Skip to main content

IMA Demands AP govt to Amend AP Fire safety act

అగ్ని ప్రమాదాల నివారణ కోసం జిల్లా  అగ్ని మాపక అధికారి నుండి Noc  పొందడం  అనేది ఎత్తైన భవనాలకు అవసరమైన నిబంధన.కానీ చిన్న చిన్న హాస్పిటల్స్ నడిపే డాక్టర్స్  ఈ నిబంధనలతో 
ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు . 

ఒక హాస్పిటల్ పెట్టాలంటే ,జిల్లా అగ్నిమాపక అధికారి నుండి  నిరభ్యంతర  పత్రం(NOC) , నగరపాలక సంస్థ నుండి నివాసయోగ్యపత్రం (కొత్తభవనాలకు )-OCCUPANCY CERTIFICATE, ఆ తర్వాత బయో సేఫ్టీ ని ప్రోసెస్ చేసి డిస్పోజ్ చేసే వారితో ఒక ఒప్పందం , అటు పిమ్మట, జిల్లా హాస్పిటల్స్ నమోదు అధికారి(DRA) నుండి రిజిస్ట్రేషన్ నంబర్ పొందాలి. 
చిన్న క్లినిక్స్ నడిపే డాక్టర్స్,డే కేర్ సెంటర్స్ నడిపే డాక్టర్స్, ఒక  ఫ్లోర్ లో హాస్పిటల్ పెట్టుకొని,పై ఫ్లోర్ లో నివాసం ఉండే డాక్టర్స్ యొక్క ఇబ్బందులు గమనించి దీనికి ఒక ప్రాక్టికల్ పరిష్కారం చూపాలనే ఉద్దేశ్యం తో IMA వారు ప్రభు త్వానికి విన్నపాలు చేయగా ప్రభుత్వం వారు, ఒక మంత్రుల   కమిటీ ని(GoM) వేసి , 
IMA వారి యొక్క సలహాలు,అలాగే భవన నిర్మాణ పరిశ్రమకు చెందిన (CREDA) వారి సూచనలు ,పరిశీలన లోకి తీసుకొని IMA వారి ఈ క్రింది డిమాండ్ల ను సానుకూల దృష్టితో పరిశీలిస్తామని 
హామీ ఇచ్చ్చారు . 


                                         ప్రభుత్వానికి IMA  సమర్పించిన అభిప్రాయాలు &డిమాండ్లు :
1. రోడ్ లెవల్ నుండి 15 మీటర్లు లేదా 49 అడుగుల కంటే ఎతైన నివాస  లేదా వాణిజ్య భవనం లో ఏదైనా ప్రమాదం జరిగితే అవసరమైన అగ్ని నివారణ ,అగ్ని మాపక సామగ్రి ని ఉంచాలనే నిబంధన పై , 
IMA కి అభ్యంతరం లేదు . 

2. హాస్పిటల్స్ , విద్యాలయాలు లేదా ఇతర వ్యాపార సంస్థలు గల  9 మీటర్లు లేదా 29 అడుగుల కంటే ఎత్తైన భవనాలకు   జిల్లా  అగ్ని మాపక అధికారి నుండి Noc పొందడానికి అభ్యంతరం లేదు .  

3. 9 మీటర్లు (సుమారుగా G+2) కంటే తక్కువ ఎత్తు ఉన్న భవనాలకు Noc అవసరం లేద ని ప్రభుత్వం తీర్మానించాలి . అంతేకాదు, 2006 కంటే ముందు నిర్మాణం పూర్తయిన భవనాలకు  జిల్లా  అగ్ని మాపక అధికారి నుండి Noc  పొందవలసిన అవసరం లేదనే  నిబంధన కూడా జత   చేయాలి . ఇలాంటి హాస్పిటల్స్ కి EHS మరియు  NTR. వైద్య సేవా పథకాలలో ఎంపానెల్ మెంట్ ఇవ్వదానికి జిల్లా  అగ్ని మాపక అధికారి నుండి Noc  పొందాలనే ప్రస్తుత  నిబంధనను  కూడా రద్దు చేయాలి . 

4.ఎత్తైన భవనం అంటే అర్ధం  ఈ క్రింది విధంగా మార్పు చేయాలి . 
నివాస భవనాలైతే , 15 మీటర్ల కంటే ఎత్తైన వి . 
వాణిజ్య కలాపాలు సాగించే భవనాలైతే 9 మీటర్ల కంటే ఎతైనవి .. . 

Comments