Skip to main content

Medical profession versus Govt...


అందరికీ సకాలంలో అందుబాటులో మంచి నాణ్యమైన వైద్యం...  ముఖ్యంగా ప్రాధమిక,అత్యవసర చికిత్సలు ,ఉచిత అత్యవసర మందులు, పరిశుభ్రమైన హాస్పిటల్స్ ,  అందివ్వడం ప్రభుత్వాల బాధ్యత . 

అలాగే, నాణ్యమైన ,హేతుబద్ధమైన ,వైద్యాన్ని అందించడం ప్రయివేట్ వైద్యుల కర్తవ్యం . 

కానీ,  అటు ప్రభుత్వం , ఇటు ప్రయివేట్ వైద్యులు వారి వారి బాధ్యతలను సరిగా నిర్వర్తించ లేక పోతున్నారు . 

 సరైన చికిత్స అందకపోవడం, పరిశుభ్ర వాతావరణం లేకపోవడం, జవాబుదారీ లోపించడం ,
అందుబాటులో స్పెషాలిటీ సేవలు లేకపోవడం అనేవి ప్రభుత్వ హాస్పిటల్స్ లో ని లోపాలు . 

అనవసరమైన వైద్యం చేయడం,డబ్బులు అపరిమితంగా గుంజేయడం, వైద్యాన్ని ఒక బాధ్యతా 
యుతమైన వృత్తి గా కాక వాణిజ్యపరమైన వ్యవహారం గా మార్చేయడం అనేది 
ప్రయివేట్ వైద్య సంస్థలలోని లోపాలు . 

ఈ లోపాలకు ,అవినీతికి, అనైతికత కు కారణాలను పరిశీలిస్తే ఎవ్వరో ఒక్కరిని వేలు పెట్టి చూపించలేము . 
నేటి సమాజమే ఆలా ఉంది . వ్యవస్థలు,సమస్తం కుళ్ళి పోయాయి . 
మనుషులు పూర్తిగా డబ్బు కూడబెట్టే యంత్రాలై పోయారు . 

సమాజంలో భిన్న వర్గాలు అవినీతి,అనైతికత లతో కుళ్ళి పోయి బలహీనులను దోచుకోవడం 
మనం చూస్తున్నాం ... అదే పరిస్థితి వైద్య నియంత్రణ సంస్థలలో ,  వైద్య వృత్తి లోనూ ఉంది . ,

బలహీనులను ,అంటే ... పల్లె జనాలను  పీడించి పబ్బం గడుపుకొంటూ , పైపెచ్చుఁ  అవేమి 
చేస్తాయంటే నువ్వు దొంగ ... నువ్వు దొంగ అనుకొంటూ వీరంగం చేయడం మొదలెడతాయి . 

క్లినికల్ నియంత్రణా చట్టం, మొదలుకొని సుమారు 200 చట్టాలతో వైద్యులను,హాస్పిటల్స్ ను 
కట్టడి చేయాలని అనుకోవడం  ప్రభుత్వం చేతకానితనం . 
అధికారం చేతిలో ఉందిగదా అని, ప్రభుత్వం,  భయంకర  చట్టాలతో  వైద్య వృత్తి పై  జులుం  చేస్తుంది . 
ఈ క్రమంలో చేయరాని తప్పులు చేస్తుంది . 

ఆధునిక వైద్యార్హత ఏమాత్రం లేని ఆయుష్ వాళ్ళ చేత ఆధునిక వైద్యం చేయించాలను కోవడం , వినియోగ దారుల రక్షణ  పేరుతొ వైద్యాన్ని అంగట్లో అమ్మే వస్తువు గా మార్చేసి వైద్యవృత్తిని వ్యాపారం గా మార్చేయడం, 
వైద్యవృత్తిలో జరిగే పొరబాట్లను (Medical errors) అత్యంత తీవ్రమైన నేరంగా పరిగణించడం ,  
ప్రభుత్వం చేస్తున్న అత్యంత పెద్ద తప్పులు .  .   

ప్రభుత్వానికి ,వైద్య వృత్తి సంస్థలకు మధ్యన జరుగుతున్న గొడవ ఇదే!
 ప్రభుత్వం చేతిలో బలముంది . దానితో వైద్య వర్గాలను అణచాలనుకోవడం అనాగరికం,
ఆటవికమే తప్ప  నిర్మాణాత్మక చర్యకాదు !

దీనికి తోడు మౌలిక సదుపాయాలైన , హాస్పిటల్స్  భవనాలు ,  మానవ వనరుల కొరత ,   సరైన బడ్జెట్ కేటాయించక పోవడం,మందుల కొరత , పరికరాలను వర్కింగ్ కండిషన్ లో ఉంచుకోలేకపోవడం, 
కోల్డ్ చైన్ లేకపోవడం,అవినీతి మొదలైన లోపాలతో,మిగతా ప్రభుత్వ సంస్థల లాగానే  ప్రభుత్వ ఆరోగ్య సంస్థలు 
కుంగి కునారిల్లుతున్నాయ్ . 

సరైన వైద్య విద్యార్హత లేకుండానే వైద్యం చేసి ప్రాణాలతో చెలగాట మాడటం నేరమైనా ,అదుపు చేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉంది . 

వైద్య విద్యార్హత ఉండి కూడా అవసరమైన నైపుణ్యం లేకుండా వైద్యం చేయడం అనేది ప్రవేట్ వైద్య రంగంలో అతిపెద్ద తప్పు . అంతే  కాదు, అనవసర మైన వైద్య చికిత్సలు చేసి డబ్బు గుంజేయడం,  వ్యాపార దృక్పధంతో 
మెడికల్ పరికరాలు,మందుల ను  ఇష్టం వఛ్చినట్లు వాడేయడం అనేది కార్పోరేట్ వైద్య సంస్థలలో ఎక్కువగా జరుగుతుందని ఒక పరిశీలనలో తేలింది . 

ఏది ఏమైనా , ప్రభుత్వము , కార్పోరేట్ వైద్య సంస్థలు , ప్రయివేట్ వైద్య సంఘాలు కూర్చుని ఈ లోపాలను సవరించు కొనే ప్రయత్నాలు చేయాలి తప్ప,ఎవరికీ వారే స్వతంత్ర  ఏకపక్ష నిర్ణయాలు తీసుకొంటె సరైన సమన్వయం కుదరక లోపాలు , ఘోరాలు మరింత ఎక్కువైతాయి . ఒక వర్గంపై మరో వర్గానికి అనుమానం,అపనమ్మకం మరింత పెరిగి ఘర్షణ వాతావరణం ఏర్పడి చివరికి సామాన్యుడు నలిగి పోతాడు . 


తమ తమ లోపాలను,అసమర్ధతలను కప్పి పుచ్చు కోవడానికి నెపాన్ని ఒకరిమీద మరొకరు రుద్దుకోవడం 
తక్షణం ఆగిపోవాలి .
 అన్ని వర్గాల ను  సమన్వయం చేసుకొంటూ విధి విధానాలు ఏర్పాటు చేయవలసిన గురుతర 
 బాధ్యత ప్రభుత్వం పై ఉంది . 

Comments