Skip to main content

Centre moves states on all India medical services cadre;

ఎప్పుడో స్వాతంత్రం రాకముందు ఇండియన్ మెడికల్ సర్వీస్ ఉండేది . తర్వాత అది రద్దయి పోయింది , కానీ 1961లో మొదలియార్ కమిటీ,   ఇండియన్ మెడికల్ సర్వీస్ వ్యవస్థ ని పునరుద్ధరించ మని సూచించినా 
గత ప్రభుత్వాలు పట్టించు కోలేదు . ఇపుడు,మోడీ ప్రభుత్వం ఇండియన్ మెడికల్ సర్వీస్ వ్యవస్థను ఏర్పాటు చేయాలనే ఉదేశ్యం తో రాష్ట్రాల అభిప్రాయం కూడా కోరుతుంది . మెజారిటీ రాష్ట్రాలు ఒప్పుకొంటే మళ్ళీ మనదేశంలో
 I AS,IPS లాగ IMS ను కూడా చూడవచ్చు

దీని వలన లాభాలు ఏమిటి ?
  • ప్రభుత్వ ప్రోగ్రామ్స్ పై మంచి మానిటరింగ్ ఉంటుంది . 
  • ఈ కేడర్ నుండి ప్రజారోగ్య సమస్యలపై మంచి ట్రైనింగ్ పొందిన వారు రాష్ట్రాలకు కూడా పంపబడటం వలన, ఆరోగ్యరంగంలో మంచి మార్పులు వస్తాయి . 
  • పే స్కెల్స్ కూడా పెరగడం వలన ఈ సర్వీసుకి వైద్యుల లో  మంచి డిమాండ్ ఉంటుంది . కాబట్టి,రూరల్ ప్రాంతాలలో కూడా నైపుణ్యం ఉన్న డాక్టర్స్ ని నియమించడానికి అవకాశం ఉంటుంది .
  • అన్నింటికంటే ముఖ్యమైనది, ప్రజారోగ్య సేవలు , మెడికల్ పరిజ్ఞానం లేని  IASఆఫిసర్స్ కు   బదులు IMSడాక్టర్స్ చేత ఆజమాయిషీ చేయబడతాయి . 

Comments