   


Comments