జన్యుక్రమాన్ని గుర్తించి
విశ్లేషిస్తే.. ఒక మనిషికి ఏయే జబ్బులు వస్తాయో, ఏ జబ్బులు ఎందుకు రావో
తెలుసుకోవచ్చు. దీని నుంచి ఒక అడుగు ముందుకు వేసి ఒక వ్యక్తికి ఏయే మందులు
పనిచేస్తాయో.. ఏ మందులు పనిచేయవో కూడా తెలుసుకోవచ్చు.
ప్రస్తుతం కేన్సర్‌కు మనం
వాడుతున్న మందుల్లో 60 శాతం పనిచేయవు. మానసిక సమస్యలకు వాడుతున్న మందుల్లో 40 శాతం
పనిచేయవు.
అంతేకాదు,కొన్ని
మందులు,కొందరికి దుష్ఫలితాల నిస్తాయి . మరికొన్ని తీవ్రమైన అలర్జీ ని కలగ చేస్తాయి
. జీవరసాయానిక చర్యలలోని
దోషం వలన గానీ,సూక్ష్మ
జీవులవలనగానీ , జన్యువులలో లోపాలవలన గానీ మనకు వ్యాధులు వస్తాయి .
కానీ 30%
వ్యాధులు కారణం లేని వ్యాధులే !
దీనికి పరిష్కారం ఏమిటి?
మందులు ఒక్కొక్కరిపై
ఒకోలా పనిచేయటానికి కారణం వారి జన్యువులే! ఈ
జన్యువులనే పరిశీలిస్తే.. ఒక మందు పనిచేస్తుందా? లేదా? ఎంత డోస్
కావాలి? అనే విషయాలు తెలిసిపోతాయి.
అన్ని మందులు,అందరికి ఒకే రకంగా పనిచేయవు .శరీర తత్వాన్ని బట్టి పనిచేస్తాయి
.అందుకే వ్యక్తిగత తత్వానికి సరిపోయే మందులను వాడితే మందులు
బాగా చేయడమే కాదు,దుష్ఫలితాలు కూడా ఉండవు .
మరో పదేళ్లలో ఆధార్ కార్డు మాదిరిగానే ప్రతి వ్యక్తికీ ఒక జన్యుకార్డు కూడా ఉంటుంది. ఆస్పత్రికి వెళ్లి ఆ కార్డును చూపిస్తే చాలు.. ఆ వ్యక్తికి సంబంధించిన చరిత్ర అంతా వచ్చేస్తుంది.
ప్రభుత్వాలు,హాస్పిటల్స్,మందుల కంపెనీలు స్టెమ్ సెల్ (మూలకణాల) థెరపీ, బయో ఫార్మాపై దృష్టి సారించాలి.
Comments
Post a Comment